🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
*_🔥వేసవిలో డీహైడ్రేషన్ లేదా వేడి వల్ల తలెత్తే ప్రతీ ఇబ్బందికి కొబ్బరి నీళ్లను ఒక పరిష్కారంగా చూస్తుంటారు.._*
*_🫒 ఒంట్లో వేడి తగ్గుతుందని, దాహం తీరుతుందని, నీరసం తగ్గుతుందని అందరూ కొబ్బరి నీళ్లను తాగుతుంటారు.._*
*_🫒 అంతేకాదు, కొబ్బరి నీళ్లు తాగితే హ్యాంగోవర్ తగ్గుతుందని, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని, డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుందని కూడా అంటుంటారు. మరి ఇందులో నిజమెంత? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?_*
*_🫒 వీటితో పాటు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.._*
*_🫒 కొబ్బరి నీళ్లలో ఏమేం ఉంటాయి ?_*
*_ఆకుపచ్చగా ఉండే లేత కొబ్బరి కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయి. పండించే నేలను బట్టి, రకాన్ని బట్టి కొబ్బరి కాయల్లోని నీళ్ల రుచిలో కాస్త మార్పులు ఉంటాయి.._*
*_🫒 ఒక 100 మి.లీ. కొబ్బరి నీటిలో 18 కేలరీలు, 0.2 గ్రాముల ప్రోటీన్, 0 ఫ్యాట్, 4.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.1 గ్రాముల చక్కెర, 165 మి. గ్రాముల పొటాషియం ఉంటుందని అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్‌కు చెందిన పోషకాహార నిపుణులు చెపుతున్నారు.._*
*_🫒 అలాగే ఎలక్ట్రోలైట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు ఒక అద్భుతమైన పానీయమని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పూజ మఖీజా చెప్పినట్లు వోగ్ వెబ్సైట్ పేర్కొంది.._*
*_🫒 ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరంలోని కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కొబ్బరి నీళ్లలో అనేకం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.._*
*_🫒 ఖనిజాల గని.._*
*_కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని ఎన్ఐహెచ్ పేర్కొంది.._*
*_🫒 శరీరం ప్రోటీన్లను తయారు చేసుకోవడంలో సహాయపడే ఎల్-అర్జినిన్ అనే అమైనో యాసిడ్, లేత కొబ్బరి నీళ్లలో ఉంటుందని ఫార్మాస్యూటికల్ రీసర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ పేర్కొంది.._*
*_🫒 ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధించడంలో ఈ అమైనో యాసిడ్ సహాయపడుతుంది.._*
*_🫒 రక్తపోటును తగ్గించడానికి, శారీరక కారణాలతో ఏర్పడే అంగస్తంభన సమస్యకు చికిత్సగా ఎల్-అర్జినిన్ ఉపయోగపడుతుందని మయో క్లినిక్ వెబ్సైట్ పేర్కొంది.._*
*_🫒 జంతువులపై చేసిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న రెండు సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కొబ్బరి నీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని రిపోర్టులు సూచిస్తున్నాయి..._*
*_🫒 ఈ నీళ్లలోని మెగ్నీషియం మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా మెగ్నీషియం సహాయపడుతుంది. అయితే, అవకాడో, అరటిపండ్లలో కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.._*
*_🫒 కిడ్నీలో రాళ్లకు ఔషధం.._*
*_కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడినంత ద్రవాహారాన్ని అందించాలి._*
*_🫒 కాల్షియం, ఆక్సలేట్ వంటి సమ్మేళనాలు కలిసిపోయి గట్టిగా స్పటికంలా, రాళ్లలా ఏర్పడినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయని అంటుంటారు.._*
*_🫒 అయితే, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా అవి కిడ్నీలకు, మూత్రనాళాలకు అంటుకోకుండా నివారిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.._*
*_🫒 గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని హెల్త్ లైన్ వెబ్సైట్ పేర్కొంది..._**
*_🫒 కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో పొటాషియం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ వంటివి టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడతాయి. మాంగనీస్‌లో యాంటీ ఇన్ఫ్లమేషన్ (మంట) లక్షణాలు ఉంటాయి. హ్యాంగోవర్ లక్షణాల చికిత్సలో ఇది ప్రయోజనకరం.._*
*_🫒 అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత లోపించినప్పుడు కూడా తలనొప్పి, నీరసం, వికారం వంటివి కలుగుతాయి. అప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కాస్త కోలుకున్న అనుభూతి కలుగుతుంది._*
No comments:
Post a Comment