Tuesday, 9 September 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి... 

             *ఆచార్య సద్భోదన*
                 ➖➖➖✍️

*సత్సంగం పరమార్థం...*```
సత్ సంగం అంటే మంచి కలయిక. 
సత్ సాంగత్యమే సత్సంగం పరమాశయం. చెడు శక్తులు వాటంతట అవే మనల్ని ఆవరిస్తాయి. 

కాని మనం ప్రయత్నిస్తేగాని సత్పురుషులను కలుసుకోలేము. సత్సంగం ఫలితాల గురించి 
శ్రీ ఆది శంకరాచార్యుల వారు చక్కగా, సూటిగా చెప్పారు.```

*సత్సంగత్వే నిస్సంగత్వం*
*నిస్సంగత్వే నిర్మోహత్వం*
*నిర్మోహత్వే  నిశ్చలతత్వం*
*నిశ్చలతత్వే జీవన్ముక్తిః*```

సజ్జనులతో సాంగత్యం వల్ల క్రమ పరిణామంలో జీవన్ముక్తి లభిస్తుంది. సత్సంగం మొదట నిస్సంగత్వాన్ని కలిగిస్తుంది. అంటే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా లోకంలోని చెడుకు దూరం అవుతాము. దీనివల్ల మనసు మోహ వికారాలకు లొంగిపోదు. ఈ నిర్మోహత్వం వల్ల బుద్ధి నిశ్చలం అవుతుంది. ఈ నిశ్చలత్వం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది.

ముక్తి అంటే సాంసారిక బంధాల నుండి విడుదల. శ్రీ శంకర భగవత్పాదుల వారి దృష్టిలో ఆత్మ సాక్షాత్కారం పొందడమే మోక్షం. అదే జీవన్ముక్తి. కాబట్టి ఏదైనా ఒక సత్సంగంలో చేరాలి. లేదా మనమే ప్రారంభించాలి. మంచి విషయాలు మాట్లాడుకోవాలి. వాటిలో కొన్నైనా ఆచరణలో పెట్టాలి.✍️```

🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment