Sunday, 20 July 2025

****పిల్లల పెంపకం విషయమై*! *తల్లిదండ్రులు ప్రవర్తన* *విషయమై! కొన్ని చిట్కాలు మీకోసం

 [7/17, 18:02] +91 79819 72004: 🙏🔥🔥🔥🔥🙏
👌" *పిల్లల పెంపకం విషయమై*! *తల్లిదండ్రులు ప్రవర్తన*
*విషయమై! కొన్ని చిట్కాలు మీకోసం*
       🦜🦜🦜
🚩"*సేకరణ & సమర్పణ*:
 *MAZUMDAR*
   *BANGALORE*
       🙏🇮🇳🇮🇳🙏
🦜1)"*తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల లోని లోపాలను* *ఎత్తిచూపటం కన్నా*! 
"*వారిలో ఉన్న "స్పెషల్ 'స్కిల్స్' గుర్తించి ప్రోత్సహించండి*!

🦜2)"*మీ పిల్లలు తప్పు చేసినప్పుడు ,మీ నాన్న రానీ చెప్తాను. (లేదా) అమ్మ రానీ చెప్తాను, నీ సంగతి అని అనకూడదు.  దాని వలన వారికి 'ప్రేమ బదులు భయం' ఏర్పడుతుంది. పిల్లల 'మెదడులో రికార్డ్'  అయ్యి! దారి తప్పే ప్రమాదం ఉంది అని తెలుసుకోండి*!

🦜3)"*ఇతరులు ముందు మీ పిల్లలని తక్కువ చేసి మాట్లాడకండి*. 
*దానివల్ల వారు కోపం వచ్చి, ఆవేశంలో ఏదైనా చేయగలరు*.

🦜4)"*మీ పిల్లలకు ఏ విషయం చెప్పదలుచుకున్నా! ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చెప్పండి*  *పదేపదే వాగిందే , వాగుతూ*! 
*హెచ్చరికలు జారీ చేయకండి. వాళ్లు మిమ్మల్ని లెక్క చేయరు*

🦜5)"*మీ పిల్లలతో మీరు బజారు/మాల్ లో ఏది అడిగితే అది కొని ఇవ్వకండి. ఇవ్వకపోయినప్పుడు ఏడ్చితే బెదిరించండి ! తప్ప, కొట్టవద్దు. మీరు అడిగిందల్లా ఇస్తే! ఆ తరువాత అనేక సమస్యలు మీకు రావచ్చు, తప్పక భరించాలి*.

🦜6)"*ఇతరుల పిల్లలతో మీరు ఎట్టి పరిస్థితులలోనూ ,మీ వాళ్లను పోల్చకండి? దానివలన తనంటే మీకు ఇష్టం లేదనుకుంటారు*".

🦜7)"*మీరు అమలు పరచలేని 'రూల్స్' అనవసరంగా మాట్లాడి , మీ పరువు తీసుకోకండి*?

🦜8)"*మీరు ఒక తప్పు చేస్తూ! అది చేయకూడదని మీ పిల్లలకు చెప్పి, నవ్వుల పాలు కాకూడదు*. *అదేదో సామెత కూడా ఉంది కదూ!*

🦜9)"*మీ పిల్లలు ఉదయం ఎప్పుడు లేవాలో, ఎప్పుడు చదవాలో ఎప్పుడు పడుకోవాలి*  *అనే విషయాలు మీద* 
*వాటి ఉపయోగాలను* *తెలిపి అవి వారు ఆచరించే విధంగా ప్రోత్సాహం, ఉత్సాహము, కలిగేటట్టు వారికి అందించండి*"

🦜10)"*నేడు పూర్తిగా కమర్షియల్ రోజులో చేసిన ఈ కాలంలో ఆప్యాయతనందించే చుట్టాలను తరచూ కలుస్తూ! ఉండండి*. *బంధుత్వాలను, మీ పిల్లల ముందు, మీరే చులకన చేస్తే!  మీ పిల్లలు రేపు డబ్బు, హోదా , 'ఎమోషనల్ సపోర్టు' అందించే వారు  గా ఉండరు*"

🦜11)"*మీకు పిల్లలతో గడిపే 'ఖాళీ సమయం' మీకు లేకపోతే!  వారిని స్కూలుకు మీతో తీసుకెళ్లండి.  అక్కడ నుండి మీ పని చూసుకుని తిరిగి రండి*.

🦜12)"*మీ పిల్లలకు వారికేదైనా సమస్య వస్తే!  మీతో చెప్పడానికి భయపడే వాతావరణo  ఈ రోజుల్లో అసలు పనికిరాదు.  వారు మీతో అది పంచుకునే విధంగా మీరు వారి స్థాయికి ఎదగాలి! చాలామంది వారి స్థాయికి దిగాలి అని అంటారు.   అది తప్పు!  'బాల్యదశ' అందుకోవటం చాలా కష్టమైన ప్రక్రియ*

🦜13)" *పెద్దయ్యాక ఏమవుతావు? అని అడిగితే వారు* *ఇంజనీరు, డాక్టరు, యాక్టర్ అంటే? హేళనగా, చులకన చేసి, నవ్వకండి*?

🦜14)"*మీ పిల్లలని శిక్షించాల్సి వచ్చినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని 'చీకటి గది'లో పెట్టడం గాని, 'పోలీసు భయం' 'బూచాడు భయం' లాంటిది కలిగించటం గాని  అసలు చేయకండి?*.

