Sunday, 20 July 2025

 *హిందూ ధర్మం - 8*
----------------- 

*మంత్రసంహిత*

మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. 

అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. 

పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని ప్రత్యేక సమయాల్లో మంత్రాల్లో అర్ధాలు వెళ్ళడవుతాయి. ఈ మంత్రాలను డికోడింగ్ (Decoding) చేసిన వ్యక్తులనే మనం ఋషులు అంటున్నాం. 

ఇలా భగవంతుడు మంత్రరూపంలో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. 

ఒకటి సమస్త విజ్ఞానమంతా మంత్రంలో బీజరూపంలో ఉంచి, మేదస్సును, మనోశక్తిని ఉపయోగించి విజ్ఞానాన్ని కనుగొనమన్నారు. 

రెండవది లోకంలో అనేక మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. 

కొందరు పరమ నిస్వార్ధపరులు ఉంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు, ఎప్పుడు పదిమంది బాగుండాలని కోరుకుంటారు, అవసరమైతే లోకం కోసం తమ కోరికలను, సుఖాలను సైతం విడిచిపెడతారు. ఈ కోవలోకి వస్తారు ఋషులు. 

వారు కాక, కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ లోకం బాగుండాలని కాంక్షిస్తారు. వారు రెండవరకం. 

మూడవరకం వారు కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు, లోకం ఏమైపోయినా వీరికి అనవసరం. 

నాలుగవరకం వారు తమ మాత్రమే బాగుండాలి, లోకం నాశనమవ్వాలి, తాము మాత్రమే సుఖంగా ఉండాలి, వెరొకరు అలా ఉంటే చూడలేరు. 

ఒక గొప్ప విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, అది సరైన వ్యక్తులకే చెప్పాలి, దుర్మార్గులకు కానీ ఒక అద్భుతమైన జ్ఞానం వెళ్ళిందా, అది లోకకంటకం అవుతుంది. మంచివాళ్ళకి, నిశ్వార్ధపరులకు జ్ఞానం చేరితే, అది లోకకల్యాణ కారకమవుతుంది. అందుకే భగవంతుడు తాను చెప్పదల్చుకున్న విషయాలను వేదమంత్రాల ద్వారా చెప్పారు.

మంత్రమనగానే అది కేవలం ఒక అక్షరసమూహం అని భావించకూడదు. మంత్రానికి శబ్దానికి చాలా సూక్ష్మమైన, విశేషమైన సంబంధం ఉంటుంది. శబ్దం చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. రెండు వస్తువుల రాపిడివల్ల శబ్దం ఏర్పడుతుంది. అణువుల మధ్య రాపిడి వల్ల కూడా చాలా సూక్ష్మమైన శబ్దాలు ఏర్పడతాయి. లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.

(ఇంకా ఉంది)
 *హిందూ ధర్మం - 7*
------------------ 

*వేదం - 7*

వేదం ప్రత్యేకించి ఒక మతాన్నికానీ, భావజాలాన్ని కాని వ్యాప్తి చేయదు, చెప్పదు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అది ఒక మతగ్రంధం కాదు, కేవలం తత్త్వం గురించి, ధర్మాల గురించి బోధ చేస్తుంది. 

ఉదాహరణ చెప్పాలంటే బైబిల్ క్రీస్తు బోధనలు వ్యాప్తి చేస్తూ క్రైస్తవమతాన్ని వ్యాప్తి చేస్తుంది, దేవుడు ఒక దైవదూతను పంపాడని, ఆయన చెప్పిందే ఆచరణయోగ్యమని, ఇతరులు చెప్పిందంతా అసత్యమని ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. 

ఖూరాన్‌ను నమ్మేవారంతా ముస్లింలు అని, తమ మతప్రవక్త మాటలే సత్యమని, అన్యమతస్థులను కాఫిర్‌లు అంటూ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది. 

కానీ వేదంలో అటువంటి ప్రత్యేకమైన భావజాలం మచ్చుకు కూడా కనిపించదు. వేదం ఏం చెప్పినా సమస్త మానవాళిని, విశ్వాన్నిఉద్దేశ్యించి చెప్తుంది. 

*'మనుర్భవ - కృణ్వంతు విశ్వమార్యం'* : ముందు మనుష్యులుగా మారండి, విశ్వం మొత్తాన్ని శ్రేష్టతరమైనదిగా చేయండి అంటుంది. 

అట్లాగే గుడ్డిగా నమ్మమని కూడా వేదం ప్రవచించదు, ఒక దేవుడిని నమ్మమని కూడా చెప్పదు. సత్యాన్ని శోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, అనుభూతి చెందండి అంటుంది. 

అటువంటి వేదాన్ని అర్దం చేసుకోవడంలో భాగంగా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. 

*1*. మంత్రసంహిత
*2*. బ్రాహ్మణం
*3*. ఆరణ్యకం
*4*. ఉపనిసత్తు

*1*. *సంహిత*:

*సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై* - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. సంధి అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము నందున్న శాస్త్రమును సంధించునది సంహితము. 

(సంహితమ్ = కూడుకొనునది). మంత్రాలన్నీ కలిపితే సూక్తం అవుతుంది, సూక్తలన్నీ కలిపితే సంహిత అవుతుంది. 

నిజానికి భగవంతుని ద్వారా ఇవ్వబడిన భాగమే వేదసంహిత. దీనినే వేదమని అంటారు. 

దీని గురించి మరింత విపులంగా తరువాయి భాగంలో చెప్పుకుందాం. 

