Sunday, 20 July 2025

 🙏హృదయ పూర్వక నమస్కారం🙏

శీర్షిక: - 👉దేహ భాష👈 :-

ఇది ముఖ్యంగా 60 సంవత్సరాల దాటిన సీనియర్ సిటిజన్స్ కొరకు:-

ఒక రోజు రామయ్యఅను 60సం.రాలు దాటిన ఒక వయోజనుడు తన అవయవాలపై పెట్టిన కేసు కోర్టుకు వచ్చింది.

ఆరోజు ఎప్పుడూ నల్లకోటులో కనిపించే జడ్జిగారు, ఆశ్చర్యంగా తెల్లకోటుతో దర్శనమిచ్చారు.

“సార్ ఈరోజు మీరు డాక్టర్ లాగా ఉన్నారు” అప్పుడు జడ్జిగారు
“ఈ కేసుకు ఇలానే ఉంటే నయమని పించింది” అని నవ్వుతూ ముందుకు సాగారు.
ఇంక కోర్టులో “వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి” అని కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జిగారు.

“అయ్యా నాపేరు రామయ్య. ఇటీవల నాశరీరావయవాలు నేను చెప్పినట్లు వినటం లేదు. సరిగా పనిచేయడం లేదు. ఏమైనా అందామంటే  మొండి కేస్తున్నాయి. వీటివలన నేను తీవ్ర అ నారోగ్యానికి లోనవటమేకాక భరించ లేని బాధ అనుభవిస్తున్నాను.అందు కని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను” అమాయకంగా చెప్పాడు రామయ్య.

“దీనికి శరీరావయవాలు ఏమంటు న్నాయి వాటిని ప్రవేశపెట్టండి” జడ్జి గారు ఆదేశించారు.

“అయ్యా నాపేరు గుండెకాయ. శరీర కష్టమంతా నాది. అయినప్పటికిని నేను ఎంత కష్టపడుతున్న రక్తనాళా ల్లోకొవ్వు పేరుకపోయి అన్ని అవయ వాల మాట అటు ఉంచి, నాకే సరిప డారక్తాన్ని అందించుకోలేనిదుస్థితిలో ఉన్నాను.”

“మరి ఈ విషయం మీ యజమానికి చెప్పావా?” 

“చెప్పాను సార్, ఒక్కసారి అలసట గాఅనిపించాను. మరోసారి తలతిరు గుతున్నట్లు ఇంకోసారి ఎడమ చేతి వైపు లాగుతున్నట్లు, మరోసారి కొద్ది పాటి చాతినొప్పివాంతులుతలనొప్పి ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్, కాని తను పట్టించుకోలేదు”

“నిజమే నా  రామయ్య?”

“నిజమే కానీ అది గుండెనొప్పి అను కోలేదయ్యా”

“ఓకే, గుండె నువ్వువెళ్లొచ్చు.తర్వాత ఎవరు?”

“అయ్యా నా పేరు కాలేయం. శరీరం లో బండ చాకిరీ చేస్తాను. దాదాపు  శరీరంలోని 120 పనులు నేనే చేస్తుం టాను, నన్ను రసాయన కర్మాగారం అనికూడా పిలుస్తారు. అటువంటిది నాకు హెపటైటిస్ వైరస్ సోకితే ఈరా మయ్యకనీసంపట్టించుకోలేదు. నేను ఒకటికాదు రెండుకాదు దాదాపు పది సం.రాలు పోరాడి ఇకచేసేది లేక పని చేయడం మానుకున్నాను.

“నిజమేనా రామయ్య?” జడ్జిగారు అడిగారు

“అయ్యో నాకు తెలియదయ్యా. ఆ  విషయం కాలేయం నాకు చెప్పనే లేదు”

“చెప్పాను సార్!ఒకసారికాదు,100ల సార్లు, కడుపులో ఉబ్బరం కలిగించా ను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, కోవ్వు ప దార్థాలు అరగకుండా చేశాను, కళ్ళు చర్మం మూత్రం అన్నిటినీ పసుపు రం గులోకి మార్చాను. ఐనా తను పట్టిం చుకోలేదు. చివరకు నీరసంతెప్పించా ను. బరువు తగ్గించాను. వెంట్రుకలని తెల్లగా మార్చాను. ఐనా తను పట్టిం చుకోలేదు.”

జడ్జిగార్కి విషయం అర్థమైంది."సరే కాలేయం ఇంక నువ్వు వెళ్ళోచ్చు త ర్వాత?” 

