Tuesday, 22 April 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*యమధర్మరాజు*

యముడు లేదా యమధర్మరాజు (Yama) హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. యముడు దక్షిణ దిశకు అధిపతి.

🔹యముని పాశమును కాలపాశము అని పిలుస్తారు.

🔹యముని వాహనము దున్నపోతు.

🔹యముని నగరమును యమపురి, నరకము అంటారు.

🔹యముని వద్ద కొలువు కూటములో పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు.
          
*సమవర్తి*

యముడు ధర్మానుసారం సమయమాసన్నమైనపుడు జీవుల ప్రాణాలను హరిస్తాడని చెబుతారు. యముని చెంత ఏ విధమైన పక్షపాతానికి, అధర్మానికి స్థానం ఉండదు. యముని నియమాలు కఠోరమైనవి. కనుకనే దండించేవారిలో తాను యముడనని శ్రీకృష్ణుడు భగవద్గీత, విభూతి యోగంలో చెప్పాడు.


పుణ్యాత్ములైన జీవులకు యముడు సహజంగా సౌమ్యంగానే కనపడతాడని చెబుతారు. పాఫులకు మాత్రం భయంకరమైన రూపంతో, రక్త నేత్రాలతో, మెఱుపులు చిమ్మే నాలుకతో, నిక్కబొడుచుకొన్న వెండ్రుకలతో చేతిలో కాలదండం ధరించి కనబడతాడు (స్కంద పురాణము, కాశీ ఖండము - 8/55,56).


యముడు గొప్ప జ్ఞాని. భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము).

భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు.

No comments:

Post a Comment