(ఇంకా ఉంది)
 పంచ ప్రయాగ:
అలకనంద + ధౌలిగంగ = విష్ణు ప్రయాగ

అలకనంద + నందాకిని = నంద ప్రయాగ

అలకనంద + పిండరగంగ = కర్ణ ప్రయాగ

అలకనంద + మందాకిని = రుద్ర ప్రయాగ

అలకనంద + భాగీరథి = దేవ్ ప్రయాగ

భగీరథుడు తన పూర్వజులకు ఉత్తమ గతుల ప్రాప్తి కొరకు గంగను భూమి పైకి తెచ్చేందుకు ఘోరమైన తపస్సు చేస్తాడు . అతని తపస్సుకు మెచ్చిన గంగ భూమి మీదకు రావడానికి సమ్మతించి తన ధాటికి శివుడు మాత్రమే తట్టుకోగలడు కాబట్టి శివుని ప్రసన్నుని చేసుకొమ్మని సలహా యిస్తుంది . భగీరథుడు శివుని ప్రసన్నుని చేసుకొని గంగను దివి నుండి భువికి రమ్మని అర్ధిస్తాడు . అప్పుడు గంగ దివినుండి శివుని శిరస్సు పైకి దూకగా శివుడు గంగను తనఝటాఝూటంలో బంధంచి ఒక్క పాయ  మాత్రమే భూమి పైకి విడిచి పెడతాడు . ఆ వేగానికి కూడా భూ దేవి తట్టుకోలేదని తలచిన గంగ ఆ పాయను ఆరు సెలయేళ్లుగా మార్చి భూమి మీదకు వచ్చిందట . సగరపుతృలకు పుణ్యగతులు కల్పించడానికి వారి భస్మాలను తనలో కలుపు కొనేందుకు యిలా ఆరుపాయలగా గంగ అవతరించెనని మరో కథ . ఈ సంగమాలలో యిచ్చే తర్పణాల వలన మరణించినవారికి పుణ్యగతులు కలుగుతాయని హిందువుల నమ్మకం .తిరిగి ఆ ఆరు నదులు కలసి గంగ గా మారి భగీరథుని కోర్కె తీర్చి మనదేశంలో యెన్నో వేల యెకరాల గుండా ప్రవహించి భక్తుల పాపాలను కడిగి , భక్తుల పూజలందుకుంటోంది . ప్రయాగ అంటే నది వేరొక నదితో సంగమించిన ప్రదేశం అని అర్ధం . ఉత్తరాఖంఢ్ లోని గంగోత్రి అనే హిమనీనదము నుండి పుట్టిన భగీరథి ( భగీరథుని కొరకై పుట్టింది కాబట్టి భగీరథి అయింది ) అదే రాష్ట్రంలో వున్న దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ గా పిలువ బడుతుంది . భగీరథి గంగ గా మారే క్రమంలో యే యే నదులతో సంగమించినది , యేయే ప్రదేశాలలో సంగమించినది , ఆయా ప్రదేశాలలో చూడదగ్గ వాటి గురించి తెలుసు కుందాం . బదరీ నాధ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు దారిలో వచ్చే ప్రయాగల క్రమం లోనే తెలుసుకుందాం .

1) విష్ణుప్రయాగ , 2) నందప్రయాగ , 3) కర్ణప్రయాగ , 4) రుద్రప్రయాగ , 5) దేవప్రయా

1) విష్ణు ప్రయాగ ---

హిమాలయాలలో వున్న త్రిమూర్తులకు ప్రతీకగా భూమి పై యేర్పడ్డ త్రిభుజాకార హిమనీనదమైన " సతోపంత్ " లో పుట్టిన ' అలకనంద ' నది వురుకులు పరుగులతో బదరీనాథుని పాదాలను తాకి దిగువకు ప్రవహిస్తూ  చిన్న చిన్న సెలయేళ్లని తనలో కలుపుతుంటూ ప్రవహిస్తూ జోషిమఠ్ దాటి పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి విష్ణుప్రయాగ దగ్గర ధౌళి గంగతో కలసి అలకనందగా దిగువకు ప్రవహిస్తుంది  ధౌళి గంగ ' నితిపాస్ ' లో పుట్టి తెల్లని రంగులో పడమట వైపునుండి వురుకులు పరుగులతో వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి తన ఉనికిని పోగొట్టు కుంటుంది . అలకనంద నీరు నీలం రంగులోను , ధౌళిగంగ తెల్లటి రంగులోను వచ్చి కలిసే దృశ్యం అద్భతంగా వుంటుంది . యెనిమిది సంవత్సరాల కిందట యిక్కడ రెండు యిళ్లు కూడావుండేవి కావు . సంగమం దగ్గర 1889 లో అహల్యాబాయి హోల్కర్ చే కట్టబడ్డ యెనిమిది భుజాలు కలిగిన కట్టడం వుంది . 2013 లో వచ్చిన వరదలు ఈ కట్టడానికి యే విధమైన క్షతిని కలుగజెయ్యలేదు . అక్కడనుంచి మెట్లదారి గుండా దిగి సంగమం చేరుకున్న భక్తులు తమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు .ఈ ప్రదేశంలో నారదుడు చేసిన ఘోర తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి దర్శన మిచ్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని విష్ణుప్రయాగ గా పిలువబడుతోంది . ఈ ప్రదేశంలో అనగా సుమారు 25 కిలోమీటర్ల అలకనంద విష్ణుగంగ గా పిలువబడుతోంది .ప్రస్తుతం యిక్కడ 400ంవ్ శక్తి గల హైడ్రో ఎలట్రికల్ పవర్ ప్లాంటు ఒక ప్రైవేటు సంస్థ ద్వారా నడుపబడడంతో యిక్కడ పదుల సంఖ్యలోగల యిళ్లతో కాలనీ వెలిసింది . 

2 ) నందప్రయాగ ----

విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 లేక 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరవాత నంద ప్రయాగ చేరుతాం . పూర్వం యిది యదువంశ రాజ్యముఖ్య పట్టణంగా వుండేదిట . ఈ ప్రాంతంలో నందుడు విష్ణుమూర్తి గురించి యాగం నిర్వహించి అతనిని తన పుతృనిగా పొందే వరం పొందిన ప్రదేశం . నందుడు యాగం నిర్వహించిన ప్రదేశంలో చిన్న కోవెల నిర్మించి అందులో బాల క్రిష్ణునికి పూజలు నిర్వహిస్తున్నారు . రిషికేశ్ బదరీనాధ్ రోడ్డుపైనే వుంటుంది యీకోవెల . నందమందిరం అని స్థానికులు పిలుస్తారు .అలకనంద , నందాదేవి అభయారణ్యంలోని  ' నంద గుంట ' నుండి పుట్టిన నందాకిని నదితో కలిసే ప్రదేశం యిది . యిక్కడ నందాకిని తనవునికిని పోగొట్టు కుని అలకనందగా దిగివకు ప్రవహిస్తోంది .ఈ నదులు  వేరువేరు రంగుల నీళ్లతో ప్రవహించి రెండు నదులూ కలిసి కిందకి ప్రవహించడం ఒక అద్భుతం . ఇక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం వుండేదట . ఇక్కడే శకుంతల దుష్యంతుల వివాహం జరిగిన ప్రదేశం గా కూడా చెప్తారు .

