Thursday, 20 August 2026

 👇

🪷 హ్యాపీ థాట్స్! 🪷

*🎯🎯🎯 జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి 🎯🎯🎯*

🤔 మనం కేవలం జీవించడం కోసం మాత్రమే జీవిస్తున్నామా? లేదా దీనికంటే గొప్ప ఉద్దేశ్యం ఉందా?
మీ అస్తిత్వంలోని లోతైన రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా?

🌈అయితే సర్‌శ్రీ రూపొందించిన *"ది మహా ఆస్మానీ – The Magic of Awakening - తెలుగు"* ఈ ఆన్‌లైన్ శిబిరంకు ఈరోజే నమోదు చేసుకోండి.

*తేదీ: 07-Sep-2026 నుండి*

*📲 నమోదు లింక్:*
https://khoji-connect.happythoughts.in/event/eventdetail?location_id=26f8cc09-4099-48ad-8abc-03b6d0afe15a&language_id=1a927cc7-6235-4f63-a2cd-60f43561b231

*📱 సంప్రదించండి:* 9866208380, 9920571614, 7658988607

*📝 గమనిక*: ఈ శిబిరం మూడు భాగాలుగా నిర్వహించబడుతుంది, 45 నిమిషాలు సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం: 5:30 గంటలకు, 
పునఃప్రసారం: సాయంత్రం 7:00 గంటలకు

*రిపోర్టింగ్ సమయం*: ఉదయం 5:15

MA శివిర్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం దయచేసి మా WhatsApp గ్రూప్‌లో చేరండి:
https://chat.whatsapp.com/KGgaE7TcFmu3xb0fjFHMCX?s=sh&p=a&ilr=4

ధన్యవాదాలు, హ్యాపీ థాట్స్...🙏

__________________________

🪷Happy Thoughts! 🪷

*🎯🎯🎯 Know the Purpose of Life 🎯🎯🎯*

🤔 Are we living just for the sake of living? Or is there a greater purpose? Do you wish to understand the deeper mysteries of your existence?

🌈 Then register today for the *ONLINE* reteat *"The Maha Asmani – The Magic of Awakening (Telugu)"* designed by Sirshree.

*📅 Date*: 07-Sep-2026 onwards

*📲 Registration Link:*
https://khoji-connect.happythoughts.in/event/eventdetail?location_id=26f8cc09-4099-48ad-8abc-03b6d0afe15a&language_id=1a927cc7-6235-4f63-a2cd-60f43561b231

*📱 Contact:* 9866208380, 9920571614, 7658988607

*📝 Note:*
This retreat will be conducted in three parts.
*Duration*: 45 minutes
*Days*: Monday to Friday, Morning 5:30 am, Repeat Evening 7:00 pm.
*Reporting time*: 5:15 am

*For more updates regarding MA Shivir please Join WhatsApp group:* https://chat.whatsapp.com/KGgaE7TcFmu3xb0fjFHMCX?s=sh&p=a&ilr=4

*Kindly forward this message to your Friends and Relatives.*

🙏Dhanyawad🙏
 *🍁అష్ట వినాయక క్షేత్రాలు 🍁*

అష్ట వినాయక క్షేత్రాలు దర్శిస్తే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముందుగా-

1.మయూరగణపతి క్షేత్రం.

ఈ క్షేత్రం బారామతి తాలూకాలోని ‘మోర్ గావ్’ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని ‘మయూరేశ్వర్’ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా.

 కానీ, ఇక్కడ వినాయకుని వాహనం మయూరం (నెమలి). 

పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూంటే.., వారు రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూరవాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. ఇక్కడి వినాయకుడు మయూరవాహనం మీద భక్తులకు దర్శనమిస్తాడు. 

అందుకే ఈ స్వామిని ‘"మోరేశ్వర్’ " అని పిలుస్తారు. హిందీభాషలో మోర్ అంటే ‘నెమలి’. 

అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం, ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుక ఉన్నదనీ స్థానికులు చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగువైపులా మినార్లతో మసీదులా కనిపిస్తుంది. తురుష్క చక్రవర్తుల దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారనీ, బహమనీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందనీ చరిత్రకారులు చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయకచవితినాడు, విజయదశమినాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

2.సిద్ధివినాయక క్షేత్రం

ఈ క్షేత్రం అహ్మదునగర్ జిల్లాలోని ‘శ్రీగొండ’ పట్టణానికి సమీపంలోనున్న చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించారు. సాధారణంగా వినాయకుని తొండం ఎడమచేతి వైపు వొంగి ఉంటుంది. కానీ, ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడిచేతి వైపుకు వొంగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడి వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం మధు,కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడనీ, అందుకు కృతఙ్ఞతగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడనీ స్థలపురాణం చెప్తుంది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సిందే. అయినా కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి గణపతి కనుక భక్తులు ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణం చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు.

3.బల్లాలేశ్వర క్షేత్రం.

ఈ క్షేత్రం ‘పాలి’ అనే గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పేరు ‘పల్లిపుర్’. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ సేఠ్ కుమారుని పేరు ‘బల్లాల్’. ఇతను గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుని పూజించి, రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. అతని స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని కల్యాణ్ సేఠ్ కు ఫిర్యాదు చేసారు. కోపం వచ్చిన సేఠ్ ‘బల్లాల్’ను అడవికి తీసుకునివెళ్లి, అతన్ని చెట్టుకి కట్టి స్పృహతప్పేలా చావకొట్టి, ఆ రాతివిగ్రహాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఆపస్మారకస్థితిలో ఉన్న బల్లాల్, వినాయకుని ప్రార్థించాడు. వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లువిప్పి విడిపించి, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘ఈ రాతిలోనే నువ్వు ఉండాలి’ అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతివిగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలోనున్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకును విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయకవిగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుని ‘బల్లాలేశ్వర్’ అని పిలుస్తారు.

4.వరదవినాయక క్షేత్రం

పుణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని ‘మహద్’ గ్రామంలో వెలిసిన ఈ గణపతిని ‘వరదవినాయకుడు’ అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్నిరుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యా సమేతుడై ఈ గ్రామంలోని ‘వాచక్నవి’ దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజుని చూసి ముచ్చటపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలోవచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా ‘గృత్సమధుడు’ అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక, తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేపాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి’ అని కోరాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు అక్కడ స్వయంభువుడుగా వెలిసాడు. అదే వరదవినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం 1892 నుంచీ అఖండంగా వెలుగుతూనే ఉండడం విశేషం. ఈ స్వామిని భక్తులు స్వయంగా తాకి, అర్చనలు చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత.

5.చింతామణి గణపతి క్షేత్రం.

పుణెకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థేవూర్’ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంత కాలం తపస్సు చేసాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే ‘చింతామణి’ అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు ‘గుణ’ కపిలమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తించి, ఆ మణిని అపహరించాడు. కపిలమహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొంది దాన్ని గణపతి మెడలో అలంకరిప్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం ‘కదంబనగర్’ గానూ.., ఈ స్వామి ‘చింతామణి గణపతి’ గానూ ప్రసిద్ధి పొందాడు. ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించారు.

6.గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం.

పుణెకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ్ వినాయక ఆలయం’. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందనీ, తనకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నడనీ పౌరాణిక ప్రమాణం. ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే…రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని సుఖంగా దర్శించకోవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత.

7.విఘ్నహార్ వినాయక క్షేత్రం.

ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు …సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూంటే.., వారు వినాయకుని ప్రార్థించగా..ఆ ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేసాడు. వినాయకుని గెలవడం తనవల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణుకోరి, తన పేరుమీద నీవు ఇక్కడే కొలువుతీరాలనీ వేడుకున్నాడు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని ‘విఘ్నహార్ వినాయక్’ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారు. తరువాతి కాలంలో ‘చిమాజి’ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారుపూతతో మిలమిల మెరిసే ఈ ఆలయశిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

8.మహాగణపతి క్షేత్రం.

‘రంజన్ గావ్’గా పిలవబడే ఈ గ్రామంలో కొలువున్న ఈ వినాయకుడినే ‘మహాగణపతి’గా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలచుకుని యుద్ధం చేసి వారిని సంహరించాడు. అందుకు ప్రతిగా శివుడే ఈ ‘మహాగణపతిని’ ఇక్కడ ప్రతిష్ఠించాడనీ…గణేశపురాణం చెబుతుంది. 

దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహంమీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరివుండే ఈ వినాయకుడి విగ్రహానికి క్రింది భాగంలో పది తొండాలు, ఇరవై చేతులు గల ‘మహోత్కట్’ వినాయకుని విగ్రహం ఉందని భక్తులు చబుతారు గానీ.. అది నిజం కాదని ఆలయ ధర్మకర్తలు చెప్తారు.ఈ ఎనిమిది వినాయక క్షేత్రాలలోనూ అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉంటాయి. 

ఈ క్షేత్రం దర్శించుకున్నాక తిరిగి ‘మయూరేశ్వరుని’ దర్శిస్తేనే ఈ యాత్ర పూర్తయినట్లు అని భక్తులు గ్రహించాలి.....!

బుకింగ్ కొరకు 
ఓ3మ్ శ్రీ హాలిడేస్ 
9440915570
 *వరలక్ష్మీవ్రతం - అంతరార్థం*
             ➖

*కోర్కెలు తీర్చే తల్లి ప్రతి వ్యక్తికీ అనేక కోరికలు ఉంటాయి. అవి తీరాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. అయితే కోరిక ఏదైనప్పటికీ, ఇచ్చే దైవం ఎవరైనప్పటికీ అంతిమంగా ఆ కోరికల్లో ఉండేది లేదా ఆ కోరికల ద్వారా అందుకునేది ఆనందం, తృప్తి మాత్రమే. ఈ విధమైన సంతృప్తి పొందిన వ్యక్తి మాత్రమే నిజమైన భాగ్యవంతుడు. అటువంటి భాగ్యాన్ని (లక్ష్మిని) అందించేది శ్రీ వరలక్ష్మీదేవి.*

*వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత వరలక్ష్మీదేవి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.*

*స్కాంద పురాణంలో వరలక్ష్మీ వ్రతం గురించిన వివరణ ఉంది. స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్నీ వివరిస్తాడు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది.*

 *శ్రీ లక్ష్మీదేవిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరిసంపదల్ని వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. శ్రావణమాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది.*

 *శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశకళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా జీవితకాలం ఉండాలని కోరుకుంటా మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. లక్ష్మీ నివాస స్థానాలు మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...*

 *పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్తాల్రు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ట స్థానం, ఆవు కొమ్ముల మధ్యన, పూజా మందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి.* 

*యః శుచిః ప్రయతో భూత్వా!జుహుయాదాజ్యమన్వహం శ్రియః!పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌!!*

 *లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని ఈ మంత్రానికి  భావం. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. పంచభూతాలకు ప్రతీక వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి.*

 *కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహపాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం.*

*కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్ని తత్త్వానికి సంకేతం. ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.*

*వరలక్ష్మీ వ్రతంలో వచ్చే పదములకు ముందుగా మనం ఉత్తమ అర్ధాలను తీసుకోవాలి.*

*వాటిలో ...ఈ క్రిందివి ముఖ్యమైనవి. కుండిన పురం= కుండలినీ నివసించే ప్రదేశం. చారుమతి=సర్వ శుభ లక్షణాలతో శోభించే మనసు కలిగినది...*

*అనగా శమ దమాది షట్క సంపత్తి..కలిగి దశ అవగుణాలైన కామ క్రోధ లోభ మోహ  మద మాత్సర్య ఈర్ష్య అసూయా రహిత తత్వమైన అనసూయత్వం కలిగిన మనసు కలిగి ఉండటం...!!! చారుమతీ తత్వం...ఇది..!!*

*ఇంటి పనులూ వంటపనులూ పశుపోషణా .... పొలం పనులూ ధాన్యమును సేకరించటానికి కావలసిన అన్ని జ్ఞానాలూ కార్యాలూ  సంస్కరణాది ప్రకృతి సేవలను భగవత్ కైంకర్యాలుగా చేసే తత్వం ఆమె సొంతం.*

*అలాంటి మనసు కలిగిన చారుమతి... పాల సముద్రమనే ప్రశాంత కడలిలో పవళించిన శ్రీమహా విష్ణువు యొక్క హృదయేశ్వరి అయిన వరాలను ఇవ్వగలిగిన శక్తి గల                                   శ్రీ వరలక్ష్మీదేవితో అను సంధానమైనది. కనుక శ్రీ వరలక్ష్మిదేవి ఆమె స్వప్న స్థితిలో తన దర్శనము నొసగింది.*
 🪔 పంచాంగం అంటే కేవలం తిథి, నక్షత్రం, రాహుకాలం చెప్పే పట్టికేనా?

