Tuesday, 22 April 2025

 [4/23, 08:21] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


ఎద్దుకైనగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ!


*తాత్పర్యం:*

మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు. దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా. అందుకే, అలాంటి వారినే మూర్ఖుడు అన్నారు. ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాదిపాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడచుకొంటుంది. కానీ, ముప్పయేండ్లపాటు ఎన్ని బోధించినా మూర్ఖునికి బోధపడదు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[4/23, 08:21] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*మతాలన్నీ గొప్పవే వాటిలో దోషమేమి లేదు, దోషమంతా వాటిని అనుసరించే మనుషుల్లోనే ఉంది.*
[4/23, 08:21] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు*


భార్య భర్తల మధ్యన ఎన్నో గొడవలుంటాయి. తిట్టు కుంటారు, కొట్టు కుంటారు. ఆ తర్వాత కొంతసేపటికే ఒక్కటవుతారు. ఇది సహజం. కాని ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇతరులు చూస్తుండగా జరగ రాదు. ఆ వ్యవహారం ఇంటిగుట్టు. ఇతరులు చూస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఆ సందర్భంగా పుట్టినదే ఈ సామెత. తన మొగుడు తనను కొట్టుతుండగా తోడికోడలు చూస్తే ఆ అవమానం భరించ రానిది. అందుకే మొగుడు తనను కొట్టినందుకు కాదు, దీన్ని తన తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ ఎక్కువ.
[4/23, 08:21] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*అంధకరదీపికా న్యాయం*


అశక్తుడు. ఎన్ని మంచి అవకాశాలు కల్పించినా వాటిని అందిపుచ్చుకోలేని వాడు. అంధుడి చేతికి దీపాన్నిస్తే దానివల్ల ప్రయోజనం పొందలేడు.
[4/23, 08:21] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*పిల్లలం*


పిల్లలం- చిన్న పిల్లలం
పిల్లలం- పసి పిల్లలం
చక చక బడికి వచ్చేస్తాం
ఆటలు ఎన్నో ఆడేస్తాం "పిల్లలం"
పాటలు ఎన్నో పాడేస్తాం
ప్రకృతి ఒడిలో శాస్త్రవేత్తలం "పిల్లలం "
గురువులు చెప్పిన పాఠం వింటాం
పెద్దలు చెప్పిన మాటలు అంటాం "పిల్లలం "
పుస్తకాలు ఎన్నో చదివేస్తాం
పాఠాలెన్నో నేర్చేస్తాం "పిల్లలం "
నిజాలు మేమే చెప్పేస్తాం
ఎక్కడ చూసిన అక్కడ మేమే! "పిల్లలం "
పద్యాలెన్నో నేర్చేస్తాం
నీతులు ఎన్నో పాటిస్తాం "పిల్లలం "
చకచక రాతలు రాసేస్తాం
గడ గడ చదువు చదివేస్తాం "పిల్లలం "
మట్టిని పిసికి మెత్తగ చేసి
బొమ్మలు ఎన్నో చేసేస్తాం "పిల్లలం"
ఇసకతో ఇళ్ళు కట్టేస్తాం
కాగితాలతో పువ్వులు చేస్తాం "పిల్లలం"
అందరమొకటై నిలబడతాం
ఫలితాలెన్నో సాధిస్తాం “పిల్లలం"

No comments:

Post a Comment