Sunday, 20 July 2025

 [7/18, 16:07] +91 79819 72004: *మైసూరు చాముండేశ్వరి జయంతి* 

*మణిద్వీప వాసియైన శ్రీలలితాదేవి లోక కల్యాణార్థం అనేక అవతారాలు దాల్చింది. అందులో పరమాద్భుతమైన మహాశక్తి అవతారమే శ్రీచాముండేశ్వరీదేవి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అయిన అమ్మవారు అయిదు అడుగుల ఎత్తుతో పూర్తి మేలిమి బంగారంతో మలచబడింది. అమ్మ పేరిట జరిగే మైసూరు దసరా ఉత్సవాలు జగత్ ప్రసిద్ధమైనవి. ఆశ్రిత జనకల్పవల్లి అమ్మ చాముండేశ్వరీ,*

*కర్ణాటక రాష్ట్రాన మైసూరు మహాపట్టణంలో చాముండీ అనే కొండపై అమ్మవారు కొలువు దీరినందువలన అమ్మ పేరు చాముండేశ్వరీగా స్థిర పడింది. ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఈ కొండ పరిసర ప్రాంతాలు పరాట్యక ప్రాంతాలుగాను, శక్తి పీఠం దర్శనాలకుగాను అమ్మ సన్నిది నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.*

*శైవ సంప్రపదాయంలో ఎన్నో ఆలయాలు. ఈ మహాక్షేత్ర ఆలయ సముదాయంలో అలరారుతున్నాయి. మహాకాంతి మండల రాశిగా ప్రకాశిస్తున్న* *శ్రీ చాముండేశ్వరీ గర్భాలయంతో పాటు ప్రతి ఉపాలయం చూపు మరల్చుకోలేని అపురూప శిల్ప సంపద మనస్సును ఎన్నెన్నో ముఖ్య ఘట్టాలను శిల్పులు చాలా అద్భుతంగా మలచారు. ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే నిటారుగా ఉన్న వెయ్యి మెట్లు ఎక్కాలి. సుందరమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ మెట్ల దారివెంట వెళ్ళే భక్తులకు అలుపు సొలుపు ఏమి ఉండదు. మనసును అంతకంతకు తేలికపరిచే అలౌకిక అనుభూతి నిలువెల్లా వ్యాపిస్తుంది. అంతేకాక కొండపైకి చక్కని రోడ్డు మార్గం కూడా ఉంది. నీరంతరం బస్సులు ప్రైవేటు వాహనాలు చీమల బారుల్లా పోతూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. మరెంతో అనుభూతినిచ్చే కొండపైకి రోవ్వే మార్గంకూడా ఉంది. ఇంత సునాయసంగా అమ్మ సన్నిధికి చేరుకోవటాని ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి.*

*అతి పురాతనమైన మైసూరు చాముండేశ్వరీ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించాలని నమ్ముతారు. పదిహేడవ శతాబ్దంలో అమ్మకు పరమభక్తులైన విజయనగర పాలకులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. తరువాత 18వ శతాబ్దంలో మైసూరు పాలించిన మహారాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరింపచేశారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మహాక్షేత్ర కట్టడాలన్నీ కూడా ఆ తదనంతర మైసూరు మహారాజులే నిర్మించటం ఎంతో విశేషం.*

*శ్రీ చాముండేశ్వరి ఆలయ నిర్మాణం. అంటే ప్రధాన గర్భాలయం పిరమిడ్ ఆకారంలో ఆకాశంలోనికి చొచ్చుకు పోయినట్లు కనిపిస్తుంది. ద్రావిడ శిల్పకళకు నిదర్శనం గర్భాలయ ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతున్న గాలి గోపురం 40 మీటర్ల ఎత్తుతో అతి సుందరంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంకూడా అతి విశాలంగా ఉంటుంది. ఒక్క సారి వేలాదిమంది భక్తులు వచ్చినా, అమ్మ దర్శనం అతి సునాయసంగా లభిస్తుంది. మందస్మిత వదనారవిందయై తేజోమూర్తిగా తదేకంగా మనవైపేచూస్తూ. తన అపార కరుణామృత వర్షాన్ని కురిపింప చేస్తున్న ఆ జగన్మాతను. వీడి వెనుకకు మరలిరావటానికి మనసు అస్సలు అంగీకరించదు.*

*త్రికరణ శుద్ధిగా అమ్మను మొక్కుకున్న ప్రతి మొక్కును అతి శీఘ్రంగా నెరవేస్తుంది. శత్రుభయం ఉండదు. విరోధులు మిత్రులపుతారు పెను విపత్తులాంటి ఆపదలు. కష్టాలు కన్నీళ్ళు అమ్మతన గోటితో తీసివేస్తుంది. ఇంతటి మహిమగల మహాశక్తి అయినందు వలన భారతదేశం నలుమూలలనుంచి వచ్చి అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టకామ్యాలు తీర్చుకుంటారు.*

*ఈ మహాక్షేత్రంలో అతి సుందరమైన పెద్ద మండపం ఉంది. ఇక్కడే పండుగలు పర్వదినాలలో అనేక వేడుకలు నిర్వహిస్తారు. అమ్మ ఆలయ ప్రాంగణం, సత్యలోకాన్ని, వైకుంఠాన్ని, కైలాసాన్ని తలపించేస్తూ ఉన్నందు వలన ప్రతి భక్తుడికి ఈ మహాక్షేత్ర దర్శనం మరల మరల చేసుకోవాలనే సంకల్పం కలుగుతుంది.*

*పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు లోక కంఠకుడై దుష్ట పరిపాలన చేస్తున్నాడు. మహిషుడి రాజ్యానికి రాజధాని ఈనాటి మైసూరు పట్టణం. సమస్తలోక వాసులను గడగడలాడిస్తూ మహర్షులను మునులను తపఁసంపన్నులను బాధిస్తూ యజ్ఞ యుగాదులకు ఆటంకలిగిస్తున్నాడు వీడి మితిమీరిన ఆగడాలను సహించలేక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవిదేవతలు ఒక మహాశక్తిగా ఆకృతి దాల్చారు ఆ ఉగ్రశక్తియే చాముండేశ్వరి ఈమె దుర్గాదేవి సింహవాహినియై దివ్యాయుధాలతో మహిషుడి పట్టణం మైసూరు చేరుకున్నది. తొమ్మిది రోజులపాటు మహిషుడితో పోరాడి పదవరోజున వాడిని సంహరించింది. సమస్తలోకాలకు శాంతి లభించింది. లోక కళ్యాణార్ధమైన ఈ సంఘటనకు గుర్తుగా అమ్మ నాముండీ కొండపై కొలువు దీరింది. మైసూరు మహారాజులకు ఇలవేల్పు శ్రీ నాముండేశ్వరీ దేవి.*

*అమ్మవారి దివ్యక్షేత్రంలో హిందూ సంప్రదాయంలోని ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఉగాది, దీపావళి చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఇక అక్టోబర్ నెలలో జరిగే దసరా ఉత్సవాల సంబరం అంబరాన్ని తాకుతాయి. జగత్ ప్రసిద్ధమైన దసరా ఉత్సవాలను చూడటానికి ప్రపంచం నలుమూలలనుంచి మైసూరు చేరుకుంటారు. మైసూరులోని ప్రతి వీధి ఉత్సవ కళను సంతరించుకుంటుంది. ఇప్పటికి ఈ ఉత్సవాలను ఆధ్యంతమూ మైసూరు మహారాజు వంశీకులే నిర్వహస్తూ ఉంటారు.*

*కర్ణాటకలోని జానపద కళారూపాలతో పాటుగా 64 కళలలో ఉద్దండులైన వారు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించకున్నవారు ఇక్కడకు వచ్చి ఉత్సవాలలో తమ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. చూడటానికి రెండు కళ్లు చాలని విదంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. డజన్ల కొద్ది ఏనుగులు అంబారీలతో ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా కళాబృందాలతో కదులుతూ ఉంటాయి. వేలాదిమంది కళాకారుల విన్యాసాలు. వందలాదిమంది వేదపండితుల మంత్రోచ్చారణలతో ప్రత్యేకంగా అలకరించిన ఏనుగు అంబారీపై దివ్య తేజస్సుతో వెలిగిపోడూ శ్రీ చాముండేశ్వరీదేవి దర్శనం ఇస్తూ ముందుకు సాగుతూ. ఉంటుంది. ఊరేగుతూ ఆ పరమాద్భుత శక్తి ప్రజల ముంగిటకే వచ్చి దర్శనం ఇవ్వటం మరపురాని మధురానుభూతి.*

