Tuesday, 22 April 2025

 *వివాహేతర సంబంధం నేరం కాదు...* 
*భార్య భర్త ఆస్తి కాదు - ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!*

*ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఇటీవల ఒక కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.*  
*"వివాహేతర సంబంధం నేరం కాదని, భార్యను భర్త ఆస్తిగా పరిగణించడం మహాభారత కాలంనాటి పాత భావజాలం" అని వ్యాఖ్యానించారు.*  
*ఇప్పటి సమాజం ఎంతో ముందుకెళ్లిందని, మహిళలకు స్వేచ్ఛ, అభిప్రాయ స్వాతంత్ర్యం కలగలిసిన హక్కులు ఉన్నాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.*  
*పెళ్లిలో బాధ్యతలుంటాయి గానీ, అస్తిత్వాన్ని కోల్పోవడమూ, స్వేచ్ఛ కోల్పోవడమూ కాదని తీర్పులో పేర్కొన్నారు.*  
*వివాహేతర సంబంధం అశ్లీలం కావచ్చు, కానీ అది నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.*  
*పురుషాధిక్యత, పాత ఆచారాలను ఆధారంగా చేసుకుని మహిళను బాధించడానికి చట్టాలను వాడలేమని హెచ్చరించారు.*  
*ఈ తీర్పు స్త్రీ స్వతంత్రత, వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ దిశగా గొప్ప ముందడుగు అనే అభిప్రాయం న్యాయవాదుల్లో వ్యక్తమవుతోంది.*  
*భారత న్యాయ వ్యవస్థ ప్రగతిశీల దృక్పథానికి ఈ తీర్పు చిహ్నంగా నిలుస్తోంది.*

గత కొంత కాలం గా  మన న్యాయ వ్యవస్థ నుండి వచ్చే తీర్పులు వివాదాస్పదం కి గురవుతున్నాయి.. మరియు  తీవ్ర చర్చనీయ అంశాలు అవుతున్నాయి.. ముఖ్యం గా నైతిక విలువలు,వివాహ వ్యవస్థ కి కొత్త  అర్ధం వెతుక్కో వలసిన దుస్థితి వస్తోంది.. దీని వల్ల సమాజం లో కొత్త సమస్యలు / సవాళ్లు /ఒక విధమైన  విలువల సంక్షోభం వస్తున్నాయి.. మన న్యాయ వ్యవస్థ కి విశేష అధికారాలు ఉండడం వల్ల కావొచ్చు.. ప్రజాస్వామ్యం లో న్యాయ వ్యవస్థ ను కూడా ప్రశ్నించే అవకాశం  ప్రజలకు ఉండాలి.. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ వ్యవస్థ చేసే చట్టాలను ప్రజలు వ్యతిరేకించడం/ ఆమోదించడం/నిరసన తెలపడం వంటి అవకాశం ఉన్నట్లు... మన ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లాలి🙏

No comments:

Post a Comment