వేరేవాళ్ళ కోసం కాదు, నీకోసం పని చేసుకో | Telugu Geeks
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DDjBHcZm0h8
Transcript:
(00:11) చాలు ఈ లోకమంతా అబద్ధం ఎవరో బాగుపడతారని ఎవరో సంతోషంగా ఉంటారని మీరు చెప్పే ఈ ఫిలాసఫీలు ఇంకా ఆపండి. నా ఫెయిల్యూర్స్ కి నా గతం కారణం నా చుట్టూ ఉన్న జనాలు కారణం నేను ఎప్పటికీ మారలేను అది నా తలరాత నీ సమస్య నీ గతం కాదు. నీ సమస్య ఈ లోకం కూడా కాదు. నీ సమస్య ఏంటో తెలుసా నీకు గెలవాలని ఉందే కానీ అందరి దృష్టిలో మంచివాడిగా అనిపించుకోవాలి అనే భయమే నిన్ను ఆపుతుంది.
(00:42) ఏంటి మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా నా భయమే నన్ను ఆపుతుందా? లేదు నేను నిన్ను ఇన్సల్ట్ చేయట్లేదు నిన్ను మేలుకొలుపుతున్నాను. మనంఇద్దరం ఈ రాత్రి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుందాం. ఒకవేళ నేను చెప్పే ఈ ఐదు విషయాలు నువ్వు తప్పు అని నిరూపిస్తే నేను నా ఫిలాసఫీని వదిలేస్తా కానీ అవి నిజమని నీకు అనిపిస్తే నీ లైఫ్ ని చూసే విధానం నువ్వు మార్చుకోవాలి.
(01:04) రెడీనా ఓకే చిన్నప్పుడు మా నాన్న అందరి ముందు నన్ను తిట్టేవాడు. స్కూల్లో నన్ను అందరూ ఏడిపించేవారు. ఆ అవమానాల వల్లే ఈరోజు నేను నలుగురిలోకి వెళ్ళాలన్న భయపడుతున్నాను. నా గతం నా కాళ్ళకు కట్టిన ఇనప సంకెలు నేను ఇంకా ముందుకు అసలు కదలలేను అవేమి నీ కాళ్ళకు కట్టిన ఇనప సంకెళ్లు కాదు ఆ సంకెల్ని నువ్వే నీ చేతితో పట్టుకొని గట్టిగా కూర్చున్నావ్.
(01:32) అసలు ట్రౌమా అనేది ప్రపంచంలోనే లేదు. ఏమంటున్నారు అంటే నా బాధ అంతా అబద్ధమా సరే సరే ఒక కాదు విను నాకో స్నేహితుడు ఉండేవాడు అతను ఏళ్ల తరబడి తన గదిలోనే ఉండిపోయేవాడు బయట ప్రపంచం అంటే భయం తను ఏమనేవాడంటే చిన్నప్పుడు నా తల్లిదండ్రుల నన్ను సరిగ్గా చూసుకోలేదు అందుకే నాకు ఈ భయం అని అన్నాడు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా అతనికి బయట ప్రపంచంలోకి వెళ్లి ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు.
(01:55) అందరిలో పోటీ పడటం అంటే భయం అందుకే తను సేఫ్ గా ఉండడం కోసం తన బ్రెయిన్ ఒక భయాన్ని క్రియేట్ చేసింది. ఆ భయానికి కారణం కావాలి కాబట్టి తన గతాన్ని తవ్వి తీసి సాకుగా ఒకటి చెప్పింది. అండ్ అదే అతను వాడుకుంటున్నాడు. గతం అతన్ని బంధించలేదు. బయటికి వెళ్ళకూడదు అనే తన ప్రయోజనం ఆ గోల్ దానికోసం అతనే గతాన్ని వాడుకుంటున్నాడు. దీన్నే డెలియాలజీ అంటారు.
(02:20) ఫ్రాయిడ్ లాంటి పాత సైకాలజిస్ట్ులు గతం వల్ల వర్తమానం ఇలా ఉంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పారు. కానీ యడ్లర్ ఏమన్నాడో తెలుసా నీ వర్తమాన ప్రయోజనం కోసం అంటే నీ ప్రెసెంట్ ప్రయోజనం కోసం నీ గతాన్ని నువ్వు ఇప్పుడు వాడుకుంటున్నావ్. నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఇంట్లో దాక్కోలేదు నువ్వు ఇంట్లో దాక్కోవాలని డిసైడ్ అయ్యావు కాబట్టి నీ బ్రెయిన్ భయాన్ని మానుఫ్యాక్చర్ చేసింది.
