Friday, 21 November 2025

 *పర్వదినాల మాసం మార్గశిరం*

మృగశిర నక్ష త్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశిరం. హేమంత రుతువులో తొలి మాసం. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలోని విభూతి యోగంలో ‘మాసానాం మార్గశీర్షీహం' అని మాసాలలో తాను మార్గశీర్షాన్ని అని తెలిపాడు. ఆ విధంగా ఈ మాసం భగవత్స్వరూపమే. ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైనది, శైవ, వైష్ణవానుయాయులకు విశిష్టమైనదిగా చెబుతారు. కార్తిక మాసం వలెనే ఈ మాసంలో కూడా శైవ వైష్ణవ సంబంధితమైన పండగలు, పర్వాలు మెండుగా ఉన్నాయి.

మార్గశిరమాసం ప్రధానంగా శ్రీమహావిష్ణువు నిత్యానుపాయిని, సిరిసంపదలనిచ్చే సిరుల తల్లికి ప్రియమైనది. ఈ నెలలోని గురువారాలు (లక్ష్మీవారాలు) ఆ తల్లికి అత్యంతప్రియమైనవి. ఈ రోజుల్లో చేసే గురువార నోములు తెలుగు లోగిళ్లలో ముత్తయిదువలు విధిగా ఆచరిస్తారు. ఈ వ్రత మాహాత్మ్యాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు, ద్రౌపది మార్గశిర వ్రతాన్ని ఆచరించినట్లు పురాణ కథనం.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంభువుగా వెలసిన శ్రీకనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించి, ఆరాధిస్తారు.

మార్గశిర మాసంలో తొలి తిథి నుంచి అన్నీ పర్వదినాలే!

శుక్లపాడ్యమి

ఈ మాసంలోని శుక్ల పాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైటభులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు. ఆ రోజు నుంచే కొంత కాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమయిందని పురాణ వచనం.

విదియ తదియలు

ఈ మాసంలోని శుక్ల విదియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయా లని 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ఉటంకిస్తోంది. ఈ వ్రతం వల్ల అప మృత్యు నివారణ జరుగుతుంది. స్త్రీలకు ఐదవతనం వృద్ది చెందుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

పంచమి

నాగారాధన పర్వం. నాగుల చవితి, నాగ పంచమినాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించనివారు ఈ రోజు నాగపూజను చేయా లని 'స్మృతి కౌస్తుభం' అంటోంది. ఇంటిలోనే పూజా మందిరంలో నాగ ప్రతిమనుగాని, అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి, పంచామృతాలతో, సుగంధ పుష్పాలతో పూజించాలి.

షష్ఠి

ఈ షష్ఠినే స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్టి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుని కుండలినీ శక్తికి ప్రతీకగా సర్ప రూపంలో పూజిస్తా రన్నది తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. సంతానం కోరేవారు శిలపై సర్ప రూపాన్ని చెక్కించి వేప, రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వ హిస్తారు. తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ఘనంగా నిర్వహిస్తారు.

సప్తమి

దీనినే నందా సప్తమిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది. సూర్యారాధన వల్లఆరోగ్యం చేకూరుతుంది.

అష్టమి

ఈ తిథి కాలభైరవాష్టమి. శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు. అంతవరకూ బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతారు. శిరసు తుంచిన కాల భైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది. బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద గంగ ఒడ్డున ప్రతిష్టించిస్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు. అయితే బ్రహ్మ తలను ఖండించమన్న ఆజ్ఞను కూడా ఏమాత్రం తడబాటులేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని, ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు.

ఏకాదశి

మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం. ఈ రోజును వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఆ రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేంచేస్తాడు. ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు. భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు. అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని, ఇలా ఏకాదశి వ్రతంచేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది. మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు. అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది. ఈ రోజున వ్యష్టిగా, సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతా పారాయణం చేస్తారు. భగవంతునితో సమా నంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం. మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఫేస్బుక్ పై డైలీ విష్ పేజీని ఫాలో అవ్వండి.

ద్వాదశి

నాడు హనుమంతుని షోడషోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి, యశస్సు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున హనుమద్ర్వతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి.

చతుర్దశి

చతుర్దశి దత్త జయంతి. అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు. శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరిం చాడు. అందువల్ల దత్తుడని, అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయడని పిలుస్తారు. అధ్యాత్మ, యోగ విద్యలకు ఒజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం. కొందరు పౌర్ణమినాడు దత్త జయంతి జరపడం కద్దు.

బహుళ పాడ్యమి

దశావతారాలలో ఒకటైన పరశురామావతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి. జమదగ్ని, రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు. పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి 21 సార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు. మహావీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు.

అమావాస్య

మార్గశిర అమావాస్య దక్షుని పుత్రుడైన విశ్వకర్మ జయంతి. శివుని వల్లఎన్నో వరాలు పొంది శిల్పులు, స్వర్ణకారులు యంత్రాలు నడిపే కార్మికులకు, చేనేత పనివారికి, స్థపతులకు పూజనీయుడయ్యాడు.

ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం. వృశ్చిక రాశి నుంచి ధను రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతి రోజు వేకువనే ఆచరిస్తారు. ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయినీ వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది. గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాశురం (పాట) పల్లవించింది. ఆ ముప్పై పాశురాలు 'తిరుప్పావై'గా 'నాలాయిరం' అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి. భక్తి తత్త్వం, తాత్త్విక చింతన, ఉపనిష త్సారంతోబాటు ఛందోబద్దమైన ఈ పాశురాలు తమిళ వాఙ్మయంలో మకుటాయమానమైనవి. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు 'తిరుప్పావై' గానం చేస్తారంటే ఈ పాశురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది. అలాగే శివాలయాల్లో నాయనార్లు రచంచిన 'తిరువెంబావై' (శివుని కీర్తిస్తూ పాడిన పాటలు)ని సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు. ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది. భోగి పండగ వరకూ సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం. మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు.

🕉️🕉️🕉️
 జీవిత రహదారులు.   !
    జీవిత రహదారుల వెంట 
    గమ్యం లేని అనంతమైన 
    ప్రయాణం     !
    అర్థరహితమైన జీవితానికి 
    అర్ధాన్ని వెతుక్కుంటూ 
    శ్రమైక  జీవన సౌందర్యాన్ని 
    ఆస్వాదిస్తూ
    ఎన్నో మజిలీలు    !
    కష్టాల కడలిని ఈదుతూ 
    అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ 
    అమాయకపు ప్రయాణం 
    అంతులేని దూరాలు.   !
    ప్రేమానురాగాల వెలువలో 
    కాలమిలా గడిచిపోయింది.    !
    స్నేహమాధుర్యంలో 
    లక్ష్యసాధన అన్వేషిస్తూ 
    కాలమిలా గడిచిపోయింది.   !
    ఎన్నో ఎడబాటులో 
    అమాయకత్వంగా బతికితే 
    జరిగిన మోసాలెన్నో.  !
    ఎవరిని నిందించిన ఏం ప్రయోజనం 
    ఎవరి స్వార్థం వారిదే కదా 
    ముందు చూపు లేని జీవితంలో 
    ఎదురయ్యే అగ చాట్లు ఎన్నో.   ?
    కాలం చాలా విలువైనది 
    స్థితిని నిర్ణయిస్తుంది 
    గతిని నిర్దేశిస్తుంది.  .!
    స్నేహమాధుర్యంలో లోటుపాట్లు 
    తెలియవు ఎప్పుడూ  !
    పుట్టినాము కాబట్టి జీవించాలి 
    జీవించడానికి ఒక మంచి మార్గాన్ని 
    ఎంచుకొని సాగిపోవాలి.   !
    అభివృద్ధికి సహకరించిన అందరికీ 
    కృతజ్ఞతలు తెలుపుకుంటూ 
    ఆవలి తీరం జీవితాన్ని 
    చేర్చాలి.   !    !                                   
                                    ___ రా జ్
 🕉 భజగోవిందం — తొలి పది శ్లోకాలు & సులభమైన అర్థాలు



**1️⃣ భజగోవిందం భజగోవిందం

గోవిందం భజమూఢమతే ।
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుక్రుంకరణే ॥**

అర్థం:
పండితానం, వ్యాకరణం, గ్రంథాలన్నీ చివరికి ఉపకారపడవు.
మరణ సమయం రాగానే గోవింద భక్తి మాత్రమే శరణు.
అందుకే భగవంతుని భజించు.



**2️⃣ మూఢ జహీహి ధనాగమ తృష్టిం

కురు సద్బుద్ధిం మనసి విత్రిష్టిమ్ ।
యల్లభసే నిహ కామేన
తేనా వినోదయ చిత్తం ॥**

అర్థం:
ధనం, కోరికలు, ఆశలు — ఇవన్నీ తగ్గించు.
నీ వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకో.
సుఖ–దుఃఖాలను సమానంగా స్వీకరించు.



**3️⃣ నారి స్తనభర నాభీ దేశం

దృష్ట్వా మా గా మోహావేషం ।
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్ ॥**

అర్థం:
శరీర సౌందర్యం చూసి మోహపడవద్దు.
అది కేవలం మాంసం—రేపు మారిపోతుంది.
శాశ్వతం కాని విషయాల వల్ల మనసు తప్పుదోవ పడకూడదు.



**4️⃣ నలినీ దల గత జలమతి తరలం

తద్వజ్జీవితం తిహ పచ్ఛల్పమ్ ।
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్ ॥**

అర్థం:
పద్మపత్రంపై నీటి బొట్టు ఎంత నశ్వరమో, జీవితం కూడా అంతే క్షణికం.
అహంకారం, గర్వం అన్నీ వదలాలి.
శోకంతో నిండిన ఈ లోకంలో శాశ్వతం ఏదీ లేదు.



**5️⃣ యావద్విత్తోపార్జన సక్తః

స్తావన్నిజో పరिवारో రక్తః ।
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కొన పృచ్ఛతి గేహే ॥**

అర్థం:
ధనం ఉన్నప్పుడు కుటుంబం దగ్గరగా ఉంటుంది.
ధనం లేకపోతే అదే మనుషులు దూరమవుతారు.
సമ്പదపై ఆధారపడిన ప్రేమ నిలబడదు.



**6️⃣ యావత్పవనో నివసతి దేహే

తావత్ పృచ్ఛతి కుశలం గేహే ।
గతవతి వాయౌ దేహాపాయే
భార్యాపి న విచ్ఛతి తేషం గేహే ॥**

అర్థం:
శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ప్రీయమైన వాడిగా కనిపిస్తాం.
ప్రాణం పోయిన వెంటనే శరీరం కూడా ఎవరికీ అవసరం లేదు.
శరీరం నశ్వరమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.



**7️⃣ బాలస్థావే క్రీడాసక్తః

తరుణస్థావే తరు నీసక్తః ।
వృద్ధస్థావే చింతాసక్తః
పరమె బ్రహ్మణి కోఽపి న సక్తః ॥**

అర్థం:
బాల్యంలో ఆటలు, యౌవనంలో కామం, వృద్ధాప్యంలో ఆందోళన — ఇవే మనిషి జీవితం.
ఈ చక్రంలో ఆత్మజ్ఞానం ఆలోచించడానికి ఎవరికీ సమయం ఉండదు.
అందుకే తక్షణమే దైవచింతన మొదలుపెట్టాలి.



**8️⃣ కాఠేరౌ మను జాహి వికారం

రత్నసముప్లవ మజ్ఞం ।
సరసిజనాభ భవదేవం
వుపాసిహ వుపాసిహ చితం సమస్తమ్ ॥**

అర్థం:
కోపం, లోభం, మోహం, అహంకారం — ఇవన్నీ మనల్ని పతనంలోకి తోసేస్తాయి.
ఇవన్నీ వదిలితేనే మనసు స్వచ్ఛమవుతుంది.
స్వచ్ఛమైన మనసుతో దైవస్మరణలో నిలవాలి.



**9️⃣ గురుచరణాంబుజ నిరభరణం

భవమంగళం సద్వరణం ।
లోకానుగ్రహకారణం
గురుదేవం భజ భజ వత్స ॥**

అర్థం:
గురువు పాదసేవ భక్తికి మూలం.
గురువే జీవితం సరిదిద్దే శుభకారకం.
గురువు అనుగ్రహం పొందినవాడే జ్ఞానం పొందగలడు.



**🔟 శత్రౌ మిత్రే పుత్రే బంధౌ

మా కురు యత్నం విజితే రంధౌ ।
మాయమాయ మిదం అఖిలమ్
హిత్వా బ్రహ్మపదమ్ ప్రవిశ విద్యత్ ॥**

అర్థం:
శత్రువు, మిత్రుడు, బంధువు — అందరూ స్వార్థం ప్రకారమే ప్రవర్తిస్తారు.
ఇవన్నీ మాయా—శాశ్వతం కాదు.
దీనిని విడిచి ఆత్మతత్త్వాన్ని గ్రహించినవాడే విముక్తి పొందుతాడు.
 మనసు మాటల ముత్యాలు

🌹 అనుకోని ఆపదలు వచ్చినప్పుడే
అసలైన మిత్రులెవరో...
అర్థం అవుతుంది...
కాపాడేవారు ఎవరో...
కాదనుకునే వారు ఎవరో.....!!

🌹 శరీరానికి మరణం
ఒక్కసారి మాత్రమే..
కానీ మనసుకు
తప్పు చేసిన ప్రతిసారీ
మరణమే..!!

🌹 "అదృష్టం" అంటే..
ధనవంతులుగా అవడం
మాత్రమే కాదు 
చేతినిండా పని, 
కడుపునిండా తిండి,
కంటినిండా నిద్ర,
అవసరానికి ఆదుకునే ఆప్తులను
కలిగి ఉండడమే
అసలైన "అదృష్టం".

శుభోదయం
 *ఓం నమో నారాయణాయ* 🙏 

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం* । 
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్* 

 *భావం* : 

 *భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో దేనినైనా ఆచరించడం:* 

 *శ్రవణం* (దేవుని కథలు వినడం), *కీర్తనం* (నామ సంకీర్తన), *స్మరణం* (భగవంతుని తలవడం), *పాద సేవనం* (భగవంతుని సేవ), *అర్చనం* (పూజించడం), *వందనం* (నమస్కరించడం), *దాస్యం* (సేవకునిగా ఉండటం), *సఖ్యం* (స్నేహంగా ఉండటం), *ఆత్మ నివేదనం* (సమర్పణ).

 *మానవ జన్మ ప్రయోజనం:* 

 *ఈ నరజన్మ, కేవలం జంతువులు పొందే భోగముల కోసం కాదు. ఇది దివ్యమైన తపస్సు చేయడానికే ఉద్దేశించబడింది.*  

 *సారం* : 

 *మానవ శరీరాన్ని కేవలం భోగాల కోసం వినియోగించకూడదు, దైవచింతన, తపస్సు ద్వారా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం.* 

*ఆచార్య సద్బోధన*
                   
*జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?*

 *ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.* 

 *ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.* 

 *ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.* 

 *ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.* 

 *అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.* 

 *సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.* 

 *అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.* 
*ఈ పవిత్ర జీవనం కోసమే మనపెద్దలు ధర్మం ఆచరించమన్నారు.```* 

 *ఓం నమో భగవతే వాసుదేవాయః* 🙏
 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభం*

 *"మార్గశిర మాసం" - ముక్తికి మార్గం*
                  
*మార్గశిర మాసం విశిష్టత*

 *చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు.* 

 *ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.* 

*భగవద్గీతలోని విభూతియోగంలో - *"మాసానాం మార్గశీర్షం"* 

 *మాసాల్లో తాను మార్గశిరమాసాన్నని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.* 

 *ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని , సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం , సంధ్యావందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి , అగ్నితేజము కూడా మన మనస్సును , బుద్ధిని వికసింపజేస్తాయి* . 

 *అందుకే.... మార్గశిర మాసంలో - ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి , శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి.* 

 *ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి.  శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో.* 

..  🍀 *"ఓం నమో నారాయణాయ'"* 🍀
 *అనే మంత్రాన్ని స్మరించాలి* .

 *ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని ,  'ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.* 

 *మార్గశిర శుద్ధ షష్ఠి* - *'స్కంద షష్ఠి'.*

 *శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.* 

 *తెలుగువారు దీన్ని ""'సుబ్రహ్మణ్య షష్ఠి'*"" అని అంటారు* 

 *మార్గశిర శుద్ధ ఏకాదశి* - *'వైకుంఠ ఏకాదశి'.* 

 *దీనినే 'మోక్ష్తెకాదశి' అని అంటారు* . 

 *ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి , శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.* 

 *మోక్షదా ఏకాదశి* ... *"గీతాజయంతి".*

 *సమస్తమానవాళికి ధర్మ నిధి , భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు.* 

 *త్రిమూర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల సమైక్యస్థితి దత్తాత్రేయుడు.*

 ఈ *"దత్తాత్రేయ జయంతి"* ని *మార్గశిరంలోనే శుక్లపూర్ణిమ నాడు జరుపుకుంటారు.* 

 *మార్గశిర శుక్ల త్రయోదశినాడు*

*"హనుమద్‌వ్రతం",* *"మత్స్యద్వాదశి",* *"ప్రదోష వ్రతం"* *ఆచరించడం పరిపాటి* .

*ఈ మాసంలోనే....*

" *అనంత తృతీయ , నాగపంచమి , సుబ్రమణ్యషష్టి , పరశురామ జయంతి , సంకటహర చతుర్ధి , ఫలసప్తమి , కాలభైరవాష్టమి , రూపనవమి , సఫలా ఏకాదశి , కృష్ణ (మల్ల) ద్వాదశి , యమదర్శన త్రయోదశి , ప్రదోష వ్రతం , శ్రీమహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే "ధనుర్మాసం" అనిఅంటాము. తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం* 

 *కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా  నిలుస్తుంది.* 

 *ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః* 🙏

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

   శ్లో𝕝𝕝   *మాతరం పితరం భక్త్యా*
            *తోషయేన్న ప్రకోపయేత్* l
            *మాతృశాపేణ నాగానాం*
           *సర్పసత్రేఽభవత్ క్షయః* ll

      *--- _చారుచర్యా - క్షేమేన్ద్రః_ ---*

తా𝕝𝕝 *తల్లిదండ్రులను భక్తితో సేవించాలి.... వారికి సంతోషం కలిగించాలి...కోపం కలిగించరాదు....* తల్లికి ఆగ్రహం కలిగించి శాపగ్రస్తులై నాగసంతతి { సర్పయాగంలో హతులైనారు మిగిలిన వారు చెల్లాచెదురై }పాతాలమును చేరి దుస్థితిని అనుభవించారుకదా!!!

✍️VKS ©️ MSV🙏
 హరి ఓం  ,                     
                                       *.            *వందే మాతరం* 
దేశ స్వాతంత్ర్య సంగ్రామం లో ఉర్రూతలూగించిన నినాదం గా మారిన గీతం ‘వందే మాతరం’.  ఈ గీత రచయత  బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ. ఆయన రచించిన  ‘ఆనంద్ మఠ్’  అనే నవలో  దీనిని ఉపయోగించడం  జరిగినది.  

1857 విప్లవం విఫలం అవ్వడానికి చారిత్రిక కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ, ప్రజలలో జాతీయ స్పూర్తి కొరవడటం  ముఖ్య కారణం.  అందుచేత ఆ విప్లవసమయం లో పెక్కు మంది స్తబ్దు గా ఉండిపోయారు.   బ్రిటిష్ వారికి మద్దతు పలికినవారు కొంతమంది. 

 ప్రజలలో జాతీయ భావాలు రేకెత్తించిన వారిలో ముఖ్యులు బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ.  ఆయన రచించిన నవల ఆనంద్ మఠ్ బహుళ ప్రచారం పొందినది. అలాగే అందులోని వందేమాతరం గీతం కూడా బహుళ ప్రచారం పొందినది.   

1763-1800 మధ్య లో బెంగాల్ ప్రాంతం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా ‘సన్యాసుల తిరుగుబాటు’ జరిగినది.  బ్రిటిష్ వారు అతి కష్టం మీద ఆ తిరుగుబాటును అణచగలిగారు.   బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ ఈ ఇతివృత్తం నేపధ్యం గా తీసుకొని, బ్రిటిష్ వారి వేటు పడకుండా ఉండటానికి, ఆ నవలను ఒక చారిత్రిక ఆధ్యాత్మిక నవలగా రూపొందించారు.  అందులో భారత దేశాన్ని ఆయన భారత మాత గా దుర్గ, లక్ష్మి సరస్వతి గా కీర్తించడం జరిగినది.   

ఆ రోజుల్లో కాంగ్రెస్ సమావేశాలలోనూ, ముఖ్యమైన సభల్లోనూ  – వందేమాతరం గీతాన్నే అలపించేవారు.   1896 కాంగ్రెస్ సమావేశం లో రవీంద్రనాథ టాగూరు గారు ఈ గీతాన్ని స్వయంగా పాడారు.  బెంగాల్ విభజన కు వ్యతిరేకం గా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని  వందేమాతరం ఉద్యమమనే పిలుస్తారు.  వందేమాతరం అని గట్టిగా నినదిస్తే బ్రిటిష్ దొరలు ఉలిక్కి పడేవారు.  అలా నినాదం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునేవారు.   స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు, తాను రాజమండ్రి లో చదువుకుంటూ ఉండగా, వందేమాతరం అనే నినాదం చేసినందుకు, ప్రిన్సిపాల్ ‘హంటర్’  ఆయనను కాలేజీ నుండి బహిష్కరించాడు.  మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన అనర్హుడుగా ప్రభుత్వం ప్రకటించింది.   

మనకు స్వాతంత్ర్యం వచ్చినపుడు జాతీయ గీతం ఏది ఉండాలనే చర్చ వచ్చినది.   వందే మాతరం బహుళ ప్రచారం పొందిన గీతం అయినప్పటికీ,  ముస్లిం నాయకుల, సెక్యులర్ నాయకుల అభ్యంతరాల వల్ల,  ముఖ్యంగా నెహ్రూ గారి చొరవతో జనగణ మన .. గీతాన్ని జాతీయ గీతం గా స్వీకరించడం జరిగినది.    ఐనప్పటికి వందేమాతరం గీతానికి జాతీయ గీతం తో సమాన  హోదా ఇవ్వటానకి అంగీకరించారు.   ఈ గీతం లో మొదటి రెండు చరణాలు పాడటానికి నిర్ణయం జరిగినది.  
**
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ గారు ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం యావత్తు భారత మాత కు వందేమాతరం అంటున్నది ..........              
              *సేకరణ*.                  
              🙏🙏 ...                
  వలిశెట్టి  లక్ష్మీశేఖర్ ...                              
  Ph.98660 35557..       
  HYD. 21.11.2025.
 [11/21, 11:30] +91 99597 98384: మీ విలువ తెలుసుకోండి  , అది లేని చోటు ఉండకండి .......                  
ఒకరోజు  బాగోలేనంత మాత్రాన , జీవిత మొత్తం అలాగే ఉంటుందనుకోకండి ...        
ఎవరిని దేనికి బలవంతం చేయకండి  ,  వేడుకోకండి , వెంటపడకండి ......
మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోవడం కన్నా కొంతమందికి దూరం జరగడం మేలు ......                           
    VLS - 21.11.25.
[11/21, 11:30] +91 99597 98384: *_కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తింటుందట._*
        *_అలాగే మనిషి కూడా డబ్బుతో అహంకార గర్వంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు తన వాళ్ళని తానే దూరం చేసుకుంటాడు._*.....
*******************.              *ఆశావాదిని ఏ విషము చంపలేదు...... నిరాశవాదిని  ఏ ఔషధము బతికించలేదు* .....
 21-11-2025,

""శక్యం త్వయాపి తత్కార్యం ధర్మమేవాను పశ్యతా""

ఓ వాలి మహారాజా! శ్రద్ధగా ఆలకించవయ్యా! నేను నీకు విధించిన శిక్షని నీ‌ అంత్యకాలములో అది అన్యాయమని భావించక ప్రశాంతముగ‌ న్యాయమని స్వీకరించు.కారణము నేను నీకు వేసిన శిక్షని ధర్మమార్గము ననుసరించి వేసాను.నేను అనుసరించిన ధర్మము నా పూర్వీకులు అనుసరించిన మార్గమే. అందుకే అయ్యది ధర్మ మార్గమని గ్రహించు.

రామాయణము కిష్కిందాకాండములో రాముడు వాలిని శరముతో గాయపర్చగా రాముడు  వాలితో సంభాషిస్తు,

"" అవశ్యం  పితురాచారః""

పూర్వీకులొనర్చిన ధర్మకార్యాచరణని ఆచరింపవలెనని పల్కి వాలిని ఓదార్చితుండగా  దానికి  ఆ వానరేశ్వరుడు బదులుగ ఓ రామా!, నీది న్యాయమా! అంటు,

""ఆధార్యం చర్మమే సద్భీ  రోమాణ్యస్థి  చ వర్జితం ,
అభక్ష్యాణి  చ  మాంసాని  త్వద్విధైర్థర్మ చారిభిః||(17-36) 

మరణావస్థను భరిస్తూ వాలి రామునితో ఇలా అంటాడు.
ఓ రామా! స్పృహదప్పిన వానిని పాము కాటు వేసినట్లుగ చాటునదాగి నన్ను వధించావు.కోతుల మాంసము ఎవ్వరు తినరు,చర్మము ఎముకలు నీకు గానీ మరెవ్వరికి గానీ  ఉపయోగపడవు.నీకు నాకు పూర్వ వైరము లేదు.కనుక నీవు చేసినది అధర్మమని రామునిపై అపవాదు వేసి

"" చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి  మనీషిణః,
అభక్ష్యాణి  చ మాంసాని  సో~హం పంచనఖో హతః||(17-38),

ఓ రామా! నీకు తెలియదా! ముళ్లపంది, వరాహము,ఉడుము,తాబేలు,కుందేలు అను ఐదు మాత్రమే భక్షింపదగినవి.నేను ఐదుగోళ్ల జంతువునే అయినప్పటికి నా మాంసము తినుటకు నీకు పనికి రావుగదయ్యా! అని విలపిస్తున్న వాలితో ,
 శ్రీరాముడు స్పందిస్తు ఆ వానరేశ్వరునితో ఓయీ! వినవయ్యా!

"" త్వం తు ధర్మమవిజ్ఞాయ కేవలం రోషమాస్థితః|,
ప్రదూషయసి మాం ధర్మే పితృపైతామహే స్థితమ్|.""(18-45).

ఆవేశములో యుండి నన్ను నిందించవలదు."

"రాజా రాష్ట్రకృతం పాపమ్,"
ప్రజలు చేసిన పాపకార్యముల ఫలితము రాజు అనుభవింపవలసియుండును. నా సోదరుడు భరతుని పాలనలో యున్న ఈ ప్రదేశములో జరిగిన పాపకార్యాన్ని నేను ప్రక్షాళన చేయకపోతే ఈ పాపము రాజైన నా భరతుడు అనుభవించబలసియుండునని చెప్పి , వాలి చేసిన తప్పులన్నిటిని తెలియచేసి పాపము చేసిన వారిని శిక్షించుట రాజధర్మము.కనుక నిన్ను వధించుట నా కర్తవ్యము అని వాలిని ఊరడిస్తాడు.

పాపకార్యాల పట్ల ప్రతిఒక్కరు విముఖతను  కలిగియుండాలని రాముని పాత్ర ద్వారా రామాయణము మనకి తెలియచేస్తున్నది కనుక మనమెల్లరము సన్మార్గగాములమై చరించాలి.

జై శ్రీరామ్   జై  జై  శ్రీరామ్.

Sri K P Sarma Garu.💐🙏
 సమయ పాలన

కాలం పరమాత్మ స్వరూపం. పరమాత్మకు ఆదిమధ్యాంతాలు లేనట్టే కాలానికీ లేవు. కాలం కలిసి రాలేదంటే అదృష్టం బాగా లేదని అర్థం. నిత్య వ్యవహారంలో ఈ మాటను ఎలా ఉపయోగించుకున్నా కాలం తాత్వికమైన అంశం. అది గొప్ప ప్రజా స్వామికవాది. ఎవరిపట్ల ఏవిధమైన హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. గొప్ప జ్ఞాని... అందరికీ అన్నీ అవుతుంది కానీ, ఎవరికీ ఏమీ కాదు. కాలతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ ఎరుక కొంచెమైనా ఉంటే జీవితంలో విజయాలు సాధించగలం. కాలం అనే మాటను విశాల భావనలో ప్రయోగిస్తాం. నిర్దిష్టమైన వేళను సమయమని వ్యవహరిస్తుంటాం.

