Saturday, 25 April 2026

 ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు🌹💐.. ప్రత్యక్షనారాయణుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి అనుగ్రహంతో .. మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టినరోజు.. పెళ్లి రోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 🌹💐🥭🍇
💐💐💐💐
    పాపాలు పాదరక్షలు ఒక్కటే.. గుడికి వెళ్ళినప్పుడు బయట వొదిలేస్తాం.. మరలా బయటకు రాగానే మన వెంటే తెచ్చుకుంటాం.. పాదరక్షలు తెచ్చుకోవాలి.. కానీ పాపాలు అక్కడే వదిలేసి రావాలి.

       మంచి మనస్సు తో చెప్పే ప్రతి మాట విలువైనదే..నలుగురి మంచి కోరే ప్రతి మనస్సు అందమైనదే.. మంచి మనస్సుతో చేసే ప్రతి పని గొప్పదే

     తప్పు చేస్తున్నావారికి ఇంకొకరు మద్దతూ ఇస్తున్నారంటే వారి నుండి వీరేదో ఆశిస్తున్నారని అర్థం.. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవొద్దు.

    కొందరు మన కష్ట సమయంలో మనకు అండగా నిలబడరు.. కాని..మన జీవితంలో ఏమి జరుగుతుందో నిశితంగా గమనిస్తూంటారు..వారు ఎవరంటే వారే మన బంధువులు.. రాబంధులు అయి ఉంటారు 

     మీకు తగిలిన గాయం గురించి ఆలోచిస్తుంటే నొప్పి మరింత బాధిస్తుంది..కాని ఆ గాయం నేర్పిన పాఠం గురించి ఆలోచిస్తే బయటపడే మార్గం కనిపిస్తుంది..

      సమస్యలు లేకుండా విజయం సాధిస్తే ఆది విక్టరీ.. కష్టాలను ఎదుర్కొంటూ విజయం సాధిస్తే ఆది హిస్టరీ.
?🥇🥈🥉🏅🎖️🏆

No comments:

Post a Comment