“అయ్యా మాపేరు ఊపిరితిత్తులు. మేము ప్రాణాధార అవయవాలం ఐ నప్పటికీ COPD(క్రానిక్ అప్స్టెక్టివ్ పలమరి డిసీస్)ద్వారా ఏడాదికి 3.2 మిలియన్ మరణాలుజరుగుతున్నా యి. దీనితోపాటుగా లోయర్ రెస్పిరే టరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూ ర్తిగా హరిస్తున్నాయి. అయినప్పటికి ని సదరు రామయ్యగారు మమ్మల్ని పట్టించుకోలేదు”

మీ అనారోగ్యంగురించి ఈరామయ్య కుతెలియ చెప్పారా?”

“శ్వాసతక్కువగా ఉండటం, దగ్గు,చా తిలోనొప్పి అలసట, నాలుక పెదాలు నీలిరంగులోకి మారటంద్వారాచాలా సార్లుచెప్పాం. కానీ సదరు రామయ్య పట్టించుకోలేదు”

“సరే ఇంకా ఎవరైనా ఉన్నారా?”

“నాపేరు మెదడు సార్, అన్నిఅవయ వాలను పట్టించుకోనేనన్నేరామయ్య పట్టించుకోలేదు. తల తిరుగుతుంది అని చెప్పిన, తలనొప్పి అని చెప్పిన, సరిగా నిద్ర లేకపోయినా, దేన్ని లెక్క చేయకుండా నన్ను నా మానాన వది లేసాడు” అని వాపోయింది మెదడు.

జడ్జిగారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు.

చివరికి జడ్జిగారు రామయ్యవైపుతిరి గిసరే ఇంతకీఏమంటావురామయ్య?అన్నారు.

 “ఇవేమీ నాకు తెలియదయ్యా”

“తెలుసుకోవాలి రామయ్య, మాతృ భాష, దేశభాష, లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి.

దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయ త్నిస్తూ ఉంటాయని, వాటి గోడును మనం తప్పకుండ ఆలకించాలని తె లుసుకోవాలి. 

40సం.రాలవయసు వచ్చేవరకు దే హం నువ్వుచెప్పినట్లు వింటుందని, తర్వాత దేహం చెప్పినట్లు నువ్వు వి నాల్సి ఉంటుందన్న విషయం మనం గుర్తు ఎరగాలి.”

"గాయాలు మానకపోతే జింకులోప మని, కండరాల బలహీనతకు పొటా షియం లోపం అని, అలసట కండరా లుపట్టేస్తుంటే మెగ్నీషియంలోపమని
హృదయస్పందనలోఅసాధారణ కద లిక ఉంటేఅది మాంగనీస్ లోపమని,
గోర్లుమెత్తబడటం, ఎముకలుగుల్లబా రటం, మోకాళ్ళనొప్పులు ఉంటే అది క్యాల్షియం లోపమని,అలసట చర్మం తెల్లబడటం, తలనొప్పిఉంటే అదేరక్త హీనత ఐరనులోపమని. ఇదంతాదే హభాషలోని అక్షరమాలని అందరూ తెలిసుకొని ఉండాలి. 

అన్ని భాషలకంటే దేహభాష మిన్న అన్న నిజం పదిమందికి తెలియాలి.”

నా ఈ తీర్పుయొక్క ప్రధాన ఉద్దేశం, అవయవాలను పట్టించుకోని రామ య్యను శిక్షించడం కాదు. ఆపని అవ యవాలుచేస్తానేఉన్నాయి ఉంటాయి మిగలవారెవరైనాసరే దేహభాషనునే ర్చుకొని అవయవాలఅలసటనుఆల కించాలని, దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని ఆదే శిస్తూ ముగిస్తున్నాను.”

తీర్పు చెప్పిన జడ్జిగారు తిరిగి నల్లకో టుకిమారి కోర్టు నుంచి బయటకు న డిచారు.

"కణం"ఆరోగ్యంగా ఉంటే "కణజాలా లు" ఆరోగ్యంగా ఉంటాయి.
"కణజాలాలు" ఆరోగ్యంగా ఉంటే "అ వయవాలు" ఆరోగ్యంగా ఉంటాయి. "అవయవాలు" ఆరోగ్యంగాఉంటే ఈ "దేహం" ఆరోగ్యంగా ఉంటుంది !!!
"దేహం" ఆరోగ్యంగా మనం కొంతకా లం చిరంజీవులం.

🙏🙏సర్వేజనా సుఖినోభవంతు🙏🙏
🌺🫀🫁🧠👄💜🦷👅👁️👃🌺

No comments:

Post a Comment