Sunday, 20 July 2025

 @ "స్వాట్ "మంత్ర...@ 34
      తేది: 20/07/2025
"""""""""""""""""""""""""""""""'''''""""""

" నీలో ఈ లోపముందోయ్..."
పద్ధతి మార్చుకో' అన్నారనుకోండి ఎవరన్నా...
మనసు టక్కున చిన్నబుచ్చుకుని మొహం
కాలిపోయిన మతాబులా మాడిపోతుంది అలా చెప్పినవాళ్ళపై
కోపం తన్నుకొస్తుంది మూడ్ ఖరాబైపోయి ఇక ఆ రోజంతా
విచారం అలల మాదిరిగా ఎగసి పడుతూనే ఉంటుంది
లోలోన అలా చెప్పినవాళ్లు ముక్కుసూటి మనుషులైతే
ప్రాబ్లం మరీ ఎక్కువ ఎందుకంటే వారి మాటలు మెత్తగా
కాకుండా సుత్తితో కొట్టినట్టు సూటిగా ఉంటాయి కాబట్టి ఉన్న
లోపమే చెప్పినా అంగీకరించడానికి మనసు
ఓ పట్టాన ఒప్పదు చాలామందికి
నిజానికి ఎదుటి
వారు మన లోపాలను
గుర్తించి, మన బాగుకోరి చెబుతున్నారంటే
అదృష్టం అనుకోవాలి మన బలహీనత
లేంటో పసిగట్టడానికి
వారు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి
ఉంటారు దాన్ని మనకు చెప్పాలా, వద్దా అని నిర్ణయించుకోవడానికి తర్జనభర్జన పడి ఉంటారు చెప్పాలని నిర్ణయించుకున్న తరువాత ఎలా చెప్పాలా అని ఆలోచిస్తారు అంత
కష్టపడి మన బలహీనతల గురించి చెప్పినప్పుడు వారి
మీద కోప్పడటం అన్యాయం కాకపోతే మరేంటి..? అసలు
అలా చెప్పే సన్నిహితులు లేకపోవడంవల్లే చాలామందికి
తమ లోపాలేంటో తెలిసిరాక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇష్టారాజ్యంగా జీవితాన్ని గడిపేస్తున్నారు
టీచర్లు, డాక్టర్లు,కోచ్ లు ఇలాంటి వారంతా మనల్ని బలహీనతల నుంచి
గట్టెక్కించేవారే కదా?
మరో విషయం ఏ మనిషి అయినా, సంస్థయినా అభివృద్ధి చెందడానికి మూలం లోపాలు, సమస్యలేనంటారు మేనేజ్ మెంట్ గురువులు వాటిని గుర్తించి, అధిగమించేవారికే వృద్ధీ
విజయం సిద్ధిస్తాయంటారు. అసలు లోపమేంటో తెలుసుకోవాడానికే ఇష్టపడకపోతే ఇక బాగుపడేదెప్పుడు..?
ఏ మంచి మార్పు
అయినాసరే లోపాల మీదా, అసౌకర్యాల మీదా పుట్టుకొస్తుందనేవారు ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆర్నాల్డ్ బెన్నెట్ 
చెప్పాలంటే మానవ వికాసయాత్ర అంతా ఇలా లోపాలను,
సమస్యలను అధిగమిస్తూ వెళ్తున్నదే
అమెరికాకు చెందిన ప్రఖ్యాత మేనేజ్ మెంట్ నిపుణుడు
ఆల్బర్ట్ హమ్ ఫ్రే 1960లో
'స్వాట్అనాలసిస్' అనే వ్యాపారాభివృద్ధి సూత్రాన్ని రూపొందించారు అది మొదలు
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మేనేజ్ మెంట్ విద్యార్థులకు
పాఠమై కూర్చుందా సూత్రం
స్వాట్ (ఎస్ డబ్ల్యూఓటీ)
అంటే బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లు వీటిలో
బలహీనతలే మన చేతిలో ఉండేవి
అదుపులో ఉండని బాహ్య,ప్రపంచంలోని సవాళ్లను
ఎదుర్కోవడానికి, అవకాశాలను ఒడిసిపట్టడానికి చేయాల్సిందల్లా మనలోని లోపాలను అధిగమించి సామర్థ్యాలను
పెంచుకోవడమే ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా,పాలనకైనా
మరి దేనికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది...
సొమ్ములు
ఎన్ని ఉన్నా...
సోకులు ఎన్నిచేసినా...
లోపమేంటో తెలుసుకున్ననాడే జీవితం మేలిమి మలుపు,తిరుగుతుంది
లేదంటే, బతుకు పయనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే
అన్నట్లు ఉండిపోతుంది కాదంటారా...?

No comments:

Post a Comment