ప్రతిరోజూ మనం పంచాంగంలో తిథి చూస్తాం… నక్షత్రం చూస్తాం… రాహుకాలం, యమగండం చూస్తాం.

కానీ ఎప్పుడైనా ఆలోచించారా?

చైత్రమాసం ఎప్పుడు మొదలవుతుంది? అమావాస్యతో నెల ఎందుకు ముగుస్తుంది? ఉత్తర భారతదేశంలో అదే రోజు మాసం పేరు ఎందుకు వేరుగా కనిపిస్తుంది? హైదరాబాద్‌లో ఉన్న రాహుకాలమే విశాఖపట్నంలోనూ ఉంటుందా?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే… మన పంచాంగం కేవలం తేదీల పట్టిక కాదని, సూర్యుడు–చంద్రుడు–నక్షత్రాలు–ఋతువులు–స్థానిక కాలం… వీటన్నింటినీ సమన్వయం చేసిన అద్భుతమైన భారతీయ కాలగణన వ్యవస్థ అని అర్థమవుతుంది.

🌙 చాంద్రమానం అంటే ఏమిటి?

చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకొని తిథులు, పక్షాలు, మాసాలను నిర్ణయించే విధానమే చాంద్రమానం.

ఒక చాంద్రమాసంలో 30 తిథులు ఉంటాయి.

శుక్లపక్షం — 15 తిథులు
కృష్ణపక్షం — 15 తిథులు

కానీ మన తెలుగు పంచాంగం చంద్రుని మీద మాత్రమే ఆధారపడదు. చంద్ర మాసాలు ఋతువులతో సమన్వయంగా ఉండేందుకు అవసరమైనప్పుడు అధికమాసం వస్తుంది.

అందుకే మన పంచాంగ వ్యవస్థను మరింత ఖచ్చితంగా చాంద్ర–సౌర కాలగణన (Lunisolar Calendar) అని చెప్పవచ్చు.

🌑 అమాంత పద్ధతి అంటే ఏమిటి?

‘అమాంత’ అనే పదంలోనే సమాధానం ఉంది.

అమా + అంతం = అమావాస్యతో మాసం అంతం.

అమావాస్య తరువాత వచ్చే శుక్లపక్ష పాడ్యమితో కొత్త మాసం ప్రారంభమై, తరువాతి అమావాస్యతో ఆ మాసం ముగుస్తుంది.

అంటే:

శుక్లపక్షం → పౌర్ణమి → కృష్ణపక్షం → అమావాస్య

ఉదాహరణకు చైత్ర శుక్ల పాడ్యమి — ఉగాది రోజున చైత్రమాసం ప్రారంభమవుతుంది. చైత్ర పౌర్ణమి తరువాత కృష్ణపక్షం కొనసాగి, చైత్ర అమావాస్యతో మాసం పూర్తవుతుంది. మరుసటి రోజు వైశాఖ శుక్ల పాడ్యమితో వైశాఖమాసం మొదలవుతుంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అమాంత సంప్రదాయం ప్రాచుర్యంలో ఉంది.

🌕 మరి పౌర్ణిమాంత పద్ధతి అంటే?

ఇక్కడ మాసం పౌర్ణమితో ముగుస్తుంది.

పౌర్ణమి తరువాత వచ్చే కృష్ణపక్ష పాడ్యమితో మాసం ప్రారంభమై, తరువాతి పౌర్ణమితో ముగుస్తుంది.

అంటే:

కృష్ణపక్షం → అమావాస్య → శుక్లపక్షం → పౌర్ణమి

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉంది.

✨ అమాంతం, పౌర్ణిమాంతం — అసలు తేడా ఎక్కడ?

ఇక్కడే చాలామందికి సందేహం వస్తుంది.

రెండు పద్ధతుల్లోనూ చంద్రుడు ఒకడే… తిథి ఒకటే… పౌర్ణమి ఒకటే… అమావాస్య ఒకటే.

మారేది చంద్రుని గమనం కాదు.

మాసాన్ని ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగిస్తున్నామనే సంప్రదాయం మాత్రమే.

దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాశివరాత్రి.

తెలుగు అమాంత పద్ధతిలో:

మాఘ కృష్ణ చతుర్దశి

పౌర్ణిమాంత సంప్రదాయంలో అదే రోజు:

ఫాల్గుణ కృష్ణ చతుర్దశి

రెండు శివరాత్రులు కావు!

