పెళ్ళిరోజు సందర్భంగా నిద్ర లేవగానే "ఏవోయ్, ఎక్కడికన్నా సరదాగా వెల్దామా" అన్నాను.. "ఎక్కడికి వెళ్ళేది..గుళ్ళో వినాయకుడికి ఉండ్రాళ్ళ ప్రసాదానికి డబ్బు కట్టాను, పదండి తొందరగా స్నానం చేసి రెడీ కండి".. .చెప్పి చేయవచ్చు కదా ఏదో సరదాగా గడిపేద్దామనుకుంటే, అర్థం చేసుకోదు కదా అని గొణుగుతూ "ఒక అరకప్పు కాఫీ అయినా ఇస్తావా" విసుగ్గా అరిచాను. అలాగే అని కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది.." చేతికి ఇవ్వచ్చు కదా" నేను స్నానం చేశాను, పూజ చేయాలి, పాచి మొహంను ఎట్లా ముట్టుకునేది. అదేదో పాట గుర్తుకొచ్చింది "నేలతో నీడ అన్నది నను తాకరాదని" Blue king Princess.
(పుట్టింటివారు నీలంరాజు ఆమె పేరు "రాజకుమారి") తో దేవుడా అని గుడికెళ్ళి, టిఫిన్ అన్నా హోటల్లో తిందామా అన్నాను.. దానికి మొహం వెలిగిపోయి "సరే" అన్నది టిఫిన్ వండే బాధ తప్పిందని..ఎండ ఎక్కువగా ఉందని ఇల్లు చేరి ..మోబైల్ తీసి మా నలభైయవ పెళ్ళి రోజు రాజకుమారి వంట నైపుణ్యం గురించి మన గ్రూప్ లో సరదాగా రాసేశాను. ఉదయం11 గం.ల నుండి రాత్రి 12 గం.ల వరకు గుక్క తిప్పుకోకుండా లైక్ లు కామెంట్స్.. వైఫై బంద్ చేసి పడుకొని 7గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని 10 గంటలకు మళ్ళీ ఫేస్బుక్ తెరిచా.. మళ్లీ ఋషిఖేష్ లో గంగలాగా మళ్ళీ మొదలు శుభాకాంక్షల వరద, ప్రశంసల ప్రవాహం.. 650లైక్ లు 260 కామెంట్స్.. మీ అందరి ఋణం ఎలా తీర్చుకోగలం.. ఇప్పటికే 66 ఇంకెన్నాళ్ళో..కానీ ఇంతమంది స్పందించారంటే.. ఈ రోజులలో యువ దంపతులు ఏదో కోల్పోతున్నారు.. ఇంటి వంట ఏదో చేయాలి కాబట్టి చేయడం.. తినాలి కాబట్టి తినడం.. ఓపిక లేకపోతే పిజ్జానొ అన్ లైన్ భోజనం ఆర్డర్ చేయడం చేస్తున్నారు.. ఇంక భార్యభర్తలు ఉద్యోగం చేస్తుంటే ఇక చెప్పక్కరలేదు.. పరుగే పరుగులు.. యాంత్రిక జీవనం ..శని ఆదివారాలన్నా ఇంట్లో తింటారా అదీలేదు. తప్పదు కాంప్రమైజ్.. ఉన్నంతలో సర్దుకుపోయి ఆనందం వెతుక్కోవలసిన రోజులు.. ఇంటి వంట తినే ప్రయత్నం చేయండి..ఆనందం కోసం ఇంట్లో వెతకండి ..ఎక్కడ పోయిందో అక్కడ ..అక్కడే దొరుకుతుంది..
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.. చిన్నవారికి "శతమానం భవతి"
పెద్దలకు "అభివందనములు"
Yagna Narayana Kummamuru
No comments:
Post a Comment