🦜15)"*మీ పిల్లలను ఎటువంటి పరిస్థితులలోనూ చంపేస్తాను చీల్చేస్తాను నరికేస్తాను లాంటి పిచ్చి పదాలు మర్చిపోండి. అది మీరు చెయ్యరు, చెయ్యబోరు, గొంతు సోష, ప్రగల్భాలు తప్ప*"

🦜16)"*వారానికి ఒక్కసారైనా పిల్లలతో సరదాగా ఒక సినిమాకు/ మాల్*,/ *ఫంక్షన్/ కో, పిక్నిక్/పార్కు లాంటి చోటకు*   *వారిని*
*తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి*"

🦜17)"*మీరు మీ పిల్లలని స్నేహితులు బంధువులకు పరిచయం* *చేసినప్పుడు చాలా మావాడు*" *క్లవర్ చైల్డ్*/ 
*కవితలు రాస్తాడు*/, *పుస్తకాల పురుగు, లాంటి, ప్రశంసలు చేస్తూ! చెప్పండి. అవి మీ పిల్లలకు 'ప్రేరణ' కలిగిస్తుంది*.

🦜18)"*మీ పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చినదా!  అయితే తరువాత మీరు వారికి భోజనం తినిపించటం మానేయాలి.  అలా కాకుండా! తినిపిస్తే!, మీసాలు వచ్చాక కూడా 'అమ్మకూచి'గా ఉండే అబ్బాయిలు తరువాత  భార్య కో సమస్యలవుతారు*.

🦜19)"*మీ పిల్లలకు చదువు గురించి అతిగా చెప్పకండి? దాని వలన మీకోసం చదవాలనుకుంటారు అందుచేత చదువు వలన వచ్చే సంస్కారం, విధేయత అనే లాభాలను మాత్రమే!  చెప్పండి*!

🚩20)"*పిల్లలకు ఉదయం పూట, యోగా, నీళ్లు తాగటం*, 
*పరిగెత్తటం*",/ *మిమ్మల్ని అనుసరించేటట్లు, మీరు ఆచరించి*," "    *శ్రీహరి*
,*నామస్మరణ*" *ప్రహ్లాదుడు, ద్రువుడు, మార్కండేయుడు, హరిశ్చంద్రుడు, లాంటి కథలు, చెబుతూ ఆధ్యాత్మిక మార్గంలో, పయనిస్తే! బాగుంటుందని, ఆ కథల ద్వారా మంచి స్ఫూర్తి, కలిగేటట్టు, తెలియపరచండి*"

🦜21)"*మీ పిల్లలకు వారికి వయసుతో వచ్చే శారీరిక మార్పులు, సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు సలహాలు, మీరు( లేదా) డాక్టరు (లేదా )ఆప్తుల చేత చెప్పించండి*!"

🦜22)" *ఈ పిల్లలకు, దయ్యాలు, భూతాలు 
కథలు చెప్పటం,/ సినిమాలు చూపినా!
వారిని అతిగా భయపెట్టాక, వారికి 
ధైర్యం, సాహసం, గురించి బోధించండి. 

🦜23)"*పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు*, *ఇంటి పని, తోట పని, వంట పని, చేసేటప్పుడు మీకు సహాయకారిగా*! 
 *వారికి నేర్పే విధంగా*! 
*వారిని తీర్చిదిద్దండి*. 

🚩24)"*మీ పిల్లలతో, విడివిడిగా కూడా కలుస్తూ!  కబుర్లు చెబుతూ,  ఇతర కుటుంబ సభ్యుల గురించి మంచి మాటలు చెబుతూ*!
*వారికి 'మంచి మానవ సంబంధాలు' మెరుగుపడేగా వారిని తీర్చిదిద్దండి*

♨️25)"*పిల్లలతో సమస్యలు వస్తే! వెంటనే పరిష్కారమవుతాయని , ఊహించి అనుకోకండి*. *ఉదాహరణకు మీ అబ్బాయి లేదా అమ్మాయి స్కూలుకు సరిగా వెళ్లడం లేదని తెలిసిందనుకోండి.  అక్కడ ఒక పెద్ద శీన్ దయచేసి సృష్టించకండి?.  నెమ్మదిగా, ఓర్పుతో మాట్లాడి సమస్యను తెలుసుకోండి? ఆ మూలాలను రూపుమాపుటకు తగిన, మెరుగైన, పరిష్కార మార్గాలు సూచించండి*!
🚩 *గమనిక*:          **ఈ శీర్షిక యొక్క* 
*రెండవ భాగంగా, రేపు మీకు అందించబడును*. *ఓపిక, తీరిక, మీ విలువైన సమయాన్ని వినియోగించారు అనేవారికి నా ధన్యవాదములు, ఈ గ్రూపులో అందించారని* 
   *మీకు అనిపిస్తే*
"*మంచిది*. *ఇవన్నీ కూడా మాకు తెలుసులే*! 
 *ఇది కూడా రాయాలా*? 
*అనేవారు*  *కూడా ఉంటారు*.  *SO What*?
*అనే మొండి వాడిని*, 
*అని అనుకున్నా పరవాలేదు* *చెప్పాలనిపించింది*
*చెప్పి తీర తాను, రాయాలన్నది రాస్తాను తెలుసుకోవాలన్న వారు ఉంటారు*
    *మజుందార్*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
[7/17, 18:02] +91 79819 72004: 🙏🔥🔥🔥🔥🙏"
👌 *నిన్నటి తరువాయి 2 భాగం*
👍"*పిల్లల పెంపకం విషయమై! 'తల్లిదండ్రులు ప్రవర్తన' విషయంలో కొన్ని చిట్కాలు మీ కొరకు*"
     🦜🦜🦜
 *MAZUMDAR*
  *BANGALORE*
      🙏🇮🇳🇮🇳🙏

👌26)"*ఆడపిల్లలకు మనదేశంలో 'తండ్రి' ఎక్కువగా గారాబం చేస్తాడు. ఆమె పెళ్లయిన తర్వాత ఎలాగా కష్టపడుతుందని ఇప్పుడు పనిచేయనివ్వడు. అటువంటివారు పెళ్లయ్యాక అత్త, ఆడపడుచులతో సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ పద్ధతి మనకి పనికిరాదు*

👌27)"*మీ పిల్లలను హోంవర్క్ చెయ్యమని బెదిరించటం వల్ల నేడు లాభం లేదు. పక్కన కుర్చుని మీరు కూడా న్యూస్ పేపరు,లేక  "భాగవతం పుస్తకము' లాంటిది చదువుకోండి? గత్యంతరం    మంచిది. లేదా వాళ్లు చేతివాటానికి అలవాటు  పడవచ్చు సుమా*

👌28)"*మీ పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిట్టడం కన్నా! టీవీ ఆపు చేయటం కన్నా! పిల్లలు లను మీరు ఇప్పుడు చదువుతావా లేక 10 నిమిషాల తర్వాత చదువుతావా? అని వారినే అడిగి 'ఛాయిస్' ఇవ్వండి?*

👌29)"*మీ ఇంటిలో పేకాటలు,' మందు పార్టీలు' ఉండటం వల్ల పిల్లలు కూడా! తాము పెద్దయ్యాక అలా చేయవచ్చునని అభిప్రాయం వారిలో కలుగుతుంది. కాబట్టి అవి విడిచి పెట్టండి*?

👌30)"*భార్యాభర్తల మీద కోపతాపాలు మీ పిల్లల మీద చూపించకూడదు. అత్తగారి మీద కోపాలతో తన పిల్లలని చితకొట్టిన 'కోడళ్ళు' నాకు చాలా మంది తెలుసు*

👌31)" *కేవలము మీ పిల్లలు ఒక సబ్జెక్టులో కొంచెం 'పూర్ ' గా ఉన్నంత మాత్రాన పిల్లలని మీరు 'మొద్దు' గా ముద్ర వేయకండి*?
' *ఐన స్ట్రీన్' కి లెక్కల్లో సున్నా వచ్చేదట*. 
*ఎడిసన్ కి,లేనార్డో విన్సీ,లకు 'ఇంగ్లీష్ గ్రామర్ 'లో సున్నాలు వచ్చాయట. మీరే జడ్జిమెంట్ త్వరపడి ఇవ్వకండి*.

👌32)"*పిల్లలతో సమస్యలు వస్తే! వెంటనే పరిష్కారమవుతాయని అనుకోకండి.  ఉదాహరణకు మీ అబ్బాయి లేదా అమ్మాయి స్కూలుకు వెళ్లడం లేదని తెలుసు అనుకోండి అక్కడ ఒక వారు సీను, సృష్టించవద్దు. నెమ్మదిగా మాట్లాడి సమస్య తెలుసుకోండి*!"

👌32)"*వీలినప్పుడల్లా వారి స్కూలు లేదా కాలేజీకి వెళ్లి టీచర్లతో సంభాషించండి.  మీ పెద్ద పిల్లలు స్కూల్ కి రా వద్దంటారు. వారికి భయపడి మానేశారో, మీ పని గోవిందా! గోవిందా!"*

👌33)"*మీ పిల్లల ఫ్రెండ్స్ ని ఇంటికి అప్పుడప్పుడు, బర్తడే పార్టీలు & "గెట్ టు గెదర్" పార్టీలు వారి పేరెంట్స్ ను కూడ పిలిపించి వారి 'బ్యాక్ గ్రౌండ్' కూడా వాకబు చేయడం మంచిది*

👌34)"*కనీసము మీ పిల్లలకు   'పరీక్షల' సమయంలో మీరు టీ.వీ సీరియల్స్ చూడటం లాంటివి మానేయండి. ముందు మీరు టీ.వీ త్యాగం  చేస్తే!  వాళ్లు కూడా చేస్తారు*

👌35)"*ముఖ్యంగా తల్లిదండ్రులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మానాలి. పొదుపు చేయటం నేర్చుకొని పిల్లలకు 'డబ్బు విలువ' గురించి చెప్పాలి.  ఒక రూపాయి పొదుపు చేస్తే! రూపాయ సంపాదించినట్లేనని చెప్పాలి*

👌36)"*పిల్లలకు పాఠశాలలో ర్యాంకులు వచ్చినా! ఏదైనా పోటీలో నెగ్గినా! ఏవైనా సర్టిఫికెట్స్ వారి నైపుణ్యం గురించి వచ్చిన! ప్రత్యేకంగా వారిని అభినందించండి. స్కూలు ఫంక్షన్ కు తప్పక వెళ్తూ! ఉండండి*.

👌37)"*ఫస్ట్ ర్యాంకు వచ్చే పిల్లలు ఒకవేళ ఆ ర్యాంకు రాకపోతే భరించలేరు.  అదొక అవమానంగా భావిస్తారు.  అసూయ పెంచుకుంటారు.  కాబట్టి వారిలో క్రీడా స్ఫూర్తి !, ఇతర నైపుణ్యాలు పెంచే ప్రయత్నం నేటి తల్లిదండ్రులు చేయాలి*

👌38)"*విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు సామాజికంగా! కొన్ని ఇబ్బందులకు బయట గురవటం సహజం!  కాబట్టి మీ పిల్లలకు ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కూడా రాకుండా ఉండేలా!  మీ ఇరువురి ప్రవర్తన మార్చుకోండి*?

👌39)"*స్కూల్లో పిల్లలని వారి స్నేహితులు హింసించినప్పుడు, మీరు వెళ్లి ఆ పిల్లలని బెదిరించడం కొట్టడం లాంటివి చేయకండి ఆ విషయము 'టీచర్ దృష్టికి'  తీసుకుని వెళ్లాలి.  ఆ పిల్లల్ని బెదిరిస్తే! వారి తల్లిదండ్రులు కూడా ఊరుకోరు కదా*!

👌40)"  *మీ పిల్లలని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అవమానించకండి*. 
*మా అబ్బాయి/ మా అమ్మాయి ఇంటి పనిలో నాకు బాగా సహాయపడుతుంది అని చెప్పండి*.  *ఆ తరువాత ఆ పిల్లలకు కూడా వాళ్ళింటిలో తల్లికి తండ్రికి సాయం చేస్తారు.  ఆపైన మీ పిల్లలు మీకు నిజంగా సాయం చేస్తారు*

👌41)"*అసూయ పెరిగిన పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో శారీరక ఆరోగ్యం పై! విపరీత ప్రభావం ఉంటుంది. మానసికంగా ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకున్న వారిని నేను చూశాను. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేయాలి*

👌42)"*మీ ఇంట్లో పనికిరాని సిరప్, కాలం ముగిసిన టాబ్లెట్లను, బయట పారేయండి. తుంచి మొక్కలలో వేసినా పరవాలేదు.  అలాగే పాత బ్లేడులు తుప్పు పట్టినవి, పాత కత్తులు ఇంట్లో పొరపాటున కూడా ఉంచకండి*

👌43)" *మీరు విడిచిన బట్టలను ఎక్కడ వేయాలో అక్కడే వెయ్యండి*. *ఏవి హాంగర్ కి* *తగిలించాలో, ఏవి వాషింగ్ మిషన్ లో వేయాలో*! *ఏవి పాత బట్టలు, కురచగా ఉన్నవి, బయట* *ఇచ్చేవి, తరచు వాటిని* 
*సపరేటు చేయటం లో *మీ పిల్లల సహాయంతో చేయండి*!

👌44)"*మీ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ గురించి నేర్పటం అన్ని విధాల శ్రేయస్కరం*. *ఇప్పుడు మన రాష్ట్రంలో జవహర్ బాల భవన్, లైయన్సు*,
*రోటరీ క్లబ్బు లాంటి మీటింగుల్లో ఇటువంటి శిక్షణ ఇస్తున్నారు*.

👌45)"*మీ ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆర్పే అలవాటు మీరు చేసుకోండి*?                 *పిల్లలకు* 
*అది జాతీయ సంపద* 
*వృధా చేయకుండా* *ఉండటం మంచిది*. *అనే విషయం అర్థమయ్యేలా చెప్పండి*

👌46)"*మీ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ పెట్టిన అందుబాటులో, ఉంటాయో ఆలోచించి, ఆ వస్తువులు అక్కడే ఉంచే అలవాటు చేసుకోండి.  అదే అలవాటు మీ పిల్లలకు అవుతుంది*.  *లేని పక్షంలో "కటింగ్ ప్లేయర్" & కత్తెర*  *లాంటివి కోసం*
*కోసం గంటసేపు* *వెతుకుటకు శ్రమ పడాల్సి వస్తుంది*

👌47)"*ఇటీవల పిల్లల ఫస్టు బర్తడే లకు లక్షలలో ఖర్చు పెట్టి బయట ఫంక్షన్ హాల్ లో చేయుట చూస్తున్నాము.  మీరిచ్చే వస్తువుల కన్నా! ఆ సమయంలో మీరు పనులన్నీ చేసి పాల్గొనడం పిల్లలకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.  'They love your presence than the presentation ' అంటారు.

👌48)"*మీ ఇంట్లో టేబుల్ క్యాలెండర్ లాంటిది పెట్టి, ప్రతిరోజు తేదీ వారాలను మార్చే పని పిల్లలకు అప్పగించండి*. 
*మా ఇంట్లో చిన్నప్పుడు మా గ్రామంలో ఆ పని నేనే చేసే వాడిని*.

👌49)"*ఎప్పటికప్పుడు చెత్తను చెత్తబుట్టలో వేయటం ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పేపర్లు చాక్లెట్ కాగితాలు కనబడితే చట్టబుట్టలో వేయటం లాంటివి పిల్లలకు నేర్పండి.  విదేశాలలో, 
పక్కన లేకపోతే జేబులో పెట్టుకుని, 
వెళ్లేటప్పుడు 'డస్ట్ బిన్' ను వేయుట నేను చూశాను.

👌50)"*నేడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో*, *మనమే* 
*మన పదార్ధములను*, *మంచినీరు, తెచ్చుకొని* 
*కూర్చుని తిని, తిరిగి*
*ఎంగిలి వాటిని ఒక ప్రత్యేక స్థలములో*, *వెయ్యాలి.  అలాగే వివాహ ఫంక్షన్లు, సమయంలో అలా జరగటం ఎంతో అభినందించదగ్గ విషయం  తదుపరి తరానికి ఇది ఒక సూచన.*.
*గమనిక*:- *ఇది రెండవ భాగం, 3 భాగం* 
*రేపు ముచ్చటించుకుందాం*! 🙏🇮🇳🇮🇳🇮🇳"🙏"

 🙏🔥🔥🔥🔥🙏"
👌 *నిన్నటి తరువాత- 3,వ భాగం పిల్లల పెంపకం  విషయమై తల్లిదండ్రులు ప్రవర్తన విషయంలో మరికొన్ని కొన్ని చిట్కాలు*
    🦜🦜🦜
  *MAZUMDAR*
   *BANGALORE*
       🙏🇮🇳🇮🇳🙏
👌51)"*సైకాలజీ సిద్ధాంతం' ప్రకారము సహజంగా కొడుకు తల్లిని , కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తారు. అందుచేత వారి ముందు తల్లిదండ్రులు తిట్టుకున్న , కొట్టుకున్న ఒకరు మరొకరికి దూరం కావటం ఖాయం అని గుర్తుంచుకోండి*!"