రోజు అదే… తిథి అదే… ఆరాధన అదే… మారింది మాసనామం మాత్రమే.

ఈ చిన్న విషయం తెలియకపోతే రెండు పంచాంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని అనిపించవచ్చు.

🌺 చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, శ్రావణం… ఈ పేర్లు ఎలా వచ్చాయి?

మన మాసనామాల వెనుక కూడా ఖగోళ సంబంధమైన సంప్రదాయం ఉంది.

పౌర్ణమి సమయంలో చంద్రుని నక్షత్ర సంబంధాన్ని ఆధారంగా చేసుకొని మాసనామాలు ఏర్పడ్డాయి.

చిత్రా → చైత్రం
విశాఖా → వైశాఖం
జ్యేష్ఠా → జ్యేష్ఠం
శ్రవణం → శ్రావణం

ఇలా చైత్రం నుంచి ఫాల్గుణం వరకు పన్నెండు చాంద్రమాసాల వ్యవస్థ ఏర్పడింది.


☀️ సౌరమానం అంటే?

చంద్రుని బదులు సూర్యుని రాశి సంచారాన్ని ప్రధానంగా తీసుకుంటే అది సౌరమానం.

సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటాం.

మేషరాశిలో ప్రవేశం → మేషమాసం
వృషభరాశిలో ప్రవేశం → వృషభమాసం
మిథునరాశిలో ప్రవేశం → మిథునమాసం

తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల కాలగణనలో సౌరమాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

తెలుగు పంచాంగంలో ప్రధాన మాసగణన చాంద్రమానమైనప్పటికీ సంక్రాంతులు, సూర్యరాశి, ఉత్తరాయణం, దక్షిణాయనం వంటి అంశాల్లో సౌరగణనకు కూడా ప్రాధాన్యం ఉంది.

🌅 సావనమానం అంటే?

ఒక సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం వరకు ఒక సావన దినం.

30 సావన దినాలను ఒక సావనమాసంగా పరిగణిస్తారు.

యజ్ఞాలు, అనుష్ఠానాలు, కొన్ని శాస్త్రోక్త కాలవ్యవధుల నిర్ణయంలో దీనికి ఉపయోగం ఉంది. సాధారణ తెలుగు మాసనిర్ణయానికి మాత్రం ఇది ప్రధాన పద్ధతి కాదు.

⭐ నాక్షత్రమానం అంటే?

స్థిర నక్షత్రాలను ప్రమాణంగా తీసుకొని కాలాన్ని గణించే విధానం నాక్షత్రమానం.

చంద్రుడు 27 నక్షత్రాల నేపథ్యాన్ని ఒకసారి చుట్టివచ్చే కాలం సుమారు 27.3 రోజులు.



ఖగోళ గణితం, చంద్రుని నక్షత్రస్థితి వంటి అంశాల్లో ఇది ఉపయోగపడుతుంది.

🪐 బార్హస్పత్యమానం అంటే?

బృహస్పతి గమనంతో సంబంధం కలిగిన కాలగణనను బార్హస్పత్యమానం అంటారు.

భారతీయ కాలగణన సంప్రదాయంలో బృహస్పతి ఆధారిత సంవత్సర గణనకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన రోజువారీ తెలుగు పంచాంగంలోని తిథి, పక్షం, మాస నిర్ణయానికి ఇది ప్రత్యక్ష ప్రధాన ప్రమాణం కాదు.

📍 ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం — “స్థాన ప్రమాణం” ఎందుకు?

ఒకసారి హైదరాబాద్ పంచాంగంలో రాహుకాలం చూసి… అదే సమయాన్ని విశాఖపట్నం లేదా రాజమండ్రిలో కూడా యథాతథంగా పాటించవచ్చా?

ఖచ్చితంగా ఒకటే అని భావించడం సరైంది కాదు.

ఎందుకంటే రాహుకాలం అనేది ప్రతిరోజూ ఒకే గడియార సమయానికి వచ్చే స్థిరమైన కాలం కాదు.

ఆ రోజు స్థానిక సూర్యోదయం–సూర్యాస్తమయం మధ్య పగటి కాలాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి, వారాన్ని బట్టి నిర్ణీత భాగాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు.

