Wednesday, 10 September 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(214వ రోజు):--
      వ్యక్తి తన జీవనాన్నీ, తన వైఖరి నీ మెరుగుపరచుకోవటమే అన్నిటి కన్న ముఖ్యమైన విషయమని స్వామీజీ పదేపదే నొక్కిచెప్పారు. చిన్మయమిషన్ 10 వ వార్షికోత్సవ సందర్భంలో మద్రాసులో ప్రసంగి స్తూ,శ్రోతలను ఇలా హెచ్చరించారు:
       రోజురోజుకూ మీ వైఖరిలో మార్పువస్తే తప్ప, ఇతరులు మీ భావాలను అంగీకరించరు. మీలో మార్పు కలిగిందని గమనిస్తే, "ఇంత మార్పు ఎలా వచ్చింది ?" అని అడగ టం మొదలుపెడతారు, సహజంగా. అప్పుడు మీ ఆలోచనలు కొన్నిటిని వారికి చెప్పండి. వారిమీద ఉపనిష త్తుల వాన కురిపించవద్దు. మీరు సరిగా జీర్ణంచేసుకొన్న భావాలనే వారికి వినిపించండి. బకెట్లకొద్దీ త్రాగ టానికి వాళ్ళేమీ ఏనుగులు కాదు. 
       యజ్ఞానికి వస్తున్నారా లేదా, పఠనసమావేశాలకు వస్తున్నారా లేదా అని ఇతరుల గురించి విచారిం చడానికి ముందు - మనం ప్రతి ఏడా ది మనలో ఏం అభివృద్ధి జరిగిందో నిర్ధారించుకోవాలి. ఈ పదేళ్లలో మనం సాధించినదేమిటి? మీరు , నేను ఎంత అభివృద్ధి చెందామన్నదే ఇప్పుడు మనం సమీక్షించుకోవాల్సి న విషయం. 
       ఐదేళ్లలో నరేంద్రుడనే సామాన్య వ్యక్తి వివేకానందుడయ్యాడు. పోనీ, మీరు వివేకులైనా కాగలిగారా? (ఏది సత్యమో, ఎదసత్యమో తెలుసుకొనే సామర్థ్యాన్ని వివేకం అంటారు).
        1964లో 3వ జాతీయ చిన్మయ మిషన్ సమావేశాలు నిర్వహించే నాటికి దేశమంతటా 100 కు పైగా కేంద్రాలున్నాయి పఠనబృందాలను, బాలవిహార్లను, వనితాబృందాలనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహిస్తూ. ఇవేకాకుండా, జాతీయ మహాసభలూ, ఆధ్యాత్మికతీర్థయాత్ర లూ, మరిన్ని పట్టణాల్లో యజ్ఞకార్య క్రమాలూ, పాఠశాలలను స్థాపించే పథకాలూ, విద్యార్థులనూ,ఉపాధ్యా యులనూ సంఘటితపరిచే కార్యక్ర మాలూ .. వీటన్నిటినీ క్రమబద్దంగా నిర్వహించడానికి సంస్థకు ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని ఆ సమావే శానికి వచ్చిన ప్రతినిధులందరూ అభిప్రాయపడ్డారు. అటువంటి కార్యాలయం మిషన్ కేంద్రాలన్నిటికీ ఉన్నతాధికారిగా ఉండకూడదనీ, విస్తృతమైన చిన్మయకుటుంబానికి అది వారధిగా ఉండి, అన్ని సంఘా లూ కలిసిమెలిసి పనిచేయటానికి తోడ్పడాలనీ స్వామీజీ సూచించారు. వివిధ ప్రదేశాల్లో ఉన్న కేంద్రాలన్నీ వాటి స్వతంత్రప్రతిపత్తి కోల్పోకుండా సంస్థకు వెన్నెముకగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
        తరగతులనూ, సమావేశాలనూ జరపటానికీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించటానికీ అవసరమైన స్థలాన్ని అద్దెకు తీసుకోటానికి అవ సరమైన సహాయం చాలా కేంద్రాల్లో ధనవంతులైన భక్తులు అందించే వారు. మరికొన్ని పట్టణాల్లో సభ్యుల ఉత్సాహానికి లోటులేనప్పటికీ, అవ సరమైన ఆర్థికవనరులు సమకూడే వి కావు. శ్రద్ధ, లక్ష్యం వారికున్న నిజ మైన మూలధనమని స్వామీజీ గుర్తు చేసేవారు. "ఈవనరులను మీరు దైవకార్యానికి సవ్యంగా వినియోగిం చ గలిగితే, లక్ష్మీకటాక్షం తప్పక సిద్ది స్తుంది ; ఆమె దేవుని వెనువెంటనే ఉంటుంది కదా" అనేవారాయన. 
       🙏🕉️ హరిఃఓం  🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
              🌺 సరళ  🌺

No comments:

Post a Comment