Saturday, 23 May 2026

మనిషి జీవితం కోరికలతో ఆశలతో కలలతో ప్రతిరోజు మొదలవుతుంది

 మనిషి జీవితం కోరికలతో ఆశలతో 
కలలతో ప్రతిరోజు మొదలవుతుంది

చిన్నప్పటి నుంచి ఇతరులను చూడడం వల్ల
అటువంటిది నాకు కావాలి 
అట్లాంటిది నా వద్ద ఉండాలి
లేదా ఇతరుల కంటే అతీతంగా ఉండాలి అనుకోవడం 
దాని కొరకు రాత్రింబవళ్లు శ్రమిస్తారు  
లక్ష్యం ఒక్కటే: తన కలలు నెరవేర్చుకోవడం.

కానీ 
ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ వస్తుంది:

కల నెరవేరిన తర్వాత నిజంగా మనిషి దాన్ని అనుభవిస్తున్నాడా?

కష్టం ఉంది  అనుభవం లేదు
చాలా సందర్భాల్లో మనం గమనించేది ఏమిటంటే:

ఖరీదైన డ్రెస్ కొంటారు  కానీ వేసుకోరు
కారు కొంటారు  కానీ ప్రయాణం చేయరు
డబ్బు సంపాదిస్తారు  కానీ ఖర్చు పెట్టరు
ఇల్లు కడతారు  కానీ తాము ఉండరు
నగలు కొనుగోలు చేస్తారు  కానీ ధరించరు
చాలామంది విలువైన బుక్స్  కొంటారు చదవరు 

ఇవి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది:
మనిషి వస్తువుల్ని పొందడంలో ఆనందం చూస్తున్నాడు, కానీ వాటిని ఉపయోగించడంలో కాదు.
వాడుకోవడం మర్చిపోతున్నారు చదవడం మర్చిపోతున్నారు 

ఎందుకు ఇలా జరుగుతుంది?

ఇది సాధారణ అలవాటు కాదు, 
మనసు యొక్క స్వభావం.
లేకుంటే లేదు అని ఏడుస్తారు ఉంటే పట్టించుకోరు 
ఎందుకిలా జరుగుతుంది

1. భయం 
“వాడితే పోతుంది”, “పాడవుతుంది”, “తరువాత అవసరం పడుతుంది” అనే భయం మనిషిని ఉపయోగించకుండా ఆపుతుంది.

2. ఆస్తి మీద అధిక మమకారం 
వస్తువు మీద ప్రేమ పెరుగుతుంది, కానీ ఆ ప్రేమ వాడటానికి కాదు   దాచుకోవడానికి మారుతుంది.

3. సంతోషాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం
మనిషి అనుకుంటాడు:
“నా దగ్గర ఉంది అంటేనే నేను సంతోషంగా ఉన్నాను.”
కానీ నిజమైన సంతోషం: చూస్తూ మురిసిపోవడం కాదు
“దాన్ని ఉపయోగించినప్పుడు వచ్చే అనుభవంలో ఉంటుంది.”

4. సామాజిక ప్రదర్శన
కొంతమంది ఇతరులకు చూపించడానికి మాత్రమే సంపాదిస్తారు, కానీ తాము అనుభవించరు.

బంధాలలో కూడా ఇదే పరిస్థితి
ఇది కేవలం వస్తువుల విషయంలోనే కాదు, మనుషుల విషయంలో కూడా జరుగుతుంది:

మంచి భార్య కావాలి అనుకుంటారు  వచ్చిన తర్వాత విలువ ఇవ్వరు

మంచి భర్త కావాలి అనుకుంటారు  ఉన్నప్పుడు పట్టించుకోరు

ప్రేమ కోరుకుంటారు  వచ్చిన తర్వాత గౌరవించరు

ఇక్కడ మనిషి మరో తప్పు చేస్తాడు:
విలువ ఉన్నప్పుడు గుర్తించడు, పోయిన తర్వాత మాత్రమే బాధపడతాడు.

మనిషి జీవితం మూడు దశల్లో ఉంటుంది:
కోరిక కోరుకోవడం
కష్టపడడం
ఫలితాన్ని అనుభవించడం 

చాలామంది కోరికలు కోరుకుంటారు కానీ చాలామంది కోరికల కొరకు ఎలాంటి కష్టపడరు 

చాలామంది కోరికలు కోరుకుంటారు 
కష్టపడతారు ఫలితాన్ని సాధిస్తారు కానీ వీరు ఆ ఫలితం అనుభవించారు

ఇందులో మూడవ దశనే చాలా మంది మిస్ అవుతున్నారు.

కోరికలు  తప్పు కాదు
కష్టపడటం కూడా తప్పు కాదు
కానీ అనుభవించకపోవడం  అదే అసలు నష్టం

జీవితానికి అసలు అర్థం
ఒక వస్తువు లేదా సంబంధం మనకు రావడం మాత్రమే కాదు,
దాని విలువను అనుభవించడం  అదే జీవితం.

డ్రెస్ ఉంటే వేసుకోండి
కారు ఉంటే ప్రయాణించండి
డబ్బు ఉంటే అవసరానికి ఖర్చు పెట్టండి, కొంత దానం చేయండి
ఇల్లు ఉంటే అందులో జీవించండి
మనుషులు ఉంటే వారిని ప్రేమించండి
వాడని వస్తువు, చూపని ప్రేమ, అనుభవించని సంతోషం ఇవన్నీ ఉండి కూడా లేనట్టే.

మనిషి చాలా సంపాదించగలడు, 
చాలా సాధించగలడు.
కానీ చివరికి జీవితాన్ని అర్థవంతం చేసేది ఒకటే:
 “అనుభవం”

కాబట్టి

కోరికలు కోరుకోండి… కష్టపడండి… సంపాదించిన తర్వాత చూస్తూ మురిసిపోకూడదు అనుభవిస్తూ ఉండాలి 

ఒకవేళ కోరుకున్నవి కష్టపడి సాధించినవి అనుభవించకపోతే 

ఆ కోరిక ఎందుకు కోరినట్లు 
కోరికల కొరకు ఎందుకు కష్టపడినట్లు.
జీవితమంతా వాటి కొరకే ఎందుకు వినియోగించినట్లు అనుభవించకపోతే.
.
ఒక వ్యక్తి ఎంతో ముచ్చట పడి మంచి ఇల్లు కట్టుకున్నాడు 
కానీ ఆ ఇళ్లకు రెంటు ఎక్కువ వస్తుందని అద్దెకిచ్చాడు 

అతను అంత మంచి ఇల్లు కట్టుకొని కూడా 
ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు ఇప్పుడు.
💐🔱⚛️🧘🪷🕉️
అహం బ్రహ్మాస్మి 
తత్త్వమసి 🔯 
.

No comments:

Post a Comment