3 ) కర్ణ ప్రయాగ ---
నందప్రయాగ నుంచి సుమారు యెనభై కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రదేశంచేరుకుంటాం . భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీనదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశమే కర్ణప్రయాగ . పిండారి గంగ పై నిర్మించిన వంతెన వస్తుంది .., కుడి వైపున నదీ సంగమం చూడొచ్చు . వంతెనకి అటుపక్కన దుర్గాదేవి మందిరం చిన్న గుట్టమీద వుంది . అదే కర్ణుని సమాధి స్థలం కూడా .వంతెన కు యిటుపక్క టాక్సీస్టాండు వుంటుంది దానికి యెదురుగా వున్న కొండపై కర్ణుడు తపస్సు చేసుకున్నప్రదేశం వస్తుంది .   కర్ణుడు సూర్యుని కొరకై తపస్సు చేసి కవచకుండలాలు యిక్కడ పొందేడుట .మహాభారత యుద్ధం లో కవచకుండలాలను ఇంద్రునకు దానంగా యిచ్చి , రథ చక్రం విరిగి కిందపడిపోయిన కర్ణుని పైకి కృష్ణుని సలహా మేరకు అర్జునుడు  " అంజాలిక " అస్త్రాన్ని ప్రయోగిస్తాడు . కాని " అంజాలిక "  కర్ణుని దగ్గరకు చేరనీయకుండా అతను చేసుకున్న పుణ్యం ఫలితంగా యముడు అతనికి కాపలాగా వుంటాడు . విషయం గ్రహించిన కృష్ణుడు వృధ్ద బ్రాహ్మణ వేషధారియై కర్ణుని పుణ్యం దానంగా అడుగుతాడు . వృధ్దబ్రాహ్మణుని సాక్షాత్తు కృష్ణునిగా గుర్తించిన కర్ణుడు తన శరీరానికి ఉత్తరక్రియలు అలకనంద పిండారిగంగల సంగమ ప్రదేశం లో జరిపించవలసినదిగా కోరి , తన పుణ్యాన్ని దానం యిచ్చెస్తాడు . కర్ణునకు శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం యిస్తాడు . పుణ్యం లేకపోవడంతో యముని రక్షణ వలయం మాయమౌతుంది . అంజాలిక అస్త్రం కర్ణుని ప్రాణాలను తీసుకుంటుంది . మహాభారత యుధ్దానంతరము కర్ణునకు యిచ్చిన మాట ప్రకారము కృష్ణుడు కర్ణుని శరీరమునకు కర్మకాండలు యీ ప్రదేశంలో చేస్తాడు . ఈ రెండు చోట్ల చిన్న కోవెలలు వున్నాయి . ఎవరో బాబాలు అక్కడ నివసిస్తున్నారు .వివేకానందుడు అతని గురువారం తురియానందజీ , అఖరానందజీ లతో యీ ప్రదేశం లో పద్ధెనిమిది రోజులు  తపస్సు చేసుకున్నాడట . పిండారి గంగ వంతెన దాటేక రోడ్డు రెండుగా చీలుతుంది . యెడమ వైపున వున్న దారి ' రాణీఖేత్ ' వెళ్లేదారి , ఆ దారిలో సుమారు పదిహేడు కిలో మీటర్లు వెడితే రోడ్డుకి దగ్గరగా ' ఆది బదరి ' ఆలయసముదాయాన్ని చూడొచ్చు .

రుద్రప్రయాగ --

కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల ప్రయాణానంతరం రుద్రప్రయాగ చేరుకుంటాం . ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా ముఖ్యకేంద్రమైన రుద్రప్రయాగ కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు , బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ముఖ్యకూడలి . ఇక్కడ భోజన , వసతి సౌకర్యాలు వున్నాయి . సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది .కేదారనాధ్ దగ్గర వున్న " చోరాబారి " అనే హిమనీనదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమించింది .ఎత్తైన మెట్లు దిగి కిందకి వెళితే సంగమ ప్రదేశం చేరుకోవచ్చు . సంగమానికి వెళ్లేదారిలో నారదశిల వుంటుంది . ఇక్కడ నారదుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని వద్ద సంగీతం నేర్చుకుంటాడు . ఈ ప్రదేశంలో శివుడు రుద్రనాధుడుగా పూజింప బడుతున్నాడు . రుద్రనాధుని కి కోవెలకు యెదురుగా చిన్న గుట్టమీద చాముండా దేవి కోవెలను చూడొచ్చు . పక్కగా వున్న కాలిబాటన వెళితే చిన్న గుహ అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు .

దేవప్రయాగ ---

రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల పయాణం తరువాత మనం దేవప్రయాగ చేరుకుంటాం .పూర్వం దేవశర్మ అనే ముని యీ ప్రదేశమ లో తపస్సు చేసుకున్నందువలన యీ వూరికి దేవప్రయాగ అని పేరు వచ్చిందని ఒక కథ , దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలం అని కొందరి కథనం .ఎవరు యేవిధంగా నిర్వచించినా యిక్కడి ప్రకృతి మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది అనడంలో అతిశయోక్తి యేమీ లేదు . చుట్టూరా యెత్తైన కొండలు , ఒకవైపున అలకనంద వురుకులు పరుగులతో  వచ్చి , గోముఖ్ దగ్గర గంగోత్రి హిమనీనదములో పుట్టిన భగీరథి ( మొదటి పేరాలో భగీరథి కథ వివరించేను) తో కలిసి ' గంగ ' గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని తలపింపకమానదు . రెండునదుల సంగమ ప్రదేశంలో 'తొండేశ్వర మహదేవ్ ' మందిరం వుంది . ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు . అలకనంద మహాలక్ష్మి స్వరూపమని , భగీరథి స్వయంగా శివుని పత్ని అని , యింట్లో అత్తాకోడళ్ల తగవులు యెక్కువగా వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకుంటే వారి సంబంధం లో మంచిమార్పులు చోటుచేసుకుంటాయని యిక్కడి వారి నమ్మకం . ఫొటోలో వున్న విధంగా అరుగులు కట్టి 2013 కి పూర్వం వుండేది .  2013 లో వచ్చిన వరదలలో అన్నీ కొట్టుకు పోయేయి . ప్రస్తుతం యిలాంటివి లేవు . ఇక్కడి ప్రభుత్వం యిలాంటివి తిరిగి నిర్మించ యాత్రీకులకు సంగమాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించే సదుపాయం కలిగిస్తుందని ఆశిద్దాం .
 *భగవంతుణ్ణి మెప్పించిన భక్తి* 

