Sunday, 20 July 2025

 *ఏమండీ*
*మనం తెలియని వారితో లేదా పెద్ద వారితో మాట్లాడినప్పుడు వారిని ఏమండీ అని సంభోదిస్తాము* 
*ఈ పిలుపు తెలుగు రాష్ట్రాల్లో చాలా కామన్ పైగా ఆ వ్యక్తి మీద మనకున్న మర్యాద గౌరవాన్ని తెలియజేస్తుంది* *అయితే ఒక పాతిక సంత్సరాలక్రితం భార్యలు భర్తలను ఏమండీ అని పిలిచేవారు పేరు పెట్టి పిలిచేవారు కాదు*
*చెప్పాలంటే తన భర్త పేరు కూడా పరాయి వ్యక్తులకు చెప్పేవారు కాదు*
*బయట భర్త గురించి చెప్పేటప్పుడు మా వారు మా ఆయన అని చెప్పేవారు అలాగే భర్తలు కూడా  భార్య గురించి చెప్పేటప్పుడు మా ఆవిడ అని చెప్పేవారు* 
*ఆ రోజుల్లో కూడా ఆలుమగల మధ్య తగాదాలు గొడవలు వుండేవి అయినా సర్దుకుపోయే వారు* 
*కుటుంబం పరువు మర్యాదలకు గౌరవం ఇచ్చేవారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కలసి వుండేవారు* 
*భార్యాభర్తల మధ్య గొడవ లొచ్చి ఆడపిల్ల ఇంటికొస్తే తల్లితండ్రులు పెద్దలు వారి తగవు తీర్చి పిల్లను తిరిగి కాపురానికి పంపేవారు* 
*ఆ రోజుల్లో విడాకుల ప్రస్తావన బహు తక్కువగా వుండేది సర్దుకుపోవడం రాజీపడడం ఎక్కువగా వుండేది* 
*ఆలుమగలు పాలు నీళ్లలాగా కలిసిపోవాలి* *పాలల్లో నీళ్లెక్కువైన నీళ్ళల్లో పాలెక్కువైన పాలరంగు మారదు ఇక్కడ పాలు అంటే వివాహబంధం* 
*తల్లితండ్రుల మధ్య స్నేహితుల మధ్య  బంధువులమధ్య ఆ మాటకోస్తే భార్యాభర్తలైన దేవుళ్ళ మధ్య కూడా గొడవలు మాట పట్టింపులు ఉండేవి*
*అప్పుడు భార్యకి భర్తో భర్తకి భార్యో క్షమాపణలు చెప్పుకునే వారు*
*ప్రపంచం లో ఘర్షణ రాని భార్యాభర్తలు అసలెవరు  ఉండరు* 
*ఎందుకంటే వారిరువురు రెండు రకాల మనస్తత్వాలు వున్న మానవులు కాబట్టి* *తాళి/మంగళసూత్రం వారిరువురికి ఒకటిగా కట్టిపడేస్తుంది అందుకే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు* 
*ఆ కారణంగానే మనదేశ జనాభా 140 కోట్లకు పెరిగింది*  
*పుట్టడం ఆడ లేదా మగ గ పుట్టి యౌవనం వరకు ఎవరి కుటుంబసభ్యులతో వారు పెరిగినా ఒక వయసు వచ్చాక వివాహం చేసుకోవాలి* 
*ఆ తరువాతే జీవితంలో అనేక అద్ధ్యాయాలు వుంటాయి* 
*అవన్నీ ఆ ఆలుమగలు రుచిచూడాలి*
*ఎప్పటికప్పుడు తప్పులను సరిచేసుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి* *ఎందుకంటె మనల్ని కన్న తల్లితండ్రులు మన జీవితాంతం బ్రతికిఉండరు* *అది సహజం* 
*అప్పుడు భర్తకి భార్య భార్యకు భర్త తోడు నీడ*
*పిల్లలు కూడా పెద్దవాళ్లై ఉద్యోగనిమిత్తం ఎక్కడికో వెళ్తారు* 
*చివరివరకు తోడుండేది భార్యాభర్తలే* 
*అదిసరే ఇంతకీ భార్య భర్తని ఏమండీ అని పిలిచినప్పుడు ఆ భర్త ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు* 
*ఏమండీ అన్న మాత్రాన భర్తలకు కొమ్ములు రావు భార్య తక్కువ అదికాదు* *అది ఒక పద్థతి అంతే* 
*దేవతలు కూడా తమ భర్తలను నాధ అని పిలిచేవారు* 
*నిజం చెప్పాలంటే మగవాళ్ళు కూడా చాలా వరకు మారేరు* 
*వంటింట్లో భార్యకు సహాయం చేస్తున్నారు కష్టమైన పనులు భర్తలే చేస్తున్నారు* 
*నిజమే ఆ దేవుడు ఆడవాళ్లకు కష్టాలు ఎక్కువే పెట్టాడు* 
*నవ మాసాలు మోసి పిల్లల్ని కనడం వాళ్ళని పెంచడం లాంటివి అందుకే ఆడవాళ్ళకి భూదేవంత ఓర్పు సహనం వుంటాయని ప్రతిక* 
*ఆడ మగాlళ్లలో ఆడదానికే పెద్దపీట వేసాడు భగవంతుడు మన భారత మాత కూడా ఆడదే*  
*ఈ నాటి భార్యాభర్తలు ఒకరినొకరు పేరుపెట్టి పిలుచుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం* 
*ఏమండి అనేమాట కల గర్భంలో కలిసిపోయింది* *ఎవరెలా పిలిచారు ఎవరెలా పలికారు అన్నది పక్కన పెడితే ఒక వయసువచ్చాక  అమ్మాయి అబ్బాయి పెళ్లిచేసుకోవడం అత్యవసరం* 
*ఎందుకంటె ఆ జీవితాన్ని కూడా తప్పక నేటి యువత రుచిచూడాలి పిల్లలను కనాలి వాళ్ళని ప్రేమతోపెంచి బాగా చదివించి దేశానికి అందించడం ప్రతి  యువత భాధ్యత* 
బి మల్లికార్జున దీక్షిత్ 
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ 
సెల్ 91333 20425

No comments:

Post a Comment