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయపాలన అనే రెండూ మనిషి జీవితంలో అత్యంత విలువైనవి. ఎందుకంటే కాలమే జీవితం గనక. ఒక కోటీశ్వరుణ్ని పేదకుటుం బంలో జన్మించిన మీరు ఇంత సంపన్నులెలా అయ్యారని ప్రశ్నిస్తే 'కాలం ఇచ్చే అవకా శాలను ఉపయోగించుకునే కళ తెలిసినవాణ్ని' అని బదులిచ్చాడట. కాలం ఒక ప్రవాహం వంటిది. దాన్ని నిలువరించలేం. చాలామంది గతాన్ని తలచుకుంటూ వర్తమానాన్ని పట్టించుకోరు. కాలాన్ని దాచుకోవడం సాధ్యంకాదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉపయోగించుకోవాలి. కాలాన్ని నియంత అన్నాడొక తాత్వికుడు. నిజమే. కాలపురుషుడు ఎప్పుడు ఎవరికి ఆనందం పంచుతాడో, విషాదం కలి గిస్తాడో ఊహించలేం. అందుకే 'రేపటి పని ఈరోజే చేయండి. నేటి పని ఈ క్షణమే ప్రారంభించండి, రేవేమవుతుందో ఎవరికి తెలుసు' అంటాడు కబీర్.
సమయపాలన వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. సమయపాలన లేకపోవడానికి సంకల్పం కొరవడటం, యాంత్రిక జీవితానికి అలవాటుపడటం, చేయాల్సిన పనిపై ఏకాగ్రత లేకపోవడం మొదలైనవన్నీ కార ణాలు. ఆటంకాలు ఎదురైనప్పుడు వేరే మార్గంలో ప్రయత్నించకుండా పని వాయిదా వేస్తుంటారు చాలా మంది. ఎవరికైనా ఉండేవి రోజుకు 24 గంటలే. లోకంలో పొద్దు చాలనివాళ్లూ ఉంటారు, పొద్దుపోని వాళ్లూ ఉంటారు. బద్ధకం వల్ల మనిషి ఏ పనీ సాధిం చలేడు. కుటుంబ పోషణకోసం వృత్తిని సాగిస్తూనే వారి వారి ప్రవృత్తికి అనుగుణంగా సంఘసేవ, సాహిత్యం, కళలు వంటివాటిల్లో పాల్గొనే వారికి సమయం చాలదు. అయినా ఒక ప్రణాళిక ప్రకారం దైనందిన జీవితం గడుపుతూ సమయాన్ని ఆయా పనులకోసం విభజించుకుంటూ లక్ష్య సాధనకోసం శ్రమించేవారు ఎప్పుడూ సమాజానికి ఆదర్శమే. వృద్ధాప్యంలోనూ ఉత్సాహంతో క్రియాశీలంగా ఉండేవా రిని చూస్తుంటాం. యవ్వనంలో ఆరోగ్యంగా ఉండీ తమకూ సమాజానికీ ఉపయోగడని నిష్క్రియాపరుల్నీ చూస్తుంటాం. శంకరాచార్యులు, వివేకానందుడు వంటివారు కొద్దికాలమే జీవించినా ప్రతి క్షణాన్నీ తమ ధ్యేయం కోసం వినియోగించి చరితార్థులయ్యారు. يكور

కొంతమంది తమ కాలాన్ని వ్యర్థం చేసుకోవడమేగాక ఇతరుల సమయాన్నీ హరి స్తుంటారు. సభలు సమావేశాలకు వెళ్లినప్పుడు ఇది తరచూ చూస్తుంటాం. ధనం పోతే మళ్లీ సంపాదించుకోగలం. కాలం విషయంలో అది సాధ్యం కాదు కాబట్టి క్రమ శిక్షణతో ప్రతి క్షణాన్నీ ఉపయోగించుకోవడం మన చేతిలోనే ఉంది.

డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
 యోగక్షేమం వహామ్యహం

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ... అన్నవి ఆర్యోక్తులు. ఇవన్నీ ఆచరించడం భగవంతుణ్ని సేవించడంతో సమానం. ఒక మహాకవి అన్నట్టుగా తల్లిదండ్రులు విషమని తలచేవాళ్లు కొందరైతే, గురువులకు పంగనామాలు పెట్టేవాళ్లు ఇంకొందరు. ఒకప్పుడు చుట్టాలు వస్తున్నారంటే ఇంటిల్లి పాది సంతోషించేవారు. మన పట్ల ప్రేమాభిమానాలు ఉండబట్టే వస్తున్నారని భావించేవారు. వాళ్లకి సకల సదుపాయాలు సమకూర్చి, భోజన వసతుల్లో ఎటు వంటి ఇబ్బంది లేకుండా చూసేవారు.

ఇటీవల కాలంలో భార్య తరపు వాళ్లు వస్తే భర్త, భర్త తరపు వాళ్లు వస్తే భార్య ముఖం ముడుచుకోవడం గురించి తరచూ వింటున్నాం. వాళ్ల వైఖరికి అనుగుణంగా పిల్లలు కూడా ప్రవర్తించడం, ఏ మాత్రం సమర్థనీయం కాకపోయినా... సహజం! ఇటు వంటి కారణాల వల్ల పిల్లలు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయానురాగాలనే కాక పెద్దల మార్గదర్శకత్వాన్నీ కోల్పోతు న్నారు. పెద్దవాళ్లు కూడా తమ మూడోతరం వారసులైన చిన్నారుల బాల్య చేష్టలు చూసే భాగ్యానికి నోచుకోవడం లేదు.

పూర్వపు రోజుల్లో ఇప్పటిలా క్షణాల్లో పను లైపోయే వసతులేవీ లేవు. అయినా కష్టమ నుకోకుండా కట్టెల పొయ్యిమీదే మట్టి, రాగి, కంచు వంటి పాత్రల్లో అతిథి, అభ్యాగతులకు వేడివేడిగా వండి పెట్టేవారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో పెద్దవాళ్లు అన్నం వండిన పాత్ర పూర్తిగా తుడిచి పెట్టేయకూడదని అంటారు. దానర్థం గబుక్కున అతిథులెవరైనా వస్తే వెంటనే వడ్డించడానికి ఉండాలని.
ఆతిథ్యం గురించి, దాని ప్రాముఖ్యం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకరోజు, మహాకోపిష్టి అని పేరొందిన దుర్వాస మహాముని, తన శిష్యబృందంతో అతిథిగా వస్తాడు. అప్పటికే పాండవుల భోజనాలు అయిపోవడంతో అక్షయపాత్రను శుభ్రం చేసి బోర్లించేసింది ద్రౌపది. ఆ పాత్రని కావాల్సినంత సేపు వాడుకున్నాక ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తే ఇంక ఆ పూటకి అది పనిచేయదు. దాంతో ముని బృందానికి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకు. దుర్వాసుడి ఆగ్రహానికి గురికాక తప్పదని భయప డ్డాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ద్రౌపది అక్షయ పాత్రని శుభ్రం చేసే సిన విషయం ధర్మరాజు ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని పట్టుకుని బాగా వెతికి, అందులో ఒక మూల దాగి ఉన్న ఒక అన్నం మెతు కుని తీసుకుని తింటాడు. సకల భువనభాండాల్నీ తనలో ఇముడ్చుకున్న భగవంతు డికి కడుపు నిండిపోయింది. అంటే సమస్త జీవకోటికి ఆకలి తీరిపోయింది. అక్కడ నదీస్నానానికి వెళ్లిన దుర్వాసుడు, ఆయన శిష్యులు ఏమీ తినకుండానే భుక్తాయా సంతో ఆపసోపాలు పడసాగారు. ఆ విధంగా పాండవులను కాపాడాడు శ్రీమన్నా రాయణుడు. తనని నమ్ముకున్నవారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుం టానని (యోగక్షేమం వహామ్యహం) శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి తెలిపాడు.

ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్
 .. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం............... మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?
కొన్ని కొన్ని సార్లు మనం కాకులను ఏమీ అనకపోయినా అవి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్లిపోతుంటాయి. ఇలా కాకి తన్నిన వెంటనే చాలా మంది తలస్నానం చేసేసి గుడికి వెళ్తుంటారు. అసలు ఇలా కాకులు ఎందుకు తన్నుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? 

జ్యోతిష్యుల ప్రకారం.. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 




కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?
కాకి తలపై కొడితే చేయవలసిన పరిహారం : కాకి తలపై తగిలితే మీరు ఇంటికి వెళ్లి తలపై నువ్వుల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించండి. అలాగే శనిదేవున్ని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయండి.

ఆ తర్వాత నిష్టగా భక్తి, శ్రద్ధలతో శనిదేవుని గుడికి వెళ్లి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై ఖచ్చితంగా దయ చూపుతాడు. అలాగే కాకికి అన్నం కూడా పెట్టండి. 

అలాగే రాబోయే అమావాస్య నాడు మర్చిపోకుండా మీ పూర్వీకులకు పిండం పెట్టి  వారిని మనస్ఫూర్తిగా పూజించండి. అలాగే ఇతరులకు మీకు చేతనైనంత సహాయం చేయండి.
 *మన నమ్మకాల వలలో మన మనస్సు!*

ఒకరోజు రామయ్య రాత్రి భోజనం చేసిన తర్వాత, అకస్మాత్తుగా అతని వెన్నునొప్పి ప్రారంభమైంది. వెంటనే అతని మనస్సులో ఒక భయం మొదలైంది –

👉"నేను 50 సంవత్సరాలు దాటేశాను... వయస్సుతో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ... ఇది గుండె నొప్పేనా?"

రామయ్య మనసులో సిలొగిజం ఆట మొదలైంది:

🌿"50 ఏళ్లు దాటినవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ."
🌿"నేను 50 ఏళ్లు దాటేశాను."
🌿"అంటే నాకొచ్చిన నొప్పి గుండె నొప్పే అయి ఉండాలి!"

👉ఈ ఆలోచనతోనే అతను మరింత భయపడిపోయాడు. భయంతో ఊపిరి బిగుసుకున్నట్లు అనిపించింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ వైద్యులు ECG, బీపీ, బ్లడ్ టెస్టులు అన్నీ చేసారు. రిపోర్టులు చూసి డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు –

"మీ గుండె బాగా ఆరోగ్యంగా ఉంది రామయ్యగారూ! ఇది కేవలం గ్యాస్ నొప్పి."

🍁నమ్మకం ఎలా ఏర్పడుతుంది?

రామయ్యకు నిజంగా గుండె సమస్య లేదు. కానీ "50 ఏళ్లు దాటినవారికి గుండె సమస్య వచ్చే అవకాశం ఉంది" అనే సామాజిక నమ్మకం, కొన్ని ఉదాహరణలు, పరిసరాలు కలిపి ఆయన మనసులో భయాన్ని నాటాయి. ఆ భయం ఆయన్ని ఆసుపత్రి వరకు లాగింది.

👉ఈ తర్క పద్ధతి మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది:

🌿"నల్ల పిల్లి నా దారి దాటింది. తప్పకుండా ఏదైనా అపశకునం జరుగబోతుంది!"
🌿"నిద్రపోతూ కాలు ఒక్కసారిగా లాగినట్లయింది... ఓహ్! నాకేదైనా చెడు శకునం తగిలిందా?"
🌿"పొద్దున్నే ఇంటి ముందు పసుపు నిమ్మకాయలు పడేశారు. ఇది ఏమిటో!"
🌿"నిద్రలో ఎవరో పేరు పిలిచినట్లు అనిపించింది. వాస్తవంగా ఎవరు పిలవలేదు... ఇలాంటి సంఘటనలు చెడు సంకేతమంటారు కదా?"

👉మన నమ్మకాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి. మనం నమ్మిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు. కానీ మనం నమ్మినట్లు మన మనస్సు స్పందించటం ప్రారంభిస్తుంది.

🍁అయితే, పరిష్కారం ఏమిటి?

ఇలాంటి అర్ధసత్యాలు, అపోహల నుంచి బయటపడటానికి "థాట్ రీప్లేస్మెంట్" (Thought Replacement) అనే మానసిక సాధన చాలా ఉపయోగకరం.

🍁ఏమిటది?

👉ఒక ప్రతికూల ఆలోచన మన మెదడులో వేగంగా అల్లుకోవడం మొదలైతే, దానికి ప్రత్యామ్నాయంగా సానుకూల ఆలోచనను పెట్టుకోవడం.

🍁రామయ్య ఉదాహరణలో ఇలా చేస్తే?

❌ "నాకు గుండె నొప్పే" అనుకోవడం కాదు.
✅ "నా ఆరోగ్యం బాగుంది. నేను నిత్యం నడుచుకుంటా, ఆరోగ్యంగా ఉన్నా. ఇది కేవలం అలసట వల్ల వచ్చిన చిన్న నొప్పి మాత్రమే."

👉ఈ చిన్న మార్పే అతని మానసిక స్థితిని మార్చేది. ఎక్కువమంది మానసిక భయాల వల్లే అనవసరమైన పరీక్షలు, ఆసుపత్రి ఖర్చులు, ఒత్తిడికి గురవుతున్నారు.

🍁ఇది నిజమైన మాయ

మన ఆలోచనలే మనపై ప్రభావం చూపుతాయి. మీ చుట్టూ ఉండే సమాజం ఇచ్చే "సజెషన్స్" మిమ్మల్ని మానసిక ఊబిలోకి లాక్కెళ్తున్నాయా?

నిజంగా భయం ఉన్నదా, లేక మనం ఊహించుకున్నదా? ఆలోచించండి.
మీరు నమ్మే విధంగా మీ జీవితాన్ని మలుచుకోవచ్చు.

మనస్సును మాయచేయనివ్వకండి! మీ నమ్మకమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 🍁.         
*ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనే పంచభూతాలు శబ్ద స్పర్శ రూప రస
గంధాలనే గుణములతో కూడుకుని ఉంటాయి. ఆకాశం నుండి వరుసగా ఒక్కొక్కటీ పుడతాయి. నాశనమయ్యేటప్పుడు భూమి నుండి వరుసగా ఒక్కొక్కటీ లయమవుతాయి. చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు అనే ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాలనే భావాలను పొందుతాయి. ఐదు ఇంద్రియాలు కాక ఆరవది మనస్సు, ఏడవది బుద్ధి, ఎనిమిదవది అహంకారం అవుతాయి. సత్వము రజస్సు తమస్సు గుణాలవుతాయి. ఇవన్నీ భౌతిక ప్రపంచంలో అవ్యక్తంగానే ఉంటూ పుడుతూ పోతూ ఉంటాయి. అవ్యక్తాలుగా ఉన్న గుణాలన్నీ ఇంద్రియ వ్యవహారాదుల ద్వారా వ్యక్తమౌతుంటాయి. ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాదుల భావనను పొంది ఇష్టము వచ్చినట్లుగా చరిస్తాయి. మానవుడు ఆ విషయం తెలుసుకొని వాని నుండి దూరంగా ఉండడం మంచిది.            