👌52)"*మీ ఇంట్లో స్థలం ఉంటే పూల మొక్కలు వేయండి! కూరగాయల మొక్కలు వేయండి*. 
 *గులాబీలు ఎలా పూస్తాయో*! *వంకాయలు, బెండకాయలు ఎలా నవనవలాడుతూ ఉండి*, *ఆర్గానిక్ వి రుచి బాగుంటాయని చెప్పి*
*వారిని ఉత్తేజితులను కావించండి*

👌53)" *మీకు ఫోను వచ్చినప్పుడు లేదా ఎవరైనా వచ్చినప్పుడు మీరు లేనని చెప్పమని, పిల్లలకు చెప్పకండి? అలా అబద్ధాలు చెప్పిస్తే ! తర్వాత వాళ్లు ఆ విషయంలో "మాస్టర్" అయిపోతారు*

👌54)"*ఉద్యోగాల్లో బిజీ గా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లలని తల్లి గారి ఇంట్లో ఉంచి, లేదా వేరే ఇంటిలో చదివించడం జరుగుతుంది.  అది తల్లిదండ్రుల మధ్య అంతర్యాన్ని నిశ్శబ్దాన్ని పెంచుతుంది* 

👌55)"*మీ పిల్లల మాటలు వినండి! మీ బాల్యంలో మీ మాట వినని, పెద్దల మీద మీరు ఎంత కోపం తెచ్చు కొన్న విషయం గుర్తుచేసుకోండి*?

👌56)"*పిల్లలిద్దరూ పోట్లాడుకున్నప్పుడు సహజంగా వారిలో పెద్ద వారిని శిక్షిస్తారు.  లేదా న్యాయ దేవత లాగా! వాదోపవాదాలు వింటారు.  ఇవి రెండూ నేడు పనికిరావు.  సరే!లేరా రండి! సరదాగా ఈ పని చేద్దాం! అని వారి మూడ్  'డైవర్ట్' చేసి వారికి ఇష్టమైన పని చేయించండి*!

👌57)"*కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అంటే 10- 12 మధ్య వయసు వారు ఉన్న పిల్లలని మీకు కథలు చెప్పమని ప్రోత్సహించండి.  'అబద్ధాలు' అందంగా చెప్పగలిగే , ఆ వయసుని సృజనాత్మక'(creatives )వైపు మరలించండి*.!

👌58)"*కొందరు తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు నీ కన్నీ  మేనమామ పోలికలు వచ్చాయి. నీ కర్మ అంటారు. భార్య మీద కోపంతో, ఆ పిల్లలు అది నిజం అనుకొని కంటిన్యూ చేస్తారు.  తల్లి కూడా "నీ మేనత్త' పోలికొచ్చింది. అంటు ఉండటం కూడా సహజమే*!

👌 59)"*తల్లిదండ్రులు ఏ ఊరు వెళితే!  ఆ ఊరిలోని చారిత్రిక కట్టడాలు చూపించి మన 'సంస్కృతి' గొప్పదనం గురించి చెప్పాలి.  పదేళ్లుగా బెంగుళూరులో ఉన్న కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంతవరకు ,'విశ్వేశ్వరయ్య మ్యూజియం,' కంబన్ పార్కు, చూపించలేదు. అంటే! మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాల నిజం*"

👌60)"*పిల్లలకు ఏదో ఒక హాబీలో శిక్షణ ఇప్పించండి.  ఈత, క్రికెట్, ఫుట్ బాల్, వైలెన్, గిటార్, వారిని చేర్చిన వారు ఎప్పుడు బిజీగా, వారిని ఉంచుతాయి. దానికి కావలసిన వనరులను వీలైనంతవరకు మీరు అందించండి*.

👍61)"*మీ చుట్టూ పక్కల వాళ్లతో సత్సంబంధాలు పెట్టుకోండి. దానివలన మీరు లేని సమయంలో వారు మీ పిల్లలకు సహాయంగా ఉంటారు*.

👍62)"*తల్లి ఆత్మహత్య చేసుకుంటే ఆమె పిల్లలకు కూడా భవిష్యత్తులో అటువంటి ఆలోచనలు రావటానికి అవకాశం ఉంది*.  *కాబట్టి అటువంటి ఆలోచన ఉన్న తల్లులు 'సైకాలజిస్ట్ ' ను సంప్రదించటం మంచిది*.

👍63)"*కొందరు తల్లులు వారి పిల్లలు ఆరేడు తరగతులు చదువుతున్నా! పిల్లలకు బూట్లు పాలిష్ చేసి పెడుతుంటారు.  అలా చేయక తండ్రి ఆ పిల్లలకు పాలిష్ ఎలా చేసుకోవాలో? నేర్పించాలి.  నా చిన్నప్పుడు చెప్పులే వుండేవి కాదు*. *పోలీసులు, మిలిటరీ వారు, వాళ్లు షూ పాలిష్*, ' *టో పాలిషు* *ఎలా ఉంటాయో! మీ* *పిల్లలకు చూపించండి* 
*శెలువ దినాలలో ఇలాంటివి నేర్పించండి*.

