Wednesday, 10 September 2025

 ॐ
--------
వేదంలో వివక్షలేదు
-------------

ఓం‌ తచ్ఛం యో ఆవృణీమహే‌ | గాతుం‌ యజ్ఞాయ | గాతుం యజ్ఞపతయే | దైవీ  స్వస్తి రస్తునః | స్వస్తి ర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శం నో అస్తు‌ ద్విపదే | శం చతుష్పదే ||

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇది శాంతి మంత్రమ్.

ఎవరు మంగళాన్ని ప్రసాదిస్తారో ఆ‌ భగవంతుణ్ణి ప్రార్థిస్తాం‌.‌ యజ్ఞం‌ చక్కగా జరగాలని అర్థిస్తున్నాం (పాడుతున్నాం). యజ్ఞం చేసే కర్తకై అభ్యర్థిస్తున్నాం. మనకు దేవతలవల్ల మేలు (స్వస్తి) జరగాలి. మానవులందఱికీ మేలు జరగాలి. చెట్టు చేమలు పైకి ఎదగాలి. మన దగ్గఱున్న రెండు, నాలుగు పాదాల జీవాలకు మేలు జరగాలి.

***           ***          

ఈ పాఠం పురుషసూక్తంలో కూడా ఉంటుంది.

ఇక్కడ యోరావృహీ మహే అన్న చోట యో ఆవృహీమహే అని తీసుకున్నాను. అది యుక్తమైంది అన్న  భావనతో. 

యజ్ఞం అంటే‌ భగవంతుణ్ణి ప్రార్థించే లేదా ఆవాహన‌ చేసుకునే ప్రక్రియ, పద్ధతి.

స్వస్తి ర్మానుషేభ్యః (మనుషులందఱికీ మేలు జరగాలి) అనడం వేదంలో లేదా సనాతన సాహిత్యంలో వివక్ష లేదు అన్నదాన్ని స్పష్టం చేస్తోంది. ‌అంతేకాదు చెట్టు చేమ, జంతువుల‌‌ మేలు కూడా‌ కాంక్షించడం ఈ మట్టి‌‌ గుణం అన్నదాన్నీ తెలియజేస్తోంది ఈ మంత్రం‌.

రోచిష్మాన్ 
9444012279

No comments:

Post a Comment