[7/18, 08:18] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
ధైర్యయుతున కితర ధనమైన నరు
దాన మిచ్చినపుడె తనకు దక్కె
ఎలమి మించుపనికి నెవరేమి సేతురు?
విశ్వదాభిరామ వినురవేమ!
*భావం:-*
ధైర్యవంతుడు ఎటువంటి కార్యముచేసినా సఫలమవుతుంది. దాని ఫలములు ఖచ్చితంగా దక్కుతాయి. పైగా అది తన వద్ద ఉంచుకోక ఇతరులకు దానిమిస్తాడు. ఇటువంటి వాడు ఉత్తములలోకెల్ల ఉత్తముడు. ఈ లోకములో దెన్నైనా ధైర్యముతో సాధించవచ్చు, కాబట్టి పిరికితనము కట్టిపెట్టి ధైర్యముతో పని మొదలుపెట్టాలి.
[7/18, 08:18] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో.. ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో.. ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో.. వారే మన ఆత్మీయులు..*
[7/18, 08:18] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న*
ఎవరికి వారు తామె గొప్పవారమని విర్ర వీగుతుంటారు. ఒకరికి మించిన వారు మరొకరు వుంటారని వారు ఎరుగరు. అలా విర్ర వీగే వారి గురించి ఈ సామెత వాడతారు. అలాంటిదే మరో సామెత ఉంది. అది. తాడిని తన్నే వాడుంటే..... వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు.
[7/18, 08:18] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*కచ్చాగోలీలాట*
పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు.
[7/18, 08:18] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*పుల్లకాయ🥓*
అమ్మ చేతి వంట
కమ్మగుంటదంట
నాన్న చేతి దెబ్బ
సుర్రుమంటదంట
ఎదురింటి జామకాయ
తియ్యగుంటదంట
పక్కింటి చింతకాయ
పుగుంటదంట
*డా.ఎం.హరి కిషన్ - 9441032212*
No comments:
Post a Comment