Tuesday, 9 September 2025

 🌺 *భగవాన్ సమత్వము* 🌺
ఒక పెద్దమనిషి నిందగా భగవాన్ తో "భగవాన్ ! మీరు పశుపక్షుల మీద, పిల్లుల మీద, దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు. కావాలని వాళ్ళని పలకరిస్తారు ,లాలిస్తారు ,చేతుల మీద వారికి తినిపిస్తారు . మేము మీ చూపు కోసం ,మాట కోసం ,మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా, ప్రాధేయపడినా,ప్రార్ధించినా మా వంకే చూడరు . ఇది మీకు న్యాయమేనా ?మీ సమత్వానికి భంగం కాదా? " అని నిష్టూరంగా మాట్లాడాడు .
భగవాన్ పెదవులపై చిరునవ్వుతో తొణికిసలాడింది . కొద్దిసేపు మౌనం వహించారు .తర్వాత మృదువుగా "అదా ! మీ సందేహం! ఆ పశువులు ,పక్షులు ,పిల్లులు ,అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు .ఏ కాంక్షలు, కోరికలు వారికి ఉండవు. అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను. అట్లా సహజంగా ప్రవర్తించడం నాకిష్టం . ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో , కాపీనాలతో ఇక్కడ నుండి ఏదో పట్టకుపోవాలనే కాంక్షతో వస్తారు. కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు. ఇవన్నీ వేషాలు , ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు" అన్నారు . అక్కడున్న భక్తలందరూ ఒకరి మొఖాలొకరు చూసుకొన్నారు.
ఇలా భగవాన్ సమత్వాన్ని చాటిచెప్పే సంఘటనలు కోకొల్లలున్నాయి.  వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది.

 *ఓం నమో భగవతే శ్రీ రమణాయ*👏👏👏

No comments:

Post a Comment