Sunday, 20 July 2025

 *✅తెలుసు కుందాం✅*


*కాలింగ్ బెల్ ఎలా పనిచేస్తుంది?*

ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు ముందు, ఆఫీసుల్లో కాలింగ్ బెల్ కనిపిస్తుంది. విద్యుదయస్కాంత ప్రభావం ఆధారంగా కాలింగ్ బెల్ పనిచేస్తుంది. 

-->ఇందులో విద్యుదయస్కాంతం, మెత్తని ఇనుముతో తయారైన "ఆర్మేచర్"ఉంటుంది. ఆర్మేచర్ కు చిన్న సుత్తి వంటి పరికరం అమర్చి ఉంటుంది. ఈ సుత్తి డొప్ప వంటి గాంగ్ ను నిరంతరం కొడుతుంది. దీనివల్ల స్విచ్ నొక్కినంత సేపు బెల్ మోగుతూనే ఉంటుంది. 

--> మీరు స్విచ్ నొక్కినప్పుడు విద్యుదయస్కాంతం చుట్టూ ఆర్మేచర్, కాంటాక్ట్ స్ప్రింగ్, స్క్రూ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. 

--> విద్యుత్ ప్రవాహం వల్ల లోహపు చుట్టలో అయస్కాంతత్వం కలుగుతుంది. 

--> దీనివల్ల ఆర్మేచర్ దగ్గరకు జరుగుతుంది. ఈ కదలిక వల్ల సుత్తి గాంగ్ ను తాకుతుంది. దాంతో ధ్వని  పుడుతుంది. అంటే కాలింగ్ బెల్ మోగుతుంది.

No comments:

Post a Comment