Thursday, 20 November 2025

 జ్ఞాన వారధి .

చదువరి నువ్వైతే, చేతిలో అక్షరమే దీపమై వెలుగుతుంది.
పుస్తకమే నీ గురువై, అజ్ఞానపు చీకటిని తరిమేస్తుంది.
ప్రతి పేజీ తిరిగే కొద్దీ, అనుభవాల సారాన్ని ఆస్వాదిస్తావు,
విశ్వంలోని రహస్యాలను నీ మనసులో నింపుకుంటావు.
నీవు చదివిన జ్ఞానం కేవలం నీకోసం కాదు.
నిధి దాచినట్లు నీలోనే ఉంచుకోకు, అది ధర్మం కాదు.
నువ్వు నేర్చిన విద్యను, తొణికిసలాడే నదిలా ప్రవహింపజేయాలి,
తృష్ణతో ఎదురుచూసే ఆ నాలుగు దిక్కులకు పంచివేయాలి.
మాటల్లో మాధుర్యాన్ని, సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తావు,
నీ ఉనికితోనే లోకంలో సకారాత్మక శక్తిని నింపుతావు.
నీవు కేవలం చదువుకున్న వ్యక్తివి కాదు, ఓ మార్గదర్శివి,
సమాజపు మలుపులో నిలబడిన ఓ నిశ్చలమైన శిఖరం. 
భవిష్యత్తు తరానికి నువ్వే బలమైన వారధివి,
గతం నుండి వర్తమానానికి, వర్తమానం నుండి రేపటి ఉదయానికి!
నీ మాటల్లో వెలుగులు, నీ చేతల్లో సత్యం ప్రతిఫలిస్తాయి,
నీ వల్లే యువతరం ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాయి.
చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక జీవనయానం,
అందుకే చదువరిగా ఉండు, జ్ఞానాన్ని పంచు,
నూతన తరానికి ప్రేరణగా నిలువు!
Bureddy.

Tuesday, 30 September 2025

@ కలి... కాలం @

వివేకంతో ప్రశ్నిస్తే 
చైతన్యం తో నిలదీస్తే
అండా సెల్ నిర్బంధాలు

భజనలు చేస్తే 
సాష్టాంగ పడిపోతే
అధికార పీఠాలు

******

నిజం మాట్లాడితే 
నిర్భయంగ సత్యం చాటితే
వ్యక్తిత్వ హననాలూ హత్యలూ 

అసత్యాలు వల్లిస్తే 
అవాస్తవాలను నిస్సిగ్గుగ ప్రకటిస్తే
పదవులూ బిరుదులూ ఘన సన్మానాలూ

*******

వనరుల దోపిడికి
అడ్డు గోడై నిలబడి కలబడితే 
ఎన్కౌంటర్లూ 

దోపిడీ పీడనా
అణచివేతల వత్తాసు పలికితే 
చట్ట సభల్లోకి ఎర్రని తివాచీలు

********

స్నేహం
ప్రేమా మానవీయతా 
జ్ఞానం విజ్ఞానం వివేకం వివేచనా

అన్నీ అన్నీ ..
కాలం చెల్లిపోయిన 
పురాతన విలువలిప్పుడు 

*****

వంచన 
ద్వేషం ఉన్మాదం
అజ్ఞానం అశాస్త్రీయతా మూఢత్వం 

ఇవే ఇవే
అందలమెక్కించే 
నయా నయా విలువలిప్పుడు

********

స్వేచ్ఛా
సమానత్వం 
సౌభ్రాతృత్వమూ
కాల గర్భంలో కలిసిపోయిన నినాదాలు 

బానిసత్వం 
అసమానతత్వమూ 
విభజనా విద్వేషమూ కపటం
విస్తరిస్తోన్న సరికొత్త నినాదాలు

********

యుగాంతమని 
సర్దుకు పోవాల్సిందేనా 
మనుగడ కోసం 

నవ యుగమంటూ 
తెగించి పోరాడాలా 
మానవ జాతి వికాశం కోసం 

చస్తూ బతకాలా 
చచ్చైనా జీవించాలా 
తేల్చుకోమంటోంది కలి ... కాలం

- రత్నాజేయ్ (పెద్దాపురం)
 తృప్తి అనేది ఒక మానసిక భావన. తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది. పాండవులు అయిదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ని నమ్మని అహంకారి దుర్యోధనుడు. అతగాడి మనసును అభద్రతా భావం, అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి, తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి. తృప్తి లేక పోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద, కలువ ముడుచుకోవడాన్ని గమనించక, ఊపిరాడక మరణిస్తుంది. తృప్తిలేని వాడికి ఏది దొరికినా, ఎంత దొరికినా సంతోషం కలగదు. జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది. ధన్యవాదాలు...
" అహం బ్రహ్మాస్మి 🤘 "
 *జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది*.. *అర్థమయ్యే వయసులో కన్నీళ్ళు తెప్పిస్తుంది*...

*మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు*.. 
*ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ,ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు*... 

*ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు*..
*జీవితం అంటే మనం బాధలో ఉన్నాఇంకొకరిని* *సంతోషపెట్టడమే*
*నిజమైన జీవితం*... 

*మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, వదులుకున్న అవకాశం,ఈ నాలుగు తిరిగి వెనుకకు తెచ్చుకోలేము*.. 
*అందుకని మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు  ఆలోచించుకుందాం, కాలం గడిచి పోకముందే వినియోగించుకుందాం, అవకాశం చేజారక ముందే ఉపయోగించుకుందాo*... 

*మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు,నాణ్యమైన మట్టి .అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి  సంపాదన కాదు సంస్కారంముఖ్యం*... 
 
*నేడు మంచిని విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు*.
*వెనక్కి లాగేవారు వెన్నంటే వుంటారు*...

*నీ మేలు కోరేవారు ఎక్కడో,ఒకరు మాత్రమే ఉంటారు..*
*అలాంటి స్నేహాన్ని,*
*నీ మాటలతో గాని,*
*చేతలతో గాని,దూరం చేసుకోకు*...

*నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కన్నా,*
*నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం*...

*దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది*..
*గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు ,వారు చేసే పనులతో చుట్టూఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు*...

       🌹🙏*శుభమధ్యహ్నం*🙏🌹
 యండమూరి వీరేంద్రనాథ్ గారి 
"" రన్ దీప్తీ రన్""  పుస్తకంలో 
"పడి లేచిన కెరటాలు" అన్న అధ్యాయం నుంచి.

ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి అవి ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా ఒక్కో స్థాయిలో ఉంటాయి... ఒక్కొక్కరికి ఆక్సిడెంట్ జరిగితే చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టవచ్చు... 
ఇంకొకరికి ఫ్రాక్చర్లు కావచ్చు...
ఇంకొందరు జీవితాంతం అంగ వైకల్యంతో బాధ పడవచ్చు... అలాగే ఉద్యోగ మరియు ఆర్థిక సమస్యలూ... 
వైవాహిక మరియు కుటుంబ సమస్యలు...
ఇప్పుడు ప్రధానంగా పిల్లలు వారి చదువులు వారిని స్థిరపరచడం...
ఇలా అనేక సమస్యలు...
అన్నీ ఒక్కొక్కరికీ ఒక్కో స్థాయిలో ఉంటాయి...
ఇవన్నీ మనం జీవించి ఉన్నంత కాలం సముద్ర కెరటాల లాగా వస్తూనే ఉంటాయి...
కానీ వాటిని మనం ఎలా తీసుకోవాలి... 
వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టే మన జీవితం... 
జీవితం తాలూకూ మాధుర్యం ఆధారపడి ఉంటుంది... 

ఇదంతా ఓపికగా చదవండి 
మీ సమయం వృథా కాదు... దానికి నాది హామీ... 

ఇవి చదివిన తరువాత వీరి జీవితంలో వచ్చిన కష్టాలతో మనవి కంపేర్ చేసుకొంటే మనవీ కూడా కష్టాలేనా వీటికే మనం ఇంత ఆందోళన చెందుతున్నామా అనిపిస్తోంది...
మనసు చాలా తేలిక పడుతుంది...
ప్రశాంత మైన మనస్సుతో ఆలోచిస్తే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది...
నేను ఇంతకు ముందు చెప్పినట్లు జీవితం మాధుర్యం ఆస్వాదించడం ప్రారంభిస్తాం....

(ఇక్కడి వరకూ నా సొంత కవిత్వం ఇక్కడి నుండి గురువు గారు చెప్పింది...)

1. ఒంటి కన్ను క్రికెట్ రాక్షసుడు
 
ఆటగాళ్ళతో విధి చాలా క్రూరంగా ఆడుకుంటుంది. అతడో నవాబు. ఇంగ్లాండు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేవాడు. యూనివర్సిటీ తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడి, ఆ రాత్రి తోటి క్రీడాకారులతో డిన్నర్కి వెళ్ళాడు. డిన్నర్ తర్వాత స్నేహితులు ‘నడిచి వెళ్దాం’ అ౦టే ‘అలసిపోయాను. కార్లో వెళ్ళిపోతాను’ అని వారికి క్షమాపణ చెప్పి స్నేహితుడి కారు ఎక్కాడు. 

వంద గజాలు కూడా వెళ్ళక ముందే, ఎదురుగా ఒక పెద్ద కారు వచ్చి ఢీ కొనడంతో కుడి భుజం బెణికింది. విండ్-స్క్రీన్ పగిలి అద్దం కంట్లో గుచ్చుకుంది. ‘ఈ భుజంతో తిరిగి మళ్లీ క్రికెట్ ఆడగలనా’ అనుకున్నాడు.  భుజాన్ని సెట్ చేయడం కోసం హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ డాక్టర్లు ‘మీకు నొప్పి తెలియలేదు కానీ మీ కుడి కన్ను పూర్తిగా పోయింది. ఇక ఆటకి పనికి రారు`” అన్నారు. 

అతడు నిరాశ పడలేదు. గమ్యం వైపు వెళ్తూన్న అతడి ప్రయాణాన్ని, ఆ ఆక్సిడెంట్ రెడ్-లైట్‌ వేసి ఆపలేదు. ఆ పై జీవితాంతం ఒంటి కన్నుతోనే ఆడాడు. అతడు సిక్సర్లు కొడుతూ ఉంటే ఎదుటి జట్టు ఆటగాళ్ళు బెంబేలెత్తి పోయేవాళ్ళు.
అతని అసలు పేరు మన్సూర్ అలీ ఖాన్. హర్యానాలోని గురుగావ్ జిల్లాలో ‘పటౌడీ’ అనే నగరానికి జమిందార్ కాబట్టి ‘నవాబ్ అఫ్ పటౌడి’ అని కూడా అంటారు. చాలా అందగాడు.
 
ఆ రోజుల్లో నవాబ్-ఆఫ్-పటౌడి గ్రౌండ్‌లో ఆడుతో౦టే, కేవలం అతన్ని చూడటానికే అమ్మాయిలు స్టేడియంకి వచ్చే వాళ్ళ౦టే అతిశయోక్తి కాదు. 

కాశ్మీర్-కి-కలి షర్మిలాటాగోర్ భర్త ఇతడు. ‘దేవర’ ఫేమ్ సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి.
ఒక కన్నుతోనే క్రికెటర్‌గా రాణించి, భారతజట్టుకి కెప్టెన్ అయ్యాడు. భారతదేశ క్రికెట్ చరిత్రలో, అతి చిన్న వయసులో ఒక దేశానికీ కెప్టెన్ అయినవాడుగా (21 ఏళ్ళు), ఎక్కువ సార్లు గెలిచిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు నవాబ్ ఆఫ్ పటోడి.
...

2. అతి చిన్నవయసులో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం (2004) చేసిన అతి కొద్దిమంది క్రీడాకారుల్లో సందీప్ సింగ్ ఒకరు. అప్పుడు అతడి వయసు 18 సంవత్సరాలు. తన కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఆడుతున్నప్పుడు, ప్రపంచ హాకీ చరిత్రలోనే అతడిది అత్యుత్తమ వేగం (గంటకి 145 కి.మీ) అని చెప్పుకునే వారు. పక్క ఆటగాడికి వేగంగా ‘పాస్’లు ఇవ్వటంలో ఆ రోజుల్లో అతడికి మించినవారు లేరని ప్రతీతి. 
 ‘బ్రతుకు చదరంగంలో అతి చిన్న పావులం మనం. ఎదుటి ఆటగాడికి 'షా' చెప్పి గెలిచామని అనుకునే లోపులో, ఓ మూల నుంచి ప్రత్యర్థి ఏనుగు వచ్చి మన రాజుని కూలదోస్తుంది. విధి కూడా అంతే. గెలిచి అందలం ఎక్కుతూండగా కాలు జార్చి మన గెలుపుకి ‘చెక్’ పెడుతుంది. మన పట్టుదలని పరీక్షిస్తుంది’ అంటాడు ఈ ఆటగాడు. 
 
ఒక దురదృష్టమైన రోజు (ఆగస్టు 22, 2006) విధి అతడిని వెక్కిరించింది. జర్మనీలో జరిగే ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనటం కోసం కల్కా-ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా, ఒక ఆర్.పి.ఎఫ్ అధికారి తుపాకి పొరపాటున పేలి, ఆ బుల్లెట్ అతడి వెన్నెముక గుండా శరీరపు దిగువ భాగంలో దూసుకు పోయి౦ది. 

దాని ఫలితంగా నడుము క్రింది భాగం అచేతనమై, దాదాపు రెండు సంవత్సరాలు వీల్‌చైర్‌ పై ఉన్నాడు. ఇక అతడు ఎప్పటికీ నడవలేడనీ, జీవితాంతం అలాగే ఉండ వలసి ఉంటుందనీ డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. 

ఆ నమ్మకాన్ని నమ్మటానికి అతడు నిరాకరించాడు. ‘ఫిజియో థెరపిస్ట్’ భుజం మీద ఒక చెయ్యి, ‘దృఢసంకల్పం’ మీద మరో చెయ్యీ వేసి అతడు నడవటం మొదలు పెట్టాడు..!

