Tuesday, 30 September 2025

@ కలి... కాలం @

వివేకంతో ప్రశ్నిస్తే 
చైతన్యం తో నిలదీస్తే
అండా సెల్ నిర్బంధాలు

భజనలు చేస్తే 
సాష్టాంగ పడిపోతే
అధికార పీఠాలు

******

నిజం మాట్లాడితే 
నిర్భయంగ సత్యం చాటితే
వ్యక్తిత్వ హననాలూ హత్యలూ 

అసత్యాలు వల్లిస్తే 
అవాస్తవాలను నిస్సిగ్గుగ ప్రకటిస్తే
పదవులూ బిరుదులూ ఘన సన్మానాలూ

*******

వనరుల దోపిడికి
అడ్డు గోడై నిలబడి కలబడితే 
ఎన్కౌంటర్లూ 

దోపిడీ పీడనా
అణచివేతల వత్తాసు పలికితే 
చట్ట సభల్లోకి ఎర్రని తివాచీలు

********

స్నేహం
ప్రేమా మానవీయతా 
జ్ఞానం విజ్ఞానం వివేకం వివేచనా

అన్నీ అన్నీ ..
కాలం చెల్లిపోయిన 
పురాతన విలువలిప్పుడు 

*****

వంచన 
ద్వేషం ఉన్మాదం
అజ్ఞానం అశాస్త్రీయతా మూఢత్వం 

ఇవే ఇవే
అందలమెక్కించే 
నయా నయా విలువలిప్పుడు

********

స్వేచ్ఛా
సమానత్వం 
సౌభ్రాతృత్వమూ
కాల గర్భంలో కలిసిపోయిన నినాదాలు 

బానిసత్వం 
అసమానతత్వమూ 
విభజనా విద్వేషమూ కపటం
విస్తరిస్తోన్న సరికొత్త నినాదాలు

********

యుగాంతమని 
సర్దుకు పోవాల్సిందేనా 
మనుగడ కోసం 

నవ యుగమంటూ 
తెగించి పోరాడాలా 
మానవ జాతి వికాశం కోసం 

చస్తూ బతకాలా 
చచ్చైనా జీవించాలా 
తేల్చుకోమంటోంది కలి ... కాలం

- రత్నాజేయ్ (పెద్దాపురం)
 తృప్తి అనేది ఒక మానసిక భావన. తామస ఆలోచనలకు తావివ్వని మనసు తేలికగా తృప్తి చెందుతుంది. పాండవులు అయిదూళ్లతో తృప్తి పడతారని చెప్పిన కృష్ణుణ్ని నమ్మని అహంకారి దుర్యోధనుడు. అతగాడి మనసును అభద్రతా భావం, అసూయ లొంగదీసుకుని అసంతృప్తికి, తద్వారా కురుక్షేత్రానికి దారితీశాయి. తృప్తి లేక పోవడం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద, కలువ ముడుచుకోవడాన్ని గమనించక, ఊపిరాడక మరణిస్తుంది. తృప్తిలేని వాడికి ఏది దొరికినా, ఎంత దొరికినా సంతోషం కలగదు. జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది. ధన్యవాదాలు...
" అహం బ్రహ్మాస్మి 🤘 "
 *జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది*.. *అర్థమయ్యే వయసులో కన్నీళ్ళు తెప్పిస్తుంది*...

*మన జీవితంలో మనల్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడరాదు*.. 
*ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ,ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు*... 

*ఒకరిని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు*..
*జీవితం అంటే మనం బాధలో ఉన్నాఇంకొకరిని* *సంతోషపెట్టడమే*
*నిజమైన జీవితం*... 

*మాట్లాడిన మాట, వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, వదులుకున్న అవకాశం,ఈ నాలుగు తిరిగి వెనుకకు తెచ్చుకోలేము*.. 
*అందుకని మాట్లాడే ముందే ఒకటికి రెండుసార్లు  ఆలోచించుకుందాం, కాలం గడిచి పోకముందే వినియోగించుకుందాం, అవకాశం చేజారక ముందే ఉపయోగించుకుందాo*... 

*మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు,నాణ్యమైన మట్టి .అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి  సంపాదన కాదు సంస్కారంముఖ్యం*... 
 
*నేడు మంచిని విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు*.
*వెనక్కి లాగేవారు వెన్నంటే వుంటారు*...

*నీ మేలు కోరేవారు ఎక్కడో,ఒకరు మాత్రమే ఉంటారు..*
*అలాంటి స్నేహాన్ని,*
*నీ మాటలతో గాని,*
*చేతలతో గాని,దూరం చేసుకోకు*...

*నిజాయితీ లేని నూరు మంది వెనుక నడవడం కన్నా,*
*నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం*...

*దీపం నిశ్శబ్దంగా ఉంటుంది.కానీ ఇల్లంతా వెలుగు ఇస్తుంది*..
*గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు ,వారు చేసే పనులతో చుట్టూఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు*...

       🌹🙏*శుభమధ్యహ్నం*🙏🌹
 యండమూరి వీరేంద్రనాథ్ గారి 
"" రన్ దీప్తీ రన్""  పుస్తకంలో 
"పడి లేచిన కెరటాలు" అన్న అధ్యాయం నుంచి.

ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి అవి ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా ఒక్కో స్థాయిలో ఉంటాయి... ఒక్కొక్కరికి ఆక్సిడెంట్ జరిగితే చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టవచ్చు... 
ఇంకొకరికి ఫ్రాక్చర్లు కావచ్చు...
ఇంకొందరు జీవితాంతం అంగ వైకల్యంతో బాధ పడవచ్చు... అలాగే ఉద్యోగ మరియు ఆర్థిక సమస్యలూ... 
వైవాహిక మరియు కుటుంబ సమస్యలు...
ఇప్పుడు ప్రధానంగా పిల్లలు వారి చదువులు వారిని స్థిరపరచడం...
ఇలా అనేక సమస్యలు...
అన్నీ ఒక్కొక్కరికీ ఒక్కో స్థాయిలో ఉంటాయి...
ఇవన్నీ మనం జీవించి ఉన్నంత కాలం సముద్ర కెరటాల లాగా వస్తూనే ఉంటాయి...
కానీ వాటిని మనం ఎలా తీసుకోవాలి... 
వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టే మన జీవితం... 
జీవితం తాలూకూ మాధుర్యం ఆధారపడి ఉంటుంది... 

ఇదంతా ఓపికగా చదవండి 
మీ సమయం వృథా కాదు... దానికి నాది హామీ... 

ఇవి చదివిన తరువాత వీరి జీవితంలో వచ్చిన కష్టాలతో మనవి కంపేర్ చేసుకొంటే మనవీ కూడా కష్టాలేనా వీటికే మనం ఇంత ఆందోళన చెందుతున్నామా అనిపిస్తోంది...
మనసు చాలా తేలిక పడుతుంది...
ప్రశాంత మైన మనస్సుతో ఆలోచిస్తే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది...
నేను ఇంతకు ముందు చెప్పినట్లు జీవితం మాధుర్యం ఆస్వాదించడం ప్రారంభిస్తాం....

(ఇక్కడి వరకూ నా సొంత కవిత్వం ఇక్కడి నుండి గురువు గారు చెప్పింది...)

1. ఒంటి కన్ను క్రికెట్ రాక్షసుడు
 
ఆటగాళ్ళతో విధి చాలా క్రూరంగా ఆడుకుంటుంది. అతడో నవాబు. ఇంగ్లాండు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదివేవాడు. యూనివర్సిటీ తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడి, ఆ రాత్రి తోటి క్రీడాకారులతో డిన్నర్కి వెళ్ళాడు. డిన్నర్ తర్వాత స్నేహితులు ‘నడిచి వెళ్దాం’ అ౦టే ‘అలసిపోయాను. కార్లో వెళ్ళిపోతాను’ అని వారికి క్షమాపణ చెప్పి స్నేహితుడి కారు ఎక్కాడు. 

వంద గజాలు కూడా వెళ్ళక ముందే, ఎదురుగా ఒక పెద్ద కారు వచ్చి ఢీ కొనడంతో కుడి భుజం బెణికింది. విండ్-స్క్రీన్ పగిలి అద్దం కంట్లో గుచ్చుకుంది. ‘ఈ భుజంతో తిరిగి మళ్లీ క్రికెట్ ఆడగలనా’ అనుకున్నాడు.  భుజాన్ని సెట్ చేయడం కోసం హాస్పిటల్‌కి వెళ్తే, అక్కడ డాక్టర్లు ‘మీకు నొప్పి తెలియలేదు కానీ మీ కుడి కన్ను పూర్తిగా పోయింది. ఇక ఆటకి పనికి రారు`” అన్నారు. 

అతడు నిరాశ పడలేదు. గమ్యం వైపు వెళ్తూన్న అతడి ప్రయాణాన్ని, ఆ ఆక్సిడెంట్ రెడ్-లైట్‌ వేసి ఆపలేదు. ఆ పై జీవితాంతం ఒంటి కన్నుతోనే ఆడాడు. అతడు సిక్సర్లు కొడుతూ ఉంటే ఎదుటి జట్టు ఆటగాళ్ళు బెంబేలెత్తి పోయేవాళ్ళు.
అతని అసలు పేరు మన్సూర్ అలీ ఖాన్. హర్యానాలోని గురుగావ్ జిల్లాలో ‘పటౌడీ’ అనే నగరానికి జమిందార్ కాబట్టి ‘నవాబ్ అఫ్ పటౌడి’ అని కూడా అంటారు. చాలా అందగాడు.
 
ఆ రోజుల్లో నవాబ్-ఆఫ్-పటౌడి గ్రౌండ్‌లో ఆడుతో౦టే, కేవలం అతన్ని చూడటానికే అమ్మాయిలు స్టేడియంకి వచ్చే వాళ్ళ౦టే అతిశయోక్తి కాదు. 

కాశ్మీర్-కి-కలి షర్మిలాటాగోర్ భర్త ఇతడు. ‘దేవర’ ఫేమ్ సైఫ్ ఆలీ ఖాన్ తండ్రి.
ఒక కన్నుతోనే క్రికెటర్‌గా రాణించి, భారతజట్టుకి కెప్టెన్ అయ్యాడు. భారతదేశ క్రికెట్ చరిత్రలో, అతి చిన్న వయసులో ఒక దేశానికీ కెప్టెన్ అయినవాడుగా (21 ఏళ్ళు), ఎక్కువ సార్లు గెలిచిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు నవాబ్ ఆఫ్ పటోడి.
...

2. అతి చిన్నవయసులో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం (2004) చేసిన అతి కొద్దిమంది క్రీడాకారుల్లో సందీప్ సింగ్ ఒకరు. అప్పుడు అతడి వయసు 18 సంవత్సరాలు. తన కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఆడుతున్నప్పుడు, ప్రపంచ హాకీ చరిత్రలోనే అతడిది అత్యుత్తమ వేగం (గంటకి 145 కి.మీ) అని చెప్పుకునే వారు. పక్క ఆటగాడికి వేగంగా ‘పాస్’లు ఇవ్వటంలో ఆ రోజుల్లో అతడికి మించినవారు లేరని ప్రతీతి. 
 ‘బ్రతుకు చదరంగంలో అతి చిన్న పావులం మనం. ఎదుటి ఆటగాడికి 'షా' చెప్పి గెలిచామని అనుకునే లోపులో, ఓ మూల నుంచి ప్రత్యర్థి ఏనుగు వచ్చి మన రాజుని కూలదోస్తుంది. విధి కూడా అంతే. గెలిచి అందలం ఎక్కుతూండగా కాలు జార్చి మన గెలుపుకి ‘చెక్’ పెడుతుంది. మన పట్టుదలని పరీక్షిస్తుంది’ అంటాడు ఈ ఆటగాడు. 
 
ఒక దురదృష్టమైన రోజు (ఆగస్టు 22, 2006) విధి అతడిని వెక్కిరించింది. జర్మనీలో జరిగే ప్రపంచ కప్‌ పోటీల్లో పాల్గొనటం కోసం కల్కా-ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వెళుతుండగా, ఒక ఆర్.పి.ఎఫ్ అధికారి తుపాకి పొరపాటున పేలి, ఆ బుల్లెట్ అతడి వెన్నెముక గుండా శరీరపు దిగువ భాగంలో దూసుకు పోయి౦ది. 

దాని ఫలితంగా నడుము క్రింది భాగం అచేతనమై, దాదాపు రెండు సంవత్సరాలు వీల్‌చైర్‌ పై ఉన్నాడు. ఇక అతడు ఎప్పటికీ నడవలేడనీ, జీవితాంతం అలాగే ఉండ వలసి ఉంటుందనీ డాక్టర్లు నమ్మకంగా చెప్పారు. 

ఆ నమ్మకాన్ని నమ్మటానికి అతడు నిరాకరించాడు. ‘ఫిజియో థెరపిస్ట్’ భుజం మీద ఒక చెయ్యి, ‘దృఢసంకల్పం’ మీద మరో చెయ్యీ వేసి అతడు నడవటం మొదలు పెట్టాడు..!

అతడు ఆసుపత్రిలో ఉండగా తమ్ముడు విక్రమ్ గీత్ సింగ్ అన్నయ్యకి హాకీ స్టిక్ ఇచ్చి వీలైనంత తొందరలో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టమని ప్రోత్సహించాడు.

గాయం నుంచి పూర్తిగా కోలుకోగానే, తిరిగి హాకీ ప్రాక్టీసు కూడా ప్రారంభించాడు..! అకుంఠిత దీక్షతో కృషి చేసి తిరిగి భారతజట్టులో స్థానం సంపాదించుకుని, కీలక ఆటగాడిగా కొనసాగాడు..! 
ఒక టోర్నమెంట్‌లో 12 గోల్స్‌ కొట్టి కొత్త రికార్డును నెలకొల్పాడు..! అంతే కాదు.

జాతీయ కోచ్‌ అయ్యాక భారతదేశానికి రెండు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించాడు..! 