(02:40) నువ్వు మారాలి అని అనుకుంటే నీ గతం అసలు అడ్డు రాదు కానీ నీకు మారడం ఇష్టం లేదు ఆ కంఫర్ట్ జోన్ వదలడం ఇష్టం లేదు అందుకే నీ గతాన్ని ఒక పెద్ద గోడలా కట్టుకొని దాని వెనక నువ్వు కూర్చున్నావ్ దాక్కుంటున్నావ్. సరే నా గతాన్ని నేను వదిలేస్తాను. కానీ నా ప్రెసెంట్ సంగతి ఏంటి నేను నా కంఫర్ట్ జోన్ వదిలి కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటే మా పేరెంట్స్ అడ్డుకుంటున్నారు.
(03:07) నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు. నీకు ఇది అవసరమా అని ఎగతాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కాదని నేను ఎలా ముందుకు వెళ్తాను వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతోనే సగం ప్రాణం చచ్చిపోతుంది. నీకొక విషయం చెప్పనా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నీ సమస్య కాదు అది వాళ్ళ సమస్య నీ బరువు నువ్వు మోసుకో వాళ్ళ బరువు వాళ్ళనే మోయినవ్వు ఏంటి వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటే అది నా ప్రాబ్లం కాదా కాదు నువ్వు ఒక గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలవు కానీ దాని బలవంతంగా నీళ్లు తాగించలేవు అలాగే నువ్వు నీ పని చేయగలవు కానీ ఎదుటివాడు నిన్ను మెచ్చుకోవాలని
(03:40) నువ్వు కండిషన్ పెట్టలేవు. లైఫ్ లో అన్ని టెన్షన్స్ కి అల్టిమేట్ సొల్యూషన్ సెపరేషన్ ఆఫ్ టాస్క్స్ నువ్వు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అందులో నీ పనిఏంటి ఎదుటివారి పని ఏంటి అని ఒక్కసారి ఆలోచించు ఉదాహరణకి నువ్వు ఒక YouTube ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రిప్ట్ రాయడం వీడియో తీయడం అప్లోడ్ చేయడం నీ టాస్క్ ఆ వీడియో చూసి జనాలు నవ్వాలా తిట్టాలా మెచ్చుకోవాల అనేది వాళ్ళ టాస్క్ మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా మన టాస్క్ ని మనం వదిలేసి వాళ్ళ టాస్క్ లో మనం వేలు పెడుతున్నాం.
(04:09) నన్ను అందరూ మెచ్చుకోవాలి అని కోరుకోవడం అంటే వాళ్ళ పనిని నువ్వు చేయాలనుకోవడమే అది ఎప్పటికీ నీ కంట్రోల్ లో ఉండదు నీ కంట్రోల్ లో లేని దాని గురించి నువ్వు బాధపడటం మూర్ఖత్వం సరే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని అన్నారు బాగుంది. కానీ ఇంత కష్టపడుతున్నప్పుడు నా బాస్ నన్ను మెచ్చుకోకపోయినా సమాజం నన్ను గుర్తించకపోయినా నా లైఫ్ కి విలువ ఉంటుందా? కనీసం ఒక చిన్న అప్రిసియేషన్ లేకపోతే నేను సక్సెస్ అయ్యానని నాకుఎలా తెలుస్తుంది అసలు గుర్తింపు లేని జీవితం నిజంగా ఒక జీవితమేనా నువ్వు ఎప్పుడైతే ఒకరి పొగడ్త కోసం ఎదురు చూస్తున్నావో ఆ క్షణమే నువ్వు వాళ్ళకి బానిసవైపోయావు
(04:47) గుర్తింపు కోరుకోవడం అంటే నీ రిమోట్ కంట్రోల్ ని ఎదుటివాడి చేతిలో పెట్టడమే ఏంటి మెచ్చుకోవాలని కోరుకోవడం కూడా బానిసత్వమా 100% అవును ఎందుకంటే వాడు మెచ్చుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావ్ వాడు విమర్శిస్తే నువ్వు ఏడుస్తావ్ అంటే నీ సంతోషాన్ని వాడు డిసైడ్ చేస్తున్నాడు ఇది స్వేచ్ఛలో అవుతుంది. మనం చిన్నప్పటి నుండి ఒక తప్పుడు పద్ధతిలో పెరిగాం.
(05:11) హోం వర్క్ చేస్తే టీచర్ మెచ్చుకుంటుంది మంచి మార్కులు వస్తే పేరెంట్స్ రివార్డు ఇస్తారు దీనివల్ల మన బ్రెయిన్ ఎలా తయారయిందంటే రివార్డు ఉంటేనే పని చేస్తాను అనే స్థాయికి పడిపోయింది. నువ్వు పక్కవాడి అంచనాలని అందుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు. లివింగ్ టు సాటిస్ఫై సంవన్ ఎల్స్ ఎక్స్పెక్టేషన్ ఇది మనిషి చేసే అతి పెద్ద పాపం నువ్వు చేసే పని నీకు సంతృప్తిని ఇవ్వాలి.