*శ్రీపురుషోత్తంపురిలో కర్మాబాయి అనే భక్తురాలు ఉండేది. బాలకృష్ణుడిని ఎప్పుడూ పూజిస్తూ ఉండేది. ఆమె వాత్సల్య భక్తికి భగవంతుడు ప్రసన్నుడై, చిన్నికృష్ణుని రూపంలో వచ్చి ఆమె పెట్టిన పులగం (కిచిడీ) ఆరగించేవాడు. ప్రతిదినం ఆమె తన బాలకృష్ణుడు ఎక్కడ ఆకలితో బాధపడతాడో అని భావించి స్నానాదికార్యాలు చేయకుండా ముందు ఉదయమే పులగం వండి బాలకృష్ణుడికి నివేదించేది. ఆమె భక్తికి వశుడైన కృష్ణుడు నిత్యం చక్కని బాలుని రూపంలో వచ్చి ఆమె ఒడిలో కూర్చొని, పెట్టిన పులగం తినేవాడు. భగవంతుడి నైవేద్యం ఆలస్యం అవకూడదన్న భావంతో ఆమె ఇంటి పనులు, పద్దతులు ఏవీ పట్టించుకోకుండా ఉదయమే భక్తితో పులగం వండి ఉంచేది.*

*ఒక రోజు కర్మాబాయి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. కర్మాబాయి స్నానం చేయకుండానే పులగం వండి బాలగోపాలునికి పెట్టడం ఆయన చూశాడు. వెంటనే ఆమెను పిలిచి 'ఇల్లు శుభ్రం చేసి,* *స్నానం చేసి, శుచిగా వంటచేసి భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. లేదంటే భగవంతుడికి కోపం వస్తుంది' అని చెప్పాడు. మర్నాడు కర్మాబాయి ఆ విధంగానే చేసింది. అందువలన వంట చెయ్యడం ఆలస్యం అయింది. చిన్ని కృష్ణుడు ఆకలితో బాధపడుతున్నాడని ఆమె హృదయం తల్లడిల్లింది. బాధ పడుతూనే కృష్ణుడికి పులగం తినిపించింది.*

*అదే సమయంలో ఆలయంలోని పూజారి మంచి రుచికరమైన పిండి వంటలు తీసుకొచ్చి నివేదన చేసి, ప్రభువును ఆహ్వానించాడు. అప్పుడు ప్రభువు నోటి నిండా పులగంతో పూజారికి దర్శనమిచ్చాడు. భగవంతుని ముఖం మీద అంటుకుని ఉన్న పులగం చూసి పూజారి ఆశ్చర్యపోయాడు. పూజారి కూడా పరమ భక్తుడు. అసలు విషయం చెప్పమని పూజారి అత్యంత భక్తి పూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్ధించాడు. అప్పుడు భగవంతుడు "నేను ప్రతినిత్యం ఉదయమే వెళ్ళి కర్మాబాయి వండి పెట్టిన పులగం తింటాను. ఆ పులగం నాకు చాలా ఇష్టం. నిన్న ఒక సాధువు ఆమె ఇంటికి వెళ్ళి 'ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి శుచిగా వంట చేసి భగవంతుడికి నివేదించాలి' అని చెప్పాడు. అందుకని ఇవాళ ఆమె తన పనులు పూర్తి చేసుకుని పులగం వండి నాకు పెట్టేసరికి ఆలస్యం అయింది. ఆకలి భరించలేక నేను బాధపడ్డాను. ఇక్కడ మీరు పిలిచేసరికి తొందరలో ముఖం శుభ్రం చేసుకోకుండా వచ్చేశాను" అని చెప్పాడు.*

*భగవంతుడు చెప్పినదంతా పూజారి, ఆ సాధువుకి చెప్పాడు. సాధువు గాబరా పడుతూ కర్మాబాయి ఇంటికి వెళ్ళి "అమ్మా! మీరు ఎప్పటిలానే ఉదయమే పులగం వండి కృష్ణుడికి నివేదన చెయ్యండి. మీరు ఏ విధమైన నియమాలూ పాటించనక్కర లేదు" అన్నాడు. కర్మాబాయి పూర్వం లాగానే ఉదయమే పులగం వండి, బాలకృష్ణుడికి పెట్టేది.*

*ఆమె జీవితాంతం బాలకృష్ణుడిని సేవించి, చివరిలో భగవత్సాయుజ్యం పొందింది. ఇప్పటికీ భక్తులు ఆమె కృష్ణభక్తిని కీర్తిస్తూ పాటలుగా పాడుకుంటారు. ఇప్పటికీ జగన్నాథస్వామి ఆలయంలో ప్రతి నిత్యం ఉదయమే పులగం వండి భగవంతునికి నివేదన చేసే సంప్రదాయం కొనసాగుతోంది.*

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
           *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌺🌼 🙏🕉️🙏 🌼🌺🌼
 *ఇద్దరూ ఇద్దరే.!!*

*మనప్రవచనకారులు చాగంటి, గరికపాటి, ఇద్దరి వైవిధ్యాన్నీ కె.వి.యస్.సన్యాసిరావుగారు  వింగడించిన తీరు అద్భుతం!* 

*చదవండి మీకే తెలుస్తుంది.*

*👆ప్రవచనమే ద్విపాత్రాభినయమైతే.!ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ... మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ...*
 
*ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా... మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే...*
 
*ఒకరేమో అలౌకిక ప్రపంచ విహారం... మరొకరేమో లౌకికప్రపంచ సంచారం...* 

*ఒకరేమో నేరుగా విశ్వేశ్వరుని సన్నిధికి... మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి...*  

