Saturday, 23 May 2026

 🙏 *రమణోదయం* 🙏

*మన సహజస్థితి ఉనికి. ఆ ఉనికి ఒక్కటి తప్ప ఇతరములన్నీ కల్పితములే. అసత్యములే. ఉనికి లేని (అసత్తు)వన్నీ అనిత్యాలు. కానీ మన ఉనికి మాత్రం నిత్యము.*

వివరణ: *ఇక్కడ తెల్పిన ఉనికి అంటే శరీరం, మనస్సు కానటువంటి మన ఎరుకయే అని గ్రహించాలి. నిద్ర, మరణం, ప్రళయం వంటివన్నీ అసత్యమై మరుగైపోయినా, అవినాశియైనటువంటి ఉనికిగా ప్రకాశించే బ్రహ్మము మాత్రమే అని అభిప్రాయం.*

'నేను చేస్తున్నాను' అనే భావనే అవరోధము.
'ఎవరు చేస్తున్నారు'? అని నిన్ను నీవు ప్రశ్నించుకో.
ఏది నిర్ణయించబడియున్నదో అది జరుగుతుంది.

నీవు పనిచేయకూడదు అని నిర్ణయించబడివుంటే
నీ వెంత ప్రాకులాడినా ఆ పని నీవు చేయలేవు.

అదే నీవు చేయాలి అని వ్రాసి ఉంటే
నీవు దానిని  తప్పించుకోలేవు.
నీ వెంత చేయకూడదు అనుకున్న 
చేసే తీరాల్సి వస్తుంది.

కాబట్టి, అంతా ఆ పరమాత్మ శక్తికే వదలివేయి.
నీకు నీవు ఏదీ వదలలేవు,
ఇష్ట ప్రకారము నిలుపుకోనూ లేవు.

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

  *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.980)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🪷🌹🙏🌹🪷

No comments:

Post a Comment