అలా.. వెక్కిరించిన విధిని చిరునవ్వుతో పరిహసించాడు.
...
3. జీవితంలో నదిని చూడని వానికి రోవింగ్ లో పతకం
 
దత్తు బోకనాల్‌కి నీళ్లు అంటే అమితమైన భయం. అతడు తన జీవితకాలంలో ఒక నదిని గాని, కాలువను గాని చూడలేదు. ఊరిలోని గ్రామస్తులందరికీ కలిపి తవ్విన ఒకే ఒక సామూహిక బావి (నుయ్యి)లో నీటిని మాత్రమే చూశాడు. మరోలా చెప్పాలంటే అతడు ఎప్పుడూ ‘ప్రవహిస్తున్న నీటిని' చూడలేదు. సముద్రమూ, కెరటాలూ అని ఎవరో చెప్తే విన్నాడు తప్ప అవి ఎలా ఉంటాయో తెలియదు.

భారతదేశంలోనే అత్యంత కరువు కాటకాలకు నెలవైన నాసిక్ జిల్లాలో తాలేగాఁవ్ గ్రామం దాటి అతడు ఎన్నడూ బయటకి వెళ్ళలేదు. అక్కడ వర్షం కూడా అరుదే. తాలేగాఁవ్ లాంటి చిన్న గ్రామంలో పుట్టిన దత్తు బోకనాల్‌కి పెద్ద పెద్ద కోరికలు లేవు. 

లోతైన నీటి గుంతల నుంచి నీటిని తీసుకెళ్ళి పొలాన్ని తడపటమే అతడి దినచర్య. వర్షం అక్కడో వరం. రైతుల ఆత్మహత్యలు సాధారణం. అతడి తండ్రి ఒక కూలీ. ఐదో తరగతి చదువుతున్న సమయంలో దత్తు తండ్రికి ఆర్థికంగా సహాయ పడాలని పగలు కూలి పని, రాత్రిళ్ళు పెట్రోలు బంకులో పని చేసేవాడు. 

తన జీవితంలో అతడు టెలివిజన్, రిఫ్రిజిరేటర్లతో బాటూ 'ఒలంపిక్స్' అనే పేరు కూడా వినలేదు. చిత్రమేమిటంటే అటువంటి వాడు రియో ఒలంపిక్స్‌లో భారతదేశం తరఫున సాగరక్రీడ (రోవింగ్) లో పాల్గొన్న “ఏకైక” క్రీడాకారుడిగా ఎదిగాడు..!
తండ్రి మరణించిన తర్వాత భవననిర్మాణంలో కూలీగా, ఆపైన మేస్త్రిగా, ఆ తర్వాత పెళ్లిళ్లలో భోజనాలు సర్వ్ చేసే వెయిటర్‌గా, ట్రాక్టర్ డ్రైవర్‌గా, ఇంకా ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి 2012లో సైన్యంలో చేరాడు. 

అతని ఎత్తు, శరీర దారుఢ్య౦ చూసి ఒక ఆర్మీ ఆఫీసర్ అతడిని పడవ పందాల్లో పాల్గొనమని సలహా ఇచ్చాడు. అక్కడి కోచ్ ప్రోత్సాహంతో అతడు వాటర్ గేమ్స్‌లో పాల్గొనడం ప్రారంభించాడు. అప్పుడు కూడా పెద్ద పెద్ద మెడల్స్ సంపాదించాలన్నది అతడి ఆశయం కాదు. రోవింగ్‌లో కాస్త గుర్తింపు వస్తే సైన్యంలో ప్రమోషన్ వస్తుందనీ, గ్రామంలో తమ కుటుంబానికి డబ్బు మరి కాస్త ఎక్కువ పంపవచ్చనీ కోరిక. అంతే. అక్కడ గ్రామంలో అతడి కుటుంబ సభ్యులు అయిదుగురు అతడు పంపించే డబ్బు మీదే ఆధారపడి ఉన్నారు. 

"నాకు తండ్రి లేడు. అమ్మ పక్షవాతంతో మంచం మీద ఉంది. పొలాలకు నీళ్లు లేవు. పొలాల్లో పంటలు లేవు. కుటుంబానికి నేనొక్కడినే ఆధారం..! నా వృత్తే నాకు ఆధారం..! పోటీల్లో గెలిస్తే జీతం మరింత పెరుగుతుందని ఒకటే నమ్మకం" అనేవాడు బొకనాల్, 
ఆ సంవత్సరం ఒలంపిక్స్ ‘రియో’లో జరుగుతున్నాయి. ఒలంపిక్స్‌లో పాల్గొనే సమయానికి బకనాల్ వయస్సు 25 సంవత్సరాలు. 

రోవింగ్‌లో భారతదేశానికి ఇప్పటి వరకూ కేవలం ఒకే మెడల్ వచ్చింది. ఆ వచ్చిన ‘ఏకైక’ మెడల్ అతడి ద్వారానే లభించింది. 
అప్పటి వరకు సముద్రాన్ని గాని, నదిని గాని చూడని ఆ యువకుడు భారతదేశంలో తన కుటుంబాన్ని దరిద్ర సాగరం నుంచి బయట పడేయడానికి పడవ ప్రయాణం మొదలు పెట్టాడు. 
ఇండోనేషియాలోజరిగిన 18వ ఏషియన్ గేమ్స్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టాడు.
బోకనాల్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.
...

4. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన హీరో. 2011 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు పూర్తి అవుతూ ఉండగా అతడికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 
విపరీతమైన బాధతో విలవిలలాడి పోయేవాడు. బ్లడ్ వామ్టింగ్స్ చేసుకునేవాడు. 

ఆ సమయంలో అతడి తల్లి అతనికి గొప్పగా సేవ చేసింది. మొహం పై రక్తాన్ని తుడుస్తూ ‘ఎప్పటికైనా తిరిగి మళ్ళీ నువ్వు దేశానికి నీ సర్వీసెస్ అంద జేస్తావురా’ అంటూ ధైర్యం చెప్పేది.
 
రెండు సంవత్సరాలపాటు ఆటకు దూరంగా ఉండి, వైద్యుల సహాయంతో అతడు తిరిగి కోలుకున్నాడు. 

2015 ఐ.పీ.ఎల్‌లో ‘ఢిల్లీ డేర్ డెవిల్స్’ ఇతడిని 16 లక్షలకి కొన్నప్పుడు ఆ సంవత్సరపు ఐ.పీ.ఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 
మృత్యువుని క్లీన్ బౌల్డ్ చేసిన ఆ క్రికెటర్ యువరాజ్ సింగ్.... 
మనందరి అభిమాన క్రికెటర్... 

ఒక్క సారి ఆలోచించండి... 
మనం ప్రతి రోజు ఆందోళన చెందుతున్న విషయాలు ఇంత కఠినమైనవేనా... వాటినుండి మన ప్రయత్నంతో బయట పడలేమా... పోరాడుదాం పోరాడితే పోయేదేమీ లేదు... కష్టనష్టాలు తప్ప... వచ్చేది అంతా ఇంతా కాదు... 
గొప్ప ఆనందం మానసిక సంతృప్తి... 
విజయం సాధించి ఆనందపు శిఖరం పై జెండా ఎగరేసిన కిక్... 

ఓపికగా చదివినందుకు...
థాంక్యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్... 
ఆలోచించండి...
కొంచమైనా ఆచరణలో పెట్టండి...
విజయపు శిఖరంపై నుండి ఈ ప్రపంచాన్ని చూడండి...
 రాత్రిపూట మరణాన్ని నివారించడానికి డాక్టర్ల సూచనలు చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా రాత్రి పూట మరణించడం మనం వింటూ ఉంటాం " నిన్న వరకు బాగానే ఉన్నాడు ఎలా ఇలా చనిపోయాడు?" అనే ప్రశ్న తరుచుగా వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం రాత్రిపూట ఆకస్మికంగా మంచం నుండి లేచడం వల్ల మెదడుకు రక్త ప్రవాహము నిలిచిపోవడమే

     మానవ శరీరము విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. రాత్రిపూట టాయిలెట్ కు వెళ్ళాలి అన్న అవసరం వచ్చినప్పుడు మనం వెంటనే మంచం నుంచి లేచి దూకుతాం. ఈ వేగం కారణంగా మెదడుకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి ఆకస్మిక గుండెపోటు లేదా మరణం సంభవిస్తుంది.
   
      దీనిని నివారించడానికి డాక్టర్లు " 3 1/2 నిమిషాల నియమము " పాటించమని చెబుతున్నారు. మీరు మేల్కొన్న వెంటనే ఒక్కసారిగా లేచి వెళ్ళకూడదు బదులుగా ఒక నియమాన్ని అలవాటు చేసుకోవాలి .ఇది చిన్న జాగ్రత్త అయినా పెద్ద ప్రమాదాన్ని నివారించగలదు.

     మొదటి నిమిషం మంచం మీద పడుకున్నట్టుగానే ఉండాలి. తరువాతి అర నిమిషం  మంచం మీద నెమ్మదిగా కూర్చోవాలి. ఆపై అర నిమిషం కాళ్లు నేల వైపు దించి మంచం అంచున కూర్చోవాలి. మొత్తం మూడు నిమిషాలు గడిచాక నెమ్మదిగా లేచి నడవాలి 

  ఈ విధానము వయసుతో సంబంధం లేకుండా అందరూ పాటించాలి.  రక్త ప్రసరణ  సమస్య ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మేల్కొని తొందరగా  కదిలే  సమయము లో  ఇది జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త అవసరం.
  
 ఈ చిన్న అలవాటు వల్ల మెదడుకు సరైన రక్త ప్రసరణ కొనసాగుతుంది. గుండె బలహీన పడకుండా ఉంటుంది. పడిపోవడం , ఆకస్మిక గుండె  పోటు ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే ఈ సమాచారాన్ని మన కుటుంబం స్నేహితులు బంధువులతో పంచుకోవాలి. 
ఒకరి జాగ్రత్త మరొకరి ప్రాణాన్ని రక్షించగలదు

సేకరణ విషయంతో   యాసాల మల్లిఖార్జున్ ,రేచపల్లి , సారంగాపూర్ 9848729131.
 2912a5;92c6;122d5;1.10e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *ముత్తయిదువ లక్షణాలు:* 
                      *మరియు*
                  *ఉపయోగాలు*
                  ➖➖➖✍️

*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..*

*1). కాళ్ళకి పట్టీలు, మెట్టెలు*
*2). చేతులకి గాజులు*
*3). మెడలో మంగళసూత్రం*
*4). తలలో పువ్వులు*
*5). నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..*


*1). మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:*
```
*కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది.

*ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది.

*ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

*అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈ నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

*అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

*ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

*గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

*అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*2). ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..*
```
*గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే. ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..!

*మన చేతి మణికట్టు దగ్గర ‘రేడియల్ నెర్వ్’ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

*ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.  అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

*అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని! పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

*అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి  శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

