*🦅సర్ప(నాగ)దోషాలు పోగొట్టే గరుత్మంతుడు*
🙏🦅🙏మహోన్నతమైన శక్తికి, అచంచలమైన భక్తికి ప్రతీక గరుత్మంతుడు🙏🦅🙏
*🙏🦅 పక్షుల్లో గరుత్మంతుడు నేనే🦅🙏*
అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట ఇది
🐍🦅ఇంతకుమించి గరుత్మంతుడి ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు.
🐍🦅శ్రీమహావిష్ణువు వాహనం గరుత్మంతుడు ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుడు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
🐍🦅మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంహరించే మహత్తరశక్తి అతనికి ఉంది. గరుడవేగం అందుకోవడం మరే ఇతర ప్రాణికీ సాధ్యం కాలేదని పురాణవచనం.
🐍🦅శ్రీహరి వాహనంగా, దాసుడిగా మాత్రమే కాదు... తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడు గరుత్మంతుడు
🐍🦅ఒకరోజున ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి.
‘‘ఏమైంది? ఏమిటి ఈ అపశకునాలు?’’ అడిగాడు ఇంద్రుడు దేవగురువుని ఆందోళనగా.
🐍🦅ఆయన దివ్యదృష్టితో చూసి ‘‘తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుడుడు వస్తున్నాడిక్కడికి. మహాబలుడు, వీరుడు అయిన గరుత్మంతుడు నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు’’ అన్నాడు బృహస్పతి.
🐍🦅గురువు మాటలతో అంతా అప్రత్తమయ్యారు. కవచాలూ, ఆయుధాలూ ధరించి, అమృత భాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. అంతలో అక్కడకి రానే వచ్చాడు గరుత్మంతుడు.
🐍🦅నేరుగా అమృత భాండం దగ్గరే వాలి దాన్ని అందుకోబోయాడు. రకరకాల ఆయుధాలతో అతనిమీద దాడి చేశారు రక్షకులు. గరుత్మంతుడు రెక్కలొక్కసారి బలంగా జాడించాడు. ఆ గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండుటాకుల్లా ఎగిరి అల్లంతదూరాన పడ్డారు. గరుడుని మీదికి ఉరికిన అగ్ని వాయు యమ కుబేర వరుణాది దిక్పాలురు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తల వంచక తప్పలేదు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు.
🐍🦅అయితే భాండం చుట్టూ ఆకాశాన్నంటేలా మహాగ్ని కీలలు లేచాయి. రివ్వున వెళ్లి నదుల నీళ్ళన్నీ పుక్కిట బట్టి వచ్చి ఆ నీటిని ఆ అగ్ని మీద కుమ్మరించడంతో ఆరిపోయింది. అంతలో అమృతం చుట్టూ తిరుగుతూ కత్తులు దూస్తున్నట్టుగా యంత్రచక్రం కనిపించడంతో గరుడుడు వెంటనే సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలకి ప్రవేశించాడు. భాండాన్ని చుట్టుకుని రెండు మహాసర్పాలు పడగ విప్పి, కోరలు సాచి పైకి లేచాయి. రెండు పాములమీదా చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి, ముక్కుతో అమృతభాండాన్ని అందుకుని ఆకాశానికి ఎగిశాడు.
🐍🦅ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. పాములు అడిగినందుకు అమృతం తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడితను అనుకున్నాడు విష్ణువు. వెంటనే అతని ముందు సాక్షాత్కరించాడు.
🐍🦅”ఓయి గరుత్మంతా! నీవు ఈ అమృతాన్ని చేజిక్కించుకుని సేవించకుండా ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగితే నాకు ఈ అమృతం వద్దు కాని మా అమ్మ దాస్య విముక్తి కోసం నాగులకు ఇవ్వడం కోసం తీసుకువెళ్తున్నాను.” అని చెప్పాడు. మహావిష్ణువు గరుత్మంతుని మాతృభక్తికి మెచ్చి నీకు ఏమివరం కావాలో కోరుకోమన్నాడు. గరుత్మంతుడు ”స్వామి నీ దర్శనం లభించింది. చాలు. ఇంక ఏ వరాలు నాకు వద్దు. కాని నీవు ఇస్తానంటున్నావు కనుక నేను సదా నీ సేవలో ఉండే భాగ్యాన్ని కలుగచేయి” అని అడిగాడు.
🐍🦅‘ఖగరాజా ‘‘నాకు వాహనంగానూ, నా రథానికీ పతాకం గానూ ఉండు ’’ అన్నాడు అనుగ్రహ పూర్వకంగా చూస్తూ.నారాయణుడు
*‘‘ధన్యుణ్ణి స్వామీ!’’ అంటూ కైమోడ్చాడు గరుత్మంతుడు.*
🐍🦅గరుత్మంతుడి పేరుతో అధర్వణవేదంలో ప్రత్యేకంగా 'గరుడోపనిషత్తు’ ఉంది. ఇందులో గరుత్మంతుడిని ‘విషదహారి’ అనే పేరుతో ప్రత్యేకంగా వివరించారు. గరుత్మంతుడి విగ్రహ స్వరూపం కూడా ఇందులో ఉంది. దీని ప్రకారం...
