Wednesday, 10 September 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(212వ రోజు):--
       సీసాలో ఏముందో దానిబట్టే మనం సీసాకు 'తేనెసీసా'అనో,'పాల సీసా'అనో పేరు పెడతాంకదా. సీసా లో సిరా ఉంటే .. ఏమంటాం? (అందరూ 'సిరా'అని అరిచారు.)ఆ, సిరాసిసా! ఇదికూడా అంతే. మీ మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే దానికలాంటి పేరే వస్తుంది. అల్లరి చేసే ఆలోచనలుంటే, అది అల్లరి మనసన్నమాట ; అంచేత, చేసేవన్నీ అల్లరిపనులే అవుతాయి. మంచి ఆలోచనలుంటే, మంచి మనసని అర్థం ; అప్పుడు పనులెలాంటి వౌ తాయి ? (అందరూ 'మంచివి'అని గట్టిగా అరిచారు) అంతే. మీకిప్పుడు తెలిసిందికదా, మంచిగా ఉండట మెలానో - మంచి ఆలోచనలూ, మంచి పనులూ . 
       చిన్మయమిషన్ ఉపాధ్యాయు లకు నిర్వహించిన చాలా సదస్సు లలో మొట్టమొదటిది బొంబాయిలో ఐదవతరగతి విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయుల కోసం జరిగింది ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే ఉపా ధ్యాయుల శిక్షణకోసం ఏర్పాటుచేసి న ఈ కార్యక్రమం వారికి తమ ధార్మికవారసత్వం గురించి వివరిం చి, వారిద్వారా విద్యార్థులకు కూడా దానిని అందజేయటం కోసం నిర్దే శించబడింది. రెండు వారాలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రవేశరుసుమేదీ లేదు; కాని, వారు తమకున్న సెలవురోజులు దీనికి వినియోగించాలి. 
       పాఠం చెప్పేవారికీ, ఉపాధ్యా యులకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ స్వామీజీ తన ప్రారంభోప న్యాసాన్ని మొదలుపెట్టారు. పాశ్చా త్య విద్యావిధానాన్నే ఈనాడు మన దేశంలోకూడా అనుసరించడం దురదృష్టకరమైన విషయమని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఈ విద్యావిధానం పిల్లల మనసులో ఎన్నో విషయాలు కుక్కి అవి పరీక్ష లయ్యేంతవరకూ అక్కడ నిలిచి ఉండటంమీదనే ఆధారపడుతుంది. "ఇది విద్యకానేకాదు." అని స్వామీజీ గర్జించారు. తర్వాత, విద్య అంటే ఏమిటో వివరించారు. 
       విద్యద్వారా లభించిన జ్ఞానం వివేకంగా పరిణమించి, బలమైన వ్యక్తిత్వంగా రూపునందుకోటానికి ఉపయోగపడాలి. విద్యావిధానం లో ఉపాధ్యాయుని నడవడి, వ్యక్తి త్వం అత్యంతప్రధానమైన పాత్ర పోషిస్థాయి. ఉపాధ్యాయుడు సామా న్యమైన రీతిలో విద్యార్థులు మన్నన పొందితే చాలదు; నిజమైన భయ భక్తులతో కూడిన గౌరవాభిమానాల ను సంపాదించాలి. విద్యార్థీ, ఉపా ధ్యాయుడూ మానసికంగా దగ్గరై, విద్యార్ధితన బుద్ధిజ్ఞానంతో ఉపాధ్యా యుని ఔన్నత్యాన్ని గ్రహించినపుడే అది సాధ్యపడుతుంది. అటువంటి గౌరవాన్ని ఉపాధ్యాయుడు పొంద లేకపోతే, విద్యార్థికి నేర్పినదేదీ చిర కాలం ఉండే ఫలితాన్నీయదు. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment