Sunday, 20 July 2025

 *📖 మన ఇతిహాసాలు 📓*


*మహాభారతంలో మొదటిసారి కృష్ణుడు, అర్జునుడు ఎప్పుడు, ఎక్కడ కలిశారు?*


మహా భారతంలో కృష్ణుని పాత్ర ద్రౌపదీ స్వయంవరం సమయంలో హఠాత్తుగా ప్రవేశిస్తుంది. అంతవరకు ఎక్కడా కృష్ణుని ప్రసక్తి లేదు. స్వయంవరంలో కృష్ణుడు కేవలం పాల్గొన్నాడు తప్ప మత్స్య యంత్రాన్ని ఛేదించే ప్రయత్నం చేయలేదు. స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించిన తరువాత బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ యువకుడు అర్జునుడే అని కృష్ణుడే ముందుగా గుర్తు పట్టి ఆ విషయం బలరాముడితో చెప్పాడు. అంతే కాదు, అక్కడ యుద్ధానికి సిద్ధమైన ఇతరరాజులతో స్వయంవరంలో ఆ బ్రాహ్మణుడు ద్రౌపదిని గెలుచుకోవడం న్యాయమేనని చెప్పి అందరినీ శాంతింపజేసాడు. తరువాత వారితో బాటే వారు విడిదిచేసిన ఇంటికి వెళ్లి కుంతీ దేవిని కలిసాడు.

అప్పటినుండీ కృష్ణార్జునులు ప్రియమిత్రులై పోయారు. ఎంతగా అంటే ద్రోణ పర్వంలో ఒకసారి కృష్ణుడు తన సారథి దారుకునితో అర్జునుని గురించి మాట్లాడుతూ తనకు అర్జునుడికన్నా ప్రియమైన వారు తన భార్యలలో గాని, పుత్రులలో గాని, బంధువులలోగాని, ఇతర మిత్రులలో గానీ ఎవరూ లేరని చెప్పాడు.

No comments:

Post a Comment