*బ్రహ్మవిష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీపార్వతులతో పాటుగా ముక్కోటి దేవతల ఏకాకృతి శ్రీవాముందేశ్వరీదేవి. కనుక అమ్మకు నమస్కరించినా దర్శనం వేసుకున్నా ఇందరి. దేవతలనుగ్రహం అమ్మరూపంగా లభిస్తుంది. ఉత్సవాలతో కాకుండా మిగతారోజులలో ఉదయం 7:30 ని. నుండి మధ్యాహ్నం 2గం. వరకు మరలా 3:30 నుండి సాయంత్రం 6:00 వరకు భక్తులకు అమ్మ దర్శన భాగ్యం లభిస్తుంది. గర్భాలయంలో ఉన్న అమ్మను దర్శించుకునేవారు సంప్రదాయాలను పాటిస్తూ పురుషులు ధోవతి కండువా, స్త్రీలు చీరలు, సల్వార్ కమీజులు ధరించాలి. శ్రీరాముండేశ్వరీ దర్శనం ఈ జన్మకు దక్కిన గొప్పవరం.*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁
[7/18, 16:14] +91 79819 72004: నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.[1][2][3]

ప్రారంభం
మండేలా గౌరవార్ధం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192మంది సభ్యులు ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానించారు.[4]

2009, ఏప్రిల్ 27న నెల్సన్ మండేలా ఫౌండేషన్ వారు మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంకోసం ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది.[5]

ఇతర వివరాలు
2009, జూలై 18న మొట్ట‌మొద‌టిసారిగా న్యూయార్క్ లో మండేలా దినోత్సవాన్ని జ‌రుపుకున్నా‌రు.[6]
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సమాజ సేవకు గుర్తుగా అతని విలువలను గౌరవించే రోజు.[1][7]
[7/18, 16:14] +91 79819 72004: *_అతడే ఒక సైన్యం!_*
*********************
_నెల్సన్ మండేలా జయంతి_
        18.07.1918

🔥🔥🔥🔥🔥🔥🔥 

_(సురేష్ కుమార్ ఎలిశెట్టి_)
       
       

✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽

ఒళ్లంతా వాచిపోయేలా దెబ్బలు తిన్న 
మండేలా బాధతో 
చేసిన ఆక్రందన..
నల్ల జాతి ఆవేదన
ఒక దేశం రోదన...
ఆయనపై పాలకుల కక్ష..
27 సంవత్సరాల శిక్ష..
నల్ల సూరీది రుధిరంతో
తడిసి ముద్దయిన 
జైలు గోడలు..
ప్రపంచానికి తెలియని
ఒక భయంకర అనుభవం..
రోబెన్ ద్వీపం..
అదెంత చేసుకుందో పాపం..
కళ్ళారా చూసింది 
ఓ మహావీరుని పరితాపం..
దుష్టాలకుల ప్రకోపం..
వీటితో పాటు గాంచింది
వెన్ను చూపని
ఆ మహావీరుని ప్రతాపం..!

స్వేచ్ఛ ప్రతి మనిషి ఇచ్చ..
రంగుల తేడాలేంటి..
వర్ణాల వివక్షలెందుకని
ఉరిమిన నల్ల వీరుడు..
నల్లజాతి హక్కుల కోసం
ప్రశ్నించడమే పాపమై..
అదే శాపమై..
జైలుకు పంపితే 
ఆగేదా ఆవేశం..
మూగపోయేదా 
నిలదీయడమే నేర్చిన 
ఆ గళం..!

అటు తెలుపు..ఇటు నలుపు
ఆ వైపు అధికారం 
ఇచ్చిన బలుపు..
ఈవైపు అణచివేతకు 
నలిగిన జనం
కంటి ఎరుపు..
ఆ మధ్యలో దిక్కులు పిక్కటిల్లేలా 
మండేలా పిలుపు...
దశాబ్దాల పోరాటంతో
సాధించిన మలుపు..
నల్లసూర్యుడి గెలుపు..!

