Wednesday, 10 September 2025

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


            *అపూర్వ సన్యాసి*
               ➖➖➖✍️

```
ఏదో ఒక సమయంలో, ఏదో దేశంలో ఒక మహాత్ములు పుడతారు. 

అటువంటి మాహాత్ములే మన గురువు పరమాచార్య, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. 

మహాస్వామి వారి శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా వారికి నా హృదయపూర్వక నమస్సులు.

మహాస్వామి వారి ప్రధాన స్థానమైన కాంచీపురంలో స్వామివారిని ఎన్నోసార్లు దర్శించుకున్నాము. 

కాని ఎంతో కృతజ్ఞతతో ఈనాటికి మా ఈ స్థాయికి కారణమైన మహాస్వామివారి మహారాష్ట్రలోని సతారా మకాం మాకు అత్యంత చిరస్మరణీయం.

ఆరోజు పరమపవిత్రమైన ప్రదోషం. పరమాచార్య స్వామివారు అత్యంత భక్తి, శ్రద్ధలతో చేసే ప్రదోష పూజను చూడడానికి దాదాపు రెండు వందల మంది వచ్చారు. స్వామివారు మెడలో రుద్రాక్షమాల, తలపై బిల్వమాలలతో అత్యంత సుమనోహరంగా, ఆచార్య స్వామిని చూసిన మొదటిసారి పాల్ బ్రంటన్ చెప్పినట్టుగా, “అటువంటి తేజోవంతమైన ముఖం మధ్యయుగంలో క్రైస్తవ చర్చిని అనుగ్రహించిన ఏ మహానియునిదో అయ్యుంటుంది. కాని ఇక్కడ అది అత్యంత మేధోసంపత్తితో కూడుకున్నది కూడా” ఉన్నారు స్వామివారు.

పూజ పూర్తయ్యి, స్వామివారు భక్తులకు తీర్థం ఇస్తున్నారు. మా నాన్నగారి వంతు రాగానే, తన గురించి, తను చేస్తున్న పని, కుటుంబం, మేము వచ్చిన బాంబే గురించి చెప్పగానే, స్వామివారు ఆసక్తితో ఎన్నో ప్రశ్నలను అడిగారు. భారత ఓడ నిర్మాణ రంగం, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, సంస్థల కార్యాచరణ వాటి అధిపతులు ఇలా. అతి సూక్ష్మ విషయాలను కూడా స్వామివారు అడగడం మమ్మల్ని విస్మయపరచింది. అది మామిడి పళ్ళ కాలం కావడంతో సామి సమర్పణకు మేము తెచ్చిన పళ్ళను అక్కడున్న భక్తులకు ఇమ్మని సేవకులకు ఇచ్చాము.

ఇద్దరు విదేశీయులు, ఎంతో వినమ్రతతో, భక్తితో పంచె, అంగవస్త్రం వేసుకుని హిందూ బ్రాహ్మణ వేషధారణలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు. కాని మనవాళ్ళే వాటిని వదలివేసి అదేమీ నియమం కాదు అన్నట్టుగా ఉండం మాకు చాలా సిగ్గుగా అనిపించింది.

మరోసారి కాంచీపురంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, అక్కడున్న భక్తులందరికీ కాగితం, కలం ఇవ్వమని శిష్యులను సైగలతో ఆదేశించారు స్వామివారు.

శిష్యులను ఓకే శ్లోకాన్ని చెప్పమని, దాన్ని భక్తులతో వ్రాయించి, వారితో గూడ చెప్పించి, ఇతరులకు ఇవ్వమని ఆజ్ఞాపించారు.

మంచి వర్షాల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఈ శ్లోకం. ఆ భక్తుల గుంపులో బాంబే నుండి వచ్చిన వారు కూడా ఉండడంతో, బాంబే వారు పఠించనవసరం లేదని ఎందుకంటే, ఈ సంవత్సరం అక్కడ ఎక్కువగానే వర్షాలు పడ్డాయని పరిహాసమాడారు స్వామివారు.✍️```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment