ఈ రోజు ప్రశ్న కు సమాధానం.
ప్రశ్న : కలియుగం లో తొందరగా భగవంతుని అనుగ్రహము పొందే వారు ఎవరు.
సమాధానం : బ్రహ్మః వైవర్త పురాణం లో నారద మహర్షి కీ స్వయం గ శివుడు చెప్పిన విషయాలు ఈ పోస్ట్ కు ఆదారం.
ఉదయం నేను అడిగిన ప్రశ్న కు చాలా మంది తమకు తోచిన సమాధానం చెప్పారు.
కానీ భగవంతునీ భక్తి తొందరగా అందరికి అలవడదు.
అయితే అదృష్టం కొద్ది ఎవరకైనా భక్తి అలవడి తొందరగా భగవంతుని అనుగ్రహం పొందే భాగ్యం ఈ కలియుగం లో ఎవరికి ఉంది అంటే ఇద్దరికీ ఉంది వారు ఎవరంటే మొదట సూద్రులు రెండు స్త్రీ లు...
దీనికి పెద్ద ఉదాహరణ.
నిత్యము బంగారు పుష్పాల తో తనను పూజించే తొండమాన్ చక్రవర్తి కంటే తన పనీ చేసుకొంటూ తనకు తోచిన విధంగా మట్టి పువ్వులతో పూజ చేసిన కుమ్మరి భీముడు తనకు ఇష్టుడు అన్నాడు శ్రీనివాసుడు.
అలాగే నిత్యమ్ నమక చమకాలతో తనను పూజించే పూజారికీ ఇవ్వని దర్శనమును కైవల్యాన్ని తనకు తోచిన పూజ చేసిన తిన్నడి కీ ఇచ్చాడు శివుడు.
అలాగే నిత్యమ్ ఇంటి బాధ్యతలు చూసుకొంటూ భర్త సంసారం పిల్లలు ఆని వారి ధ్యాస లో గడిపే ఇల్లాళ్ళు( ఇక్కడ నాకు నిజం గా ఆశ్చర్యం కలిగించే అంశం ఒకటి ఉంది పెళ్ళైన అమ్మాయి తనను పెంచి పెద్ద చేసి న తల్లి తండ్రి కుటుంబం ఊరు అయినవాళ్ళు అందరిని వదిలి భర్త అత్తమామలు మరిది ఆడపడుచు అంటూ కొత్త కుటుంబం తో కలిసి జీవించడం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే అంశం మన సనాతన ధర్మం లో స్త్రీ లు కుటుంబానికి మాంగల్యానికి ఇచ్చే విలువ ఎంత గొప్పదో అనిపిస్తుంది )కొత్త తనకు చేసే కొద్దీ పాటి పూజ కే వారిని ఉద్ధరించి కరుణిస్తాడు భగవంతుడు. దానికి ఉదాహరణ సతి సక్కుబాయి,
భక్త మీరాభాయి.
కాబట్టి అందరూ అనుకొన్నట్టు భగవంతుడు బ్రాహ్మణ పక్షపాతి కాదు అలాగే ఎడారి మతాల లో లాగ స్త్రీ లు పురుషుని కంటే తక్కువ అనే భావము సనాతన ధర్మం లో ఏమాత్రము లేదు పైగా ఈ ధర్మం లో స్త్రీ కీ ఇచ్చిన విలువ అపారము.
అందుకే తల్లి నీ మించిన దైవం లేదు అంటుంది సనాతన ధర్మం.
జై శ్రీ కృష్ణ 🙏🌺
No comments:
Post a Comment