*బ్రహ్మ జ్ఞానమంటే
అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔన్న త్యమును పొందలేము. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమ గును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయ బడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.
కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు. బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు. 63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదా త్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేముకదా!
ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయా లంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగా రము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.
బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్ద తుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమ రల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.
ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పు చున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు🙏🙏🙏
No comments:
Post a Comment