🐍🦅గరుత్మంతుడు తన కుడిపాదాన్ని స్వస్తికంగా, ఎడమపాదాన్ని కుంచితంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు. సర్పజాతికి అంటే పాములకు గరుత్మంతుడు అంటే భయం .గరుత్మంతుడు ఆభరణాలుగా శ్రేష్ఠమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు.
🐍🦅వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా, తక్షకుడిని నడుముకు సూత్రంగా, కర్కోటకుడిని మెడలో హారంగా ధరిస్తాడు. కుడిచెవికి పద్ముడిని, ఎడమచెవికి మహాపద్ముడిని కుండలాలుగా పెట్టుకుంటాడు. శిరస్సుపై శంఖుడు, భుజాల మధ్య గుళికుడు అలంకారాలుగా ఉంటారు. ఇతర ఆభరణాలు కూడా సర్పాలే. అతడికి పొడవైన బాహువులు, పెద్ద మూపు, వంద చంద్రుల కాంతివంతమైన ముఖం ఉంటాయి. గరుత్మంతుడిని ధ్యానించడం, అర్చించటం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి.
🐍🦅సర్పాలకు (నాగులకు) గరుత్మంతుడు అంటే భయం అందువలన గరుత్మంతుని, ధ్యానిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, నీతి, నిర్భయం, ధైర్యం కలుగుతాయి. మృత్యు భయం ఏమాత్రం ఉండదు. సర్వత్రా విజయం కలుగుతుంది.
నాగదోషములు కాలసర్పదోషములు ఉంటే అవి హరించి పోతాయి.రాత్రిపూట భయంగొలిపే కలలు రావటం,కలలో నాగులు (పాములు) కనిపించటం వంటివాటికి దోష నివృత్తి కలిగి కలలురావటం నిలిచి భయం తొలగి పోతుంది.
🐍🦅గరుత్మంతుడికి ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఉంది వ్యాసమహర్షి రాసిన 18 పురాణాల్లో గరుడపురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి. ఇలా ఒక సేవకుడు, పక్షిజాతికి చెందిన వ్యక్తిపేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది.
🐍🦅గరుత్మంతుడి పరాక్రమానికి, శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది. ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగంతో రామలక్ష్మణులిద్దరూ మూర్ఛపోతారు.
నాగపాశాల నుంచి వారిని విడిపించటం ఎవరివల్లా కాలేదు. ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు. అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలమవుతుంది. అతడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి. గరుడుడి స్పర్శతో క్షణకాలంలో గాయాలు మాని, వారిద్దరికీ దివ్యతేజస్సు కలుగుతుంది. గరుత్మంతుడే ఆదుకోకపోతే రామాయణం ఏ మలుపు తిరిగేదో?
🐍🦅తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే. శ్రీవారి ఉత్సవాల ప్రారంభసూచకంగా గరుడ చిత్రం ఉన్న పతాకాన్ని అర్చకస్వాములు ఎగురవేస్తారు. ఉత్సవాలకు రావాల్సిందిగా ముక్కోటి దేవతల్ని ఆయనే ఆహ్వానిస్తాడు. అలాగే, బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహనసేవల్లో గరుడ వాహనసేవ ఎంతో ప్రత్యేకమైంది. దాసుడిగా మిత్రుడిగావిసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా... ఇలా తన జీవిత సర్వస్వాన్నీ శ్రీహరి సేవకు అంకితం చేసిన దాసోత్తముడైన ఆయనను వైష్ణవ సంప్రదాయంలో గరుడాళ్వార్ పేరుతో కొలుస్తారు. అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో అనేక చోట్ల ఈ పక్షీశ్వరుని స్తుతిస్తా *‘గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పురుషులదివో వచ్చి పై పై సేవించెను’* అంటూ నల్లనిస్వామి వివాహ వేడుకల వైభవానికి గరుడుడు కూడా ఓ కారణమంటాడు అన్నమయ్య.
ప్రతి వ్యక్తీ రాత్రి నిద్రపోయే ముందు
🐍🦅 *రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం।*
*శయనే యఃపఠేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి ।।*
🐍🦅అనే శ్లోకాన్ని చదువుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు వీరిని తలుచుకుంటే దుస్వప్నాలు కలగవని దీని భావం. మనిషికి కలిగే బాధను తీర్చే శక్తి పక్షికి ఉండటం గమనించదగిన విశేషం.
🐍🦅ఆయన పైన ఎక్కి కూర్చోవాలి అంటే అది లక్ష్మీ నారాయణులు లేదా శ్రీమన్నారాయణుడి అవతారాలు మాత్రమే
🐍🦅చేతిలో డబ్బులు ఉన్నాయి
చెయ్యడానికి పనివారు వున్నారు అని ఎవ్వరికి పడితే వారికి గరుత్మంతుడుని వాహనంగా ఉపయోగిస్తే వంశక్షయం తప్పదు.
No comments:
Post a Comment