*అందునా పొలం పనులు, కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

*ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.```


*3). మూడవది మెడలో మంగళసూత్రం..!*
```
*దీని చివరున్న  బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.

*అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు… మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని!  మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

*ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది.

*ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.```


*4). ఇక నాల్గవది తలలో పూవులు..*```

*వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయికసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.```


*5). ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..*```

*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్, పసుపు కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

*ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

*ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కుపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
 237 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 25

కృతం దేహే న కర్మేదం న మాయా  శుద్దరూపిణా|
ఇతి చింతానురోధీ యః కురువన్నపి కరోతి న||

చైతన్యమయమైన ఆత్మౄ తన్నుతాను గుర్తిస్తూ తనలో సంస్కారానుగుణంగా కదిలే భావాల వల్ల శరీరము పనిచేస్తున్నదని తానేమి చేయడం లేదని తెలుసుకున్న జ్ఞాని కర్మలను ఆచరిస్తున్న చేయనట్లే.

కర్మ అనగానే కేవలము శరీర అవయవాల కదలిక మాత్రమే కాదు. ఆ కర్మను నిర్ణయించే బుద్ధి అహంకారం ఉన్నప్పుడు మాత్రమే కర్మ జరుగుతుంది. గాఢ నిద్రలో నీ గురువును కాలితో తన్నినా సరే అది నీ పనిగా గుర్తింపబడదు. చిన్నపిల్లల పనులకు కూడా వారిని కర్తగా భావించి నిందించము. బుద్ధిలో కదలిన భావాల అనుగుణంగా అహంకారంతో గుర్తిస్తూ చేసిన పనులు మాత్రమే మన కర్మలుగా గుర్తింపబడుతాయి.

జీవన్ముక్తుడు కూడా సదా ఆత్మ జాగృతుడు అయి ఉండటముతో అతని మనశ్శరీరాలు వాసనానుగుణంగా పనిచేయటాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. సముద్రంలోని అలల వలె అతనిలోనే భావాలు కదులుతూ ఉండడానికి అతడే ఆధారమైన, అతని దృష్టిలో రెండవది ఏది లేనేలేదు .గుర్తించే అహంకారం లేకపోవడంతో కర్మ ఫలాన్ని స్వీకరించే వారు కూడా ఉండరు. కాబట్టి అష్టావక్రమహర్షి "కురువన్నపి కరోతి న"... అతడు పనిచేసిన చేయనట్లే అని అంటున్నారు.

భగవద్గీత అంతటా ఇదే భావము నిమిడీకృతమై ఉంది. ఉపనిషత్తులన్నీ ఇదే భావాన్ని దృఢంగా చెబుతున్నాయి. మనదేశంలో మహర్షులు మహాత్ములు అన్ని కాలాలలోనూ ఈ సత్యాన్ని అనుభవ సహితంగా అనేక విధాల అందించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనినే జీవన్ముక్తిగా వర్ణిస్తున్నారు.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(233వ రోజు):--
       ఈ మొదటి పర్యటనలో 'ఆధ్యా త్మిక జీవనం ఎందుకు?' అనే విష యంపై ఒకటి రెండురోజుల ఉపన్యా సాల ద్వారా వేదాంతభావనలను స్వామీజీ శ్రోతలకు పరిచయం చేశా రు. స్వామీజీతో భారతదేశంలో పరి చయమున్న వ్యక్తులు కొందరు ఈ ఉపన్యాసాలకు కావలసిన ఏర్పాట్ల న్నీ చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆసియా సొసైటీ, లాసేంజలిస్ లోని వేదాంతసొసైటీ వంటి సభల్లో స్వామీజీ ప్రసంగించారు. 
       అమెరికన్ యువకుల గురించి తెలుసుకోవాలని ఆయనకు చాలా కుతూహలం ఉండేది. వారి సంస్కృ తి ఎటువంటిదో, యువకులు ఆ రోజుల్లో వారి తల్లిదండ్రులు నేర్పిన మంచి విలువలను ఎందుకు విస్మరి స్తున్నారో తెలుసుకోవాలనుండేది ఆయనకు. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో హిప్పీలు తార్లాడే హెయితాష్బరీ, గోల్డెన్ గేట్ పార్క్ మొదలైన చోట్లకు వెళ్లి చూచారు. కొంతమంది జనం పోగైనపుడు, ఆయనను ఏవైనా ప్రశ్న లడిగితే వాటినిగురించి సవివ రంగా చర్చించేవారు. ప్రశ్నలేవీ లేక పొతే తనే అడిగేవారు- జీవితంపై వారి వైఖరి, వారి ఆశయాలు, స్వప్నాలు మొదలైన వాటిగురించి. అమెరికన్లు ఎలా ప్రవర్తిస్తారో చూడ టానికి ఒకసారి రహస్యంగా ఒక బార్ వెనుక నిలబడి, అక్కడ జరిగే దాన్నం తటినీ గమనించారు. 
        ప్రస్నోత్తరాల సమయంలో అమెరికన్లు కూడా భారతీయులు భారతదేశంలో అడిగే ప్రశ్నలవంటివే అడిగేవారు : "దేవుడు ప్రపంచాన్నెం దుకు సృష్టించాడు?", "దేవుని అను గ్రహం అంటే ఏమిటి?", "యోగనిద్ర కూ, ఆత్మ సాక్షాత్కారానికీ తేడా ఏమి టి?". కాని, ఒకప్రశ్న మాత్రం కొత్తదే - "అమెరికాలో యువజనులకు క్రైస్తవ మతం ఆశాభంగం కలిగించిందని మీరు ఎందుకనుకుంటున్నారు?" ఆయన సమాధానం : 
       ఇక్కడి యువతను సంతృప్తి పరచడంలో క్రైస్తవమతం విఫల మైనదనే మాట నిజమే. వారి మతం లో వారికి అవసరమైనదేదో లేదని వారికనిపిస్తోంది. ఈవిషయం వాళ్ళందరూ సూటిగానూ, బాహాటంగానూ చెప్తారు. దానివల్ల సహజంగానే, వాళ్లంతా తూర్పు దేశాల వేదాంతాన్ని అర్థంచేసు కోటానికి ప్రయత్నిస్తున్నారు, దానిలో తమకు పనికొచ్చేదేమైనా ఉందేమోనని. ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా చేస్తున్నారనే చెప్పాలి. చాలా అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో ఈనాడు భారతదేశపు, ఇతర ఆసియా దేశాల మతాలను బోధించే విభాగాలున్నాయి.
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 saralae 🌺
 5️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  


*72. ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ నైనాం ప్రాప్య విముహ్యతిl*
 *స్థిత్వా2స్యా మన్తకాలే2పి బ్రహ్మనిర్వాణమృచ్ఛతిll*

ఓ పార్థా! దీనినే బ్రాహ్మీస్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన వాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలములో కూడా ఈ బ్రాహ్మీస్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని పరమ శాంతిని పొందుతాడు.

స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీస్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒక రోజు ఉండి మరురోజు పోయేది కాదు. మరణించే దాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు. ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కాని కొంత మంది జీవితంఅంతా ప్రాపంచికసుఖాలతో గడిపి, అంత్యకాలంలో భగవంతుని సేవించి, బ్రాహ్మీస్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసము చేత గానీ ఈ బ్రాహ్మీస్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలము సమీపించినపుడు లేక 60 దాటాక చూచుకుందాములే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణము నుండి ప్రతి వాడూ ఈ బ్రాహ్మీస్థితి లక్షణములను పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి.

వేదాంత జ్ఞానము చేత ఎటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిందో దానినే బ్రాహ్మీస్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటారు. నది సముద్రములో కలిస్తే ఇంక నది ఉండదు. సముద్రమే ఉంటుంది. పాలలో నీళ్లు పోస్తే అవి పాలు అవుతాయి నీళ్లు కనిపించవు. అలాగే ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడైతే అతడు బ్రాహ్మీస్థితిని పొందుతాడు. అతనిలో ఉన్న అవలక్షణాలు మచ్చుకైనా కనపడవు. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన తరువాత ఎవరూ మోహములో పడరు. కోరికలు ఉండవు. ఏదీ కావాలని కోరుకోడు. ఇది నాది అది నీది అనే భ్రమలో పడడు. ఈ ప్రపంచం అంతా నాటకం. అందులో నేను ఒక పాత్రను అని నటిస్తాడు కానీ అందులో లీనం కాడు. చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాము. పెద్ద అయిన తరువాత బొమ్మల మొహం కూడా చూడము. ఎందుకంటే మన స్థితి మారిపోయింది. చిన్నప్పుడు మనకు బొమ్మల మీద ఆసక్తి ఉంటుంది. పెద్ద అయిన తరువాత ఆ ఆసక్తి ఉండదు. అలాగే బ్రాహ్మీస్థితిని చేరుకున్న తరువాత సాధకుడు నిశ్చలంగా ఉంటాడు. ఎవరైతే జీవిత కాలంలో ఈ బ్రాహ్మీస్థితి చేరుకున్నాడో, అతడు బ్రహ్మానందమును పొందుతాడు. జననమరణ చక్రము నుండి విముక్తి పొందుతాడు. అతడే జీవన్ముక్తుడు. తుదకు పరమాత్మలో ఐక్యం అవుతాడు.

దీనితో రెండు అధ్యాయాలుపూర్తి అయ్యాయి. ఇప్పుడు ఒక సారి సింహావలోకనం చేసుకుందాము. సంజయుడు ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర యుద్ధ విశేషాలు చెబుతున్నాడు. దృతరాష్ట్రుడు సంజయునితో, యుద్ధమునకు సన్నద్ధము అయిన నా వాళ్లు, పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి చేస్తున్నారు అని అడగడంతో భగవద్గీత మొదలవుతుంది. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. ముందు సుయోధనుడు ద్రోణుని వద్దకు పోయి ఇరుపక్షముల వీరులను పరిచయం చేసాడు. అపుడు భీష్ముడు, అతని పక్షమువారు, కృష్ణార్జునులు అతని పక్షమువారు శంఖములు పూరించుకున్నారు. అర్జునుడు తన రథ సారధి అయిన కృష్ణునితో రథమును ఇరు పక్షముల మధ్యలో నిలబెట్ట మన్నాడు. కృష్ణుడు రథమును ఇరుసైన్యముల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు తన పక్షము వారిని, ఎదుటి పక్షములో ఉన్న తాత భీష్ముడు, గురువు ద్రోణకృపాచార్యులను, అశ్వత్థామను తన సోదరులను, బంధుమిత్రులను చూచాడు. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. చేతులు వణికాయి. అవయవములు పట్టుతప్పాయి. నోరు ఎండిపోయంది. శరీరం గగుర్పాటు చెందింది. గాండీవము చేతులో నుండి జారి పోయింది. రథం మీద నిలబడలేకపోయాడు.

అప్పుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "కృష్ణా! ఈ యుద్ధములో నా బంధువులను గురువులను మిత్రులను చంపడం నాకు ఇష్టం లేదు. నాకు ఈ రాజ్యము, విజయము అక్కరలేదు. వీరందరినీ చంపి నేను సుఖములను ఎలా అనుభవించాలి. కాబట్టి నాకు మూడు లోకముల ఆధిపత్యము వచ్చినా సరే ఈ యుద్ధము చేయను. వీరందరూ ఆతతాయలు దుర్మార్గులు అయినా సరే వీళ్లను చంపి నేను పాపం మూటకట్టుకోలేను. వీళ్లందరూ మరణిస్తే వీళ్ల కులములలో మగాళ్లు ఉండరు. అప్పుడు వర్ణసంకరం జరగడానికి అవకాశం ఉంది. వర్ణసంకరం జరిగితే వీళ్ల పితృదేవతలకు పిండప్రదానము చేసేవారు ఉండరు. ఆ విధంగా సనాతన ధర్మములు, కుల ధర్మములు నాశనమైపోతాయి. అటువంటివారికి నరకం వస్తుంది. శాస్త్ర పరిజ్ఞానము కలిగిన నేను ఈ ఘోరానికి పాల్పడలేను. అందుకని నేను అస్త్రసన్యాసము చేస్తాను. వీళ్లు నన్ను చంపినా సరే నాకు క్షేమమే అవుతుంది." అని ధనుర్బాణములను రథం మీదపెట్టి చతికిల పడ్డాడు.

కళ్లతో నీళ్లతో కరుణతో కూడిన హృదయంతో, శోకిస్తున్న అర్జునుని చూచి కృష్ణుడు జాలి పడి ఇలా అన్నాడు. "అర్జునా నీవు మహా వీరుడవు. అత్యుత్తమ ధనార్ధారివి. నీకు ఈ పిరికితనము, నపుంసకత్వము ఎక్కడి నుండి దాపురించాయి. ఇది నీకు ఉచితము కాదు. కాబట్టి ఈ దుర్బలత్వము వదిలి యుద్ధం చేయి" అని అన్నాడు.

అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు. "కృష్ణా! ఎదురుగా ఎవరున్నారో చూచావా! మా తాత భీష్ముడు, విద్య నేర్పిన గురువులు, గురు పుత్రులు, సోదరులు, మేనమామలు, బంధువులు, మిత్రులు వీరిని నేను ఎలా చంపగలను అని అనుకుంటున్నావు. వీళ్లను చంపి రాజభోగాలు అనుభవించడం కంటే అడుక్కుతినడం మేలు. ఈ నెత్తురు కూడు నేను తినలేను. అయినా ఈ యుద్ధంలో జయాపజయములుఎవరిని వరిస్తాయో ఎవరికి తెలుసు. వాళ్లే జయంచవచ్చు. మనమే జయించవచ్చు. ఈమాత్రం దానికి ఇంతమందిని చంపాలా! అయినా కృష్ణా! నా మనసు వ్యాకులమై ఉంది. ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, తెలియడం లేదు. కాబట్టి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి, నాకు కర్తవ్యమును ఉపదేశించు." అని ప్రార్థించాడు.

అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు. "అర్జునా! ఎవరి కోసరం శోకించడం తగదో వారి గురించి శోకిస్తున్నావు. పైగా బాగా తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. పండితులు అయిన వారు చచ్చిన వారి గురించి కానీ, చావబోయే వారి గురించి గానీ చింతించరు. నువ్వు నేను వీరందరూ ఇది వరకూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ముందు కూడా ఉంటారు. మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరములలో బాల్య, యౌవన, వృద్ధాప్యములు ఎంత సహజమో మరణమూ అంతే సహజం. శరీరం మరణిస్తుంది కానీ అత్మకాదు. ఆత్మ శాశ్వతము. ఈ శరీరము ప్రాపంచిక విషయములతో సంయోగం పెట్టుకొనడం వలన సుఖదుఃఖములు కలుగుతున్నాయి. జ్ఞాని అయిన వాడు సుఖదుఃఖములను సమానంగా చూస్తాడు. వాడేమోక్షమును పొందుతాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P137
 *Mahavatar Foundation Welcomes all masters to Join this most Powerful tranformative Brahma Muhurta Meditation Program on Everyday*
బ్రహ్మ ముహూర్త ధ్యానం
பிரம்ம முகூர்த்த தியானம்
ప్రపంచ ఆరోగ్య ధ్యానం 
ब्रह्म मुहूर्त ध्यान
Brahma Muhurta Meditation
