Thursday, 20 August 2026

 ఓం జయాయై నమః                        ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః                        ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః                    ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః                ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః                    ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః                    ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయైనమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః            ఓం భువనేశ్వర్యై నమః (108)

*శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీతర్థ్యం అష్టోతర శతనామావళి సమర్పయామి.*

దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి
అగరవత్తులు/ధూప్‌స్టిక్ లేదా సాంబ్రాణి వేయండి, వెలిగించండి

ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి

(పూజ ప్రారంభంలోనే వెలిగించి ఉంటుంది కాబట్టి దీపం కుందిలో నూనె లేదా నెయ్యి మరోసారి వేయండి. దీపానికి నమస్కారం చేయండి)

నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి    
పిండి వంటలపై నీళ్ళు చల్లాలి

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి  నీళ్ళు చల్లాలి

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

తాంబూలం  తమలపాకు, వక్కలు, దక్షిణతో పెట్టండి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి

కర్పూరం వెలిగించాలి

*పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే*
*నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా*
*మహాదేవ్యైచ విద్మహే, విష్ణుపత్నీచ ధీమహి!*
*తన్నో లక్ష్మీప్రచోదయాత్‌ !!*
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి.

తర్వాత...
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి

❗ *తోరగ్రంధి పూజ:* 

తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి  ఈ విధంగా పూజ చేయాలి
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి
చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి
తోరము కడుతూ కింది శ్లోకం చదవాలి..

 *తోరబంధన మంత్రం:* 

బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే

*వాయన విధి*:

 *ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః* 
 *దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే* 

ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

*వాయనదాన మంత్రం*:

👉 ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ
ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః 👈
*ఇతి పూజా విధానం సంపూర్ణం*.

👉 *వరలక్ష్మీ వ్రత కథ* : 🙏

( ❗*కథ ప్రారంభం  ఈ సమయంలో చక్కగా కూర్చుని, అక్షింతలు చేతిలో తీసుకొని, కథను భక్తి చదవండి లేదా శ్రద్దలతో వినండి*❗)

రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ ఆ సరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.

మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించు చుండెను.

No comments:

Post a Comment