అతడు ఆసుపత్రిలో ఉండగా తమ్ముడు విక్రమ్ గీత్ సింగ్ అన్నయ్యకి హాకీ స్టిక్ ఇచ్చి వీలైనంత తొందరలో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టమని ప్రోత్సహించాడు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే, తిరిగి హాకీ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు..! అకుంఠిత దీక్షతో కృషి చేసి తిరిగి భారతజట్టులో స్థానం సంపాదించుకుని, కీలక ఆటగాడిగా కొనసాగాడు..! 
ఒక టోర్నమెంట్‌లో 12 గోల్స్‌ కొట్టి కొత్త రికార్డును నెలకొల్పాడు..! అంతే కాదు.

జాతీయ కోచ్‌ అయ్యాక భారతదేశానికి రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించాడు..! 

అలా.. వెక్కిరించిన విధిని చిరునవ్వుతో పరిహసించాడు.
...
3. జీవితంలో నదిని చూడని వానికి రోవింగ్ లో పతకం
 
దత్తు బోకనాల్‌కి నీళ్లు అంటే అమితమైన భయం. అతడు తన జీవితకాలంలో ఒక నదిని గాని, కాలువను గాని చూడలేదు. ఊరిలోని గ్రామస్తులందరికీ కలిపి తవ్విన ఒకే ఒక సామూహిక బావి (నుయ్యి)లో నీటిని మాత్రమే చూశాడు. మరోలా చెప్పాలంటే అతడు ఎప్పుడూ ‘ప్రవహిస్తున్న నీటిని' చూడలేదు. సముద్రమూ, కెరటాలూ అని ఎవరో చెప్తే విన్నాడు తప్ప అవి ఎలా ఉంటాయో తెలియదు.

భారతదేశంలోనే అత్యంత కరువు కాటకాలకు నెలవైన నాసిక్ జిల్లాలో తాలేగాఁవ్ గ్రామం దాటి అతడు ఎన్నడూ బయటకి వెళ్ళలేదు. అక్కడ వర్షం కూడా అరుదే. తాలేగాఁవ్ లాంటి చిన్న గ్రామంలో పుట్టిన దత్తు బోకనాల్‌కి పెద్ద పెద్ద కోరికలు లేవు. 

లోతైన నీటి గుంతల నుంచి నీటిని తీసుకెళ్ళి పొలాన్ని తడపటమే అతడి దినచర్య. వర్షం అక్కడో వరం. రైతుల ఆత్మహత్యలు సాధారణం. అతడి తండ్రి ఒక కూలీ. ఐదో తరగతి చదువుతున్న సమయంలో దత్తు తండ్రికి ఆర్థికంగా సహాయ పడాలని పగలు కూలి పని, రాత్రిళ్ళు పెట్రోలు బంకులో పని చేసేవాడు. 

తన జీవితంలో అతడు టెలివిజన్, రిఫ్రిజిరేటర్లతో బాటూ 'ఒలంపిక్స్' అనే పేరు కూడా వినలేదు. చిత్రమేమిటంటే అటువంటి వాడు రియో ఒలంపిక్స్‌లో భారతదేశం తరఫున సాగరక్రీడ (రోవింగ్) లో పాల్గొన్న “ఏకైక” క్రీడాకారుడిగా ఎదిగాడు..!
తండ్రి మరణించిన తర్వాత భవననిర్మాణంలో కూలీగా, ఆపైన మేస్త్రిగా, ఆ తర్వాత పెళ్లిళ్లలో భోజనాలు సర్వ్ చేసే వెయిటర్‌గా, ట్రాక్టర్ డ్రైవర్‌గా, ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి 2012లో సైన్యంలో చేరాడు. 

అతని ఎత్తు, శరీర దారుఢ్య౦ చూసి ఒక ఆర్మీ ఆఫీసర్ అతడిని పడవ పందాల్లో పాల్గొనమని సలహా ఇచ్చాడు. అక్కడి కోచ్ ప్రోత్సాహంతో అతడు వాటర్ గేమ్స్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అప్పుడు కూడా పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించాలన్నది అతడి ఆశయం కాదు. రోవింగ్‌లో కాస్త గుర్తింపు వస్తే సైన్యంలో ప్రమోషన్ వస్తుందనీ, గ్రామంలో తమ కుటుంబానికి డబ్బు మరి కాస్త ఎక్కువ పంపవచ్చనీ కోరిక. అంతే. అక్కడ గ్రామంలో అతడి కుటుంబ సభ్యులు అయిదుగురు అతడు పంపించే డబ్బు మీదే ఆధారపడి ఉన్నారు. 

"నాకు తండ్రి లేడు. అమ్మ పక్షవాతంతో మంచం మీద ఉంది. పొలాలకు నీళ్లు లేవు. పొలాల్లో పంటలు లేవు. కుటుంబానికి నేనొక్కడినే ఆధారం..! నా వృత్తే నాకు ఆధారం..! పోటీల్లో గెలిస్తే జీతం మరింత పెరుగుతుందని ఒకటే నమ్మకం" అనేవాడు బొకనాల్, 
ఆ సంవత్సరం ఒలంపిక్స్ ‘రియో’లో జరుగుతున్నాయి. ఒలంపిక్స్‌లో పాల్గొనే సమయానికి బకనాల్ వయస్సు 25 సంవత్సరాలు. 

రోవింగ్‌లో భారతదేశానికి ఇప్పటి వరకూ కేవలం ఒకే మెడల్ వచ్చింది. ఆ వచ్చిన ‘ఏకైక’ మెడల్ అతడి ద్వారానే లభించింది. 
అప్పటి వరకు సముద్రాన్ని గాని, నదిని గాని చూడని ఆ యువకుడు భారతదేశంలో తన కుటుంబాన్ని దరిద్ర సాగరం నుంచి బయట పడేయడానికి పడవ ప్రయాణం మొదలు పెట్టాడు. 
ఇండోనేషియాలోజరిగిన 18వ ఏషియన్ గేమ్స్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టాడు.
బోకనాల్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
...

4. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన హీరో. 2011 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు పూర్తి అవుతూ ఉండగా అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 
విపరీతమైన బాధతో విలవిలలాడి పోయేవాడు. బ్లడ్ వామ్టింగ్స్ చేసుకునేవాడు. 

ఆ సమయంలో అతడి తల్లి అతనికి గొప్పగా సేవ చేసింది. మొహం పై రక్తాన్ని తుడుస్తూ ‘ఎప్పటికైనా తిరిగి మళ్ళీ నువ్వు దేశానికి నీ సర్వీసెస్ అంద జేస్తావురా’ అంటూ ధైర్యం చెప్పేది.
 
రెండు సంవత్సరాలపాటు ఆటకు దూరంగా ఉండి, వైద్యుల సహాయంతో అతడు తిరిగి కోలుకున్నాడు. 

2015 ఐ.పీ.ఎల్‌లో ‘ఢిల్లీ డేర్ డెవిల్స్’ ఇతడిని 16 లక్షలకి కొన్నప్పుడు ఆ సంవత్సరపు ఐ.పీ.ఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 
మృత్యువుని క్లీన్ బౌల్డ్ చేసిన ఆ క్రికెటర్ యువరాజ్ సింగ్.... 
మనందరి అభిమాన క్రికెటర్... 

ఒక్క సారి ఆలోచించండి... 
మనం ప్రతి రోజు ఆందోళన చెందుతున్న విషయాలు ఇంత కఠినమైనవేనా... వాటినుండి మన ప్రయత్నంతో బయట పడలేమా... పోరాడుదాం పోరాడితే పోయేదేమీ లేదు... కష్టనష్టాలు తప్ప... వచ్చేది అంతా ఇంతా కాదు... 
గొప్ప ఆనందం మానసిక సంతృప్తి... 
విజయం సాధించి ఆనందపు శిఖరం పై జెండా ఎగరేసిన కిక్... 

ఓపికగా చదివినందుకు...
థాంక్యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్... 
ఆలోచించండి...
కొంచమైనా ఆచరణలో పెట్టండి...
విజయపు శిఖరంపై నుండి ఈ ప్రపంచాన్ని చూడండి...
 రాత్రిపూట మరణాన్ని నివారించడానికి డాక్టర్ల సూచనలు చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా రాత్రి పూట మరణించడం మనం వింటూ ఉంటాం " నిన్న వరకు బాగానే ఉన్నాడు ఎలా ఇలా చనిపోయాడు?" అనే ప్రశ్న తరుచుగా వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం రాత్రిపూట ఆకస్మికంగా మంచం నుండి లేచడం వల్ల మెదడుకు రక్త ప్రవాహము నిలిచిపోవడమే

     మానవ శరీరము విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. రాత్రిపూట టాయిలెట్ కు వెళ్ళాలి అన్న అవసరం వచ్చినప్పుడు మనం వెంటనే మంచం నుంచి లేచి దూకుతాం. ఈ వేగం కారణంగా మెదడుకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవిస్తుంది.
   
      దీనిని నివారించడానికి డాక్టర్లు " 3 1/2 నిమిషాల నియమము " పాటించమని చెబుతున్నారు. మీరు మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు బదులుగా ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి .ఇది చిన్న జాగ్రత్త అయినా పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు.

     మొదటి నిమిషం మంచం మీద పడుకున్నట్టుగానే ఉండాలి. తరువాతి అర నిమిషం  మంచం మీద నెమ్మదిగా కూర్చోవాలి. ఆపై అర నిమిషం కాళ్లు నేల వైపు దించి మంచం అంచున కూర్చోవాలి. మొత్తం మూడు నిమిషాలు గడిచాక నెమ్మదిగా లేచి నడవాలి 

  ఈ విధానము వయసుతో సంబంధం లేకుండా అందరూ పాటించాలి.  రక్త ప్రసరణ  సమస్య ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మేల్కొని తొందరగా  కదిలే  సమయము లో  ఇది జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త అవసరం.
  
 ఈ చిన్న అలవాటు వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ కొనసాగుతుంది. గుండె బలహీన పడకుండా ఉంటుంది. పడిపోవడం , ఆకస్మిక గుండె  పోటు ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే ఈ సమాచారాన్ని మన కుటుంబం స్నేహితులు బంధువులతో పంచుకోవాలి. 
ఒకరి జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని రక్షించగలదు

సేకరణ విషయంతో   యాసాల మల్లిఖార్జున్ ,రేచపల్లి , సారంగాపూర్ 9848729131.
 2912a5;92c6;122d5;1.10e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ముత్తయిదువ లక్షణాలు:* 
                      *మరియు*
                  *ఉపయోగాలు*
                  ➖➖➖✍️

*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*

*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*
*2). చేతులకి గాజులు*
*3). మెడలో మంగళసూత్రం*
*4). తలలో పువ్వులు*
*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..*


*1). మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*
```
*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది.

*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది.

*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*
```
*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!

*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.  అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