*Day #93*
*Date:* October 1st, 2025 (Wednesday)
 Time : 3 AM to 4.30 AM (IST)
*Details: 45mnts Music Meditation + 45mnts silent Meditation*

*Join Everyday with ZOOM link👇*
https://us06web.zoom.us/j/9036216555?pwd=N2lmMXNFVlFrdlFlTGNSQ0RTRTVXdz09
*Meeting ID:* 9036216555
*Passcode:* Dhyana (D-capital letter)
*For more details* 9008532066
Mahavatar Foundation.
Bangalore.
 [9/30, 15:25] +91 99597 98384: *_పదిమంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా_*
        *_ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు._*......
*****************
 *కోపంతో ఒక దెబ్బ కొట్టినా  కొన్నాళ్లకు మర్చిపోతాం ......  కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే , దాని వల్ల బాధపడ మనసు కొన్నాళ్లకు మనుషులని నమ్మడమే మానేస్తుంది* ........


[9/30, 15:27] +91 99597 98384: *Objects in the mirror are closer than they appear.* 

*Problems are smaller than they appear, when you begin to face them.* 

Happy Tuesday - Bhoumavasare


శుభోదయం  -  सूषा      

May it be so good a morning  that I will worship God.

Wednesday, 10 September 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(214వ రోజు):--
      వ్యక్తి తన జీవనాన్నీ, తన వైఖరి నీ మెరుగుపరచుకోవటమే అన్నిటి కన్న ముఖ్యమైన విషయమని స్వామీజీ పదేపదే నొక్కిచెప్పారు. చిన్మయమిషన్ 10 వ వార్షికోత్సవ సందర్భంలో మద్రాసులో ప్రసంగి స్తూ,శ్రోతలను ఇలా హెచ్చరించారు:
       రోజురోజుకూ మీ వైఖరిలో మార్పువస్తే తప్ప, ఇతరులు మీ భావాలను అంగీకరించరు. మీలో మార్పు కలిగిందని గమనిస్తే, "ఇంత మార్పు ఎలా వచ్చింది ?" అని అడగ టం మొదలుపెడతారు, సహజంగా. అప్పుడు మీ ఆలోచనలు కొన్నిటిని వారికి చెప్పండి. వారిమీద ఉపనిష త్తుల వాన కురిపించవద్దు. మీరు సరిగా జీర్ణంచేసుకొన్న భావాలనే వారికి వినిపించండి. బకెట్లకొద్దీ త్రాగ టానికి వాళ్ళేమీ ఏనుగులు కాదు. 
       యజ్ఞానికి వస్తున్నారా లేదా, పఠనసమావేశాలకు వస్తున్నారా లేదా అని ఇతరుల గురించి విచారిం చడానికి ముందు - మనం ప్రతి ఏడా ది మనలో ఏం అభివృద్ధి జరిగిందో నిర్ధారించుకోవాలి. ఈ పదేళ్లలో మనం సాధించినదేమిటి? మీరు , నేను ఎంత అభివృద్ధి చెందామన్నదే ఇప్పుడు మనం సమీక్షించుకోవాల్సి న విషయం. 
       ఐదేళ్లలో నరేంద్రుడనే సామాన్య వ్యక్తి వివేకానందుడయ్యాడు. పోనీ, మీరు వివేకులైనా కాగలిగారా? (ఏది సత్యమో, ఎదసత్యమో తెలుసుకొనే సామర్థ్యాన్ని వివేకం అంటారు).
        1964లో 3వ జాతీయ చిన్మయ మిషన్ సమావేశాలు నిర్వహించే నాటికి దేశమంతటా 100 కు పైగా కేంద్రాలున్నాయి పఠనబృందాలను, బాలవిహార్లను, వనితాబృందాలనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తూ. ఇవేకాకుండా, జాతీయ మహాసభలూ, ఆధ్యాత్మికతీర్థయాత్ర లూ, మరిన్ని పట్టణాల్లో యజ్ఞకార్య క్రమాలూ, పాఠశాలలను స్థాపించే పథకాలూ, విద్యార్థులనూ,ఉపాధ్యా యులనూ సంఘటితపరిచే కార్యక్ర మాలూ .. వీటన్నిటినీ క్రమబద్దంగా నిర్వహించడానికి సంస్థకు ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని ఆ సమావే శానికి వచ్చిన ప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. అటువంటి కార్యాలయం మిషన్ కేంద్రాలన్నిటికీ ఉన్నతాధికారిగా ఉండకూడదనీ, విస్తృతమైన చిన్మయకుటుంబానికి అది వారధిగా ఉండి, అన్ని సంఘా లూ కలిసిమెలిసి పనిచేయటానికి తోడ్పడాలనీ స్వామీజీ సూచించారు. వివిధ ప్రదేశాల్లో ఉన్న కేంద్రాలన్నీ వాటి స్వతంత్రప్రతిపత్తి కోల్పోకుండా సంస్థకు వెన్నెముకగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
        తరగతులనూ, సమావేశాలనూ జరపటానికీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించటానికీ అవసరమైన స్థలాన్ని అద్దెకు తీసుకోటానికి అవ సరమైన సహాయం చాలా కేంద్రాల్లో ధనవంతులైన భక్తులు అందించే వారు. మరికొన్ని పట్టణాల్లో సభ్యుల ఉత్సాహానికి లోటులేనప్పటికీ, అవ సరమైన ఆర్థికవనరులు సమకూడే వి కావు. శ్రద్ధ, లక్ష్యం వారికున్న నిజ మైన మూలధనమని స్వామీజీ గుర్తు చేసేవారు. "ఈవనరులను మీరు దైవకార్యానికి సవ్యంగా వినియోగిం చ గలిగితే, లక్ష్మీకటాక్షం తప్పక సిద్ది స్తుంది ; ఆమె దేవుని వెనువెంటనే ఉంటుంది కదా" అనేవారాయన. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺
 3️⃣3️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్య విపశ్చిత:|*
 *వేదవాదరతా: పార్థ నాన్యదస్తీతి వాదిన:ll*

*43. కామాత్మాన: స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్l* 
 *క్రియావిశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతిll*

*44. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా2పమృతచేతసామ్l*
 *వ్యవసాయాత్మికా బుద్ధిస్సమాధౌ న విధీయతేll*

ఓ అర్జునా! వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతుంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపై అర్ధములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి. వేదములలో చెప్పబడిన విషయముల యొక్క అంతరార్థముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖములకు మించిన సుఖము లేదనీ అనుకుంటూ ఉంటారు. అవే కాకుండా, ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములలో చెప్పబడ్డాయి అని ప్రచారం చేస్తారు. తియ్యగా ప్రవచనాలు చేస్తారు. ఈ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లప్పుడు స్వర్గసుఖముల మీద, ఈ లోకంలో లభించే భోగముల మీదా, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. వారి బుద్ధులు పరమాత్మయందు నిశ్చయంగా లగ్నం కావు. వారి బుద్ధికూడా స్థిరంగా ఉండదు.

ఈ శ్లోకములలో పుష్పితాం వాచం అంటే అందమైన పూల వంటి మాటలు. ఈ పూలు ఫలములుగా రూపొందవు. అలాగే ఈ మాటలు కూడా ఫలప్రదములు కావు. ఇటువంటి అందమైన తీయటి మాటలను, వేదములను సరిగా, లోతుగా అర్ధం చేసుకోని వారు పలుకుతుంటారు. పైపై అర్థములను మాత్రమే చెబుతుంటారు. ఇటువంటి మాటలను అవిపశ్చిత: అంటే అజ్ఞానులు, తెలివి లేని వారు నమ్ముతుంటారు. ఎందుకంటే వారికి కోరికలు ఎక్కువ. ఆ కోరికలు తీరడానికే కర్మలు చేస్తుంటారు. స్వర్గంలో లభించే సుఖముల కోసం వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములు చేస్తుంటారు. అటువంటి వారు ఎంతటి పండితుడైనా, వేదములు అధ్యయనం చేసిన వాడైనా, ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాడు అవివేకి కిందనే పరిగణింపబడతాడు. అటువంటి వారి గురించి ఈ శ్లోకాలు చెప్పాడు పరమాత్మ

వేదవాదరతా: అంటే వేదములలో చెప్పబడిన విషయముల గురించి కొంతమంది వాదోపవాదములు చేస్తుంటారు. ఈ యాగం చేస్తే స్వర్గంలో ఈ ఫలం కలుగుతుంది అని ప్రచారం చేస్తుంటారు. వేదములలో యజ్ఞయాగములు గురించే కాదు. నిరాకారుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకోడానికి ఎన్నోమార్గాలు ఉన్నాయి. ఈ వేద పండితులు వాటి గురించి చెప్పరు. కేవలం సుఖాలు ఇచ్చే వాటి గురించే చెబుతుంటారు.

వేదములలో మూడు విభాగాలు ఉన్నాయి. 1. కర్మకాండ 2, ఉపాసనా కాండ 3. జ్ఞాన కాండ. ఈ వేదముల గురించి వాదించే వాళ్లు మొదటిది అయిన కర్మకాండల దగ్గరే ఆగిపోతారు. ఇటువంటి వారిని కామాత్మాన: అంటే కోరికలే పరమావధిగా కలవారు అని అనవచ్చు. వీరికి తన భార్య పిల్లలు, బంధువులు, తన ధనము, ఆస్తి, ఇల్లు తన సుఖం, తనవారి సుఖం ఇవే వారికి కావాల్సింది. వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించే ఆలోచిస్తారు కానీ, భగవంతుని గురించి శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు.

స్వర్గపరా: అంటే వీరంతా తాము మరణించిన తరువాత స్వర్గానికి పోతామని అనుకుంటారు. ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గమునకు ఎటువంటి విలువలేదు. పరమాత్మను చేరుకోవడమే మానవుల అంతిమ లక్ష్యము. అవివేకుల దృష్టిలో స్వర్గసుఖములే వారికి మోక్షముతో సమానము కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావడమే అంతిమ లక్ష్యం. కేవలం తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ లోక సంపదలు, స్వర్గసుఖాలు శాశ్వతం కావు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానము.

తరువాత జన్మ కర్మ ఫలప్రదామ్ అని అన్నారు. అంటే కోరికలతో కూడిన కర్మలు మోక్షమును ఇవ్వలేవు పైగా బంధనములను కలుగజేస్తాయి. జనన మరణ చక్రంలో పడేస్తాయి. కాబట్టి కోరికలతో చేసే కర్మల కన్నా నిష్కామంగా చేసే కర్మలే ముఖ్యము.

క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి అంటే స్వర్గంలో లభించే భోగముల గురించి, ఈ లోకంలో లభించే ఐశ్వర్యముల గురించి ఎన్నో కర్మలు చేస్తుంటారు. కర్మకాండలు చేయడంలో తమ జీవితం అంతా వృధా చేసుకుంటారు. కాని వారికి దక్కేది తాత్కాలికసుఖమే కాని శాశ్వత సుఖం కాదు. తయా2పహృతచేతసామ్ అంటే వేద పండితులు, తాము జ్ఞానులము అనుకొనే వాళ్లు చెప్పే ఈ తియ్యటి మాటలకు మానవుల మనసులు ఆకర్షింపబడుతున్నాయి. అటువైపు లాగబడుతున్నాయి. ఆ మాటలు విని సామాన్యజనులు మోసపోతున్నారు. కర్మకాండలవైపు మళ్లుతున్నారు. శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించడం లేదు. అటువంటి మాటలను వినవద్దని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P93
 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏💐

శ్రీ భగవాన్ రమణ మహర్షి బోధించిన నేనెవరు ఆత్మ విచారణా  జ్ఞాన మార్గాన్ని మనకు అందించడానికి  వచ్చిన వారిలో ..

శ్రీ నాన్నగారు( జున్నూరు) శివైక్యం చెందారు 

శ్రీ మౌన రమణ స్వామి (వేల్పూరు)

శ్రీ విసుజి (రమణ స్వామి),విజయనగరం

శ్రీ సుబ్రహ్మణ్యం గారు (శ్రీకాళహస్తి)

శ్రీ వివి బ్రహ్మం గారు(తాడిపత్రి)

శ్రీ దక్షిణామూర్తి గారు (హైదరాబాద్)

ఇటువంటి  మహానుభావులు( నాకు తెలిసిన వారు, వారిని దర్శించిన అనుగ్రహంతో చెబుతున్నా)తెలుగు నేలపై నడయాడుతున్నారు..

వీరంతా ఆత్మజ్ఞానం పొందినవారు. జ్ఞానాన్ని ప్రసాదించేవారు..

ఇటువంటి  గురువులు చెప్పే ప్రతి మాట మీలోని "నేను" ని స్పృశిస్తూ సత్యం వైపు నడిపిస్తారు.

ఓం శ్రీ గురుభ్యోనమః🙏💐
 నమో రమణ 

  అరుణాచల సాధువుల సాంగత్యం : వివరణ 

   సాధువుల మధ్య సాధన, అహంకారము..... ఇలాంటి మాటలు మధ్య కొంత సంభాషణ జరిగింది. అది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయగలము......

  "ఏ మంచి పని అయినా అహంకారం లేకుండానే చేయాలి" అని రమణ మహర్షి సెలవిస్తే, "అహంకారంతో చేసిన మంచి పని కూడా బంధాన్ని కలిగిస్తుంది" అని శ్రీరామకృష్ణులు సెలవిచ్చారు కదా! 

   ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం :
  ఒక 5 సంవత్సరాల పాప రమణాశ్రమం వచ్చింది. సోఫాలో ఉన్న మహర్షి ఆ పాపను చూసి "అరే మాతృశ్రీ గారు వచ్చారే!" అని సెలవిచ్చారు అంట. ఆ పాపే కాలాంతరంలో "మాతృశ్రీ జిల్లెల మూడి అమ్మగా" గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో {జిల్లెళ్ళమూడి} ఎంతో ప్రసిద్ధి చెందారు కదా! "సాధన" అంటే "చేయించబడేది" అని మాతృశ్రీ గారు అంటూ ఉంటారు కదా! 

  సాధన విషయంలో మాతృశ్రీ గారి భావన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? అని ఇక్కడ సాధువులు అంటూ ఉంటారు. 

  ఇక్కడ ఒక విషయం చూద్దాం :
  దైవానుగ్రహముతో 2009లో రమణాశ్రమం రావడం జరిగింది నేను. మా ఇంట్లో ఉన్న పరిస్థితి కారణంగా ఒక ఆరు నెలలు మాత్రమే ఉండి పోదామని వచ్చాను. ఈ ఆరు నెలలు అనుకున్నది కాస్త 16 సంవత్సరాల అయిపోయింది ఇప్పుడు. ఈ 16 సంవత్సరాల రమణాశ్రమ సాధనలో అంచెలంచెలుగా ఈశ్వరుడు, నన్ను ముందుకు నడిపించాడు అని చెప్పవచ్చు. 

  మొదటి ఆరు నెలలు ఎక్కువగా ఒక రోజుకి రెండు అరుణగిరి ప్రదక్షిణాలు చొప్పున సాగడం.. గుడుల పంచన, రోడ్డు పక్కన, రమణాశ్రమ భిక్షాన్నముతో జీవించడం .... తర్వాత మూడు నాలుగు సంవత్సరాలపాటు కాస్త ఉపనిషత్తులతోపాటు(వేదం) ఎక్కువగా ఒక రోజుకి రెండు ప్రదక్షిణాలు ... ఆ కాలంలో రమణాశ్రమ గ్రంథాలయాన్ని విరివిగా ఉపయోగించుకోవడం... 

   మొదటి ఐదు సంవత్సరాల తర్వాత అనుకోకుండా కాలునొప్పి కారణంగా నడక ద్వారా ప్రదక్షిణ చేయలేని స్థితిలో ఆధ్యాత్మిక పేపర్లు వ్రాసి భక్తులకు చేరవేయడం.... ఆ తరువాత కాలంలో ఏకాదశ రుద్రం.... రుద్ర నమక గణ పారాయణం..... ఇట్లా ఎక్కడా ఆపకుండా ఈశ్వరుడు సాధన చేయిస్తూనే ఉన్నాడు అని చెప్పవచ్చు..... మా ఇంట్లో వారు మొదటి నుంచి మనం ఇక్కడ ఉండటానికి వారి అనుగ్రహమే అని చెప్పవచ్చు... ఇదే ఈశ్వరుని యొక్క అపార కరుణకు నిదర్శనం. "తల్లి తండ్రి సంతోషపడనిదే ఏ ఆధ్యాత్మిక సాధన కూడా ముందుకు సాగదు" అని శ్రీరామకృష్ణులు అంటూ ఉంటారు కదా! 