👍64)"*కొందరు మూర్ఖులు భార్యను వేధిస్తారు, 'ఆడపిల్ల' ప్రసవించిందని, పుట్టిన పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు. అమ్మాయి పుట్టిన నా అబ్బాయి పుట్టినా? అందులో తన భాగం ఉందనే 'జ్ఞానం' పెంచుకోవాలి*. *ఇప్పుడు ఆడపిల్లలే తండ్రులని బాగా చూస్తున్నారు*.

👍65)" *మీ బాల్యంలో మొట్టమొదట సైకిలు తొక్కిన రోజున, గడియారంలో టైము ఎలాలో చూడాలో నేర్చుకున్న రోజున*, *పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, రైల్వే స్టేషన్, సందర్శించి, రోజున మీరు ఎంత త్రిలు పొందారో గుర్తు తెచ్చుకోండి*? 
*ఆ త్రిల్లు మీ పిల్లలకు కూడా ఇవ్వండి*. *అంతే తప్ప, నీకు రాదు. నువ్వు వెళ్లలేవు, నీవు చేయలేవు, అని నెగిటివ్ మాటలు మీ నుండి రాకూడదు*.

👍66)"*పిల్లలకు ఏదైనా పనిచేసినప్పుడు సరిగా చెయ్యకపోతే నీకేమి రాదు, నువ్వెందుకు పనికి రావు, అనటం కన్నా! నువ్వు బాగా చేయగలవు, ఈసారి బాగా చేయగలవు. లాంటి 'పాజిటివ్' లో మాత్రమే మాట్లాడండి. నాకు ఆ నమ్మకం ఉంది అనండి ఫలితం బాగుంటుంది*.

👍67)" *మీ పిల్లలకు మ్యాజిక్కు, పెయింటింగ్ బుక్, రీడింగ్ లాంటి సరదాలు ఉంటాయి. అటువంటి పుస్తకాలు కొని , చదివి మీకు చెప్పమని చెప్పండి! అది వారి లోని 'సృజనాత్మకను 'తట్టి లేపుతుంది*"

👍68)"*మీ పిల్లల ప్రవర్తన అతిగా కనిపిస్తే!  జాగ్రత్తగా పరిశీలించండి. అవసరమైతే, 'చైల్డ్ కౌన్సిలర్' ని కలవండి*

👍69)" * *మీ పిల్లల :'ఐ.క్యూ' పెరిగేలాగా ఇంట్లో మంచి పుస్తకాలు కొనండి!  తెలిసిన మంచి విషయాలు చెప్పండి 'పజిల్స్, రీడర్స్ ,ఇచ్చి, 'చదరంగం ఆట' ను నేర్పించండి*. *వారి 'మెదడు' కు పదును పెట్టిన, ఆలోచనా ధోరణి,/సరళి మెరుగుపడును*.

👍70)"*మీ పిల్లవాడు ఇంట్లో ఒక చేయకూడని తప్పు చేసినప్పుడు, దాని గురించి అందరికీ ప్రచారం చేయకండి*. 
*మళ్లీ ఆ తప్పు చేయకుండా పశ్చాతాప పడేలా! తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేస్తే చాలు*.

👍71)" *పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న,  వారి పిల్లలు ఏమైపోతారు*. *అని ఆలోచించి తమకు అటువంటి ఆలోచనలు రాకుండా! 'పర్సనాలిటీ డెవలప్మెంట్' పుస్తకాలు చదివి 'ఆత్మవిశ్వాసం' పెంచుకొని తమ పిల్లలను తీర్చిదిద్దాలి*.

👍72)"*కొందరి ఇళ్లలో తల్లులు భర్త అత్తమామల మీద కోపంతో 'ఆత్మహత్యా' ప్రయత్నాలు చేయటం*, *లేదా*
*కట్నం వేధింపు కేసులు పెట్టడం లేదా చస్తానని బెదిరించడం చేస్తారు*. 
*అది చూసిన మీ పిల్లల భవిష్యత్తులో అది 'ఇమిటేట్ ' చేయటం ఖాయం.  తరువాత మీ ఇష్టం*.

👍73)"*వయసు కు మించిన పనులు చేసే 'హైపర్ ఆక్టివ్' (Hyper Active) పిల్లలని గుర్తించి వెంటనే కంట్రోల్ చేయాలి. అటువంటి పిల్లలు చిన్నప్పుడు స్కూటర్లు, కార్లు నడుపుతానంటారు. వాళ్ల తెలివితేటలు అద్భుతమే! కానీ ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు రావచ్చు*
*అమెరికా లాంటి దేశాలలో 15 ఏళ్ళకి*,
*మనదేశంలో 18 ఏళ్ళకి, లైసెన్స్ ఇస్తారు*.

👍74)"*పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నోరుముయ్! నీకు తెలియదు అంటే అది నిజమనుకొని, భవిష్యత్తులో "కమ్యూనికేషన్స్' చెడగొట్టుకుంటాడు*.