*అందునా పొలం పనులు, కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*
```
*దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.

*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని!  మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది.

*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.```


*4). ఇక నాల్గవది తలలో పూవులు..*```

*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.```


*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*```

*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్, పసుపు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

*ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
 237 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 25

కృతం దేహే న కర్మేదం న మాయా  శుద్దరూపిణా|
ఇతి చింతానురోధీ యః కురువన్నపి కరోతి న||

చైతన్యమయమైన ఆత్మౄ తన్నుతాను గుర్తిస్తూ తనలో సంస్కారానుగుణంగా కదిలే భావాల వల్ల శరీరము పనిచేస్తున్నదని తానేమి చేయడం లేదని తెలుసుకున్న జ్ఞాని కర్మలను ఆచరిస్తున్న చేయనట్లే.

కర్మ అనగానే కేవలము శరీర అవయవాల కదలిక మాత్రమే కాదు. ఆ కర్మను నిర్ణయించే బుద్ధి అహంకారం ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. గాఢ నిద్రలో నీ గురువును కాలితో తన్నినా సరే అది నీ పనిగా గుర్తింపబడదు. చిన్నపిల్లల పనులకు కూడా వారిని కర్తగా భావించి నిందించము. బుద్ధిలో కదలిన భావాల అనుగుణంగా అహంకారంతో గుర్తిస్తూ చేసిన పనులు మాత్రమే మన కర్మలుగా గుర్తింపబడుతాయి.

జీవన్ముక్తుడు కూడా సదా ఆత్మ జాగృతుడు అయి ఉండటముతో అతని మనశ్శరీరాలు వాసనానుగుణంగా పనిచేయటాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. సముద్రంలోని అలల వలె అతనిలోనే భావాలు కదులుతూ ఉండడానికి అతడే ఆధారమైన, అతని దృష్టిలో రెండవది ఏది లేనేలేదు .గుర్తించే అహంకారం లేకపోవడంతో కర్మ ఫలాన్ని స్వీకరించే వారు కూడా ఉండరు. కాబట్టి అష్టావక్రమహర్షి "కురువన్నపి కరోతి న"... అతడు పనిచేసిన చేయనట్లే అని అంటున్నారు.

భగవద్గీత అంతటా ఇదే భావము నిమిడీకృతమై ఉంది. ఉపనిషత్తులన్నీ ఇదే భావాన్ని దృఢంగా చెబుతున్నాయి. మనదేశంలో మహర్షులు మహాత్ములు అన్ని కాలాలలోనూ ఈ సత్యాన్ని అనుభవ సహితంగా అనేక విధాల అందించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనినే జీవన్ముక్తిగా వర్ణిస్తున్నారు.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(233వ రోజు):--
       ఈ మొదటి పర్యటనలో 'ఆధ్యా త్మిక జీవనం ఎందుకు?' అనే విష యంపై ఒకటి రెండురోజుల ఉపన్యా సాల ద్వారా వేదాంతభావనలను స్వామీజీ శ్రోతలకు పరిచయం చేశా రు. స్వామీజీతో భారతదేశంలో పరి చయమున్న వ్యక్తులు కొందరు ఈ ఉపన్యాసాలకు కావలసిన ఏర్పాట్ల న్నీ చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆసియా సొసైటీ, లాసేంజలిస్ లోని వేదాంతసొసైటీ వంటి సభల్లో స్వామీజీ ప్రసంగించారు. 
       అమెరికన్ యువకుల గురించి తెలుసుకోవాలని ఆయనకు చాలా కుతూహలం ఉండేది. వారి సంస్కృ తి ఎటువంటిదో, యువకులు ఆ రోజుల్లో వారి తల్లిదండ్రులు నేర్పిన మంచి విలువలను ఎందుకు విస్మరి స్తున్నారో తెలుసుకోవాలనుండేది ఆయనకు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో హిప్పీలు తార్లాడే హెయితాష్బరీ, గోల్డెన్ గేట్ పార్క్ మొదలైన చోట్లకు వెళ్లి చూచారు. కొంతమంది జనం పోగైనపుడు, ఆయనను ఏవైనా ప్రశ్న లడిగితే వాటినిగురించి సవివ రంగా చర్చించేవారు. ప్రశ్నలేవీ లేక పొతే తనే అడిగేవారు- జీవితంపై వారి వైఖరి, వారి ఆశయాలు, స్వప్నాలు మొదలైన వాటిగురించి. అమెరికన్లు ఎలా ప్రవర్తిస్తారో చూడ టానికి ఒకసారి రహస్యంగా ఒక బార్ వెనుక నిలబడి, అక్కడ జరిగే దాన్నం తటినీ గమనించారు. 
        ప్రస్నోత్తరాల సమయంలో అమెరికన్లు కూడా భారతీయులు భారతదేశంలో అడిగే ప్రశ్నలవంటివే అడిగేవారు : "దేవుడు ప్రపంచాన్నెం దుకు సృష్టించాడు?", "దేవుని అను గ్రహం అంటే ఏమిటి?", "యోగనిద్ర కూ, ఆత్మ సాక్షాత్కారానికీ తేడా ఏమి టి?". కాని, ఒకప్రశ్న మాత్రం కొత్తదే - "అమెరికాలో యువజనులకు క్రైస్తవ మతం ఆశాభంగం కలిగించిందని మీరు ఎందుకనుకుంటున్నారు?" ఆయన సమాధానం : 
       ఇక్కడి యువతను సంతృప్తి పరచడంలో క్రైస్తవమతం విఫల మైనదనే మాట నిజమే. వారి మతం లో వారికి అవసరమైనదేదో లేదని వారికనిపిస్తోంది. ఈవిషయం వాళ్ళందరూ సూటిగానూ, బాహాటంగానూ చెప్తారు. దానివల్ల సహజంగానే, వాళ్లంతా తూర్పు దేశాల వేదాంతాన్ని అర్థంచేసు కోటానికి ప్రయత్నిస్తున్నారు, దానిలో తమకు పనికొచ్చేదేమైనా ఉందేమోనని. ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా చేస్తున్నారనే చెప్పాలి. చాలా అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో ఈనాడు భారతదేశపు, ఇతర ఆసియా దేశాల మతాలను బోధించే విభాగాలున్నాయి.
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 saralae 🌺
 5️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  


*72. ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతిl*
 *స్థిత్వా2స్యా మన్తకాలే2పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతిll*

ఓ పార్థా! దీనినే బ్రాహ్మీస్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన వాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలములో కూడా ఈ బ్రాహ్మీస్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని పరమ శాంతిని పొందుతాడు.

స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీస్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒక రోజు ఉండి మరురోజు పోయేది కాదు. మరణించే దాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు. ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కాని కొంత మంది జీవితంఅంతా ప్రాపంచికసుఖాలతో గడిపి, అంత్యకాలంలో భగవంతుని సేవించి, బ్రాహ్మీస్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసము చేత గానీ ఈ బ్రాహ్మీస్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలము సమీపించినపుడు లేక 60 దాటాక చూచుకుందాములే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణము నుండి ప్రతి వాడూ ఈ బ్రాహ్మీస్థితి లక్షణములను పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి.

వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీస్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రములో కలిస్తే ఇంక నది ఉండదు. సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అవుతాయి నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీస్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన తరువాత ఎవరూ మోహములో పడరు. కోరికలు ఉండవు. ఏదీ కావాలని కోరుకోడు. ఇది నాది అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచం అంతా నాటకం. అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాము. పెద్ద అయిన తరువాత బొమ్మల మొహం కూడా చూడము. ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది. పెద్ద అయిన తరువాత ఆ ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీస్థితిని చేరుకున్న తరువాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవిత కాలంలో ఈ బ్రాహ్మీస్థితి చేరుకున్నాడో, అతడు బ్రహ్మానందమును పొందుతాడు. జననమరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు.

దీనితో రెండు అధ్యాయాలుపూర్తి అయ్యాయి. ఇప్పుడు ఒక సారి సింహావలోకనం చేసుకుందాము. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. దృతరాష్ట్రుడు సంజయునితో, యుద్ధమునకు సన్నద్ధము అయిన నా వాళ్లు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుని వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేసాడు. అపుడు భీష్ముడు, అతని పక్షమువారు, కృష్ణార్జునులు అతని పక్షమువారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథ సారధి అయిన కృష్ణునితో రథమును ఇరు పక్షముల మధ్యలో నిలబెట్ట మన్నాడు. కృష్ణుడు రథమును ఇరుసైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షము వారిని, ఎదుటి పక్షములో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణకృపాచార్యులను, అశ్వత్థామను తన సోదరులను, బంధుమిత్రులను చూచాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి. అవయవములు పట్టుతప్పాయి. నోరు ఎండిపోయంది. శరీరం గగుర్పాటు చెందింది. గాండీవము చేతులో నుండి జారి పోయింది. రథం మీద నిలబడలేకపోయాడు.

అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "కృష్ణా! ఈ యుద్ధములో నా బంధువులను గురువులను మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కరలేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి. కాబట్టి నాకు మూడు లోకముల ఆధిపత్యము వచ్చినా సరే ఈ యుద్ధము చేయను. వీరందరూ ఆతతాయలు దుర్మార్గులు అయినా సరే వీళ్లను చంపి నేను పాపం మూటకట్టుకోలేను. వీళ్లందరూ మరణిస్తే వీళ్ల కులములలో మగాళ్లు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ల పితృదేవతలకు పిండప్రదానము చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటివారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానము కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్రసన్యాసము చేస్తాను. వీళ్లు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది." అని ధనుర్బాణములను రథం మీదపెట్టి చతికిల పడ్డాడు.

కళ్లతో నీళ్లతో కరుణతో కూడిన హృదయంతో, శోకిస్తున్న అర్జునుని చూచి కృష్ణుడు జాలి పడి ఇలా అన్నాడు. "అర్జునా నీవు మహా వీరుడవు. అత్యుత్తమ ధనార్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి. ఇది నీకు ఉచితము కాదు. కాబట్టి ఈ దుర్బలత్వము వదిలి యుద్ధం చేయి" అని అన్నాడు.

అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. "కృష్ణా! ఎదురుగా ఎవరున్నారో చూచావా! మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురు పుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు వీరిని నేను ఎలా చంపగలను అని అనుకుంటున్నావు. వీళ్లను చంపి రాజభోగాలు అనుభవించడం కంటే అడుక్కుతినడం మేలు. ఈ నెత్తురు కూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములుఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు. వాళ్లే జయంచవచ్చు. మనమే జయించవచ్చు. ఈమాత్రం దానికి ఇంతమందిని చంపాలా! అయినా కృష్ణా! నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి, నాకు కర్తవ్యమును ఉపదేశించు." అని ప్రార్థించాడు.

అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు. "అర్జునా! ఎవరి కోసరం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులు అయిన వారు చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి గానీ చింతించరు. నువ్వు నేను వీరందరూ ఇది వరకూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరములలో బాల్య, యౌవన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణమూ అంతే సహజం. శరీరం మరణిస్తుంది కానీ అత్మకాదు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరము ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వలన సుఖదుఃఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయిన వాడు సుఖదుఃఖములను సమానంగా చూస్తాడు. వాడేమోక్షమును పొందుతాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P137
 *Mahavatar Foundation Welcomes all masters to Join this most Powerful tranformative Brahma Muhurta Meditation Program on Everyday*
బ్రహ్మ ముహూర్త ధ్యానం
பிரம்ம முகூர்த்த தியானம்
ప్రపంచ ఆరోగ్య ధ్యానం 
ब्रह्म मुहूर्त ध्यान
Brahma Muhurta Meditation
*Day #93*
*Date:* October 1st, 2025 (Wednesday)
 Time : 3 AM to 4.30 AM (IST)
*Details: 45mnts Music Meditation + 45mnts silent Meditation*

*Join Everyday with ZOOM link👇*
https://us06web.zoom.us/j/9036216555?pwd=N2lmMXNFVlFrdlFlTGNSQ0RTRTVXdz09
*Meeting ID:* 9036216555
*Passcode:* Dhyana (D-capital letter)
*For more details* 9008532066
Mahavatar Foundation.
Bangalore.
 [9/30, 15:25] +91 99597 98384: *_పదిమంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా_*
        *_ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు._*......
*****************
 *కోపంతో ఒక దెబ్బ కొట్టినా  కొన్నాళ్లకు మర్చిపోతాం ......  కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే , దాని వల్ల బాధపడ మనసు కొన్నాళ్లకు మనుషులని నమ్మడమే మానేస్తుంది* ........


[9/30, 15:27] +91 99597 98384: *Objects in the mirror are closer than they appear.* 

*Problems are smaller than they appear, when you begin to face them.* 

Happy Tuesday - Bhoumavasare


శుభోదయం  -  सूषा      

May it be so good a morning  that I will worship God.

