Tuesday, 22 April 2025

 *_ఏమిచ్చి తీర్చేవు_*
*_నేల తల్లి రుణం..!?_*

################

*కన్నతల్లి కూడా* 
*నిన్ను నవమాసాలే మోస్తుంది..*
*ఆ తల్లి తొమ్మిది నెలల* *తర్వాత పురిటి నొప్పులు* 
*పడి నిన్ను కనేసి పడేసేది* 
*ఈ నేలతల్లిపైనే..*
*అప్పటి నుంచి* 
*నీకు అన్నీ సమకూరుస్తూ..* 
*నిన్ను సహిస్తూ..* 
*నిన్ను భరిస్తూ జీవితాంతం* 
*నిన్ను మోసేది* 
*ఆ భూమితల్లే..!*
    
*అంతేనా..నీ చివరి  ప్రయాణం వరకు నీ వెంట* *ఉండడమే గాక నిన్ను తనలో*
*కలిపేసుకునేది కూడా* 
*ఆ భూమాతే..!*
     
*మరి అలాంటి తల్లికి* 
*నీ రుణం తీర్చుకునేదెలా..*
*తనలోని పచ్చదనాన్ని*
*కాపాడుతూ..* 
*ఓ మొక్క నాటు..*
*అక్కడితో పనైపోయిందనుకోక* 
*రోజూ దానికి* 
*నీళ్ళు పోసి పెంచు..*
*ప్రకృతి పొగబారకుండా*
*నీ వంతు  కృషి చెయ్యు..!*
   
*తల్లి రుణం తల కొరివితో*
*తీరుతుందేమో..*
*నేల తల్లి రుణం తీరాలంటే*
*పర్యావరణ పరిరక్షణకు*
*చేతనైందల్లా చెయ్యవోయ్..!*

*_ప్రకృతిలోని పచ్చదనం.._*
*_నీ ఇంట చల్లదనం..!_*
🌴🌴🌴🌴🌴🌴🌴

_సురేష్ కుమార్ ఎలిశెట్టి_

No comments:

Post a Comment