*ఒకరేమో విచ్చుకునే అంతరంగం... మరొకరేమో టింగురంగం...* 

*ఒకరేమో పంచె... లాల్చీ... కండువా... మరొకరేమో అదే పంచె... ఆపై కోటు...* 

*ఒకరేమో నిరాడంబరం... మరొకరేమో గండపెండేరం...* 

*ఇద్దరి కతా ఆధ్యాత్మికతే... ఒకే లక్ష్యం... ఒకటే గమ్యం... విషయం అదే... చెప్పే తీరు వేరు...*  

*చాగంటి గుడిగంట... గరికపాటి ఆ గుడిలో హోమం మంట...* 

*రామాయణమైనా... భారతమైనా... భాగవతమైనా... శివపురాణమైనా... కార్తీక పురాణమైనా...*

*చాగంటి చెబితే తన్మయం... గరికపాటి పలికితే విస్మయం...* 

*ఒకరు వివరిస్తే ఇదే ప్రపంచమని అనిపిస్తుంది... మరొకరు సవరిస్తే ఇదా ప్రపంచమని అనిపిస్తుంది... ఇద్దరూ ప్రవచనకర్తలే...*
 
*ఒకరేమో పరవశకర్త... మరొకరేమో తన వశకర్త.! ఇద్దరూ మహా పండితులే...* 

*పూజ్యులు... మాన్యులు... మించి ధన్యులు.! ఇద్దరి ధారణ అసాధారణం...*
 
*మాటల మూటలు... విషయ పరిజ్ఞానం సాగర పర్యంతం... ధాటి అనంతం... మాటాడుతుంటే గుడిగంటల సవ్వడి వోలె గంటలు గంటలు... వినాల్సిందే ఆసాంతం.!* 

*ఒకరేమో భగవంతునికి నిన్నటి ప్రపంచపు ఉత్తరం... మరొకరేమో నేటి లోకపు ప్రత్యుత్తరం...* 

*ఇద్దరి కీర్తీ లోకోత్తరం.! ఇద్దరిదీ ప్రియవచనం... ఇద్దరూ ప్రవచనానికి బహువచనం.! రెండు మేరునగాలను ఒక దరి చేర్చి ఎంచి... పోల్చి చూపే ప్రయత్నం చేశాను... 🙏🙏*

           {సేకరణ:- అడ్మిన్ MGN}
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺🙇🏻‍♂️🌺 🙏🕉️🙏 🌺🙇🏻‍♂️🌺
 *_🚩మనభాష - మన సామెతలు 🚩_*
----------------------
💠 ఎంగిలికి ఎగ్గు లేదు - తాగుబోతుకు సిగ్గు లేదు. 

💠 ఎంత వుంటేనేం తినేది అన్నమే, బంగారం కాదు. 

💠 ఎంత తిన్నా పరగడుపే! 

💠 ఎంత ఉప్పు తింటే అంత దాహం. 

💠 ఎంత చెట్టుకు అంత గాలి. 

💠 ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు. 

💠 ఎంత నేర్చినా, ఎంత జూచినా, ఎంత వారలైనా కాంతా దాసులే! 

💠 ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక. 

💠 ఎంత ప్రొద్దుండగా లేచినా సందు చివరే తెల్లవారినట్లు. 

💠 ఎంత ప్రాప్తమో అంతే ఫలం. 

💠 ఎంతమంచి గొల్లవాడికైనా వేపకాయంత వెర్రి వుండకపోదు. 

💠 ఎంతయినా పరాయి సొమ్ము పరమాన్నమన్నట్లు. 

💠 ఎంతవాడయినా ఆడదానికి లోకువే! 

💠 ఎంత వాడయినా కాంతా దాసుడే! 

💠 ఎంత వెలుగుకు అంత చీకటి. 

💠 ఎంత సంపదో అంత ఆపద. 

💠 ఎంత సంపాదించినా కూటికే - ఎంత బ్రతికినా కాటికే! 

💠 ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. 

💠 ఎందుకు ఏడుస్తున్నావంటే, మొగుడు కొట్టబోయే దెబ్బలకి అందట. 

💠 ఎక్కడ వున్నావే గొంగళీ అంటే వేసిన చోటే వున్నానన్నదట. 

💠 ఎక్కడయినా బావే గానీ వంగ తోట దగ్గర కాదు. 

💠 ఎక్కడికి పోయినా ఏలినాటి శని తప్పదన్నట్లు. 

💠 ఎక్కడికి పోయినా చేసుకున్న ఖర్మం ఎదురు వస్తుంది. 

💠 ఎక్కడిదిరా ఈ పెత్తనమంటే - మూలనుంటే నెత్తినేసుకున్నానన్నాడట. 

💠 ఎక్కడి నీరైనా పల్లానికే పయనం. 

💠 ఎక్కమంటే ఎద్దుకు కోపం - దిగమంటే కుంటికి కోపం. 

💠 ఎక్కి కాయను చూసి, దిగివచ్చి రాయి రువ్వినట్లు. 

💠 ఎక్కినవానికి ఏనుగు లొజ్జు. 

💠 ఎక్కువగా తిన్న పొట్ట - ఏకులు పెట్టిన బుట్ట చిరుగవు. 

💠 ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం - తక్కువ తెలివి తన్నుల కారణం. 

💠 ఎక్కువ వెల పెట్టి గుడ్డును, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనరాదు. 

💠 ఎగదీస్తే బ్రహ్మ హత్య - దిగదీస్తే గో హత్య. 

💠 ఎగిరెగిరి పడే గొడ్డే గానీ - మానెడే మోస్తుంది మరి. 

💠 ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి. 

💠 ఎట్లాంటి కోమటికైనా నిమ్మకాయంత బంగారం వుంటుంది. 

💠 ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది. 

💠 ఎడపిల్ల ఏరాలితో సమానం. 

💠 ఎడమచేత్తో తెలియక చేసేది - కుడిచేత్తో తెలిసి అనుభవించాలి. 

💠 ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లు. 

💠 ఎత్తివచ్చిన కాపురానికి ఏ కాలూనినా ఒక్కటే! 

💠 ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు. 

💠 ఎత్తుకు పైఎత్తు. 

💠 ఎత్తుబారం మొత్తుకోళ్ళు. 