Wednesday, 10 September 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(214వ రోజు):--
      వ్యక్తి తన జీవనాన్నీ, తన వైఖరి నీ మెరుగుపరచుకోవటమే అన్నిటి కన్న ముఖ్యమైన విషయమని స్వామీజీ పదేపదే నొక్కిచెప్పారు. చిన్మయమిషన్ 10 వ వార్షికోత్సవ సందర్భంలో మద్రాసులో ప్రసంగి స్తూ,శ్రోతలను ఇలా హెచ్చరించారు:
       రోజురోజుకూ మీ వైఖరిలో మార్పువస్తే తప్ప, ఇతరులు మీ భావాలను అంగీకరించరు. మీలో మార్పు కలిగిందని గమనిస్తే, "ఇంత మార్పు ఎలా వచ్చింది ?" అని అడగ టం మొదలుపెడతారు, సహజంగా. అప్పుడు మీ ఆలోచనలు కొన్నిటిని వారికి చెప్పండి. వారిమీద ఉపనిష త్తుల వాన కురిపించవద్దు. మీరు సరిగా జీర్ణంచేసుకొన్న భావాలనే వారికి వినిపించండి. బకెట్లకొద్దీ త్రాగ టానికి వాళ్ళేమీ ఏనుగులు కాదు. 
       యజ్ఞానికి వస్తున్నారా లేదా, పఠనసమావేశాలకు వస్తున్నారా లేదా అని ఇతరుల గురించి విచారిం చడానికి ముందు - మనం ప్రతి ఏడా ది మనలో ఏం అభివృద్ధి జరిగిందో నిర్ధారించుకోవాలి. ఈ పదేళ్లలో మనం సాధించినదేమిటి? మీరు , నేను ఎంత అభివృద్ధి చెందామన్నదే ఇప్పుడు మనం సమీక్షించుకోవాల్సి న విషయం. 
       ఐదేళ్లలో నరేంద్రుడనే సామాన్య వ్యక్తి వివేకానందుడయ్యాడు. పోనీ, మీరు వివేకులైనా కాగలిగారా? (ఏది సత్యమో, ఎదసత్యమో తెలుసుకొనే సామర్థ్యాన్ని వివేకం అంటారు).
        1964లో 3వ జాతీయ చిన్మయ మిషన్ సమావేశాలు నిర్వహించే నాటికి దేశమంతటా 100 కు పైగా కేంద్రాలున్నాయి పఠనబృందాలను, బాలవిహార్లను, వనితాబృందాలనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తూ. ఇవేకాకుండా, జాతీయ మహాసభలూ, ఆధ్యాత్మికతీర్థయాత్ర లూ, మరిన్ని పట్టణాల్లో యజ్ఞకార్య క్రమాలూ, పాఠశాలలను స్థాపించే పథకాలూ, విద్యార్థులనూ,ఉపాధ్యా యులనూ సంఘటితపరిచే కార్యక్ర మాలూ .. వీటన్నిటినీ క్రమబద్దంగా నిర్వహించడానికి సంస్థకు ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని ఆ సమావే శానికి వచ్చిన ప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. అటువంటి కార్యాలయం మిషన్ కేంద్రాలన్నిటికీ ఉన్నతాధికారిగా ఉండకూడదనీ, విస్తృతమైన చిన్మయకుటుంబానికి అది వారధిగా ఉండి, అన్ని సంఘా లూ కలిసిమెలిసి పనిచేయటానికి తోడ్పడాలనీ స్వామీజీ సూచించారు. వివిధ ప్రదేశాల్లో ఉన్న కేంద్రాలన్నీ వాటి స్వతంత్రప్రతిపత్తి కోల్పోకుండా సంస్థకు వెన్నెముకగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
        తరగతులనూ, సమావేశాలనూ జరపటానికీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించటానికీ అవసరమైన స్థలాన్ని అద్దెకు తీసుకోటానికి అవ సరమైన సహాయం చాలా కేంద్రాల్లో ధనవంతులైన భక్తులు అందించే వారు. మరికొన్ని పట్టణాల్లో సభ్యుల ఉత్సాహానికి లోటులేనప్పటికీ, అవ సరమైన ఆర్థికవనరులు సమకూడే వి కావు. శ్రద్ధ, లక్ష్యం వారికున్న నిజ మైన మూలధనమని స్వామీజీ గుర్తు చేసేవారు. "ఈవనరులను మీరు దైవకార్యానికి సవ్యంగా వినియోగిం చ గలిగితే, లక్ష్మీకటాక్షం తప్పక సిద్ది స్తుంది ; ఆమె దేవుని వెనువెంటనే ఉంటుంది కదా" అనేవారాయన. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺
 3️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్య విపశ్చిత:|*
 *వేదవాదరతా: పార్థ నాన్యదస్తీతి వాదిన:ll*

*43. కామాత్మాన: స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్l* 
 *క్రియావిశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతిll*

*44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా2పమృతచేతసామ్l*
 *వ్యవసాయాత్మికా బుద్ధిస్సమాధౌ న విధీయతేll*

ఓ అర్జునా! వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతుంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపై అర్ధములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి. వేదములలో చెప్పబడిన విషయముల యొక్క అంతరార్థముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖములకు మించిన సుఖము లేదనీ అనుకుంటూ ఉంటారు. అవే కాకుండా, ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములలో చెప్పబడ్డాయి అని ప్రచారం చేస్తారు. తియ్యగా ప్రవచనాలు చేస్తారు. ఈ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లప్పుడు స్వర్గసుఖముల మీద, ఈ లోకంలో లభించే భోగముల మీదా, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. వారి బుద్ధులు పరమాత్మయందు నిశ్చయంగా లగ్నం కావు. వారి బుద్ధికూడా స్థిరంగా ఉండదు.

ఈ శ్లోకములలో పుష్పితాం వాచం అంటే అందమైన పూల వంటి మాటలు. ఈ పూలు ఫలములుగా రూపొందవు. అలాగే ఈ మాటలు కూడా ఫలప్రదములు కావు. ఇటువంటి అందమైన తీయటి మాటలను, వేదములను సరిగా, లోతుగా అర్ధం చేసుకోని వారు పలుకుతుంటారు. పైపై అర్థములను మాత్రమే చెబుతుంటారు. ఇటువంటి మాటలను అవిపశ్చిత: అంటే అజ్ఞానులు, తెలివి లేని వారు నమ్ముతుంటారు. ఎందుకంటే వారికి కోరికలు ఎక్కువ. ఆ కోరికలు తీరడానికే కర్మలు చేస్తుంటారు. స్వర్గంలో లభించే సుఖముల కోసం వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తుంటారు. అటువంటి వారు ఎంతటి పండితుడైనా, వేదములు అధ్యయనం చేసిన వాడైనా, ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాడు అవివేకి కిందనే పరిగణింపబడతాడు. అటువంటి వారి గురించి ఈ శ్లోకాలు చెప్పాడు పరమాత్మ

వేదవాదరతా: అంటే వేదములలో చెప్పబడిన విషయముల గురించి కొంతమంది వాదోపవాదములు చేస్తుంటారు. ఈ యాగం చేస్తే స్వర్గంలో ఈ ఫలం కలుగుతుంది అని ప్రచారం చేస్తుంటారు. వేదములలో యజ్ఞయాగములు గురించే కాదు. నిరాకారుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకోడానికి ఎన్నోమార్గాలు ఉన్నాయి. ఈ వేద పండితులు వాటి గురించి చెప్పరు. కేవలం సుఖాలు ఇచ్చే వాటి గురించే చెబుతుంటారు.

వేదములలో మూడు విభాగాలు ఉన్నాయి. 1. కర్మకాండ 2, ఉపాసనా కాండ 3. జ్ఞాన కాండ. ఈ వేదముల గురించి వాదించే వాళ్లు మొదటిది అయిన కర్మకాండల దగ్గరే ఆగిపోతారు. ఇటువంటి వారిని కామాత్మాన: అంటే కోరికలే పరమావధిగా కలవారు అని అనవచ్చు. వీరికి తన భార్య పిల్లలు, బంధువులు, తన ధనము, ఆస్తి, ఇల్లు తన సుఖం, తనవారి సుఖం ఇవే వారికి కావాల్సింది. వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించే ఆలోచిస్తారు కానీ, భగవంతుని గురించి శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు.

స్వర్గపరా: అంటే వీరంతా తాము మరణించిన తరువాత స్వర్గానికి పోతామని అనుకుంటారు. ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గమునకు ఎటువంటి విలువలేదు. పరమాత్మను చేరుకోవడమే మానవుల అంతిమ లక్ష్యము. అవివేకుల దృష్టిలో స్వర్గసుఖములే వారికి మోక్షముతో సమానము కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావడమే అంతిమ లక్ష్యం. కేవలం తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ లోక సంపదలు, స్వర్గసుఖాలు శాశ్వతం కావు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము.

తరువాత జన్మ కర్మ ఫలప్రదామ్ అని అన్నారు. అంటే కోరికలతో కూడిన కర్మలు మోక్షమును ఇవ్వలేవు పైగా బంధనములను కలుగజేస్తాయి. జనన మరణ చక్రంలో పడేస్తాయి. కాబట్టి కోరికలతో చేసే కర్మల కన్నా నిష్కామంగా చేసే కర్మలే ముఖ్యము.

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి అంటే స్వర్గంలో లభించే భోగముల గురించి, ఈ లోకంలో లభించే ఐశ్వర్యముల గురించి ఎన్నో కర్మలు చేస్తుంటారు. కర్మకాండలు చేయడంలో తమ జీవితం అంతా వృధా చేసుకుంటారు. కాని వారికి దక్కేది తాత్కాలికసుఖమే కాని శాశ్వత సుఖం కాదు. తయా2పహృతచేతసామ్ అంటే వేద పండితులు, తాము జ్ఞానులము అనుకొనే వాళ్లు చెప్పే ఈ తియ్యటి మాటలకు మానవుల మనసులు ఆకర్షింపబడుతున్నాయి. అటువైపు లాగబడుతున్నాయి. ఆ మాటలు విని సామాన్యజనులు మోసపోతున్నారు. కర్మకాండలవైపు మళ్లుతున్నారు. శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించడం లేదు. అటువంటి మాటలను వినవద్దని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P93
 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐

శ్రీ భగవాన్ రమణ మహర్షి బోధించిన నేనెవరు ఆత్మ విచారణా  జ్ఞాన మార్గాన్ని మనకు అందించడానికి  వచ్చిన వారిలో ..

శ్రీ నాన్నగారు( జున్నూరు) శివైక్యం చెందారు 

శ్రీ మౌన రమణ స్వామి (వేల్పూరు)

శ్రీ విసుజి (రమణ స్వామి),విజయనగరం

శ్రీ సుబ్రహ్మణ్యం గారు (శ్రీకాళహస్తి)

శ్రీ వివి బ్రహ్మం గారు(తాడిపత్రి)

శ్రీ దక్షిణామూర్తి గారు (హైదరాబాద్)

ఇటువంటి  మహానుభావులు( నాకు తెలిసిన వారు, వారిని దర్శించిన అనుగ్రహంతో చెబుతున్నా)తెలుగు నేలపై నడయాడుతున్నారు..

వీరంతా ఆత్మజ్ఞానం పొందినవారు. జ్ఞానాన్ని ప్రసాదించేవారు..

ఇటువంటి  గురువులు చెప్పే ప్రతి మాట మీలోని "నేను" ని స్పృశిస్తూ సత్యం వైపు నడిపిస్తారు.

ఓం శ్రీ గురుభ్యోనమః🙏💐
 నమో రమణ 

  అరుణాచల సాధువుల సాంగత్యం : వివరణ 

   సాధువుల మధ్య సాధన, అహంకారము..... ఇలాంటి మాటలు మధ్య కొంత సంభాషణ జరిగింది. అది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయగలము......

  "ఏ మంచి పని అయినా అహంకారం లేకుండానే చేయాలి" అని రమణ మహర్షి సెలవిస్తే, "అహంకారంతో చేసిన మంచి పని కూడా బంధాన్ని కలిగిస్తుంది" అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు కదా! 

   ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం :
  ఒక 5 సంవత్సరాల పాప రమణాశ్రమం వచ్చింది. సోఫాలో ఉన్న మహర్షి ఆ పాపను చూసి "అరే మాతృశ్రీ గారు వచ్చారే!" అని సెలవిచ్చారు అంట. ఆ పాపే కాలాంతరంలో "మాతృశ్రీ జిల్లెల మూడి అమ్మగా" గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో {జిల్లెళ్ళమూడి} ఎంతో ప్రసిద్ధి చెందారు కదా! "సాధన" అంటే "చేయించబడేది" అని మాతృశ్రీ గారు అంటూ ఉంటారు కదా! 

  సాధన విషయంలో మాతృశ్రీ గారి భావన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? అని ఇక్కడ సాధువులు అంటూ ఉంటారు. 

  ఇక్కడ ఒక విషయం చూద్దాం :
  దైవానుగ్రహముతో 2009లో రమణాశ్రమం రావడం జరిగింది నేను. మా ఇంట్లో ఉన్న పరిస్థితి కారణంగా ఒక ఆరు నెలలు మాత్రమే ఉండి పోదామని వచ్చాను. ఈ ఆరు నెలలు అనుకున్నది కాస్త 16 సంవత్సరాల అయిపోయింది ఇప్పుడు. ఈ 16 సంవత్సరాల రమణాశ్రమ సాధనలో అంచెలంచెలుగా ఈశ్వరుడు, నన్ను ముందుకు నడిపించాడు అని చెప్పవచ్చు. 

  మొదటి ఆరు నెలలు ఎక్కువగా ఒక రోజుకి రెండు అరుణగిరి ప్రదక్షిణాలు చొప్పున సాగడం.. గుడుల పంచన, రోడ్డు పక్కన, రమణాశ్రమ భిక్షాన్నముతో జీవించడం .... తర్వాత మూడు నాలుగు సంవత్సరాలపాటు కాస్త ఉపనిషత్తులతోపాటు(వేదం) ఎక్కువగా ఒక రోజుకి రెండు ప్రదక్షిణాలు ... ఆ కాలంలో రమణాశ్రమ గ్రంథాలయాన్ని విరివిగా ఉపయోగించుకోవడం... 

   మొదటి ఐదు సంవత్సరాల తర్వాత అనుకోకుండా కాలునొప్పి కారణంగా నడక ద్వారా ప్రదక్షిణ చేయలేని స్థితిలో ఆధ్యాత్మిక పేపర్లు వ్రాసి భక్తులకు చేరవేయడం.... ఆ తరువాత కాలంలో ఏకాదశ రుద్రం.... రుద్ర నమక గణ పారాయణం..... ఇట్లా ఎక్కడా ఆపకుండా ఈశ్వరుడు సాధన చేయిస్తూనే ఉన్నాడు అని చెప్పవచ్చు..... మా ఇంట్లో వారు మొదటి నుంచి మనం ఇక్కడ ఉండటానికి వారి అనుగ్రహమే అని చెప్పవచ్చు... ఇదే ఈశ్వరుని యొక్క అపార కరుణకు నిదర్శనం. "తల్లి తండ్రి సంతోషపడనిదే ఏ ఆధ్యాత్మిక సాధన కూడా ముందుకు సాగదు" అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు కదా! 

  ఇక్కడ ఒక విశేషం ఏమంటే; ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని మా ఇంట్లో వారి మీద కురిపించాడు అని చెప్పవచ్చు! లేకపోతే ఇక్కడ మన సాధన సరిగా సాగేది కాదేమో.......! ఎందుకంటే ఇక్కడ మన కళ్ళముందే సాధన కోసం వచ్చిన ఎంతో మంది యువకులు వెళ్లిపోయారు... వారు వెళ్ళిపోతున్న సమయంలో మనకి కూడా వెన్నులో వణుకు పుట్టేది... కానీ ఈశ్వరానుగ్రహం, మా తల్లిదండ్రుల అనుగ్రహం నన్ను ఇక్కడ నిలబెట్టింది అని చెప్పవచ్చు. 

   ఒక విషయం మనం గమనించాలి : మహర్షి జీవించి ఉన్నప్పుడే మహర్షి ముందే ఎంతో మంది సాధకులు వెళ్లిపోయారు కదా! ఇక మనం ఎంతటి వారం? అహం పైకి లేస్తే వెళ్ళిపోవడమే అని మహర్షి అంటూ ఉంటారు కదా! 

  నమో రమణ
 *🕉️ Day 20 – “మౌనం అంటే ఏమిటి?”*  
*(భగవాన్ రమణ మహర్షి ఉపదేశాల ఆధారంగా)*

---

*❖ ప్రశ్న:*  
*“భగవాన్ గారు, మీరు ఎక్కువగా మాట్లాడరు. మౌనం పాటించడం వల్ల ఏం లాభం?”*

*❖ భగవాన్ సమాధానం:*  
> **“మౌనం అంటే మాటల లేకపోవడం కాదు.  
> అది మనస్సు స్థిమితంగా ఉండే స్థితి.  
> అసలు జ్ఞాన ఉపదేశం మౌనంగా మాత్రమే జరుగుతుంది.”**

---

*➤ మౌనం యొక్క తత్వం:*

- నిజమైన మౌనం అనేది *బాహ్యంగా మాట్లాడకపోవడం* కాదు, *లోపల ఆలోచనలు లేకపోవడం*.  
- మాటల కంటే *మౌనంలో శక్తి ఎక్కువ*.  
- *ఊహల, ఆలోచనల ప్రవాహం* ఆగినపుడే అసలైన మౌనం అనుభవించబడుతుంది.  
- జ్ఞానులు మాట్లాడకుండా బోధించగలరు — *ప్రజ్ఞానంతో నిశ్శబ్దంగా.*  

---

*🧘‍♀️ సాధన సూచన:*

1. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు *నిశ్శబ్దంగా కూర్చోండి* — మాటలు కాదు, ఆలోచనలు కూడా తగ్గించండి.  