  ఇక్కడ ఒక విశేషం ఏమంటే; ఈశ్వరుడు తన అనుగ్రహాన్ని మా ఇంట్లో వారి మీద కురిపించాడు అని చెప్పవచ్చు! లేకపోతే ఇక్కడ మన సాధన సరిగా సాగేది కాదేమో.......! ఎందుకంటే ఇక్కడ మన కళ్ళముందే సాధన కోసం వచ్చిన ఎంతో మంది యువకులు వెళ్లిపోయారు... వారు వెళ్ళిపోతున్న సమయంలో మనకి కూడా వెన్నులో వణుకు పుట్టేది... కానీ ఈశ్వరానుగ్రహం, మా తల్లిదండ్రుల అనుగ్రహం నన్ను ఇక్కడ నిలబెట్టింది అని చెప్పవచ్చు. 

   ఒక విషయం మనం గమనించాలి : మహర్షి జీవించి ఉన్నప్పుడే మహర్షి ముందే ఎంతో మంది సాధకులు వెళ్లిపోయారు కదా! ఇక మనం ఎంతటి వారం? అహం పైకి లేస్తే వెళ్ళిపోవడమే అని మహర్షి అంటూ ఉంటారు కదా! 

  నమో రమణ
 *🕉️ Day 20 – “మౌనం అంటే ఏమిటి?”*  
*(భగవాన్ రమణ మహర్షి ఉపదేశాల ఆధారంగా)*

---

*❖ ప్రశ్న:*  
*“భగవాన్ గారు, మీరు ఎక్కువగా మాట్లాడరు. మౌనం పాటించడం వల్ల ఏం లాభం?”*

*❖ భగవాన్ సమాధానం:*  
> **“మౌనం అంటే మాటల లేకపోవడం కాదు.  
> అది మనస్సు స్థిమితంగా ఉండే స్థితి.  
> అసలు జ్ఞాన ఉపదేశం మౌనంగా మాత్రమే జరుగుతుంది.”**

---

*➤ మౌనం యొక్క తత్వం:*

- నిజమైన మౌనం అనేది *బాహ్యంగా మాట్లాడకపోవడం* కాదు, *లోపల ఆలోచనలు లేకపోవడం*.  
- మాటల కంటే *మౌనంలో శక్తి ఎక్కువ*.  
- *ఊహల, ఆలోచనల ప్రవాహం* ఆగినపుడే అసలైన మౌనం అనుభవించబడుతుంది.  
- జ్ఞానులు మాట్లాడకుండా బోధించగలరు — *ప్రజ్ఞానంతో నిశ్శబ్దంగా.*  

---

*🧘‍♀️ సాధన సూచన:*

1. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు *నిశ్శబ్దంగా కూర్చోండి* — మాటలు కాదు, ఆలోచనలు కూడా తగ్గించండి.  
2. మౌనంలో ఉండే శాంతిని గమనించండి — అది స్వరూపానికి నడిపే ద్వారం.

---

*🪔 భగవాన్ వాక్యం:*  
> **“మౌనం అన్నదే సత్యమైన ఉపదేశం.  
> అది అంతరాత్మను మేల్కొలిపే శక్తి.”**

---

👉 *Day 21 లో – “స్వాత్మ జ్ఞానం ఎలా పొందాలి?” అనే ప్రశ్నకి భగవాన్ సమాధానం తెలుసుకుందాం.*

*🙏 Arunachala Siva, Arunachala Ramana 🕉️*
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   ఒకరోజు ఒక ఇల్లాలు ఇంటిలో దోసెలు పోస్తున్నది. 'విరిగిన దోసలన్నీ ఈశ్వరుడికి’ అని నవ్వుతూ పనిమీద బయటకి వెళ్ళిపోయాడు భర్త. కొంత సమయం తర్వాత ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాడు. కానీ ఆరోజు అన్ని దోసెలు ముక్కలై వచ్చాయని ఆ ముక్కల్ని చూపింది అతని భార్య. 
      
    ఏం చెయ్యను? అని అతను తన భార్యను ఏమీ అనకుండా మహర్షి దగ్గరికి ముక్కలైన దోసలను తీసుకొనిపోయి మహర్షి ముందు పెట్టాడు. 

   మహర్షి "ఏమిటి అది?" అని అన్నారు. అందుకు అతను ఇంట్లో నా భార్య దోసెలు చేస్తూ వుంటే నవ్వులాటకి మాణిక్య వాచకర్(తమిళ మహనీయుడు) కథలో చెప్పిన విధంగా "విరిగినవన్నీ ఈశ్వరుడికి" అనేసి వచ్చాను. ఒక్క దోస కూడా సరిగా రాలేదు. అన్నీ ముక్కలైపోయాయి. "విరిగిన ముక్కలన్నీ మహర్షివి" గనుక మహర్షికి తీసుకొచ్చాను.

   మహర్షి నవ్వుతూ నాలుగు ముక్కలు తిని, తక్కినవి అక్కడున్న భక్తులకు పంచి పెట్టించారు.
 217 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 5 

న దూరం న చ సంకోచాతై 
లబ్దమేవాత్మనః పదమ్|
నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం||

కేవలమూ, అప్రయత్నము, పరిణామరహితము, నిష్కలంకము అయిన ఆత్మ ఎక్కడో దూరంగా అందరినిగా లేదు. దీనికి పరిమితులు లేవు, అసాధ్యము కాదు ,ఇది నిత్యసిద్ధమైనది.

శుద్ధ చైతన్యం స్వభావతః నిష్కలంకమైనది. ఇందులో ఏ విధమైన కోరికలు భావాలు వాసనలు లేవు. ఇంద్రియాలతో ప్రపంచాన్ని గుర్తించటం మనసులోని ఉద్రేకాలు బుద్ధిలోని ఆలోచనలు కూడా శ్రమతో కూడినవి, కాబట్టి ఈ ఉపాధులతో పని చేయడానికి ప్రయత్నం కావాలి. ఆత్మ ఇక్కడ నిరాయాసంగా వర్ణించబడింది. ఉపాధులైన మనశ్శరీరాలను అధిగమించి అహంకారం అంతరంగంలో లయమయి సత్య ద్రష్టగా సత్యంగా జాగ్రత అయినప్పుడు ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇందుకు ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. ఈ మహోన్నత స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి ఇది మనకు దూరంగా లేదు. ఈ స్థితి మన సహజ స్వరూపమే కాబట్టి సాధించవలసిన పనిలేదు. ఇది నిత్య సిద్ధమే. 

పరిమితమైన మన ఉపాధులతో మనము సాధించగలిగినది కూడా పరిమితమే. ఆత్మ అనంతమైనది కాబట్టి అది అపరిమితమైనది కూడా. కాబట్టే ఇది అసాధ్యము. మనలో ఉండే నిజమైన నేను ఇదే. సత్ గా సంతతము ఉంటూ చిత్తుగా తెలుసుకుంటున్నది ఇదే, అందుచేత ఇది మన నుండి ఎప్పుడూ దూరము కాదు. అదే నేను. ఇది నిత్య సిద్ధంగా ఉండనే ఉంది. అయితే మన భ్రమా జ్ఞానము వల్ల ఈ ఆత్మసాన్నిద్యాన్ని తెలుసుకోలేక పోతున్నాము.

ముండ కోపనిషత్తులో మహర్షి మేఘ గంభీర గర్జన రావమ్మతో ఇలా అంటున్నారు.

దూర తమమైన దానికంటే సుదూరమైనది, ఇక్కడే ఈ శరీరంలోనే ఉంది. యోగి తన జీవితంలో తన హృదయములోనే దీనిని దర్శించగలడు.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(213వ రోజు):--
        ఉపదేశాలూ, ఉదాహరణలూ ఒకదాని కొకటి తోడు కావాలి. విద్యా ర్థులు తమ అధ్యాపకుని స్నేహితుని గా, మార్గదర్శకునిగా, జీవనరహస్యా లు తెలిసిన జ్ఞానిగా చూడగలగాలి. పిల్లలు తాము విన్నదానికంటే చూచి నదానివల్లనే ఏదైనా విషయాన్ని సులభంగా గ్రహించగలుగుతారు. అందుచేత ఉపాధ్యాయునిలో శ్రద్ద, నిష్కపటత్వం చాలా అవసరం. ఈ కారణంచేతనే ప్రాచీన భారతదేశం లో విద్యనేర్పే బాధ్యత పరిపూర్ణమైన ధార్మికజీవనం గడిపేవారికే అప్పగిం చబడింది. శిష్యుల నడవడిని సరైన రీతిలో మలచటానికే అటువంటి వ్యక్తులు తమ జీవితాన్నంతనూ అంకితం చేశేవారు. 
       నైతికవర్తనంతో మెలుగుతూ ఆదర్శప్రాయమైన అధ్యాపకులుగా అందరిచేతా గుర్తింపు పొందేవిధం గా ప్రవర్తించాలనే ప్రోత్సాహవచనం తో స్వామీజీ తన ఉపన్యాసాన్ని ముగించారు. తర్వాతివారంరోజులూ పురాణాలూ, రామాయణం, భాగవ తం వంటి ఇతిహాసాలూ, గొప్పగొప్ప మహర్షుల జీవనచరితాలూ, వాటి భావార్థాలూ వివరించటం జరిగింది. పురాణగాథలు పిల్లలనైతికవర్తనాని కి ఆదర్శప్రాయంగా ఉండటం మాత్ర మే కాక, వాటిలో ఉపనిషత్తుల మూలసత్యాలు కూడా ఉంటాయి. 'అహం' తత్వపు లౌకికకాంక్షల నధి గమించి దివ్యత్వాన్ని చూరగొంటానికి శ్రమించే మానవుని క్లిష్టమైన వ్యక్తిత్వ పు వివిధ అంశాలకు ఈగాథల్లోని వివిధపాత్రలు ఏ విధంగా చిహ్నా లౌతాయో తెలుసుకున్నారు ఉపా ధ్యాయులందరూ. శివుడూ,గణేశు డు, పార్వతి వంటి పిల్లలందరికీ తెలిసిన దేవతల గురించిన లోతైన, ఆధ్యాత్మిక పరమైన అంతరార్థం వివరించబడింది. 
         ఆత్మవికాసం చాలా నిదానం గా జరిగే ప్రక్రియ అని అందరికీ గుర్తు చేస్తూ స్వామీజీ రెండవవారపు ఉప న్యాస కార్యక్రమాన్ని ముగించారు. విద్యార్థులకు ధార్మికవిద్యనేర్పే ప్రయ త్నాలు వెంటనే ఫలితాలనీయవనీ, వారి వైఖరి వెంటనే మారకపోవచ్చ నీ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి కాని, విత్తనాలు నాటడం జరిగితే, అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. నాలుగు సంవత్సరాల కాలేజీచదు వులో విద్యార్థులు విలాసజీవితాన్ని చవిచూచినా, తర్వాత వృత్తిలో కష్టా ల్నీ, స్పర్థలని ఎదుర్కొంటున్నపుడు, తాము ఇదివరలో నేర్చుకొన్న విష యాలను గుర్తుకు తెచ్చుకొని, వాటి నుంచి సహాయం పొందవచ్చు. చిన్నతనంలోనే మనసులో వ్రేళ్లూ నిన జీవనసూత్రాలు తర్వాతికాలం లో పుష్పించి, వారిని మంచి పౌరు లు గానూ, మంచిమానవులు గానూ చేస్తాయి.
         🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 3️⃣2️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దనl*
 *బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్ll*

ఈ నిష్కామ కర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరి పరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు.

ఆధ్మాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవము మీద నిశ్రయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచి వాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావము ఉండకూడదు. అలాగే నిశ్రయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా, విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవము మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయములను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్లపొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువులమీదికి మనసు పోతుంది. వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణములను భూతద్దంలో నుండి ప్రసరింపజేస్తే, అవి ఏకాగ్రత చెంది దేనినైనా భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణములు విడి విడిగాఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్రబుద్ధి అవసరము.

వ్యవసాయాత్మికా బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం స్థిరంగా ఉంచుకోవడం ఎవరికైనా బుద్ధి స్థిరంగా, నిశ్చయం లేకుండా, చంచలంగా ఉంటే వాడు ఏ పనీ సక్రమంగా చేయలేడు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్రయమైన బుద్ధి అవసరము. అంటే మన మనసును, బుద్ధిని ఏకాగ్రం చేయాలి. చేసే పని మీదనే ఉంచాలి. అటుఇటుపోనివ్వకూడదు. మనం ఏం చెయ్యాలి. ఏం సాధించాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి అని ముందు నిర్ణయించుకోవాలి. తరువాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి. అంతే కానీ ముందు ఏదో ఒక కర్మ మొదలు పెట్టి దాని మీద మనసుపెట్ట కుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరము. అలా కాకుండా ఒక నిశ్చయం, లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరుగెడుతూ ఉంటుంది. ఏ పనిమీదా ధ్యాన ఉండదు. అన్ని పనులు మొదలు పెడతాడు. ఏ పనీ పూర్తిగా చేయడు. తుదకు అభాసుపాలవుతాడు.

ఏ మానవుడికైనా జీవితాశయము ఒకటి ఉండాలి. దానిని బట్టి అతని జీవన విధానము ఉంటుంది. ఉన్నతమైన ఆశయములు కలవారి జీవన విధానము కూడా ఉన్నతంగా ఉంటుంది. అతడు ఉన్నత శిఖరములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా అల్ప బుద్ది కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి. వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి. కొంతమంది ఈ జీవితం అశాశ్వతము, క్షణికము అని దీని గురించి ఆలోచించరు. చచ్చిన తరువాత స్వర్గలోక సుఖముల గురించి ఆలోచిస్తారు. కాని ఆ స్వర్గలోకము కూడా శాశ్వతము కాదు అని వారికి తెలియదు. మరి కొంతమంది ఇవేమీ కాదు మోక్షమే అసలైన పరమ పదము అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గం అనుసరిస్తారు. ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులు కలిగి ఉంటారు.

అందుకని మానవులను రెండు విధములుగా విభజించాడు కృష్ణుడు. వ్యవసాయాత్మికా బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మికా బుద్ధి కలవారు. వ్యవసాయాత్మికా బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏకా భవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. మార్పు చెందదు. స్థిరంగా ఉంటుంది. అవ్యవసాయినామ్ అంటే స్థిరమైన బుద్ది లేని వాళ్లు. వారి బుద్ధి బహుశాఖా అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అనంతంగా ఉంటుంది. అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది. ఏ ఒక్కదాని మీదా బుద్ధినిలువదు. మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే ఎక్కువగా కనపడుతుంటారు. ఏపనీ నిలకడగా చెయ్యరు. పూర్తి చెయ్యరు. ఎవరు ఏది చెబితే దానిని నమ్ముతారు. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాము కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీదా నిలకడగా ఉండదు. దేవుళ్లలో భేద బుద్ధిని కల్పిస్తాడు. ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే దేవుళ్లను మారుస్తుంటాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు. పరమాత్మ ఒక్కడే అని తెలిసినా, దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు. ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తాడు. అటువంటి వారు ఎలా ఉంటారో మనకు రాబోవు శ్లోకాలలో కృష్ణుడు వివరిస్తున్నాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P90
 రమణుల ఉపదేశ సారము
“హృదయ కుహరమధ్యే కేవలం బ్రహ్మ మాత్రం
ఆహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి
హృదివిశ మనసా త్వం చిన్వతా మజ్జతా వా
పవనచలన రోధాదాత్మనిష్ఠో భవ త్వం.”
(హృదయ కోశము నందు అహం స్ఫురణతో కేవల బ్రహ్మము ఆత్మస్వరూపమై భాసించుండును. విచారణచే కాని, మనస్సును హృదయము నందు లీనము చేసికొని కాని, లేదా శ్వాస నియమము చే (మనస్సును నియమించుకొని) కాని, ఆత్మనిష్ఠుడవు కమ్ము.)
ఈ శ్లోకము మహర్షి కృతమే. రమణ మహర్షి శిష్యులలో ఒకరైన జగదీశ్వర శాస్త్రి, సంస్కృత పండితుడు, కవి, “హృదయ కుహర మధ్యే “ అని ప్రారంభించి తర్వాత వ్రాయవలసినది తోచక, ఆ కాగితం అట్లే మహర్షి కూర్చునే స్థానంలో దిండు క్రింద పెట్టి, ఏదో పనిపై వెళ్లి పోయారట. ఆ తర్వాత వారు తిరిగి వచ్చేసరికి, మహర్షి శ్లోకమును పై విధంగా పూరించి ఉంచారు!
వాశిష్ట గణపతి ముని పై శ్లోకమును రమణ మహర్షి బోధనా సారాంశంగా తీసుకొని, వారి రమణ గీత లో, ఒక అధ్యాయమంతా వ్యాఖ్యానించారు. వారీ శ్లోకము గురించి చెప్పినది:
“శ్లోకం భగవతో వక్త్రాన్మహర్షేరిమముద్గతం,
శ్రుత్యంత సారం యో వేద, సంశయో నాస్య జాతు చిత్ “
“భగవాన్ ముఖతః వెలువడిన ఈ శ్లోకము వేదాంత సారమని, నిస్సంశయముగా గ్రహింపవలెను.”    
 *🕉️ Day 19 – “మనస్సు ఎలా అదుపులోకి తేవాలి?”*  
*(భగవాన్ రమణ మహర్షి ఉపదేశాల ఆధారంగా)*

---

*❖ ప్రశ్న:*  
*“భగవాన్ గారు, నా మనస్సు చాలా చెదిరిపోతుంది. దాన్ని ఎలా కట్టడి చేయాలి?”*

*❖ భగవాన్ సమాధానం:*  
> **“మనస్సు కట్టడి చేయాలనుకోవడం కంటే, దాని మూలాన్ని తెలుసుకోవాలి.  
> మనస్సు ఎక్కడ నుంచి వస్తుంది అని జాగ్రత్తగా పరిశీలించండి.  
> మూలం తెలిసినపుడే మనస్సు నశిస్తుంది.”**

---

*➤ మనస్సు అదుపులోకి తెచ్చే మార్గం:*

- మనస్సుతో పోరాడొద్దు — దానిని పరిశీలించండి.  
- మనస్సు ఎప్పుడూ *బయట* చూసే ప్రకృతి కలది.  
  దానిని *లోపలికి తిప్పాలి* – “మనస్సు ఇప్పుడు ఏం ఆలోచిస్తోంది?”, “ఇది ఎక్కడ నుంచి వస్తోంది?” అని ప్రశ్నించాలి.  
- ఇలా చేసేవాళ్లకు, మనస్సు తానుగా అదుపులోకి వస్తుంది.

---

*🧘‍♀️ సాధన సూచన:*

1. ప్రతిసారీ మనస్సు చెదిరినప్పుడు, *“ఇది ఎవరిది?”* అని ప్రశ్నించండి.  
2. ఆ ప్రశ్నను అర్థపూర్వకంగా విచారిస్తే, మనస్సు శాంతిస్తుంది.  
3. క్రమంగా, “మనస్సే లేదు” అనే స్థితి – సహజ స్థితి గా మారుతుంది.

---

*🪔 భగవాన్ వాక్యం:*  
> **“తాను తానే ప్రశ్నించుకునే శక్తి — అదే మనస్సు నియంత్రణకు మార్గం.  
> అది బయట వేటకు వెళ్లినప్పుడు బంధం, లోపలికి వచ్చినప్పుడు ముక్తి.”**

---

👉 *Day 20 లో – “మౌనం అంటే ఏమిటి?” అనే ప్రశ్నకి భగవాన్ సమాధానం తెలుసుకుందాం.*

*🙏 Arunachala Siva, Arunachala Ramana 🕉️*
 అరుణాచల శివ 👏
ఈశ్వర తత్వం.....
భగవాన్ రమణులు గారిని ఓక విదేశీ శిష్యుడు ఇలా అడిగాడు... 
మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు... 
అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది'...
అప్పుడు భగవాన్ రమణులు వారు... "ఏది ఉలకదో, ఏది పలకదో, నీతో సంభాషించదో, నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో అదే ఈశ్వర తత్వం" అని జవాబిచ్చారు...
 216 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకం 4

భవో$యం భావనామాత్రో న 
కించిత్పరమార్థతః|
నాస్త్యభావభావానాం భావభావ విభావినాం||

ఈ ప్రపంచమంతా భావన మాత్రమే భావానికి వేరుగా ,నిజంగా ప్రపంచం లేనేలేదు. అస్తిత్వం కలిగి ఉన్న ఆత్మా,అభావమైన జగత్తు తమ స్వభావములో నిత్యము ఉంటాయి.

అష్టావక్ర గీతలోని అనేక వాక్యాలు అత్యంతమైన ఆదరణను పొంది అనేక తత్వశాస్త్రజ్ఞులు నాలుకపై చరిస్తూ ఉండటానికి కారణం పదాల కూర్పులోని పొందిక మాత్రమే కాదు. అనంత భావ అర్థ గంభీర సౌందర్యం ఆ వాక్యాలలో ఇమిడి ఉండి ఒకసారి విన్న మళ్లీమళ్లీ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అందు కొక చక్కని ఉదాహరణ ఇక్కడ చూస్తున్నాం. "భవోయం భావన మాత్రః"ఈ ప్రపంచమంతా ఒక విధంగా భావనలు  మాత్రమే. ఈ వాక్యాన్ని వేదాంత బోధకులు అందరూ తరచుగా వాడుతున్నారు. మనసులోని ఆలోచనలు అణిగిపోయి అనంత సత్యములోకి జాగృతమైనప్పుడు భావ ప్రవాహంగా నామరూపాలుగా తెలియపడే ప్రపంచమంతా అదృశ్యమైనప్పుడు సాధకుడు తప్పకుండా ఇలా అనుకుంటాడు. "నకించి పరమార్థతః"... నిజంగా ఇక్కడ ఏదీ లేదు ఆత్మలేని ప్రపంచం ఎప్పుడూ తమ స్వభావాలను మార్చుకోవు అనే వేదాంత సత్యాన్ని అష్టావకులు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు.

ఆత్మ సత్యమైనది, నిత్యమైనది, పరిణామరహితము, అనంతము, ఈ ప్రపంచము అసత్యము, అనిత్యము, నిత్య పరిణామశీలి, వాటి సహజ స్వభావాలను అవి ఎన్నడూ కోల్పోవడం లేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆత్మ మాత్రమే సత్యమైనది. ఇదే నిత్యంగా ఉంటుంది .ప్రపంచము ఉనికి కలిగి లేదు. వాటి స్వభావాలు మారకుండా ఎప్పుడు అలాగే ఉంటాయి.🙏🙏🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(212వ రోజు):--
       సీసాలో ఏముందో దానిబట్టే మనం సీసాకు 'తేనెసీసా'అనో,'పాల సీసా'అనో పేరు పెడతాంకదా. సీసా లో సిరా ఉంటే .. ఏమంటాం? (అందరూ 'సిరా'అని అరిచారు.)ఆ, సిరాసిసా! ఇదికూడా అంతే. మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే దానికలాంటి పేరే వస్తుంది. అల్లరి చేసే ఆలోచనలుంటే, అది అల్లరి మనసన్నమాట ; అంచేత, చేసేవన్నీ అల్లరిపనులే అవుతాయి. మంచి ఆలోచనలుంటే, మంచి మనసని అర్థం ; అప్పుడు పనులెలాంటి వౌ తాయి ? (అందరూ 'మంచివి'అని గట్టిగా అరిచారు) అంతే. మీకిప్పుడు తెలిసిందికదా, మంచిగా ఉండట మెలానో - మంచి ఆలోచనలూ, మంచి పనులూ . 
       చిన్మయమిషన్ ఉపాధ్యాయు లకు నిర్వహించిన చాలా సదస్సు లలో మొట్టమొదటిది బొంబాయిలో ఐదవతరగతి విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయుల కోసం జరిగింది ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే ఉపా ధ్యాయుల శిక్షణకోసం ఏర్పాటుచేసి న ఈ కార్యక్రమం వారికి తమ ధార్మికవారసత్వం గురించి వివరిం చి, వారిద్వారా విద్యార్థులకు కూడా దానిని అందజేయటం కోసం నిర్దే శించబడింది. రెండు వారాలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రవేశరుసుమేదీ లేదు; కాని, వారు తమకున్న సెలవురోజులు దీనికి వినియోగించాలి. 
       పాఠం చెప్పేవారికీ, ఉపాధ్యా యులకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ స్వామీజీ తన ప్రారంభోప న్యాసాన్ని మొదలుపెట్టారు. పాశ్చా త్య విద్యావిధానాన్నే ఈనాడు మన దేశంలోకూడా అనుసరించడం దురదృష్టకరమైన విషయమని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఈ విద్యావిధానం పిల్లల మనసులో ఎన్నో విషయాలు కుక్కి అవి పరీక్ష లయ్యేంతవరకూ అక్కడ నిలిచి ఉండటంమీదనే ఆధారపడుతుంది. "ఇది విద్యకానేకాదు." అని స్వామీజీ గర్జించారు. తర్వాత, విద్య అంటే ఏమిటో వివరించారు. 
       విద్యద్వారా లభించిన జ్ఞానం వివేకంగా పరిణమించి, బలమైన వ్యక్తిత్వంగా రూపునందుకోటానికి ఉపయోగపడాలి. విద్యావిధానం లో ఉపాధ్యాయుని నడవడి, వ్యక్తి త్వం అత్యంతప్రధానమైన పాత్ర పోషిస్థాయి. ఉపాధ్యాయుడు సామా న్యమైన రీతిలో విద్యార్థులు మన్నన పొందితే చాలదు; నిజమైన భయ భక్తులతో కూడిన గౌరవాభిమానాల ను సంపాదించాలి. విద్యార్థీ, ఉపా ధ్యాయుడూ మానసికంగా దగ్గరై, విద్యార్ధితన బుద్ధిజ్ఞానంతో ఉపాధ్యా యుని ఔన్నత్యాన్ని గ్రహించినపుడే అది సాధ్యపడుతుంది. అటువంటి గౌరవాన్ని ఉపాధ్యాయుడు పొంద లేకపోతే, విద్యార్థికి నేర్పినదేదీ చిర కాలం ఉండే ఫలితాన్నీయదు. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 3️⃣1️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.* 

*39. ఏషా తే2భిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణుl*
 బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి॥

అర్జునా! ఈ సమత్వధావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగము ఆధారంగా అంటే జ్ఞానము ఆధారంగా చెప్పాను. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగము అవుతుంది. ఆ కర్మయోగము ఆధారంగా ఈ సమత్వభావనను ఎలా ఆచరించవచ్చో చెబుతాను విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మబంధనములను దూరంగా నెట్టివేయగలవు. దాని వలన నీకు జ్ఞానం కలుగుతుంది. అని చెప్పాడు కృష్ణుడు.

(ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానమును గురించి చెప్పబడే తత్త్వము, జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి.)

అర్జునా! ఇప్పటి దాకా నీకు జ్ఞానయోగము గురించి, ఆత్మ జ్ఞానము గురించి చెప్పాను. అంటే సాంఖ్యము గురించి చెప్పాను. ఇక్కడి నుండి కర్మయోగము గురించి క్లుప్తంగా చెబుతాను అని అన్నాడు. ఇక్కడ మీకు ఒకసందేహము రావచ్చు. అన్నీ జ్ఞానముతోనే సంక్రమిస్తాయి; జ్ఞానమే ముఖ్యము; జ్ఞానముతోనే ఆత్మతత్వము బోధపడుతుంది అని తెలుసుకున్నాము కదా! ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరికి పరిమిత జ్ఞానము ఉంటుంది. మరి కొందరికి విశేష జ్ఞానము ఉంటుంది. కొంత మంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు. మరి కొంత మంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు. మరి కొంత మంది నిష్కామంగా, కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు. ఎవరైనా సరే ముందు కర్మయోగము అవలంబించిన తరువాత జ్ఞానయోగానికి వెళ్లాలి. పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగము అవలంబించి కొంత జ్ఞానముసంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది. కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు.

కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానముతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తరువాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి. కాని మనకు ఒక అపోహ ఉంది. కలియుగంలో కేవలం రామనామ స్మరణ కానీ పరమాత్మ నామ స్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని. మనస్సును శుద్ధి పరచుకోడానికీ, గతజన్మ పాపఫలముల నుండి విముక్తి పొందడానికీ, కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూటకట్టుకోకుండా ఉండటానికి పరమాత్మ నామస్మరణ ఉపయోగపడుతుంది కానీ కేవలం నామ స్మరణతో మోక్షం రావడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు.

అర్జునా! నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వం జ్ఞాన పరం గానే కాక కర్మ వరంగా కూడా చేయవచ్చు అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంటబట్టించుకొని ఈ కర్మబంధనముల నుండి విముక్తుడివి కా! అంటూ తరువాతి శ్లోకంలో ఇప్పుడు చెప్పిన దానిని విపులీకరించి చెప్పాడు కృష్ణుడు.

*40. నేహాభిక్రమనాశో2స్తి ప్రత్యవాయో న విద్యతేl*
 *స్వల్పమష్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ll*

ఏ కర్మనైనా నిష్కామంగా, ఒక యోగంగా చేస్తే, దానికి ఎప్పటికీ అపజయము ఉండదు. విపరీత ఫలితములు ఉండవు. అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి. పైగా ఈ నిష్కామ కర్మ యోగమును పూర్తిగా ఆచరించక పోయినా పర్వాలేదు. ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది. ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యు భయం నుండి కాపాడుతుంది.

ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి. అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థం అవుతుంది. దానినే భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు. కర్మయోగము అంటే మానవ జీవన విధానము. బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాము. కాని లోపల అంతా కల్మషంగా ఉంటుంది. కాని లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన, కర్మయోగములు. చాలా మందికి ఎంతో ఐశ్వర్యం సంపదలు చుట్టు జనం ఉంటారు. కాని ఒంటరి తనం ఫీల్ అవుతుంటాడు. ఏదో తెలియని వెలితి. ఏదో కావాలని తపన. మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు. ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మయోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెబుతున్నాడు. ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు. ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు. దానిని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యము. మనశ్శాంతి మనయొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందేకానీ, మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది. సుఖం ఎక్కడో లేదు. మనకు ఉన్న ధనము, ఆస్తి, పదవి, సంపాదన వీటిలో లేదు. ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడేవాళ్లు ఉన్నారు. సుఖం మనలో ఉంది. మన ఫీలింగ్ లో ఉంది. మన మనసులో ఉంది. కాని మనం దానిని నమ్మము. మనకు అంగబలం అర్ధ బలం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అనే అపోహలో ఉంటాము. ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు. అమితంగా ఉంటే అదే అన్ని దు:ఖములకు కారణం అవుతుంది. కాబట్టి ధనము, ఆస్తి, బంగారము, అంగ బలము శారీరక సుఖాన్ని ఇస్తాయోమో కానీ, మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వవు.

ఈ కర్మయోగం అనుష్ఠానం చేస్తే ఎవరికీ అపజయమే ఉండదు. చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు. సక్రమమైన ఫలితములే వస్తాయి. ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్ గా చేస్తాము. కర్మను కర్మగానే చేస్తాము. కాని కర్మను ఒక యోగంగాచేస్తే అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దాని వలన అపజయం కాని, విపరీత పరిణామాలు కానీ ఉండవు. ఏవేవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే, ఆ కోరికలు తీరక పోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. కానీ నా ధర్మం నేను చేస్తున్నాను. ఏం ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మను ఒక యోగంగా చేస్తే, విపరీత పరిణామలు అంటూ ఏమీ ఉండదు. పైగా ప్రతి అపజయం నుండి తిరిగి జయం పొందడానికి కావలసిన పాఠాలు నేర్చుకుంటాడు.

