వచ్చు వచ్చు నాకు తెలుసు……!!
అనగనగా ఒక పల్లెటూరి లో ఒక ఆమె వుండేది...ఆమె ఉత్త డాంభికురాలు...నాకు అన్ని తెలుసు తెలియనిది లేనే లేదు అని గొప్పలు చెప్పుకునేది.
ఏవరైనా గొప్పగా నగలు ధరిస్తే చాలు ఇలాంటి వే మా చెల్లెలు కి వున్నాయనో అక్క కి వున్నాయనో అనేది.!! ఎవరైనా బాగా అందంగా వుండే వారిని చుాస్తే....తన ను పెళ్ళి చేసుకోడానికి ఎంతో మంది పోటి పడేవారు...ఎన్నో సంబందాలు వచ్చేవి...అనేది...తీరా చుాస్తే ఆమె అసలు అంత గొప్ప అందం వుండేది కాదు....మాటలే చేంతాడంత.....!!
అలా అలా ఆమె డాంభికాల్ని భరించడఽ పెద్ద సమస్య గా మారిపోయింది .
ఒకరోజు ఏకాదశి పండగ పర్వదినం వచ్చింది .ఊరంత వడలు చేసుకొని పాల పిండి దంచుకొని హాయిగా సంతోషం గా పండుగను చేసుకుంటున్నారు....!! ఆమెకి కుాడా వడలు చేసుకోవాలనిపించి.....అ వును అవి అసలు ఎలా చేయాలో ఏ పప్పు తో చేయాలో కుాడా తెలియదు .పక్కింటి కి పోయి....మా ఊర్లో వడలు మేము పెద్ద పెద్ద అండాల నిండా చేసేవాళ్లం...అందరికి పంచి వాళ్లము...అంది..
పంచితే మంచిదే కదా..ఇప్పుడు నీకు ఏమి కావాలి అని అడిగింది..పక్కింటావిడా? నాకు వడలు చేయడం నేర్పు అంది...ఒస్ దానికేమి భాగ్యము నేర్పుతానులే అంది..పక్కింటావిడా...!! మనం మెదట మినపప్పు తీసుకోవాలి ...వాటిని నీళ్ల లో పోయాలి...బాగ నాన నివ్వాలి...అనగానే... ఆఁ ఆఁ ఇక నాకు తెలుసు....గుర్తు వచ్చింది ...ఇక నాకు వచ్చు....వస్తా అని గబ గబ బయటకు పరిగెత్తింది… !! కాని ఇంటికి వచ్చాక మినపప్పు ఎలా వుంటుందో తెలియదు...!! ఎలా అనుకంటుా...మళ్ళీ మినపప్పు ఎలావుంటుందో చెప్పమనీ మళ్ళీ పక్కింటామె దగ్గరకు వెళ్లింది .ఆమె తన దగ్గర వున్న బేడల్ని చుాపి...ఇవి మినప బెడలు అని చుాపింది...ఓస్ ఇవేనా...నాకు తెలుసు తెలుసు....నాకు ఇక అన్నివచ్చు..అని మళ్ళీ బయటకు పరిగెత్తింది...! నీటిలో మినపప్పు నానవేసింది.తరువాత ఏమి చేయాలో తెలియలేదు.....! మళ్ళీ పక్కింటావిడా దగ్గరకు పరిగెత్తింది… మినపప్పు నాన నాక ఏమి చేయాలి....అని అడగింది..మినపప్పు లో రాళ్ళు లేకుండా , గాలించి తరువాత చిల్లు ల గిన్నెలో నీళ్ళు లేకుండా వడబోసుకోవాలి...అంది....అవునవును...నాకు తెలుసు....నాకు మిగతా అంతా వచ్చు....వచ్చు..నేను వడలు చేసేస్తాను...అని మళ్ళీ ఆమె ఇంటికి పరిగెత్తింది...!!
పక్కింటావిడా చెప్పినట్లు గాలించి వడపోసింది....తరువాత వాటిని ఏమి చేయాలో తెలియదు ....మళ్ళీ పక్కింటావిడా దగ్గరకు పరిగెత్తింది… ..తరువాత ఏమి చేయాలని అడిగింది ....!! ఇక ఆ పక్కింటావిడ కి కోపం వచ్చేసింది ...నీవు ఏది కుాడా పుార్తీగా చెప్పనీయవు...అలాగనీ చేసుకోలేవు...ఇక న న్ను విసిగించకు...నాకు ఏమి తెలియదు ...నీకు వచ్చినట్లు… నీ ఇష్టం వచ్చినట్లు వడలు చేసుకో.....ప్రతిసారీ తెలుసు నాకు ఇంక వచ్చు...అంటావు..కదా...చేసుకో.పో..ఇక నాకు తెలియదు చెప్పను పో అంది...!
ఈసారీ ఏమి చేయాలని అడగ గా చివరికి పక్కింటావిడా....రోట్లో వేసి రుబ్బు...అనే మాట అనిందో లేదో వెంటనే ఆఁ నాకు అంతా వచ్చు ....చేసేస్తాను...తెలుసు తెలుసు అని మళ్ళీ ఇంటికి పరిగెత్తింది… ..!!
అదే అదనుగా భావించి...పక్కింటావిడా ఎదైతే అది అవుతుంది అని ఒక సంచిలో గుడ్డలు దురుము కొని ఇప్పడల్లా మా ఇంటికి రాను...అనుకుంటుా పక్కింటావిడా తలుపుకు తాళాలు వేసుకొని పుట్టింటికి వెళ్లి పోయింది .
ఇక్కడ డాంబికాల ఆమె రోట్లో మినపప్పు వేసి రుబ్బుకుంది...తరువాత ఏమి చేయాలో తెలియక మళ్ళీ పక్కింటావిడ దగ్గరకు పరిగెత్తింది… ..😇😇
ఇంకేముంది… ...ఈమె సందేహల దెబ్బకి ఆ పక్కింటావిడా పుట్టింటికి పారిపోయింది… !!
ఇక ఆ తరువాత రోట్లో మినపప్పు ఏమి చేయాలో తెలియక..వడలు చేయడం రాక...అలాగే వుండిపోయింది...!
అందుకే మిడి మిడి జ్ఞానము , డాంబికాలు వ్యర్దమైనవి… !
ఏదైనా పుార్తీగా…తెలుసుకోవాలి..ఓపిక సహనం వుండాలి....అప్పుడె దెనినైనా మనం నేర్చుకోగలం...!
No comments:
Post a Comment