*రష్యా మహిళ కోసం ఇజ్రాయెల్ నుంచి ప్రియుడు రాక*:- కర్ణాటక తీర పట్టణం గోకర్ణ సమీప అడవి లోని గుహ లో రహస్యంగా నివసించిన రష్యా మహిళ నీనా కుటినా (40), తన ప్రేయసి అని ఇజ్రాయెల్ నుంచి డ్రోర్ గోల్డ్ స్టెనిన్ (38) అనే వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు. ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల సాయం కోరారు. వారికి సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు. ‘గోవాలో ఇద్దరం ఒకే కంపెనీ లో పని చేశాం. అప్పుడే ప్రేమించు కున్నాం. ఇద్దరు కుమార్తెలు జన్మించిన అనంతరం కూడా కలిసే ఉన్నాం. గతేడాది పని పై ఇజ్రాయెల్ వెళ్లా. తరచూ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్లం. ఉన్నట్లుండి మార్చి నుంచి నీనా ఫోన్ కు స్పందించడం మానేశారు. ఈ విషయంపై పణాజీ పోలీసులకు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశా. ఇటీవల గుహలో రహస్యంగా ఉన్న ఆమెను, పిల్లల్ని పోలీసులు రక్షించారని తెలిసి, వెంటనే ఇక్కడికి వచ్చా అని పోలీసులకు వివరించారు. కుటుంబ నిర్వహణకు ప్రతి నెలా రూ.3.5 లక్షలు పంపుతున్నానని తెలిపారు. ఆమె తరచూ ప్రకృతి మధ్యలోనే పిల్లలను పెంచాలనేదని, అందుకే అడవిలోకి వెళ్లి ఉండొచ్చని తెలిపారు. ఓ రష్యన్ మహిళ, తనతో పాటు ఇద్దరి పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంది. కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి వచ్చిన ఆమె, కర్ణాటక గోకర్ణ లోని అడవుల్లో మారు మూల గుహలో ఏకాంతంగా జీవిస్తోంది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అడవిలో బట్టలు కనిపించడం తో, చుట్టు పక్కల తనిఖీలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి, కొన్ని ఏళ్లు గా గుహలో నివసిస్తున్న రష్యా మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దట్టమైన అడవి లోని గుహ లో చాలా కాలం నుండి నివసిస్తున్నది. ఇటీవల అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విష పూరిత పాములు, మృగాల తో పాటు కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఆ ప్రాంతం నుంచి వారిని తరలించారు. రష్యా మహిళ 40 ఏళ్ల నీనా కుటినా, ఇద్దరు కుమార్తెలు - 6 ఏళ్ల ప్రేమ, 4 ఏళ్ల అమాగా పోలీసులు గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా గోవా నుంచి ఇక్కడకు చేరుకుని గుహలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలిపింది. పాస్ పోర్ట్, వీసా పత్రాలు ఆ గుహలో ఎక్కడో పోయినట్లు చెప్పింది. అయితే ఆ ప్రాంతం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. రష్యా మహిళ అభ్యర్థన మేరకు బంకి కోడ్ల గ్రామం లోని మహిళా సన్యాసి యోగ రత్న సరస్వతి ఆశ్రమానికి తొలుత వారిని తరలించారు. మరోవైపు గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఆ గుహలో సోదా చేయగా రష్యా మహిళ పాస్‌పోర్ట్, వీసా పత్రాలు లభించాయి. 2017 ఏప్రిల్ 17 వరకు గడువు ఉన్న బిజినెస్ వీసాపై నీనా భారత్ కు వచ్చినట్లు వాటి ద్వారా తెలిసింది. 2018 ఏప్రిల్ 19 న గోవాలోని విదేశీ కార్యాయలం భారత్ నుంచి వెళ్లి పోవాలని ఆమెకు చెప్పింది. దీంతో నేపాల్ వెళ్లిన రష్యా మహిళ అదే ఏడాది సెప్టెంబర్ 8 న తిరిగి భారత్ కు వచ్చినట్లు ఆమె రికార్డుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కాగా, వీసా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు. వారిని రష్యాకు తిరిగి పంపేందుకు బెంగళూరు లోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు.
No comments:
Post a Comment