Sunday, 20 July 2025

 [7/18, 10:47] +91 79819 72004: *ఆకలేస్తే ఆలోచన పుడుతుంది. ఆలోచన పుడితే కార్యాచరణ తడుతుంది. ఆచరిస్తే కడుపు నిండుతుంది.*

*సంపాదించి పెట్టేవాళ్ళు లేనప్పుడు ఎలా సంపాదించాలి అనే ఆలోచన రాదు. సంపాదన మొదలవుతుంది. ఎందుకంటే, సమయం ఉండదు, అవసరం ఆగదు.*

*సంపాదన మొదలయ్యాక, ఎలా పెంచుకోవాలి అనే ఆతృత అవసరమైన విద్యను అందిస్తుంది. చదువు పూర్తి చేసి, అప్పుడు సంపాదన గురించి ఆలోచించే వారికంటే, వీరే జీవితంలో లక్ష్యాలు సాధిస్తారు.*

*ఆలోచన, ఆచరణలలో ఏది ముందు, ఏది తరువాత అనే సందిగ్ధం నెలకొని వుంటే, ఆచరణే ముందు. అందులోంచి వచ్చే అలోచన  అమూల్యమైనది.*💪

*కృషితో నాస్తి దుర్భిక్షం.*

*శుభోదయం.*🙏
[7/18, 10:48] +91 79819 72004: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

' గుర్తింపు లేని బాధ్యత '

జీతం లేని పనిమనిషి  - 'అమ్మ'

అమ్మా  నీకు జీతమెంతమ్మ 
వారం తో నీకు  పనిలేదమ్మ
నెలంతా నీకు పనిదినములేనమ్మ 
శలవేలేదమ్మ

భగవంతుడు ఇచ్చెను మూడురోజుల శెలవమ్మ
కలిలోన కలిపేస్తె దానికేది విలువమ్మ
తగ్గదు నీ పనిభారమమ్మ
అర్థం చేసుకునే  - సమయం, తెలివి - ఎవరికీ లేవమ్మ 

దేవుడు - తన అంశతో  - నిను సృష్టించెనమ్మ
ఆడ, ఈడ - నెగ్గుకొస్తవని - ఆడపిల్లగా - పుట్టించెనమ్మ
మనిషిలా ఉండే యంత్రమే నీవమ్మ 
స్వేదం, ఖేదం - తప్ప -  సౌఖ్యమేదమ్మ

అత్తగారి ఆరళ్ళు, ఆడబిడ్డల అదిరింపులు  - అడ్డేవమ్మ
బిడ్డనుమోసి, చావు చవి చూసి -  కని - ప్రేమ పంచేవమ్మ 
వంశాకురాన్నిచ్చి-  అత్తింటి వృద్ధి  - చేసేవమ్మ

తిండి, నిద్ర, సరదా -  తక్కువేనమ్మ
పిల్లలంటే శ్రద్ధ , పెనిమిటంటే  ప్రేమ - నీకమ్మ
గురువు, దైవమై - పిల్లల పెంచేవమ్మ
పిల్లలే ధనం, పెనిమిటే ఘనం - నమ్మేవమ్మ

కటిక  పేదైన,  కుబేరుడైన - తారతమ్యాలు చూడవమ్మ
పస్తుండి, నీ వంతు పెట్టు - అన్నపూర్ణవమ్మ
కొడుకు, కోడలు, పెనిమిటి - ఎవరైనా,  తప్పు సర్ది,  తను  సర్దుకునే - నైజం నీదమ్మ
  
ఇంటికి దీపం,  దైవం  - నీవేనమ్మ
తల్లీ  నీకు   - వందనమమ్మ, 
దీవించి  - అందరినీ- క్షమించి - కాపాడవమ్మ 

నా ఇల్లు, నావాళ్లు తప్ప- వేరే ధ్యాస - లేదమ్మ
చితినెక్కువరకు   -  చింతిస్తవమ్మ
అందమైన బొమ్మ  - ఎంత ఓపికమ్మ
గుర్తింపు లేని బాధ్యతలు - మోసేవమ్మ 
జీతభత్యం లేని - పనిమనిషి - నీవమ్మ! 

బొమ్మా  నీకు మురిపాలమ్మ
చెల్లీ నీకు       రక్షెవరమ్మ
కొమ్మా నీకు   తోడెవరమ్మ
తల్లీ  నీకు     శిక్షేనమ్మ !!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మణ్యం చెన్నై
నా స్వీయ రచన

No comments:

Post a Comment