*ఆధ్యాత్మిక జీవనంలో సంతోషాన్ని కోరుకోవటం దోషం అవుతుందా ?*
*సంతోషాన్ని ఉనికిగా మార్చుకోవాలనే తపనలో 'మన ఉనికే ఇప్పటికే సంతోషంగా' ఉందని తెలుసుకోలేకపోతున్నాం. నిజానికి మనం జీవించి ఉండాలంటే సంతోషం అవసరమా ? సుఖసంతోషాలను మనం అవసరాలుగా భావిస్తున్నాం అంతే ! మన జీవనానికి గాలి, నీరు, ఆహారం, వస్త్రాలు, నివాసం వంటివి నిజమైన అవసరాలు. అయితే వీటితోపాటు సుఖసంతోషాలను కూడా అవసరాలుగా మన మనసు భావిస్తోంది. నిజంగా మనకి దుఃఖంలేదు. కోరుకున్న సంతోషం దక్కలేదనే వెలితి దుఃఖంగా కనిపిస్తుంది. సంతోషాలను బయటి వస్తువుల నుండి పొందాలని, పొందిన సంతోషాన్ని శాశ్వితం చేసుకోవాలని, మనసు ఆరాటపడుతుంది. అసలు మన ఉనికే తొలి సంతోషమనే విషయాన్ని మరిచిపోతున్నాం. ఇంకా ఏదో సంతోషం కావాలని వెంపర్లాడుతున్నాం. సృష్టిలో మనిషి తప్ప ఏ ప్రాణి సుఖసంతోషాలను కోరుకోవటం లేదు. కేవలం వస్తే అనుభవించి వదిలివేస్తున్నాయి. ముందు మనమంటూ ఉంటేకదా సంతోషంగా ఉండాలని కోరుకునేది. కోటి రూపాయలతో కొన్న పడవలో సంతోషంగా ప్రయాణం చేసే వాడు పడవ మునిగిపోతుందని తెలిస్తే, ముందు పడవ పోతేపోయింది తాను బ్రతికితే చాలనుకుంటాడు. అప్పటిదాకా సంతోషాన్ని ఇచ్చినట్లు భావించే సొమ్ము, వస్తువు ఇప్పుడు అతని ప్రాణంతో పోలిస్తే గడ్డిపోచతో సమానం !*.
No comments:
Post a Comment