అమ్మ క్షీరం కంటే
సెంట్రీ మూత్రమే 
ఎక్కువగా తాగానన్న 
ఒకనాటి ఖైదీ...
బాపూ సిద్ధాంతాలే స్ఫూర్తిగా
చరిత్ర మరవని అపారకీర్తిగా
తెలుపునలుపుల నడుమ 
హద్దులు చెరపగా..
సరిహద్దుల్లో పొడిచింది తొలిపొద్దు..
ఆ ఉదయం..
నల్లజాతికి తొలి ఉషోదయం
మండేలా తానుగా సృష్టించిన మహోదయం..!

దక్షిణాఫ్రికా పోరాట చరిత్రలో
ప్రతి పుట..ప్రతి సంపుటి..
మండేలా రుధిరమే సిరాగా
ఆయన ఆవేశమే అంశంగా..
అతడి వ్యధాంశమే కథాంశంగా..
అతగాడి విజయమే 
ఇతివృత్తంగా..
ఆ వీరుడి జీవితమే మొత్తంగా..
ఒక ఇతిహాసమై..
ఆధునిక జగతి ఎప్పటికీ
మరచిపోని 
గొప్ప సన్నివేశమై!

జైలు గోడలు చీల్చి..
మాటల తూటాలు పేల్చి..
చారిత్రక పోరాటానికి
మెట్లు పేర్చి..
నిరంకుశ పాలకుల
గుండెలు మండేలా 
నెల్సన్ మండేలా
చేసిన సింహనాదం..
దక్షిణాఫ్రికా స్వేచ్ఛానినాదం!

కారాగారమే కాటిసీమగా
అంతమైపోవాల్సిన జీవితం
స్వేచ్ఛావాయువులు పీల్చి
ఒక జాతికి తానే రక్షకుడై..
దేశానికే అధ్యక్షుడై..
రణాలు చేసిన 
గుణాలను వదిలి..
సంస్కరణలు చేపట్టి..
నోబుల్ శాంతి బహుమతి
సాధించాడు..
భారతరత్నమూ అయ్యాడు..
ఎల్లలెరుగని నల్లసూరీడు..!
************************
[7/18, 16:21] +91 79819 72004: 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


♥️ *కథ*-*165* ♥️


మనం బ్రతికి ఉన్నంత కాలం, జీవితంలో మనం ఏమేమి చేయాలనుకుంటున్నాం?


*ఆలస్యం* *చేయవద్దు*


చాలా తెలివైన ఒక డాక్టర్ ఉండేవాడు, ప్రతిక్షణం నవ్వుతూ ఉండడం అతని గొప్పతనం. అందరికీ అతను ఉల్లాసమైన వైద్యుడిగా ప్రసిద్ధి. మృత్యు ముఖం నుండి కూడా రోగులను వెనక్కి తీసుకురాగలడని ప్రతీతి.
తన దగ్గరకు వచ్చే రోగులందరినీ ఒక ఉత్తరం వ్రాసి ఇమ్మనేవాడు. అతను వారిని, "మీరు బ్రతికితే మీ జీవితాంతం ఎలా జీవిస్తారు, ఇప్పుడు మీరు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారు? ఈ లేఖలో వ్రాయండి",అని అడిగేవాడు.

రోగులందరూ తమ మనస్సును విప్పి వ్రాసేవారు.

"నేను బ్రతికితే, నేను నా కుటుంబంతో సమయం గడుపుతాను."

‘నా కొడుకు, కూతురి పిల్లలతో నాకు కుదిరినంతసేపు ఆడతాను."

"నా భర్తను, అతని తల్లిదండ్రులను చాలా బాధపెట్టాను. ఆపరేషన్ తర్వాత వారందరికీ క్షమాపణలు చెప్పి వారితో సంతోషంగా జీవిస్తాను."

కొందరు తనివితీరా ప్రయాణించాలనే తమ కోరికల గురించి వ్రాశారు.

నా వల్ల జీవితంలో ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతాను అని కూడా కొందరు వ్రాశారు.

నా జీవితంలో నవ్వును ఇంకా పెంచుకుంటాను అని ఎవరో వ్రాశారు.

"జీవితంలో నేను ఎవరికీ ఫిర్యాదు చేయను, అలాగే నా గురించి ఎవరికీ ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వను. నేనేం చేసినా నా వల్ల ఎవరూ బాధపడకుండా చూసుకుంటాను."

