నేటిమంచి మాట
నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంతవరకు ప్రేమించటం రాదు ప్రేమించటం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు.
ఈ రోజుల్లో తిండి లేక చస్తున్న వారి కన్నా తినలేక చస్తున్న వారే ఎక్కువ. ఎవరూలేరని అనాధలవుతున్న వారి కన్నా అందరూ ఉండి అనాధలయ్యే వారే ఎక్కువ. బాధలో తోడుండే వారి కన్నా బాధించేవారే ఎక్కువ.
సంతోషం నేర్పలేని విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం
No comments:
Post a Comment