అందువల్ల ప్రదేశం మారితే సూర్యోదయ–సూర్యాస్తమయాలు మారవచ్చు. వాటితో పాటు రాహుకాలం, యమగండం, గుళికకాలం వంటి సూర్యోదయాధారిత సమయాలు కూడా మారవచ్చు.

కాలమాన పద్ధతి: చాంద్రమాన అమాంత పద్ధతి
స్థాన ప్రమాణం:
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లేదా 
 హైదరాబాద్, తెలంగాణ
అని స్పష్టంగా పేర్కొనడం మరింత సముచితం.

⚠️ ముహూర్తాల విషయంలో ఇది మరింత ముఖ్యం

సాధారణ దినచర్యలో కొన్ని నిమిషాల వ్యత్యాసం పెద్దగా అనిపించకపోవచ్చు.

కానీ వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, శాంతి, హోమం వంటి శుభకార్యాలకు ముహూర్తం నిర్ణయించేటప్పుడు కార్యక్రమం జరిగే నిజమైన ప్రదేశమే ముఖ్యం.

అక్కడి అక్షాంశ–రేఖాంశాలు, స్థానిక సూర్యోదయం, తిథి–నక్షత్ర సంధులు మరియు అవసరమైన ఇతర పంచాంగ అంశాలను పరిశీలించాలి.

అందుకే హైదరాబాద్‌కు గణించిన సమయాన్ని రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం లేదా మరొక ప్రాంతానికి యథాతథంగా వర్తింపజేయడం అన్ని సందర్భాల్లో సరైన విధానం కాదు.

🙏🏻 మన దిన పంచాంగానికి ప్రమాణం

 మనం అందించే దిన పంచాంగం: “చాంద్రమాన అమాంత పద్ధతి — స్థాన ప్రమాణం”
ఆధారంగా సిద్ధమవుతుంది.

https://chat.whatsapp.com/KjFEtBA5XtTDfkyn5UNlIR


🪔 చివరిగా ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు…

అమాంతం — అమావాస్యతో మాసం ముగుస్తుంది.
పౌర్ణిమాంతం — పౌర్ణమితో మాసం ముగుస్తుంది.
సౌరమానం — సూర్యుని రాశి సంచారం ఆధారం.
సావనమానం — సూర్యోదయం నుంచి సూర్యోదయం ఆధారం.
నాక్షత్రమానం — నక్షత్రాల ఆధారిత కాలగణన.
స్థాన ప్రమాణం — పంచాంగ సమయాల ఖచ్చితత్వానికి అత్యంత ముఖ్యమైన ఆధారం.

🙏🏻 మన పూర్వీకులు కాలాన్ని కేవలం గంటలు, నిమిషాలుగా చూడలేదు.

సూర్యుని గమనాన్ని గమనించారు… చంద్రుని కళలను లెక్కించారు… నక్షత్రాలను పరిశీలించారు… ఋతువులను సమన్వయం చేశారు… మనిషి జీవనాన్ని ప్రకృతి గమనంతో అనుసంధానించారు.

అందుకే పంచాంగం అంటే కేవలం “ఈరోజు మంచి సమయం ఏది?” అని చూసే పుస్తకం మాత్రమే కాదు.

ఆకాశంలో జరిగే ఖగోళ గమనాన్ని… భూమిపై మన జీవనంతో అనుసంధానించిన భారతీయ కాలగణన సంప్రదాయం.

పంచాంగాన్ని తెలుసుకోవడం అంటే… మన పండుగల వెనుక ఉన్న కాలాన్ని, మన ఆచారాల వెనుక ఉన్న గణనను, మన సంస్కృతి కాలాన్ని ఎలా దర్శించిందో తెలుసుకోవడం. 🙏🏻
 #కాళికే_పాపహారిణి_దృష్టిదోష_వినాశిని 

