Friday, 21 November 2025

 *ఓం నమో నారాయణాయ* 🙏 

*శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం* । 
*అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్* 

 *భావం* : 

 *భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో దేనినైనా ఆచరించడం:* 

 *శ్రవణం* (దేవుని కథలు వినడం), *కీర్తనం* (నామ సంకీర్తన), *స్మరణం* (భగవంతుని తలవడం), *పాద సేవనం* (భగవంతుని సేవ), *అర్చనం* (పూజించడం), *వందనం* (నమస్కరించడం), *దాస్యం* (సేవకునిగా ఉండటం), *సఖ్యం* (స్నేహంగా ఉండటం), *ఆత్మ నివేదనం* (సమర్పణ).

 *మానవ జన్మ ప్రయోజనం:* 

 *ఈ నరజన్మ, కేవలం జంతువులు పొందే భోగముల కోసం కాదు. ఇది దివ్యమైన తపస్సు చేయడానికే ఉద్దేశించబడింది.*  

 *సారం* : 

 *మానవ శరీరాన్ని కేవలం భోగాల కోసం వినియోగించకూడదు, దైవచింతన, తపస్సు ద్వారా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం.* 

*ఆచార్య సద్బోధన*
                   
*జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?*

 *ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.* 

 *ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.* 

 *ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.* 

 *ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.* 

 *అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.* 

 *సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.* 

 *అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.* 
*ఈ పవిత్ర జీవనం కోసమే మనపెద్దలు ధర్మం ఆచరించమన్నారు.```* 

 *ఓం నమో భగవతే వాసుదేవాయః* 🙏

No comments:

Post a Comment