Sunday, 20 July 2025

 *🟥నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం*


నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.

*ప్రారంభం*

మండేలా గౌరవార్ధం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192మంది సభ్యులు ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానించారు.

2009, ఏప్రిల్ 27న నెల్సన్ మండేలా ఫౌండేషన్ వారు మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంకోసం ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది.

*ఇతర వివరాలు*

♦️2009, జూలై 18న మొట్ట‌మొద‌టిసారిగా న్యూయార్క్ లో మండేలా దినోత్సవాన్ని జ‌రుపుకున్నా‌రు.

♦️దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సమాజ సేవకు గుర్తుగా అతని విలువలను గౌరవించే రోజు.

No comments:

Post a Comment