ఈ కర్మయోగము పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు. కొంచెం ఆచరించినా చాలు ఆ జనన మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే, ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ నీకు ఫలితం దక్కదు. కానీ ఈ కర్మయోగము చిత్త శుద్ధితో నిష్కామంగా చేస్తే, కొద్దిగా ఆచరించినా పూర్తి ఫలితం ఇస్తుంది. ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని కోటి రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలం, ఒక సామాన్యుడు ఆకలితో ఉన్న వాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితం కన్నా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనములు కలిగిస్తుంది. అశాంతిని కలిగిస్తుంది. కర్మను కోరికలేకుండా చేస్తే శాంతిని కలిగిస్తుంది. కర్మ బంధనముల నుండి మోక్షమును కలిగిస్తుంది.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                  P89
 🔔 *తీర్థ యాత్ర* 🔔

*తిరువణ్ణామలై*

🙏 అరుణాచలేశ్వర స్వామి క్షేత్రం 🙏

🏞️ క్షేత్ర మహిమ
తమిళనాడులోని తిరువణ్ణామలై లో వెలసిన అరుణాచలేశ్వర స్వామి ఆలయం శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని లింగరూపంలో వెలసి ఉన్నాడు. ఇది అగ్ని స్థలము గా ప్రసిద్ధి.

📖 పురాణ నేపథ్యం
ఒకసారి బ్రహ్మ – విష్ణువులకు సృష్టి – స్థితి పరాక్రమంపై గర్వం వచ్చింది. ఆహంకారాన్ని తొలగించడానికి శివుడు అనంత జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు.
విష్ణువు వరాహరూపం తీసుకొని క్రిందికి వెళ్ళినా ఆది కనబడలేదు.
బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళినా అంతం కనిపించలేదు.

ఈ అనంత జ్వాలారూపమే అరుణాచల పర్వతం గా నిలిచింది. శివుడు సాక్షాత్తు ఈ పర్వతరూపంలో భక్తుల పాలిట వెలుగుతున్నాడు.

🕉️ ఆలయ వైభవం
ఆలయం గోపురాలు అద్భుతమైన ద్రావిడ శైలిలో నిర్మించబడ్డాయి.
ప్రధాన లింగం అరుణాచలేశ్వరుడు – ఆయన సాక్షాత్తు జ్వాలరూపం.
అమ్బాళుగా అపిత కుచాంబా అమ్మవారు దర్శనమిస్తారు.
ఆలయం చుట్టూ ఉన్న గిరివలయం (14 కిమీ) ఎంతో పవిత్రమైనది. భక్తులు అర్ధరాత్రి, పౌర్ణమి రోజున దీన్ని భక్తితో ప్రదక్షిణ చేస్తారు.

🌼 పండుగలు
కార్తిక దీపం: సంవత్సరంలో ఒకసారి, కార్తిక పౌర్ణమి రోజున, పర్వత శిఖరంపై మహాజ్యోతి వెలిగిస్తారు. ఇది విశ్వానికి వెలుగు, శివుడి అనంతత్వానికి సంకేతం.
మహాశివరాత్రి, ఆడి పూరం వంటి పండుగలు కూడా గొప్పగా జరుగుతాయి.

🚶 యాత్రికులకు సూచనలు
గిరివలయం చేయడం అత్యంత పుణ్యకార్యం. ఇది భక్తునికి ఆత్మశుద్ధిని ఇస్తుంది.
ఆలయ దర్శనం ముందు స్వచ్ఛతతో స్నానం చేయాలి.
కార్తిక దీప సమయంలో లక్షలాది భక్తులు చేరతారు – ఆ ఉత్సవాన్ని జీవితంలో ఒక్కసారి తప్పక అనుభవించాలి.

✨ తీర్థయాత్ర ఫలితం
తిరువణ్ణామలై యాత్రచేసినవాడు, జీవనంలో అహంకారాన్ని విడిచి, జ్ఞానజ్యోతి వైపు అడుగులు వేయగలుగుతాడు. అరుణాచలేశ్వర దర్శనం భక్తునికి మోక్ష సాక్షాత్కారం అందిస్తుంది.

 శ్రీమద్ రామాయణ కల్పవృక్షం గ్రంథానికి తెలుగు లో తొలిజ్ఞానపీఠం అందుకున్నారు. ప్రసిద్ధ కవి, పండితుడు. వేయిపడగలు, చెలియలి కట్ట, ఏకవీర, నర్తన శాల, ఆంధ్రప్రశస్తి, కిన్నెరసాని పాటలు వంటివి వీరి ప్రసిద్ధ రచనలు. ఈ రోజు కవి సమ్రాట్” 
 విశ్వనాథ సత్యనారాయణ జయంతి  జ్ఞాపకం !

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

విశ్వనాథ సత్యనారాయణ గారు 20వ శతాబ్దపు తెలుగు రచయిత."కవి సమ్రాట్" బిరుదాంకితుడు. అతని రచనలలో కవిత్వం, నవలలు, నాటకీయ నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చరిత్ర, తత్వశాస్త్రం, మతం, సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, భాషాశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, స్పృహ అధ్యయనాలు, జ్ఞాన శాస్త్రం, సౌందర్యం, ఆధ్యాత్మికత వంటి అనేక రకాల విషయాలను ఆలంబనగా ఉంటుంది. వారు తిరుపతి వెంకట కవులు ద్వయానికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి విద్యార్థి. విశ్వనాథ ఆధునిక, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రాశారు. ఆయన ప్రసిద్ధ రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (రామాయణం కోరికలు తీర్చే దివ్య వృక్షం), కిన్నెరసాని పాటలు (మత్స్యకన్య పాటలు), నవల వేయిపడగలు (ది థౌజండ్ హుడ్స్) ఉన్నాయి. అనేక అవార్డులలో, ఆయన 1971లో పద్మభూషణ్ పురస్కారం, తెలుగు సాహిత్యంలో తొలి
 నేటి మంచిమాట

పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం బలం ఏమిటో.

ఒక మంచి పుస్తకం ఎలా అర్థంకాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థంకాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే.

మిత్రులారా! నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే రోజుకొక మంచిమాట పంపడం జరుగుతుంది.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
 *హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి*

ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.
అపారమైన శివ భక్తుడు.అయినా పరకాంతల యందు..పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన “స్వామి హనుమ” చిరంజీవి గా మిగిలిపోయారు.చరిత్రలో నిలిచిపోయారు.

“జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి.సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి.”
 
👌 *2. మైత్రి యొక్క విలువ!*

వంచన తో..బలం తో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలి కి మంత్రిగా
హనుమ ఒక్క నాటికి లేరు.
తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపు గా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

“జీవితం లో కస్టాలు సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం.నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కాష్టాలొచ్చినా విడిచిపెట్టకండి.”
 
👌 *3. అహం బ్రహ్మాస్మి*-నేనే గొప్ప అని అనకు! నాదేం లేదు…అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి!

లంకకు వెళ్ళే ముందు…హనుమ ఇలా అంటారు..! నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది…కాని నేను ఎలా వెళ్తానో తెలుసా?
“నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూనీరంలో నుండి తీసిన బాణాన్ని తన ఎడమ చేతిలోనున్న బంగారు వింటినారికి సంధించి ఆకర్ణాంతం లాగి విడిచిపెడితే ఆ బాణం ఎలా వెళుతుందో ” అలా దూసుకెళతాను…అది నా శక్తి కాదు…!రాముడి చే విడవబడితే…రాముడి శక్తి ఆ బాణం లో కెళ్ళి బాణం వెళుతుంది!అటువంటి రామ బాణం లా వెళతాను!”నేను…నా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!
 
👌 *4. నీ మీద నమ్మకం ఉండేలా బ్రతుకు!*
కొన్ని లక్షల వానర సేన!
నూరు యోజనముల సముద్రం!
జాంబవంతుడు సహా ఎందరో అతిరథ మహారథులు!
తలచుకుంటే కాని పని కాదు!కాని రాముడు నమ్మింది …అందరూ సూచించింది “హనుమనే”!

“నిన్ను నమ్మి పని అప్పగించి ….గుండెల పై చెయ్యేసుకుని హాయిగా నిద్రపోయేలా బ్రతుకు!”
 
👌 *5. మోసం చేసేవాళ్ళు ఉంటారు.నువ్వు మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపో!*
హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది!
“స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసి
అలసి ఉన్నట్టు కనబడుతున్నారు..!కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని
వెళ్ళండి “అని అంటుంది.
హనుమ…”సముద్రం లో బంగారు పర్వతమా?మాయ లా ఉంది?ఇది నాకు విఘ్నమని” ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

“చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ
చేసుకున్న ప్రమాణం.”
 
👌 *6. లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు.*
హనుమ,లంకలో సీతమ్మకోసం వెతుక్కుంటూ
రావణ అసురుని అంత: మందిరం లోనికి ప్రవేశించగా
కొన్ని వందల మంది స్త్రీలు వివస్త్రలు గా, సురా పానం చేసి…మత్తులో ఒకరిపై ఒకరు పడి అడ్డదిడ్డంగా…పడి ఉన్నారు… లెక్కలేనన్ని పళ్ళు…మధుర…పానియాలు నేలపై పది పారుతూ ఉన్నాయి.వారి ఒంటి మీద బంగారు నగలు…నేలంతా పడి ఉన్నాయి…
ఇవన్నీ చూస్తున్నా…..
హనుమ ఒక్కింత కూడా చలించలేదు…ఆతని మనసులో ఉన్నది ఒక్కటే!నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందొ?ఎన్ని కస్టాలు పడుతోందో అని…!
మురుగు కాలువ దాటినట్టు ఆ స్థలాన్ని దాటి
సీతమ్మ ను వెతుక్కుంటూ వెళ్లారూ హనుమ.

“లక్ష్యం సాధించడం లో గురి…
చేసే పని లో పట్టుదల…
పడే శ్రమలో తపన ఉంటె….మన చుట్టూ ఏమున్నా కనపడవు.”
 
👌 *7. పెద్దరికాన్ని గౌరవించు*
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి
చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు.
నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు.
హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడ్డారు!
రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

“పెద్దలకి…నువ్విచ్చే గౌరవం నలుగురిలో నీ గౌరవాన్నే పెంచుతుంది”
 
*హనుమ కథ లో*…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి.ప్రతి ఊరి పొలిమేరల్లో గద పట్టుకుని నిలబడి….”ఏం భయం లేదు రా...నీకు తోడుగా నేనున్నానులే……పద “..అని తెలిపే ఆంజనేయ విగ్రహాలే...

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
 ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పాస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
 *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక అభినందనలు*
 💐💐🌹🌹🍇🍇🍫🍫🥭🥭

మనకు *విలువ* నిచ్చే వారిని
      *"హార్ట్"* లోనూ,
 మనకు *విలువనివ్వని* వారిని
        *"మ్యూట్"* లోను, పెడితే
 మన *జీవితం*
       *"క్యూట్"* గా ఉంటుంది.. *

.       ఉన్నదానితో సర్దుకోవటం నేర్చుకుంటే *జీవితం* ఎప్పుడూ *ఆనందంగానే* ఉంటుంది...  లేని దానికోసం *ఆరాటపడితే* చివరికి కన్నీళ్లు మిగులుతాయి

       ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని *దూరం* చేసుకుంటున్నాం..  లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని  తేలికగా *నమ్మేస్తున్నాం*..  మనం *నిజం* తెలుసుకునే లోపలే *నిజాయితీగా* ప్రేమించిన వారిని *దూరం* చేసుకుంటున్నాము.. ఇదే *జీవితం*

           జీవితం *ఇసుగు పుట్టటానికి* వెయ్యి కారణాలు *ఉండొచ్చు* కానీ.. *జీవించడానికి* ఒకే ఒక్క కారణం.. *రేపటిరోజు* ఇలా ఉండదు అనే ఒకే ఒక *నమ్మకంతో*. హాయిగా ఆశగా జీవిద్దాం.

మన *నీడను* చూసి మన *బలం* అనుకుంటే పొరపాటు నేస్తమా.. తెలుసుకో.. ఎందుకంటే *వెలుగును* బట్టే *నీడ* కూడ తన *తీరు* మార్చుకుంటుంది.. మనుషులు కూడ అంతే,.. *అవసరం* బట్టి *పిలుపు*.. అవకాశాన్ని బట్టి తన *తీరు* మార్చుకుంటారు..
 *"ఓం''...  తో   అలసట  మాయం.*
శాస్త్రీయంగా  నిరూపించిన  బాలిక.

🕉️ఓం... శబ్దంతో
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగు ఏళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. 

పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేషరాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 
🕉️ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 

🕉️ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి.
ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది. 
అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 

గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. 
కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 

🕉️ఓం శబ్దంపై ఇప్పటివరకు ఎవరూ  ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. 

ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 
అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. 
దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. 
దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 

🕉️ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 

17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. 
ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

ప్రతి రోజు ఉదయం ,  సాయంత్రం కనీసం 21 సార్లు దీర్ఘ ఓంకారం  చేద్దాం!
మన బంధుమిత్రులతో  చేయిద్దాం!
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🪴జై శ్రీరాం.🙏🚩
 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    
నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
పరమాచార్య పావన గాధలు…


           *పూలు - పాదుకలు*
                ➖➖➖✍️
```
కంచి మఠం దగ్గర కామాక్షి అని పూలు అమ్మే ఒకావిడ ఉండేది. 