75)" *పిల్లలకు సరిగ్గా వినపడనప్పుడు వారు గుర్తించలేరు* *అది తల్లి గుర్తించాలి *ఏ వినిపించుకోవే* ! **ఒళ్ళు జాగ్రత్త! అని అనకుండా*! *E.N.T specialist దగ్గరికి*, 
*కనిపించకపోతే*,  '* *Ophthalmology కంటి డాక్టర్ల కు*, *చూపించవలెను*. *పిల్లల విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు*.
*గమనిక*:"*సీరియల్స్ టీ.వీలో చాలా ఎపిసోడ్స్, చూసే మీకు*, *చదివే ఓపిక ఉంటుందని* "*నేను భావించి భావించి*, *4, భాగంగురించి*
*రేపు*  *ముచ్చటించుకుందాం* 
*వేచి చూడండి*.
     "*మజుందార్*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  🙏🔥🔥🔥🔥🙏"
👌"*నిన్నటి రోజు తరువాత: 4 వ భాగం 'పిల్లల పెంపక విషయమై! తల్లిదండ్రులు వారి ప్రవర్తన విషయంలో మరికొన్ని చిట్కాలు*"
     🦜🦜🦜
  *MAZUMDAR*
   *BANGALORE*
       🙏🇮🇳🇮🇳🙏
76)"*మీ పిల్లలని అతిగా దండించటం, విమర్శించటం, వలన   గోళ్ళు కొరికేస్తూ! అలవాటు గా పక్కలు తడిపే అలవాటు, నోట్లో వేలు పెట్టుకోవడం, నత్తిలాంటివే రావచ్చు.  అటువంటి పిల్లల తల్లి తన 'ఎమోషన్స్' పూర్తిగా కంట్రోల్ చేసుకుని తీరాలి*

77)"*అడపా తడపా మీ యొక్క మత, సిద్ధాంతం,  అనుసారము, ప్రార్థనా స్థలాలకు తీసుకు వెళ్ళటం, మానవతా విలువలు గురించి తెలియజేయడం, అతడు సేవా కార్యక్రమాలలో పాల్గొనేట్టు, బొట్టు పెట్టుకొనుట, ఊర్వ ఉండ్ర నామధారణ , గొప్ప యతీంద్రుల, మహనీయుల చరిత్రలు చెప్పటం కొరకైనా! తల్లిదండ్రులు అవి తెలుసుకొని తీరవలెను*.

78)"*ఉద్యోగాలలో బిజీగా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లలని అత్త / తల్లి గారింట్లో ఉంచి చదివించడం జరుగుతుంది. అది తల్లిదండ్రుల మధ్య అంతరాన్ని నిశ్శబ్దం పెంచుతుంది*.

79)" *తల్లి చీటికిమాటికి తన తల్లి దగ్గరకు పిల్లలతో సహా వెళ్ళినందువలన అక్కడ అమ్మమ్మ తాతయ్యల గారం చేయడం చేస్తే! పిల్లల్లో క్రమశిక్షణ తగ్గవచ్చు*.

80)"*కొందరు పిల్లలు స్నానం చేయటం అప్పుడప్పుడు మానేస్తారు అటువంటి వారిని ఉదయం కాకపోతే సాయంత్రం చేయమని సున్నితంగా హెచ్చరించండి! అలాగే గోళ్ళు కత్తించుకోవడం కూడా నేర్పండి. వారికి ఒక 'నైల్ కట్టర్' ప్రత్యేకంగా కొని ఇవ్వండి*.

81)" *మీ పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వండి. కానీ! మరీ ఎక్కువ కాదు. అది కూడా ఇంట్లో ఏదో ఒక పని చేసిన తర్వాత ప్రతిఫలంగా మాత్రంగానే ఇవ్వండి*.

82)"*అతిగా మాట్లాడుతున్న పిల్లలను ముదురు మాటలు మాట్లాడుతున్న పిల్లలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలి*.

83)"*మీ పిల్లలు మాట విననప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి రెండు ఇంజక్షన్లు గట్టిగా ఇప్పిస్తాను ,జాగ్రత్త! లాంటి డైలాగులు వాడవద్దు. దాని వలన వారికి 'ఇంజక్షన్ ఫోబియా' రావచ్చు*"

84)"*అంగవైకల్యం ఉన్న పిల్లలపై అతిగా జాలి ప్రదర్శించటం వలన వారికి సెల్ఫ్ పిటి పెరిగే అవకాశం ఉంది వారు కాన్ఫిడెంట్గా ఉండేలా అందవైకల్యంతో అద్భుతాలు సాధించిన 'స్టీఫెన్ హాకింగ్, నూతన ప్రసాదు', కాలు లేకపోయినా డ్యాన్స్ చేసిన అమ్మాయి సినిమాలో, హీరోయిన్ 
గా మంచి పేరు వచ్చినట్లు, అలాంటి సమాచారం ఇవ్వండి. 

85)"*సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల్లో 'అటాచ్మెంట్' ఎక్కువ ఉంటుంది.   పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ అది తగ్గించే ప్రయత్నం చేయాలి*

86)"*డైవర్స్ తీసుకున్న వారి పిల్లలు 'మానసిక రుగ్మతలకు'  లోను కావచ్చు,!  ఇది అందరి విషయంలో జరగదు.  అటువంటి సమయంలో సైకాలజిస్టు,/ టీచరు/ తాత /,మతాధికారి/ తో కౌన్సిలింగ్ చేయిస్తే! బాగుంటుంది*.

87)"  *మీ పిల్లలకు తలనొప్పి కడుపునొప్పి లాంటివి వచ్చినప్పుడు వారికి రెండు కారణాలు చెప్పవచ్చు*      *మొదటిది స్కూల్ కొట్టడానికి*, 
*రెండవది నిజమైనది ఆ రొంపిలో ఏది అనేది తెలుసుకున్నాక డాక్టర్* *వద్దకు వెళ్లాలో* *వెళ్ళకూడదు నిర్ణయించుకోండి*?

88)"*మనదేశంలో పిల్లలు నాకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు, అని చెప్పుకున్నట్లుగా! 'విదేశాలలో' పిల్లలు నాకు ఇద్దరు నాన్నలు, ముగ్గురు అమ్మలు అని చెప్పుకునే స్థితి ఏర్పడింది.  ఈ పరిస్థితి నలుగురిలో ఒకరికి ఉంది కాబట్టి 'విదేశా వ్యామోహం' తగ్గించండి*.

