Tuesday, 9 September 2025

 ☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️

         *నృత్యగణపతి* 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

నేపాల్ దేశంలో గణేశ భక్తులు నృత్య గణపతినే ఎక్కువగా పూజిస్తుంటారు. ఎరుపు రంగుతో మెరిసిపోతుంటే నేపాల్ నృత్య గణపతి త్రినేత్రుడు. తన వాహనమైన ఎలుకపై కుడికాలును కొద్దిగా మడిచి పెట్టి నృత్యం చేస్తున్న గణపతి, ఎడమ కాలును పూర్తిగా పైకెత్తగా, ఆ కాలు బొజ్జను చుట్టుకుని ఉన్న నాగబంధాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. పన్నెండు చేతులులో దర్శనమిచ్చే ఈ స్వామివారు విఘ్నాలను తొలగించి, కోరుకున్న కోరికలను వెంటనే తీరుస్తాడన్నది నేపాల్ భక్త జన విశ్వాసం.

*అటువంటి నృత్య గణపతులను మనదేశం లోని హళబేడు హోయసలెశ్వరాలయం, మదురై మీనాక్షీ ఆలయం, బీదర్ జిల్లా జలసంగవి వంటి క్షేత్రాలలో దర్శించుకోగాలము.* 

హళబేడు హోయసలేశ్వరాలయ గోడపైనున్న నృత్యగణపతి మూర్తి అత్యంత సుందరరూపంతో దర్శనమిస్తుంటారు. ఎనిమిది చేతులలో కనిపించే ఈ స్వామి ముందు రెండు చేతులు దండముద్ర, విస్మయముద్రతో కనిపిస్తుండగా, వెనుకనున్న ఆరు చేతుల్లో పరశు, పాశ, మోదకపాత్ర, దంత, సర్ప, కమల పుష్పాలు ఉన్నాయి. కరండమకుటంతో నృత్యం చేస్తున్న ఈ గణపతి నిలబడిన పీఠభాగంలో మరుగుజ్జులు వాయిద్యాలు వాయిస్తున్నట్లుగా చూడగలము.

ఇక, మదురమీనాక్షి దేవాలయ స్తంభం పైనున్న నృత్య గణపతి, ఎలుకపై నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఎడమకాలితో ఎలుకపై నించున్న ఈ గణపతి, కుడికాలును పైకెత్తి నృత్యం చేస్తున్నట్లుగా దర్శనమిస్తుంటాడు. ఎనిమిది చేతులతో దర్శనమిచ్చే ఈ నృత్యగణపతి కుడివైపునున్న నాలుగు చేతులలో పరశు, వలయ, పుష్పం, దంతాలతో, ఎడమవైపు నాలుగు చేతుల్లో అంకుశం, పాశం, మోదకం, ఫలాలు ఉన్నాయి.

ఇప్పుడిప్పుడే మన దక్షిణభారత దేశంలో నృత్య గణపతి పూజకు విశేష ఆదరణ లభిస్తోంది

*జై  జై  గణేశా...*

☘️🍀☘️🍀☘️🍀☘️🍀☘️

No comments:

Post a Comment