ఆమె పరమాచార్య స్వామివారిని అప్పా(నాన్న) అని పిలిచేది. రోజూ స్వామివారికి ఒక బుట్టెడు పూలతో అర్చన చేసేది.

అప్పుడు స్వామివారు ఆమెతో, “ఇన్ని పూలను ఎందుకు వాడుతున్నావు? వీటిని నీవు అమ్మితే డబ్బు వస్తుంది కదా!” అని చెప్పేవారు.

“డబ్బు అంత గొప్పదా అప్పా? ఈ పూలతో నీకు అర్చన చేస్తే దానికంటే గొప్పదే నాకు లభిస్తుంది!” అని బదులిచ్చేది.

పరమాచార్య స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తే, స్వామివారిని ఎవరూ లేపకూడదని శ్రీమఠంలో ఒక నియమం ఉండేది. 
కాని ఈ నియమానికి కామాక్షి మినహాయింపు. ఆమె ఎంత పొద్దుపోయిన తరువాత అయినా రావచ్చు. ఎందుకంటే, తన వ్యాపారం మొత్తం పూర్తైన తరువాతనే రావాలని మధ్యలో రాకూడదని స్వామివారే ఆజ్ఞాపించారు.

అంతటి కరుణాసాగరులైన స్వామివారు తనకోసమని ఆమెకు అన్నం పెట్టే వ్యాపారాన్ని వదిలితే ఒప్పుకుంటారా?

ఒకరోజు సాయింత్రం స్వామివారు, తొమ్మిదిగంటల వార్తలను విని తనకు వచ్చి చెప్పే నాగరాజు మాటలను వింటున్నారు. మఠం బాధ్యతలు, నియమాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం స్వామివారికి అలవాటు. వార్తలను విశ్లేషించి, స్వామివారు నిద్రకు ఉపక్రమించేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఆరోజు ‘జాన’ అనే ఒక భక్తురాలు వెల్వెట్ తో చేసిన పాదుకలను తీసుకుని స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారు రోజంతా వాటిని వేసుకునే ఉన్నారు. రాత్రి దాకా వాటిని వదలలేదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు స్నానాల గదికి వెళ్ళారు.

స్వామివారికి వార్తలు చెప్పే నాగరాజు, “ఈరోజు స్వామివారు పాదుకలను విడువగానే, వాటిని నేను తీసుకుంటా; నా వద్ద స్వామివారి పాదుకలు లేవు” అని తనలో తాను అనుకున్నాడు.

స్వామివారు పాదుకలను విడువకుండానే కూర్చున్నారు. అప్పుడే పూలమ్మే కామాక్షి వచ్చి, స్వామివారికి నమస్కరించింది. స్వామివారు వెంటనే పాదుకలను వదిలి, ఆమెకు ఇచ్చి, “ఇవి నీకే. తీసుకెళ్ళు” అని అన్నారు.

నాగరాజు బాధపడుతూ, “ఎప్పుడు నేను ఏమి తలచినా, దైవం మరొకలా తలుస్తుంది” అని వెళ్ళిపోయాడు.

పూలమ్మే ఆ పేదరాలికి స్వామివారి అవ్యాజ కరుణ వల్ల కలిగిన భాగ్యం అది. ఎంతోమంది ఆ పాదుకల కోసం ఆమెను ప్రలోభపెట్టాలని చూశారు. వాటికోసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాని వాటికి ఆమె లొంగలేదు. తన అవసరాలు అన్నీ స్వామివారే చూసుకున్నారు. ఆమె ఇంటిలో పెళ్లిళ్లకు స్వామివారు బళ్ల నిండా సామాను పంపేవారు.

స్వామివారు సిద్ధి పొందిన తరువాత కూడా, ఆమె సాయంత్రాలలో స్వామివారి అధిష్టానానికి పూలతో అర్చన చేసేది. కాని స్వామివారు ఉన్నంత వరకు, ఆమెను ఉత్తి బుట్టతో పంపలేదు; అందులో కొన్ని పళ్ళను ఉంచేవారు.

స్వామివారి సిద్ధి తరువాత ఖాళీ బుట్టను చూసి చాలా బాధపడేది. “అప్పా! నువ్వు ఉండిఉంటే, ఖాళీ బుట్టతో నన్ను పంపేవాడివా?” అని ఏడ్చింది. అప్పుడే, తనని విస్మయానికి గురి చేస్తూ, ఎవరో అధిష్టానం నుండి తనవైపు విసిరినట్టుగా ఒక మందార పువ్వు బుట్టలో వచ్చి పడింది.

ఈనాటికి ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్వామివారు ‘ప్రత్యక్ష రూపం’తో ఈనాటికి మనల్ని ఆశీర్వదిస్తున్నారు.

తన్ను నమ్మినవారిని ఎన్నటికీ వదిలిపెట్టరు; ఇదే నాలుగు వేదాల తీర్పు.✍️```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
 “కంచిపరమాచార్యవైభవం”🙏

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 *📖 మన ఇతిహాసాలు 📓*


*కార్తవీర్యార్జునుడు*


కార్తవీర్యార్జునుడు హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.

రావణుని గదతో పడగొట్టి పడిపోయిన అతనిని బంధించటానికి వెళుతున్న అర్జునుడు.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.

ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.

కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను
 *✍🏼 నేటి కథ ✍🏼*


*కోతి చెప్పిన నీతి*


సువర్ణపురం అనే రాజ్యానికి ఇంద్రవర్మ అనే రాజు ఉండేవారు. విస్తారమైన సువర్ణపురం చాల సంపన్నమైంది. కానీ రాజుకి రాజ్యమంతా తిరిగి పర్యటించి తన ప్రజల కష్టసుఖాలు విచారించే సమయం లేదు. తన రాజ్యంలోనే ఉన్న ప్రకృతి అందాలని చూసి ఆనందించాలని ఆసక్తి లేదు. కారణం రాజుకి పొరుగు రాజ్యాలలో విహరించే ఆసక్తి ఉండడమే.

ఇంద్రవర్మ ఎప్పుడు వివిధ రాజ్యాలను పర్యటించే వాడు. కానీ తన రాజ్యంలో కొంత భాగమైన చూసింది లేదు. ఇది ఇలా ఉండగా, ఒక రోజు రాజు విహారానికి బయల్దేరి, తన రాజ్యంలోని అడవిలో విశ్రాంతి కొరకై ఆగుతాడు. తన దగ్గరలోనే ఒక కోతిని గమనిస్తాడు. అది రాజు ఫలహారం చేసి మిగిలిన వేరుశెనగకాయల్ని తీసుకొని చెట్టు పైకి ఎక్కి తినసాగింది. అలా తింటూ ఉండగా, కోతి చేతి నుండి ఒక వేరుశెనగకాయ కింద పడుతుంది. ఆ ఒక్క కాయ కోసం, తన చేతిలోని కాయలన్ని పడేసి కిందకి దిగుతుంది. ఇదంతా గమనిస్తున్న రాజు చూసి నవ్వసాగాడు. కోతి కోపంతో, ఎందుకు నవ్వుతున్నావ్? అని అడిగింది. అప్పుడు ఇంద్రవర్మ "ఒక్క కాయ కోసం అన్నీ వదులుకున్నావ్ నువ్వెంత వెర్రిదానివి!" అని అన్నాడు. వెంటనే కోతి "నన్ను వెర్రిదానినని అంటున్నావుగా, మరి నువ్వు చేసేది కూడా అదేగా. మన రాజ్యంలోని అందాలని ఆనందించకుండా, ప్రజల కష్టసుఖాలని విచారించకుండా పక్క రాజ్యాలని పర్యటిస్తూ ఉంటావు కదా" అని అంది.

ఇంద్రవర్మకు జ్ఞానోదయం అయింది. తాను చేసేది తప్పు అని తెలుసుకొని, విదేశీ పర్యాటనికి స్వస్తి చెప్పి, తన రాజ్యం మంచి చెడ్డలు చూసుకోసాగాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
 _*పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు*_
[సంకష్టహర చతుర్థి సందర్భంగా.]
🙏🌺🌺🌺🌻🕉️🌻🌺🌺🌺
🪷 వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు... కానీ ఏ పెళ్లిని తలపెట్టినా, అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే♪. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు♪.

🪷 మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి♪. 

🪷 ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది♪. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది♪.

✳️ _*స్థలపురాణం:*_

🪷 అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం♪. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం♪. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు♪. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు♪. 

🪷 ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు♪. 

🪷 కానీ, అదేం చిత్రమో! యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి♪. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు♪. అంతట నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు♪. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు♪. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి♪. ముక్కోటిదేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది♪. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని రుషులందరూ వేనోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి క్షేత్రం గా విరాజిల్లుతోంది♪.

✳️ _*భిన్నమైన రూపం*_  

🪷 ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. _*ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు.*_ సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు♪. 

🪷 ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం•.

✳️ _*పెళ్లి పెద్ద*_ 

🪷 కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు♪. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు♪. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు♪. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు♪. 

🪷 ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


*
 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?* 
*తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు.* 

*రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది. ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.*

*సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు.* 

*మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి.* 

*అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


       *బీరకాయ తింటున్నారా?*
               ➖➖➖✍️
```
*జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరలా బీరకాయ వండుతుంటారు. 

*అయితే ఈ కాయలే కాదు, బీరపాదు మొత్తం ఔషధపూరితం అని వైద్యులూ అంటున్నారు.

*సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

*సెల్యులోజ్‌ ఎక్కువగా ఉండటంతో ఇది మలబద్ధకాన్నీ మొలలవ్యాధినీ అద్భుతంగా నివారిస్తుంది.

*బీరకాయల్లోని పెప్టైడ్లూ ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి. 

*మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడంద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది.

*బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.

*కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.

*అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుందట.

*బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంటోంది. 

*దీన్ని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్నవాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందట. 

*ఇందులోని విటమిన్‌ బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందట.

*బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదనీ తేలింది. కాబట్టి బీరకాయ అనేక వ్యాధుల్నీ అరికడుతుందని గుర్తుంచుకోండి.✍️```
                             
         ….సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేడు…
  
          *సంకష్టహర చతుర్థి*
                 ➖➖➖✍️

*గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది                 చవితి తిథి* 
```
మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి.

*పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. 

ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.```

 *సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం:-* ```
సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.

సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. 

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.```

*సంకట హర చతుర్ధి వ్రత కథ :*``` 

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెలుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. 
ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. 
ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు.. ‘ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది’ అని చెప్పాడు.
అపుడు ఆ రాజు ‘అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది’అని అడిగాడు వినయంగా! 
అపుడు ఇంద్రుడు ‘ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది’ అని చెప్పాడు.

సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని! 
కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. 
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. 
సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, 'నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. 
చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. 
రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది' అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. 
గణేషుని దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. 
ఆమె దేహం పై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. 

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