89)*విదేశాలలో* ఫాదర్స్ డే *మదర్స్ డే*
*అని జరుపుకుంటారు*
 *అంటే ఆ ఒక్క రోజునే ఎక్కడో* *వృద్ధాశ్రమాలలో ఉన్న తల్లిదండ్రులను కలుసుకొని , గ్రీట్ట్ చేస్తారు*. *మన దగ్గర అది అవసరం లేదు ప్రస్తుతం.  వారిని నిత్యం గౌరవించే అలవాటు ఉంది* *లేని వారు* *చేసుకోవాలి మన వద్ద మరణించిన వారికే సంవత్సరానికి ఒకసారి 'తద్దినం నాడు* 
*పిండా'  లకు నమస్కారము పెట్టుకుంటాము*.

90)"*విడాకులు తీసుకున్న తల్లులు తమ పిల్లలతో భర్త ఎలా వేదించేవాడు. ఎన్ని హింసలు పెట్టేవాడు, వంటి విషయాలు పదేపదే చెప్పకూడదు.  దాని వలన వారు 'ఎమోషనల్'  గా అయ్యే ప్రమాదం ఉంది.  దాని వలన తరువాత తల్లికి కూడా ముప్పే! జరిగిపోయింది ఒక పీడకలాగా మార్చి పోవాలి*.

91)"*మనదేశంలో అంతగా లేదుగానీ, అడపా తడపా మేనమామలు* *బాబాయిలు సవతితండ్రులు బాలికపై అత్యాచారం* *చేస్తున్నారు  తల్లి విషయంలో పిల్లలకు తగు జాగ్రత్తలు చెప్పాలి*

92)" *మనదేశంలో తల్లిదండ్రులు పిల్లలకు' సెక్స్' గురించి ఏమీ చెప్పరు.  అదొక అపరాధంగా ఫీల్ అయ్యేలా చేస్తారు. తల్లి కొంతవరకు కూతురికి చెప్తుంది. కొడుకు మాత్రం స్కూల్లో ఎవరో ఒక ఫ్రెండ్ దగ్గర, నేర్చుకుంటాడు. తెలుసుకుంటాడు కానీ వాడేమి 'సెక్స్ స్పెషలిస్ట్' కాదు, సమరంలా*!

93)"*తల్లితండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారై ఉన్నప్పుడు పిల్లలపై! ఒక మతంపై నమ్మకం ఏర్పరిచే ఒత్తిడి , తీసుకు రాకూడదు. వారికున్న ఇతర సమస్యలకు తోడు ఇదొక తలనొప్పి కావచ్చు*.

94)"*విడాకులు తీసుకున్న వారు తమ పిల్లలు రహస్యంగా తమ తండ్రిని (లేదా) తల్లిని కలుసుకుంటున్నారని తెలిసినప్పుడు ఉద్వేక పడకండి. భార్యాభర్తల బాంధవ్యం తెగిపోయిన రక్తసంబంధం తెగదు కదా! నచ్చజెప్పటానికి ప్రయత్నించండి! తప్ప, బెదిరిస్తే! ఫలితం ఉండదు*.

95)"*ఎడమ చేతి వాటం వల్ల పిల్లలని కొందరు హేళన చేసినప్పుడు వారు సిగ్గుపడుతుంటారు*. 
*అటువంటి పిల్లలకు ధైర్యం చెప్పండి*. 
*అమెరికన్ అధ్యక్షుడు క్లింటన్, అమితాబ్ బచ్చన్*, *లాంటి ఎందరో ప్రముఖులు  అలాంటి అలవాటు కలవారు ఉన్నారు*.

96)"*భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్న మాట్లాడుకోవడం మానేయకండి. ఇది పిల్లల్లో అభద్రతా భావన కలిగిస్తుంది. ఎవరితో మాట్లాడితే ఏం ప్రమాదమోనని వారు బిక్కు, బిక్కుమంటూ ఉంటారు*

97)"*మీ పిల్లల స్నేహితుల గురించి మీకు మీరే! జడ్జిమెంట్ ఇవ్వకండి, ఎప్పుడు చిరునవ్వు తో పలకరించటం చేయండి. అదే మీ పిల్లలకు అలవాటు చేయండి.

98)"*మీ పిల్లల గురించి బయట వారు ఫిర్యాదు చేసినప్పుడు అన్ని నిజమనుకోవద్దు నింపాదిగా ఫ్రెండ్లీగా మాట్లాడి అసలు విషయం తెలుసుకోండి*! *మీరు చెప్పే ప్రతి విషయం వారికి అర్థమయ్యే భాషలో ముందుగా మీరు* *ఆలోచించుకొని*, 
*ఎంత చెప్పాలో అంతే చెప్పండి*.

99)"*మీ పిల్లలు అడిగిందల్లా ఇచ్చినా తప్పే అలాంటి పేరెంట్స్ ని పిల్లలు చులకన చేస్తారు. ఆ పైన ప్రతి విషయం కమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తారు అని తెలుసుకోండి*.

100)"*పేరెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ని 'నిర్లక్ష్యం' చేసినా ! పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు*.
*గమనిక"*: *ఈ తల్లిదండ్రుల యొక్క* 
*ప్రవర్తన నియమావళి అయ్యింది*. *మరి "పిల్లల పెంపకం"లో తల్లిదండ్రులు పాత్ర*. 
*Art of parenting* 
*తో మీ ముందు ఉంటాను*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏.

No comments:

Post a Comment