#శత్రు_సంహారిణి_మాతా_రక్ష_రక్ష_నమోస్తుతే 🙏🌷

#నమః_పార్వతీ_పతయే_హర_హర 

#మహాదేవ_శంభో_శంకర..!🙏🌹

🙏#తమలపాకు_యొక్క_ఆధ్యాత్మిక_రహస్యం 🙏

భారతీయ సంప్రదాయంలో, తమలపాకు కేవలం ఆతిథ్యానికి లేదా అలంకరణకు చిహ్నం మాత్రమే కాదు, అది జీవితంలోని సకల సారాలకు ప్రతీక...... భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల మధ్య సమతుల్యతను నెలకొల్పడం ద్వారా పరిపూర్ణత కోసం కృషి చేయాలని ఇది సూచిస్తుంది.....  ఆదిశక్తి మాత యొక్క దివ్య నామాలలో ఒకటి "#తాంబూలప్రియ," అంటే ఆమె తమలపాకును ప్రియంగా భావిస్తుంది..... అయితే, ఇందులో ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉంది..... అమ్మవారికి ప్రియమైన తమలపాకు భౌతికమైనది కాదు, దివ్యమైనది  అది కేవలం ఒకే సారాన్ని, అంటే అమృత తత్వ సారాన్ని మాత్రమే కలిగి ఉంటుంది......  ఒక భక్తుడు సంపూర్ణ భక్తి, ప్రేమ మరియు ఏకాగ్రతతో అమ్మవారి దివ్య నామాలను జపిస్తూ, ఆమె ఆరాధనలో లీనమై #చైతన్యపు హద్దులను #అధిగమించినప్పుడు, అతను సహస్రార చక్రం నుండి దివ్య అమృతాన్ని అనుభవిస్తాడు..... యోగ శాస్త్రంలో దీనిని అమృతధార లేదా #అమృతతత్త్వం అని అంటారు.... ఈ దివ్య సారం సాధకుడి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఆనందం, శాంతి మరియు పరమ చైతన్యంతో నింపుతుంది.....  ఈ అమృతం తాంబూలప్రియ మాతకు అత్యంత ప్రియమైనది... అంటే, బాహ్య ఆడంబరం కంటే కూడా, సాధకుడి యొక్క శుద్ధ భక్తి, నిస్వార్థ ప్రేమ మరియు ఆత్మ సాక్షాత్కారమనే అమృతాన్ని అమ్మవారు ఎక్కువగా ఆస్వాదిస్తారు.... సాధకుడు స్వయంగా #చైతన్యమనే_అమృతంలో #స్థిరపడినప్పుడు మాత్రమే, అతని ఆరాధన 
అమ్మవారికి నిజంగా ప్రియమైనదిగా మారుతుంది....
ఈ విధంగా, "#తాంబూలప్రియ" అనే నామం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, అమ్మవారి నిజమైన ఆనందం బాహ్య నైవేద్యాల ద్వారా కాకుండా, మనస్సాక్షి యొక్క శుద్ధత, అవిచ్ఛిన్నమైన భక్తి మరియు ఆధ్యాత్మిక అమృతానుభూతి ద్వారా లభిస్తుంది..... ఇదే సాధన యొక్క అంతిమ రహస్యం మరియు అమ్మవారి ఆరాధన యొక్క అత్యున్నత లక్ష్యం.....

#ఓం_నమశ్శివాయ ....!!  #ఓం_అరుణాచల_శివ
 *బ్రహ్మ    కపాలం*

➖➖➖➖✍️

 "శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు```పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.   నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ, ఆయన ఊర్ధ్వ ముఖం(ఐదవ ముఖం) పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు. 

మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!,
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది. 

కానీ కిందపడలేదు,శివుడి అరచేతికి అతుక్కుపోయింది.

అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. 

క్రమక్రమంగా ఎండి, చివరికది, కపాలంగా మారిపోయింది. 

బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే, అది సరాసరిబ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది. 

జగద్గురువు, మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు. 

దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా! పరమజ్ఞానివి. నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి. శాసించగలవాడివి. అయినా, మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు. కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము. 
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు . కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. 

భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ..మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. 

హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. 

అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి “పరమశివా, 
నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా! ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా?” అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు?పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.

అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. 

ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. 'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్విఖితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది. అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికితోడు నాశక్తి, శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.' అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. 

అంతే! 

ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.

తమ పితృదేవతలను పునరావృతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!✍️```
.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                     🌷🙏🌷
 త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి *మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి “నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక” అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను.* 

చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ అందరు శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి..

*పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే* |
*నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా* ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగ వాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.

( *అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి* )

👉 *ముత్తైదవులకు వాయనం, పసుపు,కుంకుమలు ఇవ్వాలి. సాయంత్రం పేరింటం అవకాశాన్ని బట్టి ముత్తైదువలకు తాంబూలం, పండ్లు తదితర సుమంగళి పదార్తాలను సమర్పించాలి.*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