*"మంచిమాటలు"*
*నన్ను నేను అర్పించుకుంటున్నాను అని చెప్పడం సులభం. కాని ఆచరణ కష్టం. అయితే ప్రార్థన, స్తుతి దానికి మార్గం సుగమం చేస్తాయి.*
*భగవంతుని పై విశ్వాసం, భగవదర్పణం, మన పని భారాన్ని తగ్గించి, కర్మను ఎదుర్కొనే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి.*
*ఇతరులకు సేవ చెయ్యడమే జీవిత పరమార్థం. ఈ అవకాశం కేవలం మానవులు మాత్రమే పొందిన వరం. అదే వివేకం, జ్ఞానం.*
*పూజల రూపంలో మనం ఆచరించే ఆచారాలే భగవంతుని పై మనం చూపే ప్రేమానురాగాలు.*
*మనల్ని మనం భగవదర్పణం చేసుకుంటే ఇంక మన బాధ్యత ఆయనదే. అప్పుడు మనకు అన్నీ సమకూరుతాయి.*
No comments:
Post a Comment