2. మౌనంలో ఉండే శాంతిని గమనించండి — అది స్వరూపానికి నడిపే ద్వారం.

---

*🪔 భగవాన్ వాక్యం:*  
> **“మౌనం అన్నదే సత్యమైన ఉపదేశం.  
> అది అంతరాత్మను మేల్కొలిపే శక్తి.”**

---

👉 *Day 21 లో – “స్వాత్మ జ్ఞానం ఎలా పొందాలి?” అనే ప్రశ్నకి భగవాన్ సమాధానం తెలుసుకుందాం.*

*🙏 Arunachala Siva, Arunachala Ramana 🕉️*
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   ఒకరోజు ఒక ఇల్లాలు ఇంటిలో దోసెలు పోస్తున్నది. 'విరిగిన దోసలన్నీ ఈశ్వరుడికి’ అని నవ్వుతూ పనిమీద బయటకి వెళ్ళిపోయాడు భర్త. కొంత సమయం తర్వాత ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాడు. కానీ ఆరోజు అన్ని దోసెలు ముక్కలై వచ్చాయని ఆ ముక్కల్ని చూపింది అతని భార్య. 
      
    ఏం చెయ్యను? అని అతను తన భార్యను ఏమీ అనకుండా మహర్షి దగ్గరికి ముక్కలైన దోసలను తీసుకొనిపోయి మహర్షి ముందు పెట్టాడు. 

   మహర్షి "ఏమిటి అది?" అని అన్నారు. అందుకు అతను ఇంట్లో నా భార్య దోసెలు చేస్తూ వుంటే నవ్వులాటకి మాణిక్య వాచకర్(తమిళ మహనీయుడు) కథలో చెప్పిన విధంగా "విరిగినవన్నీ ఈశ్వరుడికి" అనేసి వచ్చాను. ఒక్క దోస కూడా సరిగా రాలేదు. అన్నీ ముక్కలైపోయాయి. "విరిగిన ముక్కలన్నీ మహర్షివి" గనుక మహర్షికి తీసుకొచ్చాను.

   మహర్షి నవ్వుతూ నాలుగు ముక్కలు తిని, తక్కినవి అక్కడున్న భక్తులకు పంచి పెట్టించారు.
 217 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 5 

న దూరం న చ సంకోచాతై 
లబ్దమేవాత్మనః పదమ్|
నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం||

కేవలమూ, అప్రయత్నము, పరిణామరహితము, నిష్కలంకము అయిన ఆత్మ ఎక్కడో దూరంగా అందరినిగా లేదు. దీనికి పరిమితులు లేవు, అసాధ్యము కాదు ,ఇది నిత్యసిద్ధమైనది.

శుద్ధ చైతన్యం స్వభావతః నిష్కలంకమైనది. ఇందులో ఏ విధమైన కోరికలు భావాలు వాసనలు లేవు. ఇంద్రియాలతో ప్రపంచాన్ని గుర్తించటం మనసులోని ఉద్రేకాలు బుద్ధిలోని ఆలోచనలు కూడా శ్రమతో కూడినవి, కాబట్టి ఈ ఉపాధులతో పని చేయడానికి ప్రయత్నం కావాలి. ఆత్మ ఇక్కడ నిరాయాసంగా వర్ణించబడింది. ఉపాధులైన మనశ్శరీరాలను అధిగమించి అహంకారం అంతరంగంలో లయమయి సత్య ద్రష్టగా సత్యంగా జాగ్రత అయినప్పుడు ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇందుకు ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. ఈ మహోన్నత స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి ఇది మనకు దూరంగా లేదు. ఈ స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి సాధించవలసిన పనిలేదు. ఇది నిత్య సిద్ధమే. 

పరిమితమైన మన ఉపాధులతో మనము సాధించగలిగినది కూడా పరిమితమే. ఆత్మ అనంతమైనది కాబట్టి అది అపరిమితమైనది కూడా. కాబట్టే ఇది అసాధ్యము. మనలో ఉండే నిజమైన నేను ఇదే. సత్ గా సంతతము ఉంటూ చిత్తుగా తెలుసుకుంటున్నది ఇదే, అందుచేత ఇది మన నుండి ఎప్పుడూ దూరము కాదు. అదే నేను. ఇది నిత్య సిద్ధంగా ఉండనే ఉంది. అయితే మన భ్రమా జ్ఞానము వల్ల ఈ ఆత్మసాన్నిద్యాన్ని తెలుసుకోలేక పోతున్నాము.

ముండ కోపనిషత్తులో మహర్షి మేఘ గంభీర గర్జన రావమ్మతో ఇలా అంటున్నారు.

దూర తమమైన దానికంటే సుదూరమైనది, ఇక్కడే ఈ శరీరంలోనే ఉంది. యోగి తన జీవితంలో తన హృదయములోనే దీనిని దర్శించగలడు.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(213వ రోజు):--
        ఉపదేశాలూ, ఉదాహరణలూ ఒకదాని కొకటి తోడు కావాలి. విద్యా ర్థులు తమ అధ్యాపకుని స్నేహితుని గా, మార్గదర్శకునిగా, జీవనరహస్యా లు తెలిసిన జ్ఞానిగా చూడగలగాలి. పిల్లలు తాము విన్నదానికంటే చూచి నదానివల్లనే ఏదైనా విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. అందుచేత ఉపాధ్యాయునిలో శ్రద్ద, నిష్కపటత్వం చాలా అవసరం. ఈ కారణంచేతనే ప్రాచీన భారతదేశం లో విద్యనేర్పే బాధ్యత పరిపూర్ణమైన ధార్మికజీవనం గడిపేవారికే అప్పగిం చబడింది. శిష్యుల నడవడిని సరైన రీతిలో మలచటానికే అటువంటి వ్యక్తులు తమ జీవితాన్నంతనూ అంకితం చేశేవారు. 
       నైతికవర్తనంతో మెలుగుతూ ఆదర్శప్రాయమైన అధ్యాపకులుగా అందరిచేతా గుర్తింపు పొందేవిధం గా ప్రవర్తించాలనే ప్రోత్సాహవచనం తో స్వామీజీ తన ఉపన్యాసాన్ని ముగించారు. తర్వాతివారంరోజులూ పురాణాలూ, రామాయణం, భాగవ తం వంటి ఇతిహాసాలూ, గొప్పగొప్ప మహర్షుల జీవనచరితాలూ, వాటి భావార్థాలూ వివరించటం జరిగింది. పురాణగాథలు పిల్లలనైతికవర్తనాని కి ఆదర్శప్రాయంగా ఉండటం మాత్ర మే కాక, వాటిలో ఉపనిషత్తుల మూలసత్యాలు కూడా ఉంటాయి. 'అహం' తత్వపు లౌకికకాంక్షల నధి గమించి దివ్యత్వాన్ని చూరగొంటానికి శ్రమించే మానవుని క్లిష్టమైన వ్యక్తిత్వ పు వివిధ అంశాలకు ఈగాథల్లోని వివిధపాత్రలు ఏ విధంగా చిహ్నా లౌతాయో తెలుసుకున్నారు ఉపా ధ్యాయులందరూ. శివుడూ,గణేశు డు, పార్వతి వంటి పిల్లలందరికీ తెలిసిన దేవతల గురించిన లోతైన, ఆధ్యాత్మిక పరమైన అంతరార్థం వివరించబడింది. 
         ఆత్మవికాసం చాలా నిదానం గా జరిగే ప్రక్రియ అని అందరికీ గుర్తు చేస్తూ స్వామీజీ రెండవవారపు ఉప న్యాస కార్యక్రమాన్ని ముగించారు. విద్యార్థులకు ధార్మికవిద్యనేర్పే ప్రయ త్నాలు వెంటనే ఫలితాలనీయవనీ, వారి వైఖరి వెంటనే మారకపోవచ్చ నీ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి కాని, విత్తనాలు నాటడం జరిగితే, అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలేజీచదు వులో విద్యార్థులు విలాసజీవితాన్ని చవిచూచినా, తర్వాత వృత్తిలో కష్టా ల్నీ, స్పర్థలని ఎదుర్కొంటున్నపుడు, తాము ఇదివరలో నేర్చుకొన్న విష యాలను గుర్తుకు తెచ్చుకొని, వాటి నుంచి సహాయం పొందవచ్చు. చిన్నతనంలోనే మనసులో వ్రేళ్లూ నిన జీవనసూత్రాలు తర్వాతికాలం లో పుష్పించి, వారిని మంచి పౌరు లు గానూ, మంచిమానవులు గానూ చేస్తాయి.
         🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 3️⃣2️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దనl*
 *బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ll*

ఈ నిష్కామ కర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు.

ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్రయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావము ఉండకూడదు. అలాగే నిశ్రయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూతద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడి విడిగాఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.

వ్యవసాయాత్మికా బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం స్థిరంగా ఉంచుకోవడం ఎవరికైనా బుద్ధి స్థిరంగా, నిశ్చయం లేకుండా, చంచలంగా ఉంటే వాడు ఏ పనీ సక్రమంగా చేయలేడు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్రయమైన బుద్ధి అవసరము. అంటే మన మనసును, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చేసే పని మీదనే ఉంచాలి. అటుఇటుపోనివ్వకూడదు. మనం ఏం చెయ్యాలి. ఏం సాధించాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి. తరువాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి. అంతే కానీ ముందు ఏదో ఒక కర్మ మొదలు పెట్టి దాని మీద మనసుపెట్ట కుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము. అలా కాకుండా ఒక నిశ్చయం, లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. ఏ పనిమీదా ధ్యాన ఉండదు. అన్ని పనులు మొదలు పెడతాడు. ఏ పనీ పూర్తిగా చేయడు. తుదకు అభాసుపాలవుతాడు.

ఏ మానవుడికైనా జీవితాశయము ఒకటి ఉండాలి. దానిని బట్టి అతని జీవన విధానము ఉంటుంది. ఉన్నతమైన ఆశయములు కలవారి జీవన విధానము కూడా ఉన్నతంగా ఉంటుంది. అతడు ఉన్నత శిఖరములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా అల్ప బుద్ది కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి. వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి. కొంతమంది ఈ జీవితం అశాశ్వతము, క్షణికము అని దీని గురించి ఆలోచించరు. చచ్చిన తరువాత స్వర్గలోక సుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆ స్వర్గలోకము కూడా శాశ్వతము కాదు అని వారికి తెలియదు. మరి కొంతమంది ఇవేమీ కాదు మోక్షమే అసలైన పరమ పదము అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గం అనుసరిస్తారు. ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులు కలిగి ఉంటారు.

అందుకని మానవులను రెండు విధములుగా విభజించాడు కృష్ణుడు. వ్యవసాయాత్మికా బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మికా బుద్ధి కలవారు. వ్యవసాయాత్మికా బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏకా భవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మార్పు చెందదు. స్థిరంగా ఉంటుంది. అవ్యవసాయినామ్ అంటే స్థిరమైన బుద్ది లేని వాళ్లు. వారి బుద్ధి బహుశాఖా అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అనంతంగా ఉంటుంది. అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది. ఏ ఒక్కదాని మీదా బుద్ధినిలువదు. మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే ఎక్కువగా కనపడుతుంటారు. ఏపనీ నిలకడగా చెయ్యరు. పూర్తి చెయ్యరు. ఎవరు ఏది చెబితే దానిని నమ్ముతారు. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాము కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీదా నిలకడగా ఉండదు. దేవుళ్లలో భేద బుద్ధిని కల్పిస్తాడు. ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే దేవుళ్లను మారుస్తుంటాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు. పరమాత్మ ఒక్కడే అని తెలిసినా, దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు. ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తాడు. అటువంటి వారు ఎలా ఉంటారో మనకు రాబోవు శ్లోకాలలో కృష్ణుడు వివరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P90
 రమణుల ఉపదేశ సారము
“హృదయ కుహరమధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
ఆహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృదివిశ మనసా త్వం చిన్వతా మజ్జతా వా
పవనచలన రోధాదాత్మనిష్ఠో భవ త్వం.”
(హృదయ కోశము నందు అహం స్ఫురణతో కేవల బ్రహ్మము ఆత్మస్వరూపమై భాసించుండును. విచారణచే కాని, మనస్సును హృదయము నందు లీనము చేసికొని కాని, లేదా శ్వాస నియమము చే (మనస్సును నియమించుకొని) కాని, ఆత్మనిష్ఠుడవు కమ్ము.)
ఈ శ్లోకము మహర్షి కృతమే. రమణ మహర్షి శిష్యులలో ఒకరైన జగదీశ్వర శాస్త్రి, సంస్కృత పండితుడు, కవి, “హృదయ కుహర మధ్యే “ అని ప్రారంభించి తర్వాత వ్రాయవలసినది తోచక, ఆ కాగితం అట్లే మహర్షి కూర్చునే స్థానంలో దిండు క్రింద పెట్టి, ఏదో పనిపై వెళ్లి పోయారట. ఆ తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, మహర్షి శ్లోకమును పై విధంగా పూరించి ఉంచారు!
వాశిష్ట గణపతి ముని పై శ్లోకమును రమణ మహర్షి బోధనా సారాంశంగా తీసుకొని, వారి రమణ గీత లో, ఒక అధ్యాయమంతా వ్యాఖ్యానించారు. వారీ శ్లోకము గురించి చెప్పినది:
“శ్లోకం భగవతో వక్త్రాన్మహర్షేరిమముద్గతం,
శ్రుత్యంత సారం యో వేద, సంశయో నాస్య జాతు చిత్ “
“భగవాన్ ముఖతః వెలువడిన ఈ శ్లోకము వేదాంత సారమని, నిస్సంశయముగా గ్రహింపవలెను.”    
 *🕉️ Day 19 – “మనస్సు ఎలా అదుపులోకి తేవాలి?”*  
*(భగవాన్ రమణ మహర్షి ఉపదేశాల ఆధారంగా)*

---

*❖ ప్రశ్న:*  
*“భగవాన్ గారు, నా మనస్సు చాలా చెదిరిపోతుంది. దాన్ని ఎలా కట్టడి చేయాలి?”*

*❖ భగవాన్ సమాధానం:*  
> **“మనస్సు కట్టడి చేయాలనుకోవడం కంటే, దాని మూలాన్ని తెలుసుకోవాలి.  
> మనస్సు ఎక్కడ నుంచి వస్తుంది అని జాగ్రత్తగా పరిశీలించండి.  
> మూలం తెలిసినపుడే మనస్సు నశిస్తుంది.”**

---

*➤ మనస్సు అదుపులోకి తెచ్చే మార్గం:*

- మనస్సుతో పోరాడొద్దు — దానిని పరిశీలించండి.  
- మనస్సు ఎప్పుడూ *బయట* చూసే ప్రకృతి కలది.  
  దానిని *లోపలికి తిప్పాలి* – “మనస్సు ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది?”, “ఇది ఎక్కడ నుంచి వస్తోంది?” అని ప్రశ్నించాలి.  
- ఇలా చేసేవాళ్లకు, మనస్సు తానుగా అదుపులోకి వస్తుంది.

---

*🧘‍♀️ సాధన సూచన:*

1. ప్రతిసారీ మనస్సు చెదిరినప్పుడు, *“ఇది ఎవరిది?”* అని ప్రశ్నించండి.  
2. ఆ ప్రశ్నను అర్థపూర్వకంగా విచారిస్తే, మనస్సు శాంతిస్తుంది.  
3. క్రమంగా, “మనస్సే లేదు” అనే స్థితి – సహజ స్థితి గా మారుతుంది.

---

*🪔 భగవాన్ వాక్యం:*  
> **“తాను తానే ప్రశ్నించుకునే శక్తి — అదే మనస్సు నియంత్రణకు మార్గం.  
> అది బయట వేటకు వెళ్లినప్పుడు బంధం, లోపలికి వచ్చినప్పుడు ముక్తి.”**

---

👉 *Day 20 లో – “మౌనం అంటే ఏమిటి?” అనే ప్రశ్నకి భగవాన్ సమాధానం తెలుసుకుందాం.*

*🙏 Arunachala Siva, Arunachala Ramana 🕉️*
 అరుణాచల శివ 👏
ఈశ్వర తత్వం.....
భగవాన్ రమణులు గారిని ఓక విదేశీ శిష్యుడు ఇలా అడిగాడు... 
మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు... 
అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది'...
అప్పుడు భగవాన్ రమణులు వారు... "ఏది ఉలకదో, ఏది పలకదో, నీతో సంభాషించదో, నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో అదే ఈశ్వర తత్వం" అని జవాబిచ్చారు...