Tuesday, 9 September 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

            *ఆచార్య సద్భోదన*
                ➖➖➖✍️
```
దేవుని వాక్యాలను ఉల్లంఘించినవారికి పతనం తప్పదు.

దేవుడు లేడు అనే భావన మన హృదయంలో ఆవిర్భవించకూడదు.

మనం ఉన్నామంటే భగవంతుడు ఉన్నట్లే! చెఱకు తీయగా ఉంటుంది.    ఆ రుచి అనుభవానికే తప్ప కంటికి చూపగలమా?!

అనుభవపూర్వకముగనే  భగవంతుణ్ణి తెలుసుకోవాలి తప్ప కనిపించలేదు కనుక దేవుడు లేడు అన్న మూర్ఖత్వ భావనతో ఉండకూడదు.

మనం ఏ రూపంలోనైనా కొలవ వచ్చును.  ఏ నామముతోనైనా పిలవవచ్చును. కానీ దైవం మాత్రం ఒక్కడే . స్విచ్ వేస్తే లైట్ వెలిగి కాంతినిస్తుంది, ఫేన్ తిరిగి గాలివీస్తుంది, టి వి లో బొమ్మలు కదిలి ఆహ్లాదమునిస్తున్నాయి. వీటి పనితనము వేరు కానీ వీటియందు ప్రవహించే విద్యుత్ మాత్రం ఒక్కటే కదా!
ఇదే భావనతో దైవాన్ని తెలుసు కోవడానికి ప్రయత్నం చేయాలి. నాస్తికతను విడచి దివ్యత్వం వైపు అడుగులు వేయాలి.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment