జీవిత రహదారులు. !
జీవిత రహదారుల వెంట
గమ్యం లేని అనంతమైన
ప్రయాణం !
అర్థరహితమైన జీవితానికి
అర్ధాన్ని వెతుక్కుంటూ
శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆస్వాదిస్తూ
ఎన్నో మజిలీలు !
కష్టాల కడలిని ఈదుతూ
అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తూ
అమాయకపు ప్రయాణం
అంతులేని దూరాలు. !
ప్రేమానురాగాల వెలువలో
కాలమిలా గడిచిపోయింది. !
స్నేహమాధుర్యంలో
లక్ష్యసాధన అన్వేషిస్తూ
కాలమిలా గడిచిపోయింది. !
ఎన్నో ఎడబాటులో
అమాయకత్వంగా బతికితే
జరిగిన మోసాలెన్నో. !
ఎవరిని నిందించిన ఏం ప్రయోజనం
ఎవరి స్వార్థం వారిదే కదా
ముందు చూపు లేని జీవితంలో
ఎదురయ్యే అగ చాట్లు ఎన్నో. ?
కాలం చాలా విలువైనది
స్థితిని నిర్ణయిస్తుంది
గతిని నిర్దేశిస్తుంది. .!
స్నేహమాధుర్యంలో లోటుపాట్లు
తెలియవు ఎప్పుడూ !
పుట్టినాము కాబట్టి జీవించాలి
జీవించడానికి ఒక మంచి మార్గాన్ని
ఎంచుకొని సాగిపోవాలి. !
అభివృద్ధికి సహకరించిన అందరికీ
కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఆవలి తీరం జీవితాన్ని
చేర్చాలి. ! !
___ రా జ్
No comments:
Post a Comment