💠 ఎత్తువారి బిడ్డ
ఎత్తెత్తి అడుగులేస్తే - పుల్లాకుల మీద పడ్డాయట. 

💠 ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే! 

💠 ఎద పొంగుతోంది - నా వన్నెలు చిన్నెలు చూడమన్నదట. 

💠 ఎదురు అన్నది మాట - ఎదాన పెట్టింది వాత.
 
💠 ఎదురింట్లో పొయ్యి మండితే తన పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్లు. 

💠 ఎదురుగుండా అద్దముంటే వెక్కిరించుకో బుద్ధి పుడుతుంది. 

💠 ఎదురు తిరిగిన కుక్క, ఏదుపంది ఒక్కటే! 

💠 ఎదురు పడిన వాడే నా మొగుడు అన్నట్లు. 

💠 ఎద్దు ఎండకు లాగు - దున్న నీడకు లాగు. 

💠 ఎద్దుకు, ఎనుబోతుకు లంకె వేసినట్లు. 

💠 ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి?

💠ఎద్దు కొద్దీ సేద్యం - చద్ది కొద్దీ పయనం. 

💠 ఎద్దుగా కలకాలం బ్రతికేకంటే ఆబోతుగా ఆరు నెలలు బ్రతికితే చాలు. 

💠 ఎద్దును అడిగి గంట కడతామా?

💠 ఎద్దులున్నవాడి సేద్యం చూడు - మంది వున్నవాడి బలం చూడు. 

💠 ఎద్దు పుండు కాకికి ముద్దా?

💠 ఎద్దు బీదదయితే చేను బీద. 

💠 ఎద్దు మంచిదయితే సంత కెందుకు వెళుతుందిట?

💠 ఎద్దులా తిని మొద్దులా నిద్ర పోయినట్లు. 

💠 ఎద్దులా కుక్కను పెంచి తానే మొరిగినట్లు. 

💠 ఎద్దు లేని సేద్యం - చద్ది లేని పయనం. 

💠 ఎన్నడూ దొరకనమ్మకు ఏగానీ దొరికితే ముడిమీద ముడి ఏడు ముళ్ళు వేసిందట. 

💠పుట్టింట్లో ఎన్నాళ్ళున్నా పెళ్ళయ్యాక అత్తారింటికి పోకతప్పదు. 

💠 ఎన్ని పుటాలు పెట్టినా.. ఇత్తడి ఇత్తడే! 

💠పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదు. 

💠 ఎన్ని విద్యలయినా కుల విద్యకు సాటిరావు. 

💠 ఎన్నో వ్రణాలు కోసానుగానీ, నా వ్రణమంత బాధలేదు అన్నాడట. 

💠 ఎముకలేని నాలుక ఎట్లా త్రిప్పినా తిరుగుతుంది. 

💠 ఎముక లేని నాలుక ఏమయినా పలుకుతుంది. 

💠 ఎరగని ఊళ్ళో మొరగని కుక్క. 

💠 ఎరువుసొమ్ములు బరువుచేటు - తియ్యా పెట్టా తీపులచేటు - అందులో ఒకటి పోతే అప్పుల చేటు. 

💠 ఎరువు వుంటే వెఱ్ఱివాడూ సేద్యగాడే! 

💠 ఎరువు పెట్టిన చేను - ఏలుబడి అయిన కోడలు. 

💠 ఎరువు లేని చేను - వేగంలేని ఏరూ ఒకటే! 

💠 ఎరువు లేని పైరు - పరువు లేని ఊరూ ఒక్కటే! 

💠 ఎఱను వేసి చేపను పట్టినట్లు. 

💠 ఎఱుక పిడికెడు ధనము. 

💠 ఎఱ్ఱ కోమటినీ నల్ల బ్రాహ్మడినీ నమ్మరాదు. 

💠 ఎలుకమీద కోపంతో ఇంటికి నిప్పంటించుకొన్నట్లు. 

💠 ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండ్లు లేవు తెల్లవార్లూ బాడుగ తోలారట. 

💠 ఎవడి కంపు వాడికింపు. 

💠 ఎవడి నోటికంపు వాడికి తెలియదు. 

💠 ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. 

💠 ఎవరి ఏడుపు వాళ్ళకే తగులుతుందని. 

💠 ఎవరి పిచ్చి వారికి ఆనందం. 

💠 ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడ్వటానికి?

💠ఎవరికి పెట్టావే దండమంటే.. మీలో బుద్ధిహీనుడికి అన్నదట. 

💠 ఎవరికి వారే యమునాతీరే! 

💠 ఎవరి పాపాన వాళ్ళే పోతారన్నట్లు. 

💠 ఎవరి ప్రాణం వారికి తీపి. 

💠 ఎవరి బిడ్డ వారికి ముద్దు. 

💠 ఎవరి ముడ్డి క్రిందకి నీళ్ళు వస్తే వాళ్ళే లేస్తారు. 

💠 ఏ దిక్కూ లేకపోతే అక్క మొగుడే దిక్కు. 

💠 ఎసట్లో గింజలన్నీ పట్టి చూడాలా?

💠ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు. 

💠 ఏ ఎండకా గొడుగు పెట్టినట్లు. 

💠 ఏకాంతంలో కాంతా కలాపాలే ముద్దన్నట్లు. 

💠 ఏ కర్రకు నిప్పంటుకుంటే ఆ కర్రే కాలుతుంది. 

💠 ఏకాదశి ఇంటికి శివరాత్రి వెళ్ళినట్లు. 

💠 ఏ కాలు జారినా పిర్రకే మోసం. 

💠 ఏకుతో తాకితే మోకుతో కొడతారు. 

💠 ఏకులాగ వచ్చి మేకులాగా అయినట్లు. 

💠 ఏ గాలికా చాప యెత్తినట్లు. 

💠 ఏ గుంటనీరు ఆ గుంటకేనన్నట్లు. 

💠 ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది. 

💠 ఏ గూటి పక్షి ఆ గూటికే! 

💠 ఏ గ్రహం పట్టినా ఆగ్రహం పెట్టరాదు. 

💠 ఏ చెట్టూ లేనిచోట ఆముదపుచెట్టు మహావృక్షం. 

💠 ఏటవతల యిచ్చేకన్నా యేట్లో పారేయటం ఉత్తమం. 

💠 ఏటి ఈతకు లంక మేత సరి. 

💠 ఏటి వొడ్డు చేను ఏరు వస్తే ఉంటుందా?

💠ఏటి వొడ్డు చేనుకు మాటిమాటికీ భయం.
 
💠 ఏటికి ఎదురీదినట్లు. 

💠 ఏటికి లాగితే కోటికీ - కోటికి లాగితే ఏటికీ అన్నట్లు. 

💠ఏటిగట్టుదాని మాట యెన్నడూ నమ్మరాదు. 

💠 ఏటివంక లెవరు తీరుస్తారు?

💠ఏటివరద - నోటిదురద రెండూ ఒక్కటే! 

💠 ఏటుకు ఏటు - మాటకు మాట. 

💠 ఏట్లో పారే నీరు యెవరు త్రాగితేనేం?

💠ఏట్లో వేసినా యెంచి వేయాలి. 
💠 ఏడవగలిగితే ఏడ్చేకొద్దీ వ్యవసాయం. 
ఏడవనేరిస్తేనే వ్యవసాయం. 

💠 ఏడ్చి ముఖం కడుక్కున్నట్లు. 

💠 ఏడు కురచలు చూచి యెద్దు కొనాలి. 

💠ఏడుపులో ఎడమ చేయి అన్నట్లు. 

💠 ఏడు మాటలు మాట్లాడినా, ఏడడుగులు నడిచినా గుణం తెలుస్తుంది. 

💠 ఏడు మెతుకులు కతికితే ఏనుగంత బలం. 

💠 ఏడుస్తూ ఏరువాక సాగిస్తే కాడీ, మోకూ దొంగలు యెత్తుకుపోయారట. 

💠 ఏడ్చేదాని ఎడమచేతి క్రిందా, కుట్టేదాని కుడిచేతి క్రిందా కూర్చోరాదన్నట్లు. 

💠 ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్లు. 

💠 ఏడ్చేవాడిని చూచి నవ్వినట్లు. 

💠 ఏతాము పాటకు ఎదురుపాట లేదు. 

💠 ఏ దారి అంటే గోదారి అన్నట్లు. 

💠 ఏదుంతిన్నా ఏకాదశే పందుంతిన్నా పరగడుపే. 

💠 ఏ దేముడు వరమిచ్చినా మొగుడు లేందే పిల్లలు పుట్టరు. 

💠 ఏనుగంత తండ్రి ఉండే కంటే ఎలుకంత తల్లి మేలు. 

💠 ఏనుగుకు వెలక్కాయలు లొటలొట. 

💠 ఏనుగు తొండమూ తిరుగుబోతు ముండ వూరుకోవు. 

💠 ఏనుగు దాహానికి చూరునీళ్ళా?

💠ఏనుగు నిచ్చి అంకుశం దాచుకున్నట్లే. 

💠 ఏనుగును చూచి కుక్కలు మొరిగినట్లు. 

💠 ఏనుగు బ్రతికినా వెయ్యే చచ్చినా వెయ్యే. 

💠 ఏనుగుమీద ఈగ వాలినట్లు. 

💠 ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడా!

💠 ఏనుగులే గాలికి కొట్టుకు పోతుంటే, పుల్లాకు నా సంగతేమిటి అన్నదట. 

💠 ఏ పని చేసినా పొయ్యిలో ఏకులు దాచుకున్నట్లే! 

💠 ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. 

💠 ఏ పుట్టలో ఏ పాముందో?

💠ఏ పూజ తప్పినా పొట్టపూజ తప్పదు. 

💠 ఏబ్రాసికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువ. 

💠 ఏ మందలో పట్టినా, మన మందలో ఈనితే సరి. 

💠 ఏమి చేసుకుని బ్రతకనమ్మా అంటే.. నోరు చేసుకుని బ్రతకమన్నట్లు. 

💠 ఏమి చేస్తున్నావురా అంటే.. పారబోసి యెత్తుతున్నా అన్నాట్ట. 

💠 ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట. 

💠 ఏమీ ఎరుగని వాడు చీరముడి, పోకముడి విప్పి ఆశ్చర్యంగా చూసాడట. 

💠 ఏమీ తోచనమ్మ ఎదురింటికి పోతే.. తోటికోడలు పుట్టింటికి పోయిందట. 

💠 ఏమీ లేకపోతే మూట విప్పి మళ్ళీ కట్టమన్నట్లు. 

💠 ఏమీ లేనమ్మకు యేడ్పులే శరణ్యం. 

💠 ఏమీ లేనివానికి ఏతులు లావు - స్వాములవారికి జడలు లావు. 

💠 ఎముకలు విరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్లు తినవచ్చు. 

💠ఏరా బడాయిబావా అంటే.. ఏమే గుడ్డి కంటి మరదలా అన్నాడట. 

💠 ఏ రాయి అయితేనేమి పండ్లూడ గొట్టుకోవటానికి!

💠 ఏ రేవుకు వెళ్ళినా ముళ్ళపరిగే దొరికిందన్నట్లు. 

💠 ఏరు యెన్ని వంకలు పోయినా కలిసేది సముద్రంలోనే. 

💠 ఏరు యెంతపారినా కుక్కకు గతుకునీళ్ళే. 

💠 ఏరు ఏడామడల దూరం వుండగానే చీరవిప్పి చంకలో పెట్టుకున్నదట. 

💠 ఏరు దాటి తెప్ప తగలేసినట్లు. 

💠 ఏరు పోయిందే పోక - యేలిక చెప్పిందే తీర్పు. 

💠 ఏరు ముందా? ఏకాదశి ముందా?

💠ఏరు మూరెడు తీస్తే - కొలను బారెడు తీస్తుంది. 

💠 ఏలటానికి వూళ్ళు లేకపోవచ్చుకానీ బిచ్చమెత్తుకు తినటానికి వూళ్ళే లేవా?

💠ఏలేవాడి యెద్దు పోతేనేం - కాచేవాడి కన్ను పోతేనేం?

💠ఏళ్ళు యెగసన - బుద్ధి దిగసన. 

💠 ఏవాడ చిలుక ఆవాడ పలుకు పలుకుతుంది. 

💠 ఏ వేషం వేస్తేనేం? గ్రాస మొస్తుంది గదా!
ఏ వేషం వచ్చినా దివిటీ వానికే చేటు. 

