Sunday, 20 July 2025

 [7/20, 16:48] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*

*ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో.. ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో.. ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో.. వారే మన ఆత్మీయులు..*
[7/20, 16:48] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*

విద్య మిసిమిచ్చున్
విద్య వివేకమిచ్చున్.!
విద్య సచ్చరితమిచ్చున్ విద్య సకలంబిచ్చున్.!!
విద్య లేనివాడు వింత జీవి గదా.!!!
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా.!!!!

*భావం:-*
చదువు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చదువు తెలివిని ఇస్తుంది.
చదువు సత్ ప్రవర్తన ఇస్తుంది. చదువు అన్నియూ ఇస్తుంది,
చదువు లేని వాడు వింత పశువు కదా.!!
[7/20, 16:48] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*అంతా ఆ తాను ముక్కే*

ఇది సాధార‌ణంగా రాజ‌కీయ‌నాయ‌కులు వాడుతారు ఈయ‌న‌ అదే పార్టీకి చెందిన‌ వాడు అని చెప్ప‌డం టాను అంటే వ‌స్త్ర‌ము యొక్క‌ పెద్ద‌ క‌ట్ట‌ అని అందులోంచి చిన్న‌ముక్క‌ క‌త్తించినా అది దానిలోదే అవుతుంది

*ఆ మొద్దు లోదే ఈ పేడు*

"అంతా ఒక్క‌టే" అనే అర్థాన్ని క‌లిగించే సామేత‌ ఇది మొద్దు అంటే పెద్ద‌ కొయ్య‌, అందులోంచి తీసిన‌ చిన్న‌ ముక్క‌ అంటే పేడు
[7/20, 16:48] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*కటకటాలు లెక్కపెట్టడము*

దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము.
[7/20, 16:48] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*

*మూడు బొమ్మలు*

చాలాకాలం క్రిందట మంచితెలివితేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతరరాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికంపొందేందుకు అతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమతెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు. తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడుబొమ్మలనూ, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైనబొమ్మో, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశీలించి చెప్పండి." అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులోకూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలాఉండటం రాజు గమనించాడు.

ఆ మూడుబొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నయోఅని పరిశీలిస్తున్నాడు. ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండుచెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరోచెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియు నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు.దూరచిన సూది నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్కచెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చూడలేకపోయడు. ఆచెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తానుచేసిన, తెలుసుకొనిన, చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి "మీరు చాలాతెలివిగలిగిన కళాకారులు" అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మలద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.

ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డస్నేహితుడను గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తాడు. కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏఒక్కరికీ ఎలాంటి సహాయం చేయడు. చెవిద్వారా విన్నది మరో చెవిద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రాతినిత్యము వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కాని ఇతడు చాలా ప్రమాదకరమైనవ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవబొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పేమాటలను అతడు చాలా ఓపికతో శ్రధతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భధ్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

*నీతి: మీస్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి.*

🅢🅞🅝🅣🅔🅛🅐. 🅓🅗🅐🅝🅤🅝🅨🅐
[7/20, 16:48] +91 79819 72004: *✅తెలుసు కుందాం✅*

*🐮పశువులు నెమరు వేస్తాయేం?🐴*

🟩ఆవులు, ఎద్దులు, గేదెల్లాంటి పశువులను నెమరు వేయు జంతువులని పిలుస్తారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే విధానంలో భాగంగానే ఇవి నెమరు వేస్తాయి. వాటి పొట్టలోని జీర్ణాశయంలో నాలుగు గదుల్లాంటి భాగాలుంటాయి. అవి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారు మూడు రోజులు పడుతుంది. పశువులు తమకు లభించిన గడ్డి, మొక్కల్లాంటి మేతను నమిలి మింగకుండా మొదట నేరుగా మింగేస్తాయి. అలా మింగిన ఆహారం దాని జీర్ణాశయంలోని మొదటి గది ర్యూమన్‌ (rumen)లోకి చేరుకుని అక్కడ మెత్తబడి కొంత వరకూ జీర్ణమవుతుంది. అక్కడ ఇంకా జీర్ణం కాని గరకు, పీచులాంటి ఆహారపదార్థాలను పశువులు తిరిగి నోట్లోకి తెచ్చుకుని దంతాలతో నిదానంగా మెత్తగా అయ్యేవరకూ నములుతాయి. దీన్నే నెమరు వేయడమంటారు. ఇలా మెత్తబడిన ఆహారం ఆవు జీర్ణాశయంలోని రెండో గది రెటిక్యులమ్‌ (reticulum)లోకి చేరుకుంటుంది. అక్కడ వడబోతకు గురైన ఆహారం మూడో గది ఒమేసమ్‌ (omasum)లోకి చేరుతుంది. అక్కడ ఇంకా బాగా జీర్ణమై అబోమేసమ్‌ (abomesum)లోకి వెళ్తుంది. అక్కడ పూర్తిగా జీర్ణమవుతుంది.

No comments:

Post a Comment