నేను ధ్యానం ద్వారా జీవితానికి సంబంధించిన అసలు లక్ష్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూడా ఎవరో వ్రాశారు.

ఇలా చాలా మంది రకరకాల విషయాలు వ్రాశారు.

ఆపరేషన్‌ చేసి రోగులను డిశ్చార్జి చేసిన తర్వాత డాక్టర్‌ వారు రాసిన లేఖను వారికి తిరిగి ఇచ్చి, ‘‘మీరు లేఖలో ఏం రాశారో,  మీ జీవితంలో ఇందులోది ఎంత సాధించగలిగారో దాన్ని గుర్తు పెట్టుకోండి. ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి, మీరు ఏమి చేయగలిగారో, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో చెప్పండి." అని చెప్పేవాడు.

డాక్టర్ ప్రకారం, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,
 'నేను బ్రతికితే ఒకరిపై పగ తీర్చుకుంటాను,'  'నేను నా శత్రువును అంతం చేస్తాను,'  'నేను చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను,'  'నేను చాలా బిజీగా ఉండాలి,'  'ఎవరినైనా  గెలవాలి,'  'మరింత గౌరవం పొందాలి', అని ఒక్క వ్యక్తి కూడా వ్రాయలేదు.

ప్రతి ఒక్కరికీ జీవితం పట్ల భిన్నమైన దృక్పథం ఉంది.

అప్పుడు డాక్టర్ ఇలా ప్రశ్నించేవారు, "మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఇలా జీవించలేదు, అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు ... ఇప్పుడు ఏదైనా మిమ్మల్ని ఆపుతోందా; ఇప్పుడేమైనా ఆలస్యం అయిందా?"

ఇది డాక్టర్ ఉల్లాసంగారి  కథ!!


మన జీవిత కథను ఒక్కసారి చూద్దాం. మన జీవితాన్ని మనం ఎలా జీవించాలనుకుంటున్నామో ఆలోచించండి..
ఇప్పుడే ఇలాంటి జీవితాన్ని గడపడం ప్రారంభిద్దాం. జీవిత ప్రయాణం పూర్తి అయినప్పుడే జీవితం యొక్క అసలైన ఆనందం, ఆ క్షణంలో ఏ కోరిక మిగిలి ఉండదు, అపరాధభావం ఉండదు. 
" మేము జీవించాలనుకున్న అందమైన జీవితాన్ని మేం గడిపాం ", అని అప్పుడు మనం చెప్పగలం.

ఇంక ఎక్కువ ఆలస్యం చేయవద్దు !!

♾️

ప్రతీ రోజూ జీవితాన్ని కొత్త మార్గంలో జీవించడానికి ఒక క్రొత్త అవకాశం. ప్రతీ ఉదయం ధ్యానం ఆ క్రొత్త జీవితాన్ని ఈ జీవితంలోకి తీసుకురావడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. 🌼

*చారీజీ*


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌


HFN Story team
[7/18, 16:33] +91 79819 72004: తెలుగు సాహిత్య, సినిమా, మరియు పత్రికా రంగాల్లో అత్యంత ప్రముఖ వ్యక్తిగా గుర్తింపబడిన బహుముఖ ప్రతిభాశాలి. కథకుడిగా, వ్యంగ్య వ్యాస రచయితగా, కాలమిస్టుగా, సినిమా నిర్మాతగా, మరియు సంపాదకుడిగా ఆయన చేసిన కృషి తెలుగు సాహిత్య లోకంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన రచనలు, ముఖ్యంగా "మిథునం" వంటి కథలు, తెలుగు సాహిత్యంలోనే కాక సినిమా రంగంలో కూడా ఒక మైలురాయిగా నిలిచాయి. ఈ రోజు శ్రీరమణ గారి వర్ధంతి జ్ఞాపకం !

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఈ వ్యాసం శ్రీరమణ గారి జీవితం, సాహిత్య కృషి, సినిమా రంగంలో ఆయన పాత్ర, మరియు సమాజంపై ఆయన చూపిన ప్రభావాన్ని వివరిస్తుంది.

తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, అక్షర తునీరం అనే కలం పేరును స్వీకరించి, అనేక పత్రికలకు వ్యంగ్య రచనలను కూడా అందించారు. శ్రీ రమణ అనే మారుపేరుతో పిలువబడే ఆయన నిజమైన గుర్తింపు కామరాజ రామారావు.
......
జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ రమణ గారు టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు రచయితగా వ్యవహరించారు.  బాపు, రమణలతో పాటు పలువురు దర్శకులతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా పేరడీ రచనలకు  ఆయన  ఫేమస్‌.  ‘నవ్య’ వారపత్రికకు ఎడిటర్‌గానూ పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

◾బాల్యం మరియు విద్య.....

శ్రీరమణ 1952 సెప్టెంబరు 21న ఆంధ్రప్రదేశ్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు బొమ్మకంటి శ్రీనివాసరావు. బాల్యం నుండే సాహిత్యం, హాస్యం, మరియు సమాజంపై లోతైన ఆలోచనలపై ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన విద్యాభ్యాసం స్థానికంగా పూర్తిచేసి, తరువాత సాహిత్యం మరియు రచనా రంగంలో తన ప్రతిభను ప్రదర్శించారు. ఆయన రచనల్లోని సహజత్వం, సమాజంలోని సూక్ష్మ విషయాలను గమనించే దృష్టి, మరియు హాస్యం ఆయన బాల్యం నుండి ఆయనలో ఉన్న సృజనాత్మకతను సూచిస్తాయి.

◾సాహిత్య రచనలు....

శ్రీరమణ గారు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రచనలు వ్యంగ్యం, హాస్యం, మరియు మానవీయ భావాలతో నిండి ఉంటాయి. ఆయన కథలు సామాజిక సమస్యలను, మానవ సంబంధాలను, మరియు జీవితంలోని సూక్ష్మ భావాలను సమర్థవంతంగా చిత్రీకరిస్తాయి. 

◾"మిథునం" - ఒక మాస్టర్‌పీస్....

శ్రీరమణ గారి అత్యంత ప్రసిద్ధ రచనల్లో "మిథునం" ఒకటి. ఈ కథ ఒక వృద్ధ దంపతుల జీవితంలోని సరళత, ప్రేమ, మరియు సన్నిహిత క్షణాలను అద్భుతంగా చిత్రీకరిస్తుంది. ఈ కథ 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో సినిమాగా మలచబడి, ఎస్పీ బాలసుబ్రమణ్యం మరియు లక్ష్మీలు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా కూడా కథలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. "మిథునం" కథలోని సరళమైన కథనం, లోతైన భావోద్వేగాలు, మరియు సహజమైన సంభాషణలు శ్రీరమణ గారి రచనా నైపుణ్యానికి నిదర్శనం.

◾ ఇతర రచనలు....

మిథునం తో పాటు, శ్రీరమణ గారు అనేక కథలు, వ్యాసాలు, మరియు వ్యంగ్య రచనలు రాశారు. ఆయన రచనలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి, మరియు ఆయన వ్యంగ్య హాస్య కాలమ్‌లు పాఠకులను ఆకర్షించాయి. ఆయన కాలమ్‌లలో సమాజంలోని వైరుధ్యాలను, అసంబద్ధతలను హాస్య రీతిలో విమర్శించే నైపుణ్యం ఉండేది. ఈ రచనలు సమాజంలోని సమస్యలను హాస్యం ద్వారా పాఠకులకు అర్థమయ్యేలా చేసేవి.

◾పత్రికా రంగంలో కృషి....

శ్రీరమణ గారు "పత్రిక" అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా పనిచేశారు. ఈ పత్రికలో ఆయన రచనలు, సంపాదకీయాలు, మరియు హాస్య కాలమ్‌లు పాఠకులకు ఎంతో ఆదరణ పొందాయి. ఆయన సంపాదకీయ నైపుణ్యం ద్వారా "పత్రిక" ఒక ప్రముఖ సాహిత్య మాసపత్రికగా గుర్తింపు పొందింది. ఆయన సంపాదకీయాలు సమాజంలోని సమకాలీన సమస్యలను విశ్లేషించే విధానంలో సరళమైనవి, అయినా లోతైనవి.

◾సినిమా రంగంలో పాత్ర.....