💠 ఐదు నిముషాల సుఖానికి మరుజన్మ నెత్తాలి అందిట.
 
💠 ఐశ్వర్య దేవత హలంలోనే వుంది. 

💠 ఐశ్వర్యానికి అంతం లేదు - దారిద్ర్యానికి మొదలూలేదు. 
----------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 [7/20, 16:48] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*

*ఒప్పులకుప్పా*

ఒప్పులకుప్పా
ఒయ్యారి భామా
సన్నా బియ్యం
చాయపప్పు
బావిలో కప్పా
చేతిలో చిప్పా
రోట్లో తవుడు
నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్
నీ మొగుడు సిపాయ్
[7/20, 16:48] +91 79819 72004: మెక్కూమెక్కూ... ముక్కామెక్కూ... (బాలల సరదా జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*********
    ఒకూరిలో ఒకడున్నాడు. వాడేమో రోజూ కూర (మాంసం) తీస్కోనొచ్చి వంట బాగా అదిరిపోయేలా చేయమని పెండ్లానికిచ్చి పొలానికి పోయేటోడు. ఆమె చానా టక్కరిది. మొగుడట్లా బైటికి పోవడం ఆలస్యం గబగబా రొట్టె చేసుకోని
మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి బాగా కూర చేసుకోని నున్నగా తినేసేది. మొగుడు వచ్చే సమయానికి మిగిలిన ఒట్టి ఎముకలు వేసి చారు చేసి వానికి పెట్టేది.
వాడు చారూ, ఎముకలు చూసి “ఇదేందే... దీంట్లో ఒక్క ముక్క కూడా లేదు" అనడిగితే "ఏమో నాకేం తెల్సు... నువ్వెట్లాంటిది తెస్తే అట్లాంటిది చేసి పెడతా వున్నా. ముక్కల్లేకపోతే పోయి... నీకు కూరమ్మేటోన్ని అడుగుపో" అని గట్టిగా కొట్లాడేది. పాపం వాడు ఆమె నోటికి బెదపడి గమ్మున నోరు మూసుకోని మట్టసంగా పెట్టినేది తినేటోడు. అట్లా ఆమె ముక్కలన్నీ తినుకుంటా తినుకుంటా రోజు రోజుకీ దుబ్బగయిపోతా వుంటే పాపం వాడేమో రోజు రోజుకీ సన్నగా బక్కచిక్కి పోతా వున్నాడు.
ఒకరోజు వాడు చెల్లెలిని చూసొద్దామని వాళ్ళూరికి పోయినాడు. ఆమె అన్నను చూసి "ఏందన్నా... ఇంతకుముందు పోట్లగిత్తలా ఎట్లా వుండేటోనివి. ఇప్పుడేమి ఇట్లా ఎండుపుల్లలెక్క బాగా చిక్కిపోయినావు" అనడిగింది. దాంతో వాడు జరిగిందంతా చెప్పినాడు.
ఆమె “అట్లనా" అని మూడు లక్కబొమ్మలు తెచ్చిచ్చి “అనా... అనా... ఇవి అలాంటిలాంటి మామూలు  లక్కబొమ్మలు కాదు. మంత్రించిన లక్కబొమ్మలు. వీటిని తీస్కోనిపోయి నీ పెండ్లానికి తెలీకుండా ఒకటి నీ గుమ్మం కింద తవ్వి పెట్టు. మరొకటి గూట్లో దాచిపెట్టు. ఇంకొకటి గవాక్షిపైన పెట్టు" అని చెప్పింది.
సరేనని వాడు ఆ మూడు లక్కబొమ్మలూ తీస్కోనిపోయి పెండ్లాం నీళ్ళకు పోయినప్పుడు ఒకటి గుమ్మంకింద, మరొకటి గూట్లో, ఇంకొకటి గవాక్షిలో కనబడకుండా పెట్టేసి ఏమీ తెలీనోనిలెక్క మట్టసంగా వున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే వాడు ఎప్పటిలాగానే కూర తీస్కోనొచ్చి పెండ్లానికిచ్చి పొలానికి పోయినాడు. మొగుడట్లా పోయినాడో లేదో... వెంటనే ఆమె మెత్త మెత్తని ముక్కలన్నీ ఏరి పొయ్యి మీదికి కూరగిన్నె ఎక్కిచ్చింది. కూర చేసినాక రొట్టెలు కాల్చుకుందామని పిండి తీసి వేన్నీళ్ళు కలిపి కొడతా వుంటే గుమ్మం కిందున్న బొమ్మ
"కొట్టూ... కొట్టూ... రొట్టే కొట్టూ 
ఒక్కదానికే బాగా కొట్టు" అనరిచింది. "ఎవరబ్బా అట్లా అంటా వున్నారని" ఆమె అదిరిపడి చుట్టూ చూస్తే ఎవరూ కనబడలేదు. దాంతో "ఏందోలే" అనుకోని రొట్టెలు చేసుకోని, పళ్ళెంలో కూరేసుకోని తిందామని నోట్లో పెట్టుకోబోయింది.
వెంటనే గూట్లో వున్న బొమ్మ “పెట్టూ  పెట్టూ నోట్లో పెట్టు....
ఒక్కడానివే దంచీ కొట్టు..." అనరిచింది.
అంతే ఆమె “ఎవరబ్బా అట్లా అంటావున్నారని" బిరబిరా బైటికి పోయి అంతా వెదికింది. కానీ ఎక్కడా ఎవరూ కనబళ్ళేదు.
దాంతో “ఏందోలే" అనుకోని రొట్టెలోకి కూరద్దుకోని తినసాగింది. వెంటనే గవాక్షిలోని బొమ్మ 
“మెక్కూ మెక్కూ ముక్కా మెక్కూ ....
మొగునికి పెట్టక బాగా మెక్కూ..." అని ఆగకుండా అరవసాగింది.
దాంతో ఆమె "నేను కూర తింటావున్నది ఎవరో చూస్తా వున్నట్టున్నారు” అని భయపడి ఆరోజు నుండీ ఏమీ తినకుండా చేసినవి చేసినట్టు మట్టసంగా మొగునికి కూడా సమానంగా పెట్టడం మొదలు పెట్టింది.
*********