(05:32) అంతే తప్ప ఎవడో వెరీ గుడ్ అని సర్టిఫికెట్ ఇస్తేనే నువ్వు గొప్పవాడవ అనుకోవడం ఒక పెద్ద భ్రమ. పక్కవాడు నీకు ఇచ్చే రేటింగ్ తో మీ వాల్యూని మీరు కోల్పోకూడదు. గుర్తింపు కోసం మీరు పాకులాడుతున్నారు అంటే మీరు మీ జీవితాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టారని అర్థం. ఆ ఆరాటాన్ని ఈరోజే చంపేయండి. సరే ఎవరి మెప్పు కోరుకోవద్దు అంటున్నారు. మరి ఇలా నేను ఎవరిని పట్టించుకోకుండా ఉంటే ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని అయిపోతాను.
(06:01) అందరూ నాకు కాంపిటీషన్ లాగా మారిపోతారు. అప్పుడు నేను ఎవరిని నమ్మాలి అందరూ నన్ను తొక్కేసి ముందుకు వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవాలా నేను వాళ్ళని శత్రువుల్లా చూడకుండా ఎలా చూడాలి చూడు బాబు లైఫ్ అనేది రేస్ కాదు నువ్వు ఒక కొండ ఎక్కుతున్నావ అనుకో నీకంటే ముందు కొంతమంది ఉంటారు. అలాగే నీ వెనకాల కొంతమంది ఉంటారు. కానీ మీరందరూ వెళ్లేది ఒకవైపే ఒక గోల్ కోసమే ముందున్నవాడు నీకంటే గొప్పోడు కాదు అలాగే నీ వెనక ఉన్నవాడు నీకంటే తక్కువఏమి కాదు వాళ్ళు నీ శత్రువులు కాదు నీ తోటి ప్రయాణికులు కానీ ఈ సొసైటీలో ఎవడో ఒకడు పైన ఉండాలి కదా బాస్ మాట వినకపోతే జాబ్
(06:34) పోతుంది కింద వాడిని కంట్రోల్ చేయకపోతే పని జరగదు ఈ హైరార్కీ లేకుండా ఉండదు కదా మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా ఈ ప్రపంచాన్ని వర్టికల్ రిలేషన్షిప్స్ లో చూస్తాం అంటే ఎవడో ఒకడు పైన ఉండాలి ఎవడో ఒకడు నీ కింద ఉండాలి ఉండాలి ఈ పద్ధతిలో నువ్వు ఎప్పుడూ టెన్షన్ తోనే బ్రతుకుతావ్ నీ పైన ఉన్నవాడిని చూసి భయపడతావ్ నీ కింద ఉన్నవాడిని చూసి గర్వపడతావ్ కానీ నిజమైన స్వేచ్ఛ ఏంటో తెలుసా హారిజాంటల్ రిలేషన్షిప్స్ అంటే అందరిని సమానంగా చూడటం నీ బాస్ దేవుడు కాదు నీ కింద పని చేసేవాడు నీ బానిసా కాదు ఇద్దరూ మనుషులే చేసే పనులు వేరు కావచ్చు కానీ నీ స్థాయి ఒకటే
(07:08) ఎప్పుడైతే నువ్వు ఈ కాంపిటీషన్ మైండ్సెట్ నుంచి బయట పడతావో అప్పుడు లోకమంతా నీకు శత్రువుల్లా కాకుండా నీ స్నేహితుల్లా కనిపిస్తారు. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలవు. చూడండి మీరు చెప్పినవన్నీ వినడానికి బాగుంటాయి కానీ నేను ఎవరి అంచనాలకు తగ్గట్టు బ్రతకకపోతే ఎవరి మెప్పు కోరుకోకుండా నా దారిలో నేను వెళ్ళకపోతే కచ్చితంగా నన్ను అందరూ తిట్టుకుంటారు అసహ్యించుకుంటారు.
(07:35) నా ఫ్రెండ్స్ నన్ను దూరం పెడతారు సొసైటీ నన్ను ఒక పిచ్చోడిలా చూస్తుంది నన్ను ఎవ్వరు ఇష్టపడరు. ఆ ఒంటరితనాన్ని నేను ఎలా భరించాలి? కంగ్రాాచులేషన్స్ ఫైనల్ గా నీ లైఫ్ కి నువ్వు బాస్ అయ్యావు. నీకు స్వేచ్ఛ దొరికింది అని చెప్పడానికి ఇదే మొదటి గుర్తు ఏంటి అందరూ నన్ను ద్వేషిస్తుంటే సంతోషించమంటారా అవును ఎందుకంటే నిన్ను ఎవరైనా డిస్లైక్ చేస్తున్నారు అంటే దాని అర్థం నువ్వు వాళ్ళ కంట్రోల్ లో లేవని నువ్వు నీకు నచ్చినట్టుగా నీ స్వధర్మం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావని దాని అర్థం.