శ్రీరమణ గారు సినిమా రంగంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. "మిథునం" కథను సినిమాగా మలచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కథలు సినిమా రచయితలకు, దర్శకులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా కూడా పనిచేసి, తెలుగు సినిమా రంగంలో సాహిత్య రచనలకు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఆయన రచనలు సినిమా రంగంలో సాహిత్యం మరియు కళా రూపాన్ని సమన్వయం చేసే విధానంలో మార్గదర్శకంగా నిలిచాయి.

◾ పురస్కారాలు మరియు గుర్తింపు.....

శ్రీరమణ గారి రచనలు ఎన్నో పురస్కారాలను, గుర్తింపులను అందుకున్నాయి. 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి హాస్యరచన విభాగంలో కీర్తిపురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం ఆయన హాస్య రచనలలోని ప్రత్యేకతను, సమాజంపై ఆయన చూపిన ప్రభావాన్ని గుర్తించింది. ఇంకా, ఆయన రచనలు పాఠకులు, విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు పొందాయి.

◾సమాజంపై ప్రభావం....

శ్రీరమణ గారి రచనలు సమాజంలోని సామాజిక, సాంస్కృతిక అంశాలను సరళమైన హాస్యం ద్వారా పాఠకులకు అందించాయి. ఆయన రచనలు సమాజంలోని వైరుధ్యాలను, అసమానతలను, మరియు మానవ సంబంధాలను సూక్ష్మంగా పరిశీలించి, వాటిని హాస్యం, వ్యంగ్యం ద్వారా వ్యక్తీకరించాయి. ఆయన రచనలు పాఠకులను ఆలోచింపజేస్తూనే, వారిని నవ్వించే శక్తిని కలిగి ఉన్నాయి.

◾వ్యక్తిగత జీవితం...

శ్రీరమణ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ వివరాలు సార్వజనికంగా అందుబాటులో లేనప్పటికీ, ఆయన రచనలు ఆయన సామాజిక దృక్పథాన్ని, మానవీయ విలువలను ప్రతిబింబిస్తాయి. ఆయన సరళమైన జీవన శైలి, సాహిత్యం పట్ల అంకితభావం, మరియు సమాజంపై ఆసక్తి ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తాయి.

◾ వర్ధంతి సందర్భంగా.....

ఈ రోజు, జులై 18, 2025, శ్రీరమణ గారి వర్ధంతి సందర్భంగా, ఆయన సాహిత్య, సినిమా, మరియు పత్రికా రంగాల్లో చేసిన కృషిని స్మరించుకోవడం ప్రతి తెలుగు సాహిత్యాభిమాని బాధ్యత. ఆయన రచనలు ఈ రోజు కూడా పాఠకులను ఆకర్షిస్తున్నాయి, స్ఫూర్తినిస్తున్నాయి. ఆయన "మిథునం" వంటి రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి, భావితరాలకు మార్గదర్శనం చేస్తాయి. ఆయన అనేక ముఖ్యమైన రచనలలో 'జోకి జ్యోతి', 'శ్రీ ఛానల్', 'పండరి' మరియు 'మొగలి రేకులు' వంటి ఆకర్షణీయమైన కథలు ఉన్నాయి. స్క్రీన్ రైటర్, రచయిత మరియు జర్నలిస్ట్‌గా శ్రీ రమణ వారసత్వం నిస్సందేహంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు సాహిత్య దృశ్యంపై చెరగని ముద్ర వేస్తుంది.

......
శ్రీరమణ గారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. ఆయన కథలు, వ్యంగ్య రచనలు, మరియు కాలమ్‌లు తెలుగు పాఠకుల మనసులను ఆకర్షించాయి. సినిమా రంగంలో ఆయన కృషి, "పత్రిక" మాసపత్రికకు ఆయన సంపాదకీయ నైపుణ్యం, మరియు హాస్య రచనలకు అందిన గుర్తింపు ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం. ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన రచనలను మళ్లీ చదివి, ఆయన సాహిత్య లోకంలోని సరళతను, హాస్యాన్ని, మరియు లోతైన భావాలను ఆస్వాదిద్దాం. 
.......
శ్రీరమణ గారి సాహిత్య యాత్ర తెలుగు సాహిత్యాభిమానులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం!

          🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

No comments:

Post a Comment