Thursday, 20 August 2026

 🇮🇳 वन्दे मातरम्। 🫡
తాత్పర్య సహిత సంపూర్ణ వందేమాతర గీతం

वन्दे मातरम्। सुजलाम् सुफलाम् मलयजशीतलाम्, शस्यश्यामलाम् मातरम्। वन्दे मातरम् !

వందే మాతరమ్! సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం, మాతరమ్! వందే మాతరమ్!

(అమ్మలాంటి నా మాతృభూమికి వందనం చేస్తున్నాను. మంచి నీళ్లతో, సమృద్ధిగా పండే పంటలు/ఫలాలతో, చల్లని చందనపు గాలులతో శోభిల్లే ఓ మాతృభూమీ, పచ్చని పైర్లతో నిండి ప్రశాంతంగా వెలిగిపోతున్న ఓ అమ్మల కన్న అమ్మా! నీకు వందనం!)

शुभ्रज्योत्स्ना पुलकितयामिनीम्, फुल्लकुसुमित द्रुमदलशोभिनीम्, सुहासिनीम् सुमधुरभाषिणीम्, सुखदाम् वरदाम् मातरम्। वन्दे मातरम् ।  

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం, 
ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం,
సుహాసినీం, సుమధుర భాషినీం, 
సుఖదాం, వరదాం, 
మాతరమ్! వందే మాతరమ్!

(తెల్లని వెన్నెల కాంతులతో పరవశించి పోయే రాత్రులు కలదానా,
వికసించిన పువ్వులతో, దట్టమైన చెట్ల ఆకులతో అందంగా ప్రకాశించేదానా,
చక్కని చిరునవ్వు చిందించేదానా, తీయని మాటలు మాట్లాడేదానా,
సుఖాలను, శుభకరమైన వరాలను ఇచ్చే ఓ మాతృభూమీ! నీకు వందనం!)

कोटि-कोटि कण्ठ कल-कल निनाद कराले, कोटि-कोटि भुजैधृत खरकरवाले, के बॉले माँ तुमि अबले, बहुबलधारिणीं नमामि तारिणीम्, रिपुदलवारिणीं मातरम्। वन्दे मातरम् 

కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే,
కోటి కోటి భుజైర్ధృత ఖరకరవాలే, 
కే బాలే మా తుమి అబలే, బహుబల ధారిణీం, నమామి తారిణీం,
రిపుదళ వారిణీం, 
మాతరమ్! వందే మాతరమ్!

(కోటానుకోట్ల మంది ప్రజల కంఠాల నుంచి వచ్చే జయజయధ్వనులతో భయంకరమైన శక్తి కలిగి, కోటానుకోట్ల  చేతుల్లో పదునైన కత్తులు పట్టుకుని శత్రువులను భయపెట్టేదానా,
ఇంతటి శక్తి ఉన్నప్పటికీ నిన్ను 'అబల' అని ఎవరు అంటారు? అపారమైన బలము కలిగినదానా, మమ్మల్ని కాపాడే దేవివి నీవే, నీకు నమస్కరిస్తున్నాను. శత్రువుల మూకలను సంహరించి నిరోధించే ఓ మాత�

No comments:

Post a Comment