Saturday, 23 May 2026

 *"ఘాత" అనే తెలుగు పదం సందర్భాన్ని బట్టి వేరు వేరు అర్థాలు కలిగి ఉంటుంది.* 

*గణితంలో:* *"ఘాతాంకం" (Exponent/Power). ఒక సంఖ్యను అదే సంఖ్యతో ఎన్నిసార్లు గుణించాలో తెలిపేది "ఘాతం." ఉదాహరణకు, 4=4^3. నాలుగు యొక్క ఘాతం 3.*

*జ్యోతిష్య శాస్త్రంలో:* *"ఘాతవారం" అంటే, అశుభ దినం. ప్రతి రాశికీ కొన్ని నిర్దిష్టమైన వారాలు, తిథులు, నక్షత్రాలు అశుభకరమైనవిగా పరిగణించ బడతాయి. వీటిని "ఘాతవారం" లేదా "ఘాత రాశి" అని పిలుస్తారు. మేషరాశి వారికి ఆదివారం ఘాతవారం‌. ఆరోజుల్లో క్రొత్త వ్యాపారాలు, ప్రయాణాలు చేయడం మంచిది కాదని అంటారు.*

*"ఘాతతిధి" అంటే, కొన్ని తిథులు కొన్ని రాశుల వారికి నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని "ఘాతుక తిథులు"  అంటారు.*

*గమనించాల్సింది ఏమంటే, సాధారణ రోజువారీ పనులకు ఇవి వర్తించవు. ముఖ్యమైన వివాహాలు, గృహ ప్రవేశాలు, శస్త్ర చికిత్సలు లేదా పెద్ద పెట్టుబడులకు మాత్రమే పరిగణించాలి.*

*"ఘాత"  అంటే తీవ్రమైన దెబ్బ, వినాశనం లేదా హాని అనికూడా అంటారు. ఉదాహరణకు, "విద్యుత్ ఘాతం" అంటే కరెంట్ షాక్.*

*ఇంకోసారి మరో పదం.*😊

*శుభోదయం.*🙏

No comments:

Post a Comment