సుబ్బయ్య రోజు కూలీగా నగరంలోని ఓ షాపులో పని చేస్తుండేవాడు
తన జీతం తీసుకుందామని తన యజమాని దగ్గరకు వెళ్ళాడు.
ఆ యజమాని .... బాబూ , ఈరోజుతో మన దుకాణం మూసివేస్తున్నాం, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మన దుకాణం కూల్చేస్తున్నారు ఈ రోజు అని, చివరి రోజు జీతాన్ని ఇచ్చాడు.
దానిని చాలా పదిలంగా పట్టుకుని దీనితో తన జీవితం ముగియనుందా, రేపు ఎలా అని భగవంతుని ప్రార్ధిస్తూ, ఆ డబ్బులతో బన్ను కొనుక్కుని నడుస్తూ ఆలోచిస్తూ బయలు దేరాడు.
ఇంతలో ఒక ముదుసలి బక్క పలుచని వ్యక్తి, అతని ఇద్దరు మనుమలతో, బాబూ...! మేము గత రెండు రోజుల నుండి ఏమీ తినలేదు, మాకు ఏమయినా
సాయం చేయగలవా... అని చాలా దీనంగా అడిగాడు.
వారి ముఖాలు చూస్తుంటే చాలా బాధ కలిగి, తన చేతుల్లో ఉన్న బన్నును వారికి ఇచ్చాడు. ఆ పిల్లలు దానిని చాలా అత్రంగా , ఇష్టంగా తిని కడుపునిండా నీళ్ళుతాగారు.
ఆ ముదుసలి కృతజ్ఞతా భావంతో తన చేతుల్లో ఉన్న ఒక పురాతన నాణాన్ని అతనికి ఇచ్చి బాబూ దీని విలువ చాల ఉంది, నీకు మరీ అవసరమయితేనే
ఖర్చు చేయి అని అతని చేతిలో పెట్టాడు.
నిజానికయితే అది ఒక చెల్లని నాణెం.
అయినా దానిని తన జేబులో వేసుకుని తన ఇంటికి చేరుకుని నిద్ర పోవడానికి సిద్ధ పడ్డాడు . అప్పుడు సుబ్బయ్యకు ఒకటి గుర్తుకు వచ్చి, పాత పేపర్లను తిరగేశాడు .
ఒక పాత వార్తాపత్రికలో పురాతన నాణేలకు తగు డబ్బులిస్తాం అనే ప్రకటన కనపడింది. చాలా జాగ్రత్తగా ఆ చిరునామా భద్రపరచుకొని తెల్లవారిన తర్వాత ఆ చిరునామా ఉన్న దుకాణాదారుని దగ్గరకు వెళ్ళి తన నాణాన్ని ఇచ్చాడు.
ఆ నాణాన్ని చూసిన ఆ దుకాణాదారుడు, బాబూ నేను ఈ నాణెం కోసం చాలా రోజుల నుండి వెతుకుతున్నాను. ఈ నాణెం పురాతన కాలంనాటిది, ఇది
ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వెల్లివిరిస్తుందని చెప్పి, పెద్ద మొత్తంలో డబ్బులిచ్చాడు.
సుబ్బయ్యకు సంతోషం ఆగలేదు,తన డబ్బుకు వాస్తవ యజమాని అయిన ఆ ముసలి తాతకు కొంత డబ్బు ఇద్దామని,తిరిగి నిన్న బన్ను కొన్న ఆ హోటల్ దగ్గరకు వెళ్ళాడు .
ఆ హోటల్ యజమాని సుబ్బయ్యను పిలిచి, బాబూ ...! నిన్న నీవు బన్ను ఇచ్చిన తాత కృతజ్ఞతగా ఈ ఉత్తరం నీకు ఇవ్వమని వేరే ఊరు వెళ్ళిపోయాడు అని ఒక
ఉత్తరం ఇచ్చాడు.
దానిలో ఇలా ఉంటుంది...,
"బాబూ! నీవు తినడానికి ఉంచుకున్న దాన్నంతా మాకు ఇచ్చావు... నేను కేవలం నా దగ్గర ఉన్నదాంట్లో కొంచెమే నీకు ఇచ్చాను,దానిని జాగ్రత్తగా వాడి మంచి
పేరు తెచ్చుకో " అని.
తాను తన చివరి జీతాన్ని పూర్తిగా ఎదుటివారి కడుపు నింపినందువల్ల తనకు లభించిన వరమిదని సుబ్బయ్యకు అర్ధమయింది.
నీతి: మనం చేసే చిన్న చిన్న సాయాలు ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు... అందుకే మన చేతనయిన సాయాన్ని అందించే అవకాశం వచ్చినపుడు దానిని వదులుకోకండి...
ఆ భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఏ రూపంలో సృష్టిస్తున్నాడో మనకు తెలియదు.
.🙏🙏🙏🙏🙏🙏🙏
యెనుముల
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment