కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
👉 *గణపతి పూజ*
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే
*వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ*
*నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా*॥
*ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥*
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,.. ఓం ఏకదంతాయ నమః,....
ఓం కపిలాయ నమః..., ఓం గజకర్ణికాయ నమః....,
ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః,....
ఓం విఘ్నరాజాయ నమః,.... ఓం గణాధిపాయ నమః,....
ఓంధూమకేతవే నమః,.... ఓం గణాధ్యక్షాయ నమః...,
ఓం ఫాలచంద్రాయ నమః...., ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః..., ఓం శూర్పకర్ణాయ నమః,...
ఓం హేరంబాయ నమః,... ఓం స్కందపూర్వజాయనమః,...
*ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.*
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా... గుడ సహిత (బెల్లం) ఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి....నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! *అనేన మయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!*
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.
*ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం... వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.*
=====================
*పూజ ప్రారంభము* //// *వరలక్ష్మీదేవి ధ్యానం*////
*నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే*
*శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే !!*
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః || అక్షింతలు వేయాలి.
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి
దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి ఆవాహయామి
అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి
సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి
రత్నసింహాసనం సమర్పయామి అక్షింతలు వేయాలి.
శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి
రాగి/స్టీల్ పల్లేంలో నీళ్ళు వదలాలి
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి
అమ్మవారిపై నీళ్ళు చల్లాలి
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
నీళ్ళు చల్లాలి
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి పంచామృతం చల్లాలి
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
నీళ్ళు చల్లాలి
సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రం సమర్పించాలి
కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి
ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి.
తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
No comments:
Post a Comment