Tuesday, 22 April 2025

 త్రిమూర్తుల పచ్చడి : 

అంటే కొత్తిమీర, పూదీన, కరివేపాకు పచ్చడి :
నేను పొద్దుపొద్దున  మార్కెట్ వెళ్ళి కూరలు తీసుకొని చాలా తాజాగా ఉన్న  కొత్తిమీర, పూదీన ఒక 10 రూపాయిలకి తెచ్చి వలిచి ఒక గుప్పెడు ఎదురు ఇంట్లో కరివేపాకు అడిగి వలిచి మూడింటిని కడిగి జల్ల్కి వేసాను.
          
ఒక బాండిలొ 1గరిటె నూనె వేసి ఆవాలు మెంతులు, 15 ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి వేయించాను. అవి తీసి మళ్లీ అదె బాండిలొ 1 చెంచాడు నూనె వేసి 3, 2 నిమిషములు వేయించాను. నిమ్మకాయ అంటా చింతపండు నానపెట్టి చిన్న గ్లాసు గుజ్జు తీసుకొన్న. చల్లారాక mixi లో ఈ తిరగామూత గ్రైండ్ చేసుకోని, కొంచం పసుపు చిన్న బెల్లం ముక్క తగినంత ఉప్పు, గుజ్జు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆఖరికి ఈ వేయించిన మూడింటిని వేసి రెండు 
తిప్పులు తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి.

Latha Ravi

No comments:

Post a Comment