Saturday, 25 April 2026

స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు...

 స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు...
🕉️ సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు.
🕉️రెండు చేతులతో తల గీరుకోరాదు.
🕉️ అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును.
🕉️ ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.
🕉️ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను.
🕉️గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు.
🕉️ గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు.
🕉️గర్భిణి స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు.
 🕉️సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది.
🕉️చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు.
🕉️ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

No comments:

Post a Comment