(08:05) చాలామంది స్వేచ్ఛని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. స్వేచ్ఛ అంటే పక్కవాడు నిన్ను అసహించుకోవడానికి నువ్వు ఇచ్చే పర్మిషన్ అందరికీ నచ్చాలి అని అనుకునేవాడు అందరికీ బానిస అవుతాడు తప్ప ఎప్పటికీ తన కోసం తాను బ్రతకలేడు. నీ ప్రయాణంలో నీకు అపోజిషన్ ఎదురవుతుంది అంటే నువ్వు నీకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నావ అని అర్థం.
(08:25) ఆ డిస్లైక్ అంటే నిన్ను వేరేవాడు డిస్లైక్ చేయడాన్ని భరించే ధైర్యం నీకు ఉన్నప్పుడే నువ్వు నిజమైన మనిషివి అవుతావ్. గుర్తుంచుకో 10 మందితో కలిసి వెళ్తే నువ్వు కేవలం ఒక గొర్రెవి మాత్రమే కానీ నిన్ను నువ్వు నమ్మి ఒంటరిగా నిలబడితేనే నువ్వు ఒక లీడర్వ అవుతావ్. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనేది ఇలా జరుగుతానే ఉంటుంది అండ్ ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది తర్వాత చూద్దాం.
(08:44) సో వీళ్ళు మాట్లాడుకున్న ఈ ఫైవ్ పాయింట్స్ ని మనం ఫాస్ట్ గా రివిజన్ చేసేద్దాం. ముందుగా ఆర్గ్యుమెంట్ నెంబర్ వన్ ట్రౌమా ఇస్ ఏ లైఫ్. గతం నిన్ను బంధించలేదు. నీ భయాలను దాచుకోవడానికి నువ్వే గతాన్ని ఒక సాకుగా వాడుకుంటున్నావ్. మారాలి అనే ఆలోచన నీకు ఉందనుకో నీ పాత గాయాలు నీ అడుగులను ఎప్పటికీ ఆపలేవు. ఆర్గ్యుమెంట్ టూ బట్ వాట్ విల్ పీపుల్ థింక్ నీ పనిని నువ్వు చేయడం నీ బాధ్యత.
(09:06) ఎదుటివాడు నిన్ను మెచ్చుకోవాలా వద్దా అనేది వాడి సమస్య. పక్కవాడి టాస్క్ లో నువ్వు వేలు పెట్టడం మానేస్తే నీ లైఫ్ లోని సగం టెన్షన్లన్నీ మాయమైపోతాయి. ఆర్గ్యుమెంట్ త్రీ ఫ్రీడమ్ ఫ్రమ్ వాలిడేషన్ పక్కవాడి పొగడత కోసం నువ్వు ఆశపడితే నీ సంతోషం అనే రిమోట్ కంట్రోల్ వాడి చేతికి ఇచ్చినట్టే. వేరే వాళ్ళ అంచనాలని అందుకోవడానికి నువ్వు పుట్టలేదు నీ పని నీకు సంతృప్తిగా ఉంటే అదే చాలు.
(09:28) ఆర్గ్యుమెంట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ ఆర్ ఫోర్స్ లోకం అనేది రేస్కర్ నీ ముందు వెనక ఉన్నవాళ్ళు నీ శత్రువులు కాదు వాళ్ళు నీతో పాటు ప్రయాణించే ప్రయాణికులు అందరినీ సమానంగా చూసే హారిజాంటల్ రిలేషన్స్ ఉంటేనే నీ మనసుకి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఆర్గ్యుమెంట్ ఫైవ్ ద అల్టిమేట్ ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ పక్కవాడు నిన్ను ఇష్టపడకపోవడం అంటే నువ్వు వాడి కంట్రోల్ నుండి బయట పడ్డావు అని అర్థం.
(09:51) ఇలాంటి అపోజిషన్ ని వేరేవాళ్ళు నిన్ను డిస్లైక్ చేయడాన్ని నువ్వు భరిస్తే ఆ ధైర్యం ఉన్నప్పుడే నువ్వు 10 మందిలో ఒక గొర్రెలా కాకుండా ఒక లీడర్ లా నిలబడతావ్. సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్లీ ఇది కొంచెం కొత్తగా ట్రై చేశాను. సో మీకు ఇది ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి.
(10:07) థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.
No comments:
Post a Comment